నేటి నుంచి ఉద్యమం తీవ్రతరం | Severed from the present-day movement | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఉద్యమం తీవ్రతరం

Published Sat, Sep 21 2013 4:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM

Severed from the present-day movement

సాక్షి, తిరుపతి: రాష్ట్ర విభజనపై కేంద్రం దిగి రాకపోవడంతో శనివారం నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నట్టు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, ఆర్డీవో రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమి తి అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలో సీమాంధ్రలో ఉద్యమం తీవ్రతరం చేయనున్నట్టు చెప్పారు. శనివా రం నుంచి 30వ తేదీ వరకు నిరసనలు చేపడుతున్నామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు.
 
 21న (శనివారం) సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు జిల్లావాసులు విద్యుద్దీపాలను వెలిగించద్దు.
 
 23 నుంచి 30వ తేదీ వరకు ప్రయివేటు విద్యా సం స్థల మూసివేత.
 
 24న సీమాంధ్ర బంద్. రైలు మార్గాలు మినహా రహదారుల దిగ్బంధం
 
 25, 26 తేదీల్లో ప్రయివేటు రవాణా సంస్థల బంద్
 
 27, 28 తేదీల్లో  సర్పంచ్‌లు పంచాయతీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల నే ఏకవాక్య తీర్మానాలను ఆమోదించి ప్రధాన మంత్రికి పంపించాలి.
 
 ఈ సమావేశంలో ఆర్‌టీసీ జేఏసీ నాయకులు చల్లాచంద్రయ్య, ఎం.నరసింహులునాయుడు, ఆవుల ప్రభాకర్ యాదవ్, బాబు, శివప్రసాద్, టీటీడీ, రెవెన్యూ జేఏసీ నాయకులు మోహన్‌రెడ్డి, సురేష్‌బాబు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement