గల్ఫ్ డెస్క్: గల్ఫ్ దేశాలకు ఉద్యోగుల భర్తీ ప్రక్రియను చేపట్టే రిక్రూటింగ్ ఏజెన్సీల వ్యాపార నైతికత, వలస కార్మికుల హక్కులు అనే అంశంపై జూన్ 23–25 వరకు దుబాయిలో ఒక వర్క్‌షాప్ జరిగింది. మైగ్రంట్ ఫోరమ్ ఇన్ ఏసియా(ఎంఎఫ్‌ఏ), డిప్లొమసీ ట్రైనింగ్ ప్రోగ్రాం (డీటీపీ), మిడిల్ ఈస్ట్ సెంటర్ అనే మూడు సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. అరబ్ గల్ఫ్ దేశాలు, ఆసియా దేశాలలోని సామాజిక కార్యకర్తలు, కార్మిక నాయకులు, యాజమాన్య సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమం చివరి రోజున దుబాయిలోని తెలంగాణ ప్రవాసులు కృష్ణ దొనికెని, మంద సుమంత్‌రెడ్డి పాల్గొన్నారు. అరబ్ గల్ఫ్ దేశాల ఆర్థికాభివృద్ధిలో వలస కార్మికుల పాత్ర గణనీయమైనది. వీరి హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించాలి. ప్రైవేటు రంగం ఇందుకు బాధ్యత తీసుకోవాలి అనే నేపథ్యంలో ఈ చర్చాగోష్టి జరిగింది. వలస కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం, సామాజిక సంస్థలు కలిసి పనిచేయడం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఇందుకు కావలసిన విజ్ఞానం అందించడానికి ఈ సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) సదస్సు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment