samiyaka andhra
-
బంద్ విజయవంతం
పట్టణాలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆందోళన వంతాడపల్లి వద్ద వాహనాల అడ్డగింపు చలో ఢిల్లీ ప్రచార పోస్టర్ విడుదల సాక్షి, విశాఖపట్నం: టి బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పిలుపుమేరకు జిల్లాలో బంద్ విజయవంతమైంది. పట్టణాలు,గ్రామాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఉదయం నుంచి రాత్రివరకు దుకాణాలు మూత పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలను మూయించారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. నియోజకవర్గాల్లో పార్టీనేతలతోపాటు ప్రజలు భారీ ఎత్తున ఆందోళనల్లో పాల్గొన్నారు. నక్కపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులు ,కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జాతీయరహదారిపై ఆర్టీసీ కాంప్లెక్స్‌కు ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. పాయకరావుపేటలో దుకాణాలు,థియేటర్లు, బ్యాంకులు, విద్యా సంస్థలు మూసివేశారు. మాడుగులలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో నాయకులు ,యువకులు, విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. మాడుగుల సమన్వయకర్తలు బూడిముత్యాలనాయుడు, పూడి మంగపతిరావు ఆధ్వర్యంలో రహదారులు దిగ్బంధించారు. పాడేరులో బంద్ విజయవంతమైంది. పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే రోడ్డులో వంతాడపల్లి వద్ద బైఠాయించి, వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాడేరులో వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం నేతలు పిలుపునిచ్చారు. పార్టీ అధినేత పేరిట ముద్రించిన ఛలో ఢిల్లీ ప్రచార పోస్టర్‌ను విడుదల చేశారు. అరకులోయలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. చోడవరంలో వ్యాపారులు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. యలమంచిలి పట్టణంలో పలు నిరసన కార్యక్రమాలు జరిగాయి. -
‘చింత’లేని మోహన్!
*మొన్న వ్యతిరేకించి.. నిన్న సమర్థించి.. నేడు మౌన ముద్ర *రాష్ట్ర విభజనపై పెదవి విప్పని తిరుపతి ఎంపీ *రానున్న రోజుల్లో పదవి కోసమే తీరు మార్చుకున్న వైనం సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర విభజన కు వ్యతిరేకంగా సీమాంధ్రలో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తున్నా దీనిపై తిరుపతి ఎంపీ చింతామోహన్‌కు ఏ మాత్రం చింత ఉన్నట్టు లేదు. కాంగ్రెస్ అధినేత్రిని నమ్ముకుంటే చాలు, తనకు మేలు జరుగుతుందనుకున్నారేమో.. గురువారం తెలంగాణ బిల్లుపై పార్లమెంట్లో పలువురు సీమాంధ్ర ఎంపీలు గళం విప్పినా, చింతామోహన్ మాత్రం ఉన్నా లేనట్లుగానే వ్యవహరించారు. మొదటి నుంచీ విభజనను సమర్థిస్తూ వచ్చారని ఆయన తీరును బట్టి చెప్పవచ్చు. సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున సాగిన రోజుల్లో కూడా ఇల్లు వదిలి బయటకు రాలేదు. పైగా సమైక్యవాదులపై ఆయన కొరడా ఝుళిపించారు. సమైక్య నినాదాలతో ఆయనను అడ్డుకున్న వారిపై కేసులు బనాయించారు. ఇదంతా రానున్న కాలంలో పదవి కోసమేననేది అందరికీ అర్థమైంది. అనూహ్యంగా నాలుగు రోజుల క్రితం తిరుపతిలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ వారు సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహించిన ధర్నాకు ఆయన మద్దతు పలికారు. అయితే ఓటర్లను నమ్ముకోవడం కంటే సోనియమ్మనే నమ్ముకోవడం మంచిదని చింతా భావించారు. ఆయన సన్నిహితులతో మాట్లాడుతూ ‘‘సోనియమ్మతో మంచిగా ఉంటే ఎప్పుడైనా ఏదో ఒక పదవి రాబట్టుకోవచ్చు. అంతేకాని ఈ జనాన్ని నమ్ముకుంటే నాకు ఒరిగేదేమీ లేదు’’ అని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. గురువారం పార్లమెంటు రణరంగంగా మారిన విషయం తెలిసిందే. తిరుపతి నగరం నుంచి ప్రాతిథ్యం వహిస్తున్న చింతా మోహన్ ఉన్నాడో లేడోననే సందేహం వచ్చే విధంగా ఆయన వ్యవహరించారు. శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి తిరుపతి రానున్నారు. ఎంపీ తీరుపై సమైక్యవాదులు ఏవిధంగా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే. -
కిరణ్, బాబు ‘సమైక్య’డ్రామా
పుంగనూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ముసుగులో ము ఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు హైడ్రామా ఆడుతున్నారని మాజీమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పుంగనూరు మండలంలోని చెలిమిగడ్డలో గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహిం చారు. అక్కడ విలేకరులతో మాట్లాడు తూ కిరణ్ సమైక్యం పేరుతో నటిస్తూ సోనియాగాంధీకి కోవర్టుగా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. విభజన బిల్లు పెడితే రాజీనామా చేస్తానని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి నేడు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కోవర్టు కిరణ్‌కు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. విభజన కోసం తొలుత లేఖ ఇచ్చి ఇప్పుడు సమైక్య నాటకం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ సమైక్య నినాదం పేరుతో పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ, చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలతో సమైక్యాంధ్ర ధర్నాలు చేయిస్తూ ఎవరికి వారు నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం తొలి నుంచి జగన్మోహన్రెడ్డి పోరాటం చేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన జరగకుండా వైఎ స్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరు జగన్మోహన్రెడ్డి నాయకత్వాని బల పరచి ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నేతలు ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి, రెడెప్ప, వెంకటరెడియాదవ్, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, నాగరాజరెడ్డి గంగిరెడ్డి, షరీఫ్, నయాజ్, కిజర్‌ఖాన్, తులసమ్మ, సుబ్బమ్మ, హేమావతి తదితరులు పాల్గొన్నారు. -
నేడు సమైక్య బంద్
విశాఖపట్నం ,న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లును కేబినేట్ లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ బంద్ కు పిలుపునిచ్చింది. పార్టీ పిలుపు మేరకు జిల్లాలో బంద్‌కు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. దీనిని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉద్యమం చేస్తున్న తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా జిల్లా ప్రజలు నిలవాలని కోరారు. జేఏసీ, సమైక్యాంధ్ర వాదులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొని తమ వ్యతిరేకతను డిల్లీకి తెలియజేయాలన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీ ఆందోళనకు ప్రభుత్వ, ప్రయివేట్ విద్యాసంస్థలు, ఆర్టీసీ కార్మికులు, పెద్ద, చిన్న వ్యాపారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులు ఇబ్బందులు పడైనా మనం, మన ముందు తరాలు బాగుండడానికి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపాలని కోరారు. -
ఏ ఎండకు ఆ సమైక్యం
ఉద్యమకారులను తిట్టిన నోటితోనే సమైక్యాంధ్ర నినాదం చింతామోహన్ వైఖరితో కాంగ్రెస్ కార్యకర్తల విస్మయం సాక్షి, తిరుపతి: విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, రాజకీయపార్టీల మొదలు జిల్లాలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సమైక్యాంధ్ర కోసం ఏడు నెలలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. సమైక్య ఉద్యమంతో గతంలో జిల్లా యావత్తు కొన్ని నెలలపాటు స్తంభించిపోయింది. సాధారణ జనజీవనానికి ఆటంకం కలిగింది. ఇంత జరిగినా అప్పట్లో స్పందించని ఒకే ఒక్క వ్యక్తి తిరుపతి ఎంపీ చింతా మోహన్. ఉద్యమకారులు పలుమార్లు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలంటూ ఎంపీ ఇంటిముందు ధర్నాకు దిగారు. ఓ సందర్భంలో ఆయనను అడ్డుకున్నందుకు సమైక్యవాదులపై ఎంపీ పోలీసు కేసులు సైతం నమోదు చేయించారు. అయితే ఆయన హఠాత్తుగా తన వైఖరిని మార్చుకున్నారు. ఇప్పుడు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ మొసలిక న్నీరు కారుస్తున్నారు. రెండు రోజుల కిందట ఆయన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు వందమందితో ఆందోళన నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం నివ్వెరపోయాయి. సమైక్యాంధ్ర ఉద్యమానికి సహకరించాలని కోరిన రోజుల్లో పత్తా లేకుండా పోయిన ఎంపీ, ఇప్పుడు ఉన్నట్టుండి జనంలోకి రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాజకీయాల్లో తనకంటూ లాబీయింగ్ కలిగిన చింతా మోహన్ హఠాత్తుగా సమైక్యాంధ్ర నినాదాన్ని చేపట్టడం వెనుక మతలబు ఏమిటని గుసగుసలుపోతున్నారు. ఏపని అయినా సొంత ప్రయోజనం లేకుండా చేయరని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించే సమైక్యాంధ్ర అంటూ నినదించారని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏ రకంగా తీసుకున్నా సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎదుర్కోక తప్పదు. ప్రజల్లో పార్టీపై ఉన్న చెడు అభిప్రాయం తనపై పడకుండా చూసుకునేందుకు వేసిన ఎత్తుగడ అని ఆ పార్టీ కార్యకర్తలు కొందరు విశ్లేషిస్తున్నారు. -
బీ అలర్ట్..!
ఎన్నికలు పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలి సైబర్, ఆర్థిక నేరాల అడ్డుకట్టకు ప్రత్యేక చర్యలు మూడు జిల్లాల పోలీసులతో డీజీపీ ప్రసాదరావు సమీక్ష సాక్షి, ఏలూరు : సమైక్యాంధ్ర ఉద్యమం.. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ పోలీసులు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ బి.ప్రసాదరావు ఆదేశించారు. ఎన్నికలయ్యేంత వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసాదరావు తొలిసారిగా ఆదివారం జిల్లాకు వచ్చారు. శాంతిభద్రతలు, సమైక్యాంధ్ర ఉద్యమం, రానున్న ఎన్నికలపై కోస్తా రీజియన్ ఐజీ, ఏలూరు రేంజ్ డీఐజీ, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల అధికారులతో స్థానిక ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిస్థితులు, సమైక్యాంధ్ర ఉద్యమంలో వ్యవహరించాల్సిన తీరు, వచ్చే ఎన్నికలకు సమాయత్తం వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే బైండోవర్లపై దృష్టి సారించాలని చెప్పారు. అనంతరం కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు అదనపు బలగాలు... రానున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నట్టు డీజీపీ తెలిపారు. 2009 ఎన్నికల నిర్వహణలో అమలు చేసిన విధానాలను దృష్టిలో ఉంచుకుని 2014 ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అదనపు బలగాల విషయాన్ని ఇప్పటికే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామని డీజీపీ తెలిపారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగానే పోలీస్ సిబ్బంది బదిలీలు జరిగాయన్నారు. సైబర్, ఆన్లైన్ బ్యాంకింగ్ నేరాలను అరికట్టేందుకు సంబంధిత సిబ్బందికి వివిధ మాడ్యూల్స్ ద్వారా నిరంతరం శిక్షణ ఇస్తున్నామన్నారు. నకిలీ కరెన్సీ నిరోధానికి ప్రత్యేక బృందాలు... బంగ్లాదేశ్, దుబాయ్ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న నకిలీ కరెన్సీని పూర్తిగా నిరోధించేందుకు సీఐడీ విభాగంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ చెప్పారు. పోలీసు శాఖలో వివిధ హోదాలకు సంబంధించి పదోన్నతుల విషయంలో కొందరు ట్రిబ్యునల్, కోర్టులను ఆశ్రయించడం వల్ల జాప్యం జరిగిందని, దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీనియార్టీ జాబితాను రూపొందించి ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణ, నూతన భవనాల నిర్మాణం కోసం ఇక నుంచి రాష్ట్ర పోలీస్ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరతామన్నారు. ఈ సమీక్షలో కోస్తా రీజియన్ (విశాఖపట్నం) ఐజీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు, ఏలూరు రేంజ్ డీఐజీ విక్రమ్‌సింగ్‌మాన్, ఎస్పీ ఎస్.హరికృష్ణ, కృష్ణా జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎన్.శివశంకరరెడ్డి, రాజమండ్రి అర్బన్ పోలీస్ జిల్లా ఎస్పీ రవికుమార్ మూర్తి, మూడు జిల్లాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. డీజీపీకి ఘన స్వాగతం తొలిసారిగా జిల్లాకు వచ్చిన డీజీపీ ప్రసాదరావుకు జిల్లా పోలీసులు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ఏలూరు చేరుకుని స్థానిక పోలీస్ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనం పూర్తిచేశారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పలువురు పోలీసులు తమ సమస్యలపై డీజీపీకి వినతిపత్రం అందజేశారు. -
‘సమైక్య’ హోరు
రెండో రోజూ రెవెన్యూ ఉద్యోగుల సమ్మె జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు పలమనేరులో ఎన్జీవోల రాస్తారోకో మదనపల్లెలో ఉద్యోగుల మానవహారం సాక్షి, చిత్తూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనలు రెండో రోజు శుక్రవారమూ కొనసాగాయి. జిల్లాలోని 66 రెవెన్యూ కార్యాలయాలు మూతపడ్డాయి. రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ పూర్తిస్థాయిలో సమైక్యాం ధ్ర సమ్మెను కొనసాగిస్తోంది. మదనపల్లె, చిత్తూరు లాంటిచోట్ల జేఏసీ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బయటకు పంపారు. చిత్తూరులో ఎన్జీవోలు ర్యాలీ నిర్వహించారు. నీటిపారుదలశాఖ ఉద్యోగులు, జెడ్పీ ఉద్యోగులు ర్యాలీ లో పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కలెక్టరేట్లో రెవెన్యూ సర్వీసెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రవాణాశాఖ కార్యాలయంలో కార్యకలాపాలు స్తంభించాయి. జిల్లా అధికారులు కార్యాలయాలకు వచ్చి కూర్చున్నారు. తిరుపతిలో తహశీల్దారు, సివిల్ సప్లయిస్, ఆర్డీవో కార్యాల యాలు మూతపడ్డాయి. భూసర్వే, స్టాటిస్టికల్ విభాగాల ఉద్యోగులు విధులు బహిష్కరించారు. జ్యోతి రావు పూలే విగ్రహం నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు రాజకీయపార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 9వ తేదీ సమైక్య రన్‌కు సన్నాహకంగా ఈ ర్యాలీ చేపట్టారు. మదనపల్లెలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసేవారిని బయటకు పంపేశారు. పోస్టాఫీసు ఎదుట మౌన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. తహశీల్దారు కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. హౌసింగ్, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని జేఎసీ నాయకులు బయటకు పంపేశారు. శ్రీకాళహస్తిలో రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేశారు. రెవెన్యూ ఉద్యోగులు మాత్రం విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. పలమనేరులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలనూ మూసేశారు. పలమనేరులోని చెన్నై-బెంగళూరు రహదారి వద్ద ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పుత్తూరులో బ్యాంక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. తహశీల్దారు కార్యాలయం పని చేయలేదు. రాజకీయపార్టీల నాయకులు మ ద్దతు ప్రకటించారు. కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, శాంతిపురం, రామకుప్పం, గుడుపల్లె మండలాల్లోనూ రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. -
మళ్లీ సమైక్య సమ్మె
జిల్లా రెవెన్యూ అధికారికి ఎన్జీవోల సమ్మె నోటీసు సమ్మెలోకి 20 వేల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దూరం సాక్షి, చిత్తూరు: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం మళ్లీ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును కేంద్రం వెనక్కు తీసుకోవాలన్న డిమాండ్‌తో జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికిపైగా ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. రెవెన్యూశాఖ ఉద్యోగుల అసోసియేషన్ సమ్మెలో కీలకపాత్ర పోషిస్తోంది. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నాయకులు జిల్లా రె వెన్యూ అధికారికి బుధవారం ఉదయం కలెక్టరేట్లో సమ్మె నోటీసు అందజేశారు. విభజన బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్లో బిల్లును ఉపసంహరించుకునే వరకు సమ్మె నిరవధికంగా కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో 20 విభాగాలకుపైగా ప్రభుత్వ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు స మ్మెలో పాల్గొంటున్నారు. జిల్లా అధికారులు పాల్గొనడం లేదు. జిల్లా అధికారుల అసోసియేషన్ ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. తహశీల్దార్ కార్యాలయాల మూత జిల్లాలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మెను ఉద్ధృతం చేశారు. మొత్తం 66 తహశీల్దారు కార్యాలయాలను బుధవారం సాయంత్రం 6 గంటలకే మూసేశారు. గురువారం ఉదయం నుంచి నిరవధికంగా విధులకు హాజరుకారాదని తీర్మానించారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు రోజుకొక రూపంలో ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. తలారీ నుంచి తహశీల్దారు వరకు జిల్లాలో దాదాపు 2000 మంది రె వెన్యూ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో గురువారం నుంచి స ర్టిఫికెట్ల జారీ, ఇళ్లపట్టాల మంజూరు, ఇతర రెవెన్యూసేవలు నిలిచిపోనున్నాయి. సమ్మెలో ఇతర ప్రభుత్వ శాఖలు వాణిజ్యపన్నులు, వ్యవసాయ, స్టాంప్ రిజిస్ట్రేషన్లు, సహకారశాఖ, తూనికలు కొలతలు, సివిల్ సప్లయిస్, హౌసింగ్, డీఆర్డీఎ, డ్వామా, బీసీ, ఎస్సీ, మైనారిటీ సంక్షేమశాఖల ఉద్యోగులు, పంచాయతీరాజ్, మున్సిపల్ ఉద్యోగులు సమ్మెకు మద్దతు ప్రకటించారు. తిరుపతి ము న్సిపల్ కార్పొరేషన్, చిత్తూరు కార్పొరేషన్, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుంగనూరు, నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో అత్యవసర సేవలు మినహా మిగిలిన వారు గురువారం నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. ఆర్టీసీ, విద్యుత్, విద్యాశాఖ సమ్మెకు దూరం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు, కార్మికుల ఇతర డి మాండ్లపై అంగీకారం కుదరడంతో ప్రస్తుతానికి కార్మికులు సమ్మెకు దూరంగా ఉన్నారు. అయితే ఎన్జీవోల రోజువారి ఆందోళనలో పా ల్గొంటామని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. పరీక్షల సమయం కా వడంతో ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగులు విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సమ్మెకు దూరంగా ఉన్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మెకు పిలుపు ఇవ్వకపోవడంతో ఆశాఖ ఉద్యోగులు సమ్మెలో లేన్నట్లే. గెజిటెడ్ అధికారుల్లో తహశీల్దార్లు మినహా ఇతర శాఖల అధికారులు సమ్మెలోకి వెళుతున్నట్లు ఇంకా ప్రకటించలేదు. -
బాలరాజు సమైక్యాంధ్ర ద్రోహి
అరకులోయ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడిన గిరిజన సంక్షేమ మంత్రి బాలరాజు వైఖరిని పలు సంఘాలు నిరసించాయి. ఈ మేరకు అరకులోయలో బుధవారం వైఎస్సార్సీపీ అరకు నియోజకవర్గ సమన్వయకర్త కిడారి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ జంక్షన్‌వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కిడారి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు ఎంత నష్టం వాటిల్లుతుందో బాలరాజుకు తెలియదా? అని ప్రశ్నించారు.ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గిరిజన ప్రాంతాలు విభజన వల్ల మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోతాయన్నారు. బాలరాజు గిరిజన, సమైక్యాంధ్ర ద్రోహి అన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టి అప్పాలు, సమర్డి రఘునాథ్, చట్టు అప్పలరాజు, గెమ్మెలి బాబురావు, మండ్యగురు శ్రీరాములు,స్వామిరాజు, బి.బి నాగేశ్వరరావు పాండు రంగస్వామి పాల్గొన్నారు. ఏపీఎన్జీవోలు,టీడీపీ ఆధ్వర్యంలో మంత్రి బాలరాజు సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడడాన్ని నిరసిస్తూ ఎన్జీవోలు,టీడీపీ నేతల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మంత్రి బాలరాజు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవోల సంఘం నాయకులు ఆర్ మత్స్యలింగం,సత్యనారాయణ,కన్నబాబు, మండల అధ్యక్షుడు శెట్టి బాబురావు, అబ్రహం, పట్నాల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. గుణపాఠం తప్పదు డుంబ్రిగుడ : గిరిజన సంక్షేమ మంత్రి బాలరాజు బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ డుంబ్రిగుడలో నిరసన తెలిపింది.ఈమేరకు కొవ్వొత్తుల ర్యాలీనిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు కె సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తుంటే ఒక సీమాంధ్ర మంత్రి విభజనకు అనుకులంగా మాట్లాడం అన్యాయమన్నారు. ఇటువంటి ద్రోహులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మంత్రి కేవలం తన పదవిని కాపాడుకునేందుకే రాష్ట్ర విభజనకు అనుకులంగా మాట్లాడుతున్నారన్నారు. ఇదే తరుణంలో బాలరాజు వైఖరికి నిరసనగా నేడు డుంబ్రిగుడలో బంద్ నిర్వహిస్తునట్లు సుబ్బారావు తెలిపారు. ప్రజలు,వ్యాపారులు బంద్‌కు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బి మూర్తి,సింహద్రి,భాస్కర్‌రావు, కొండబాబు,అర్జున్,నందారావు,చిరంజీవి పాల్గొన్నారు. -
బాలరాజు తెలంగాణం
అసెంబ్లీలో విభజనవాదం వినిపించిన మంత్రి రగిలిపోతున్న సమైక్యవాదులు తగినపాఠం చెబుతామంటూ హెచ్చరిక సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పాడేరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రి పసుపులేటి బాలరాజుపై నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర విభజన బిల్లుపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో బాల రాజు తెలం‘గాణం’ వినిపించారు. తాను విభజనకు అనుకూలమని పాతపల్లవి అందుకున్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించడం జిల్లావాసుల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. సమైక్య ఉద్యమాలు జరుగుతున్న తరుణంలో నియోజక వర్గ ప్రజల అభీష్టం పేరిట బాలరాజు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడాన్ని ఇక్కడి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో బాలరాజుకు టీఆర్ఎస్ శాసనసభ్యులు మద్దతు పలకడం విశాఖ వాసులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంత ప్రయోజనాల కంటే పదవికే బాలరాజు అధిక ప్రాధాన్యతనిచ్చి మాట్లాడారంటూ నగరంలోని ఎంపీపీ డబుల్ రోడ్ జంక్షన్లో సమైక్యవాదులు బుధవారం రాత్రి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. గతంలో కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంతో పార్టీని ధిక్కరించి రెండు పర్యాయాలు రెబల్‌గా బరిలోకి దిగి క్రమశిక్షణ చర్యలకు గురైన ఈ గిరిజనమంత్రి తాజాగా పార్టీ నిర్ణయమే శిరోధార్యమనడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఇక్కడి సమైక్యవాదులు దుయ్యపడుతున్నారు. బాలరాజు తన ప్రత్యేక తెలంగాణ అనుకూల నిర్ణయాన్ని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని సమైక్యాంధ్రా విద్యార్ధి జేఏసీ హెచ్చరించింది. ఐఏ ఎస్ పదవిని వదులుకొని ఇటీవల పార్టీలో చేరిన కొప్పుల రాజు సూచనల మేరకే బాల రాజు తెలంగాణకు మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి బుధవారం నాటి సంఘటన బలం చేకూర్చింది. తెలంగాణకు మద్దతు ప్రకటించిన బాలరాజు ఆ ప్రాంతానికి వలసపోవడం మంచిదని, ఆయన క్షమాపణ చెప్పి సమైక్యం అనకుంటే రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెబుతామని సమైక్యాంధ్రా రాజకీయ ఐకాస నేత జేటీ రామారావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
సమైక్యమంటేనే నేరమా ?
పామర్రు/చల్లపల్లి/మచిలీపట్నం, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలుగు ప్రజల ప్రయోజనాలను, ఆత్మాభిమానాన్ని కాపాడాలని అసెంబ్లీలో కోరడమే నేరంగా భావించి వైఎస్సార్సీపీ, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, నేతలను అరెస్టు చేయడం దారుణమని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సహా ప్రజాప్రతినిధులందరినీ శాసనసభనుంచి సస్పెండ్‌చేసి ఆపై అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వారు పేర్కొన్నారు. ఈ అప్రజాస్వామిక చర్యను ఖండిస్తూ గురువారం జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చల్లపల్లి, పామర్రులో జరిగిన ధర్నా కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ ఓ ప్రజాస్వామ్య దేశంలో తమ అభీష్టాన్ని తెలిపే హక్కును కాలరాయడం దారుణమన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కలిసి టీ బిల్లును గట్టెక్కించే వ్యూహంలో భాగంగానే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయించి బయటకు పంపారన్నారు. ఇదేమి ప్రజాస్వామ్యమని అసెంబ్లీ బయట మాట్లాడుతున్న పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మను నిరంకుశత్వంగా అరెస్టు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన పామర్రులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కుమ్మక్కు రాజకీయాలతో పార్టీ ఎమ్మెల్యేను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. మైలవరంలో జోగి రమేష్ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా బయలు దేరి వెళ్లి స్థానిక బోసుబొమ్మసెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం పదవి కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి తిప్పలు పడుతున్నారని, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నానంటూ సమైక్య ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. చల్లపల్లిలో జరిగిన రాస్తారోకోలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్సార్సీపీని అణగదొక్కేందుకు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని పార్టీ మచిలీపట్నం పట్టణ కన్వీనర్ షేక్ సలార్‌దాదా అన్నారు. కార్యక్రమాల్లో పార్టీ తోట్లవల్లూరు మండల కన్వీనర్ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, పామర్రు మండల ప్రచార కన్వీనర్ కూసం పెద వెంకటరెడ్డి, జిల్లా ప్రచార కమిటీ సభ్యులు ముత్తేవి ప్రసాద్, పార్టీ నాయకులు ఆర్.వెంకటేశ్వరరావు, మోరా రాజరెడ్డి,టౌన్ యూత్ కన్వీనర్ కూసం సుబ్బారెడ్డి, నందిపాటి సాంబిరెడ్డి, చల్లపల్లి, మచిలీపట్నం నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. -
సడలని వైఎస్సార్ సీపీ దీక్షలు
సాక్షి, విశాఖపట్నం : సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దీక్షలు మూడో రోజుకు చేరాయి. సడలని సంకల్పంతో గురువారం నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేశారు. రాజకీయ లబ్ధికోసమే సీఎం కిరణ్, చంద్రబాబునాయుడు దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య తీర్మానం చేయకుండా చర్చలతో కాలయాపన చేసి సీమాంధ్ర ప్రజల్ని మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం కోరిన వైఎస్ విజయమ్మతోపాటు పార్టీ ఎమ్మెల్యేల్ని అరెస్టు చేసిన తీరును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అనకాపల్లిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకుడు కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) ఆధ్వర్యంలో అనకాపల్లి జోనల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహరదీక్షలు చేశారు. పార్టీ ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా మందపాటి జానకిరామరాజు (జానీ) ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ జంక్షన్లో ధర్నా చేశారు. యలమంచిలి నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు మూడో రోజూ రిలే దీక్షలు పాటించారు. మళ్ల సంజీవరావు నేతృత్వంలో మునగపాకలో రాస్తారోకో నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పాయకరావుపేటలో నియోజకవర్గ సమన్వయకర్త చెంగల వెంకట్రావు ఆధ్వర్యంలో సమైక్యం కోసం పట్టణంలో దీక్షలతో పాటు విజయమ్మ అరెస్టుకు నిరసనగా రాస్తారోకో చేశారు. సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. చోడవరంలో పార్టీ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర రిలే దీక్షలో పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు పీవీఎస్ఎన్ రాజు పాల్గొన్నారు. పంచాయతీ కార్యాలయం ఎదుట బిఎన్‌రోడ్డుపై కార్యకర్తలు బైఠాయించారు. రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాడేరు పాత బస్టాండ్ ఆవరణలో నియోజకవర్గ సమన్వయకర్త గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలోనిరాహార దీక్షలు జరిగాయి. జి.మాడుగులలో వైఎస్ఆర్సీపీ నేత వెంకటగంగరాజు(బుజ్జి) ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. నర్సీపట్నంలో సమన్వయకర్త ఉమాశంకర్‌గణేష్ ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. సమన్వయకర్తతో పాటు కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. -
విదేశీ కుట్రను తిప్పికొట్టండి
బెంగళూరు, న్యూస్‌లైన్ : తెలుగు తల్లిని నిలువునా చీల్చాలని చూస్తున్న విదేశీవని త కుట్రను తిప్పి కొట్టాలని పలువురు వ క్తలు అభిప్రాయపడ్డారు. బెంగళూరులో ని ఎంజీ రోడ్డులో ఉన్న అజంతా హోట ల్లో కర్ణాటక తెలుగు ప్రజా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర రౌండ్ టేబుల్ సమావేశం విజ యవంతమైంది. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి మాట్లాడుతూ... 1947లో మనకు స్వతంత్య్రం వచ్చినా ఫలితం లేకపోయిందని, ఇప్పటికీ విదేశీయులు చెప్పిన విధంగానే మన భారత ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నివసించే హక్కు ప్రతి భారతీయుడికీ ఉందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత సీమాంధ్ర వాసులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇప్పటి నుంచే ఒత్తిడి పెట్టడం చాలా బాధకరమని అన్నారు. తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం దక్కలేదన్న అక్కసుతో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారని గుర్తు చేశారు. ఒక ఎకరా పొలంలో పంట పండించి రూ. కోటి సంపాదిస్తున్నట్లు కేసీఆర్, ఆ నైపుణ్యం ఏమిటో బహిర్గతం చేస్తే రైతులందరూ మూకుమ్మడిగా బాగుపడతారని అన్నా రు. ఎకరా పొలంలో వ్యవసాయం ద్వా రా రూ. కోటి సంపాదించే రైతు ఈ ప్ర పంచంలోనే లేడని, అదే నిజమైతే తెలంగాణ ఎలా వెనుకబడిందో కేసీఆరే చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను లూటీ చేసేందు కే కేసీఆర్ లాంటి దొరలు తెలంగాణ వా దాన్ని వినిపిస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక తెలుగు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బెల్లం రమణ చౌ దరి మాట్లాడు తూ... హైదరాబాద్ అభివృద్ధి సీమాం ధ్రుల వల్లనే సాధ్యమైందని అన్నారు. కర్ణాటక వైఎస్ఆర్ యువ వేదిక కార్యదర్శి డాక్టర్ రసూల్ మాట్లాడుతూ.. ని యంతలుగా వ్యవహిం చిన వారు చరి త్రలో బాగుపడిన దాఖలా లు లేవని గు ర్తు చేశారు. రాాష్ట్ర విభజనకు వత్తాసు పలుకుతున్న వారికి ఇదే గతి పడుతుంద ని హెచ్చరించారు. అనంతరం వక్తల అభిప్రాయాలను లిఖితపూర్వకం గా స్వీకరించారు. వీటి ద్వారా సుప్రీం కో ర్టును ఆశ్రయించనున్నట్లు బొందు రామస్వా మి తెలిపారు. సమావే శం ప్రారంభానికి ముందు మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద చోటు చేసుకున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటనలో మృ తి చెం దిన కోటె వెంకటేష్ యాదవ్‌కు ని వాళులర్పిం చా రు. సమావేశంలో కేటీపీఎ స్ నాయకులు బాబు రాజేంద్రకుమార్, శివకుమార్, హ లసూరు విజయకుమా రి, ప్రతాప్, వరలక్ష్మి, సునీత, అంబరీష్‌రెడ్డి, జీ వరలక్ష్మి, రామచంద్ర, కర్ణాటక వైఎస్ఆర్ యువ వేదిక అధ్యక్షుడు సు రే ష్, సుందర్, తెలుగు కళావికాసిని కా ర్యదర్శి శ్రీధరరావు, లావణ్య, చిత్తూరుకు చెందిన టీడీపీ నేత వెంకటరమణ, రాము, ముఖర్జీ, చౌడప్ప, దానం పాల్గొన్నారు. -
2 నుంచి సమైక్య ఉద్యమం ఉధృతం
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : నూతన సంవత్సరంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు ఏపీ ఎన్జీవోల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి చెప్పారు. సంఘ నాయకులతో కలసి ఆదివారం మచిలీపట్నం వచ్చిన ఆయన తూర్పు కృష్ణా ఎన్జీవోల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జనవరి రెండో తేదీ నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని చేయనున్నట్లు ఆయన వివరించారు. జనవరి రెండున విశాఖపట్నంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, మూడున రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. నాలుగున సీమాంధ్ర జిల్లాల్లో అన్ని పార్టీల నాయకులు, ఉద్యోగులతో ర్యాలీలు, 6 నుంచి 10 వరకు అన్ని ప్రాంతాల్లో రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. పీఆర్సీ, ఐఆర్ కోసం చర్చలు... ఉద్యోగులకు పీఆర్సీ, మధ్యంతర భృతి ఇప్పించేందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామని చంద్రశేఖరరెడ్డి తెలిపారు. హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం తన చిత్తానుసారం వ్యవహరించిందన్నారు. ఉద్యోగులు కోరినవిధంగా నిబంధనలు మార్చి హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, లేకుంటే వాటిని తిరస్కరిస్తామని చెప్పారు. జూన్ 30 నాటికి తెలంగాణ అంశంపై అన్ని రాజకీయ పార్టీలూ తలోదారిగా వ్యవహరించాయన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణను విడగొడుతున్నట్లు ప్రకటించిందన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఏవీవీఎస్‌వీవీ నరసింహం మాట్లాడుతూ ఈ రాష్ట్రం ఇప్పటి వరకు సమైక్యంగా ఉందంటే ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌లోని ఉద్యోగుల ఉద్యమమే కారణమన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజనకు సంబంధించి మలివిడత చర్చ ప్రారంభం కాగానే సీమాంధ్రలో మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. దీంతో అసెంబ్లీ, పార్లమెంట్లపై ఈ ప్రభావం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కృష్ణా ఎన్జీవో అసోసియేషన్ కన్వీనర్ ఉల్లి కృష్ణ, అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరావు, కోశాధికారి దారపు శ్రీనివాస్, కార్యదర్శి కె.శివశంకర్, వెస్ట్ కృష్ణా అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకుడు టీఎస్ఆర్ ఆంజనేయులు, అవనిగడ్డ, నాగాయలంక, కైకలూరు, బంటుమిల్లి, మొవ్వ, పామర్రు, గుడివాడ తదితర ప్రాంతాల ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. -
నిరసనల హోరు
=వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు =జిల్లా అంతటా రోడ్ల దిగ్బంధం.. అక్కడే భోజనాలు =సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యం రాష్ట్ర విభజన అంశంపై మొండిగా ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును వైఎస్సార్సీపీ వరుస ఆందోళనలతో నిరసిస్తోంది. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లా అంతటా నాయకులు, కార్యకర్తలు రహదారులు దిగ్బంధించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా, కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ నినాదాలతో హోరెత్తించారు. రోడ్లపై వంటావార్పులతో నిరసన తెలిపారు. సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన యత్నాలకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు రహదారుల దిగ్బంధం, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించాయి. అనంతరం నేతలు, కార్యకర్తలు, మద్దతుగా పాల్గొన్న ప్రజలు రోడ్లపైనే భోజనాలు చేసి తమ నిరసన తెలిపారు. ఆందోళనల్లో పాల్గొన్న కార్యకర్తలు, నేతలను పలుచోట్ల పోలీసులు అరెస్టు చేశారు. పామర్రు మండలంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో మండల పరిధిలోని అడ్డాడలో రహదారుల దిగ్బంధం కార్యక్రమం నిర్వహించారు. మైలవరంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జ్యేష్ఠ రమేష్‌బాబు స్థానిక మార్కెట్ యార్డు వద్ద, జోగి రమేష్ స్థానిక ఇంజినీరింగ్ కళాశాల వద్ద రోడ్లు దిగ్బంధించారు. వంటావార్పు చేసి అక్కడే భోజనాలు చేశారు. ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారిపై జోగి రమేష్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రహదారి దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. తిరువూరులో నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో, గూడూరు మండలంలో మచిలీపట్నం - విజయవాడ రోడ్డుపై పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో, కంచికచర్ల మండలం పరిటాల జాతీయ రహదారిపై నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో రోడ్ల దిగ్బంధం చేశారు. వంటావార్పు నిర్వహించారు. చల్లపల్లి 214 జాతీయ రహదారిని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో దిగ్బంధించారు. దీంతో మచిలీపట్నం, విజయవాడ, అవనిగడ్డ రహదారుల్లో రాకపోకలు స్తంభించాయి. అనంతరం రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపట్టి అక్కడే నాయకులు భోజనాలు చేశారు. కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పామర్రు- కత్తిపూడి 165 జాతీయ రహదారిపై రాకపోకలను అడ్డుకున్నారు. అక్కడే వంటావార్పు చేశారు. పెనమలూరు మండలంలోని గంగూరు వద్ద నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నూజివీడు, గుడివాడ, గుడ్లవల్లేరులలో పార్టీ నేతల ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. విజయవాడలో నేతల అరెస్ట్... పార్టీ విజయవాడ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో కుమ్మరపాలెం సెంటర్లో జాతీయరహదారిపై వంటావార్పు చేపట్టి, రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డగించారు. దీంతో జలీల్‌ఖాన్‌తో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు త రలించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యకర్తలు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించారు. వాహనాల రాకపోకలను అడ్డగించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలిచ్చారు. -
ముగిసిన ‘మూడో విడత’
సాక్షి, విశాఖపట్నం : ప్రజల నిరసనలు, ఆందోళనల నడుమ మూడో విడత రచ్చబండ ముగిసింది. భీమిలిలో నవంబర్ 11న ప్రారంభమైన ఈ కార్యక్రమం శనివారం వరకు మొక్కుబడిగానే సాగింది. ప్రజలకు ప్రయోజనమివ్వని కార్యక్రమంగా మిగిలి పోయింది. సమైక్యాంధ్ర ఉద్యమంతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్యకు వచ్చేందుకు వేదికయింది. విస్తృత బందోబస్తు, విపరీత ఆంక్షల నడుమ ఈ సభలను అధికారులు, అధికారపార్టీవారు మమ అనిపించారు. సమస్యలపై ప్రశ్నించే వారిని అడ్డుకున్నారు. అన్ని మండల కేంద్రాల్లోనూ ఈ సభలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా రేషన్‌కార్డుల కోసం 62,059 , పింఛన్ల కోసం 28,482, ఇళ్ల కోసం 59,989 దరఖాస్తులొచ్చాయి. రేషన్‌కార్డులలో వయస్సు మార్పు కోసం మరో 1198 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీని నిర్వహణకు మండలానికి రూ.70వేలు చొప్పున ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు పైసా విదల్చలేదు. నవంబర్ 15న చోడవరంలో జరిగిన సభలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు పసుపులేటి బాలరాజు, గంటా శ్రీనివాసరావులకు సభల్లో నిరసనలు ఎదురయ్యాయి. పాడేరు సభలో పెంచిన పరీక్ష ఫీజులను రద్దు చేయాలని విద్యార్థులు, బకాయి వేతనాలు చెల్లించాలని పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున మంత్రి బాలరాజు ఎదుట నిరసన తెలిపారు. సభలోకి చొచ్చుకెళ్ళేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎస్టీ జాబితాలో చేర్చాలని కొండకుమ్మర్లు మంత్రిని నిలదీశారు. అనకాపల్లి సభలో మంత్రి గంటా శ్రీనివాసరావుకూ నిరసనలు తప్పలేదు. ఇక్కడ సమస్యల్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించిన 54మంది టీడీపీ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు చేదు అనుభవం ఎదురయింది. యలమంచిలి మండలం పీఎన్ఆర్పేట కార్యక్రమంలో ఇందిరమ్మ బిల్లు అందలేదంటూ మొగ్గా అప్పారావు అనే లబ్ధిదారుడు ప్రస్తావించగా ఎమ్మెల్యే కన్నబాబు సహనం కోల్పోయి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబుపాలెం సభలో వేదికపైకి ఎందుకు తనను ఆహ్వనించలేదని గ్రామ సర్పంచ్ లంబా అప్పారావు ప్రశ్నించగా.. ‘ఇది అధికారుల సభ అని,పిలవాల్సిన అవసరం లేదని, ఇదే నా స్టయిల్ ’ అని దురుసుగా మాట్లాడారు. క్రషర్ డీడీ చార్జీలను విపరీతంగా పెంచడంపై తిమ్మరాజుపేటలో పలువురు రైతులు ఎమ్మెల్యే కన్నబాబును నిలదీశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అరకులోయలో జరిగిన రచ్చబండలో ఎమ్మెల్యే సోమ ప్రసంగాన్ని ఏపీ గిరిజన సంఘం సభ్యులు అడ్డుకున్నారు. గత రచ్చబండలో ఇచ్చిన వినతులను ఇప్పటికీ ఎందుకు పరిష్కరించలేదని నిలదీసిన గిరిజన సంఘం ప్రతినిధులు, విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. కశింకోట సభకు మంత్రి గంటా హాజరు కాకపోవడంతో స్థానికులు అధికారుల్ని నిలదీశారు. -
ఒకటే నినాదం.. సమైక్యవాదం
రాష్ట్ర విభజనకు నిరసనగా ఉధృతంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం 53వ రోజైన శనివారం కూడా జిల్లాలో అదే ఉత్సాహంతో కొనసాగింది. సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహిస్తున్న రిలే దీక్షలను కొనసాగించారు. ఉయ్యూరులో విద్యుత్ బంద్ పాటించారు. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలో ఉద్యమం ఉరకలెత్తుతోంది. గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులు భారీ ఎత్తున ప్రదర్శన చేసి, మానవహారం నిర్మించి, సభ నిర్వహించారు. నూజివీడులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలతో పాటు వంటావార్పు, ఆటాపాటా కార్యక్రమాలు జరిపారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉయ్యూరులో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వచ్ఛందంగా విద్యుత్ బంద్ పాటించారు. ఉయ్యూరు, పరిసర గ్రామాల ప్రజలు కరెంటు నిలిపివేసి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. జేఏసీ నాయకులు ఉయ్యూరు సెంటర్లో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. రవీంద్రభారతి పాఠశాల విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో ర్యాలీ జరిపారు. ప్రధాన సెంటర్లో స్వస్తిక్ ఆకారంలో నిలబడి ఆందోళన చేశారు. మిలటరీ యూనిఫాంతో సెంటర్లో రోడ్డుపై నిలబడి సెల్యూట్ చేస్తూ జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. తిరువూరు ఎంపీడీవో ఆఫీసు రోడ్డులో ప్రైవేటు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు బైఠాయించి సమైక్య నినాదాలు చేశారు. తిరువూరు మండలంలోని రోలుపడి ఎంపీయూపీ పాఠశాల విద్యార్థులు తిరువూరు-మధిర ఆర్ అండ్ బీ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నూజివీడులోని చిన్న గాంధీబొమ్మ సెంటరు సమీపంలోని న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు, పట్టణంలోని సారథి స్కూల్ విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా పలు విన్యాసాలు చేశారు. పామర్రు నియోజకవర్గం కురుమద్దాలి ఎస్వీఎస్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రహదారిపై రాస్తారోకో జరిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పెడనలో సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 47వ రోజుకు చేరాయి. జాతీయజెండాతో ప్రదర్శనలు.. శనివారం నాటి ఆందోళనల్లో జాతీయ పతాకాలతో ప్రదర్శనలు ప్రధానాకర్షణగా నిలిచాయి. విజయవాడలో ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో సుమారు 300 మీటర్ల మువ్వెన్నల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. వత్సవాయిలో 200 మీటర్లు, జగ్గయ్యపేటలో 105 మీటర్లు, అవనిగడ్డలో 160 మీటర్ల జాతీయ పతాకాలతో నిర్వహించిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముసునూరులోనూ 20 మీటర్ల జెండాతో ప్రదర్శన నిర్వహించారు. విజయవాడలో విద్యార్థి జేఏసీ కన్వీనర్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి, సమైక్యవాదులకు మధ్య టగ్ ఆఫ్ వార్ (తాడు లాగుడు), మహిళలతో తొక్కుడు బిళ్ల ఆట ఆడించి నిరసన తెలిపారు. కృష్ణలంకలో ప్రైవేటు స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు సుమారు వెయ్యి మంది ర్యాలీ నిర్వహించారు. నగర పాలకసంస్థ సిబ్బంది కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరేందుకు 13 యూనివర్సిటీల ప్రొఫెసర్లు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు గరీబ్థ్ల్రో ఢిల్లీ వెళ్లారు. వారికి పలువురు సమైక్యవాదులు వీడ్కోలు పలికారు. -
నేటి నుంచి ఉద్యమం తీవ్రతరం
సాక్షి, తిరుపతి: రాష్ట్ర విభజనపై కేంద్రం దిగి రాకపోవడంతో శనివారం నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నట్టు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, ఆర్డీవో రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమి తి అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలో సీమాంధ్రలో ఉద్యమం తీవ్రతరం చేయనున్నట్టు చెప్పారు. శనివా రం నుంచి 30వ తేదీ వరకు నిరసనలు చేపడుతున్నామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. 21న (శనివారం) సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు జిల్లావాసులు విద్యుద్దీపాలను వెలిగించద్దు. 23 నుంచి 30వ తేదీ వరకు ప్రయివేటు విద్యా సం స్థల మూసివేత. 24న సీమాంధ్ర బంద్. రైలు మార్గాలు మినహా రహదారుల దిగ్బంధం 25, 26 తేదీల్లో ప్రయివేటు రవాణా సంస్థల బంద్ 27, 28 తేదీల్లో సర్పంచ్‌లు పంచాయతీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల నే ఏకవాక్య తీర్మానాలను ఆమోదించి ప్రధాన మంత్రికి పంపించాలి. ఈ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు చల్లాచంద్రయ్య, ఎం.నరసింహులునాయుడు, ఆవుల ప్రభాకర్ యాదవ్, బాబు, శివప్రసాద్, టీటీడీ, రెవెన్యూ జేఏసీ నాయకులు మోహన్‌రెడ్డి, సురేష్‌బాబు పాల్గొన్నారు. -
నేడు ‘సేవ్ ఏపీ’ సభ
సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నంలో గురువారం జరిగిన సమైక్య సమరభేరి సభ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చింది. వేలాది మంది విద్యార్థులు, ప్రజలు సభకు తరలివచ్చారు. తూర్పు కృష్ణా సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ చైర్మన్ ఉల్లి కృష్ణ అధ్యక్షతన నోబుల్ కాలేజీ మైదానంలో జరిగిన సభలో మేధావులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, విద్యా సంస్థల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు ఉద్వేగపూరిత ఉపన్యాసాలతో జనాన్ని ఉత్తేజితుల్ని చేశారు. రాజీనామా చేయకుంటే చరిత్ర క్షమించదు : చంద్రశేఖర్‌రెడ్డి సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనేలా ఒత్తిడి పెంచాలని ఏపీ ఎన్జీవోల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేశామన్నారు. ఇప్పటికైనా వారు ఉద్యమంలోకి రాకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు రాలేరని హెచ్చరించారు. నెలరోజులకు పైగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగులు జీతాలనే కాదు, జీవితాలను పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రకటించారు. మరో స్వాతంత్య్ర పోరాటంలా సాగుతున్న ఈ ఉద్యమాన్ని రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకొనే వరకూ కొనసాగిస్తామని చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టంచేశారు. చరిత్రంటే మనదే.. చరిత్ర సృష్టించిందీ మనమే : చలసాని హైదరాబాద్ తెలంగాణ వారి సొత్తు అంటూ కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని, హైదరాబాద్ నిర్మాణంలో, అభివృద్ధిలో మన తాతముత్తాల నుంచి ఈ తరం వరకూ రక్తమాంసాలు ధారబోశామని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. సీమాంధ్రులు చరిత్ర హీనులు, చేతగాని వాళ్లు కాదని, చరిత్రను నిర్మించిన, సృష్టించిన వారని పేర్కొన్నారు. సీమాంధ్రకు చెందిన వ్యక్తి శ్రీలంకను పాలించి అక్కడ జెండాను రూపొందిస్తే ఇప్పటికీ ఆ దేశ జెండాగా సింహం చిత్రంతో ఉందని వివరించారు. రాచరికపు వ్యవస్థలో సైతం సీమాంధ్రులు పాట్నా వరకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుని సుభిక్షంగా పాలన సాగించిన సంగతిని మరిచారా అంటూ చరిత్రను గుర్తుచేశారు. మద్రాసు సైతం బందరు ప్రధాన కేంద్రంగా ఉన్న సంగతి చరిత్రను చూస్తే తెలుస్తుందని అన్నారు. భారతజాతికి జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య ఈ గడ్డపై పుట్టినవాడేనని, ప్లేగువ్యాధికి మందు కనుక్కొని ప్రపంచాన్ని కాపాడిన యల్లా ప్రగడ సుబ్బారావు మన వాడేనని గుర్తుచేశారు. హైదరాబాద్‌ను సీమాంధ్రులు దోచుకోలేదని, మన పూర్వీకుల నుంచి కూడా హైదరాబాద్ అభివృద్ధి పునాదులుగా నిలిచారని చలసాని వివరించారు. వాస్తవానికి తెలంగాణ వాళ్లు వాడుకునే కరెంటుకు సీమాంధ్రలో వాళ్లు అదనపు బిల్లులు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. వాడుకోని కరెంటుకు సీమాంధ్రులు ఏటా రూ.5,200 కోట్లు అదనంగా చెల్లిస్తున్న సంగతి నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. కృష్ణా-గోదావరి బేసిన్లో లభ్యమవుతున్న గ్యాస్ నిక్షేపాలను తెలంగాణకు తరలిస్తున్న సంగతి నిజంకాదా అని నిలదీశారు. ఇటలీకి చెందిన సోనియా మన దేశానికి వచ్చిన తర్వాత 14ఏళ్లపాటు భారత పౌరసత్వం పొందకుండా ఆ దేశ పౌరసత్వంతోనే కొనసాగారని, అయినా అమెను ఇక్కడి వారు గుండెల్లో పెట్టుకుంటే రాష్ట్ర విభజన చేస్తూ మన గుండెలపై తన్నుతున్నదని చలసాని విమర్శించారు.