- జిల్లా రెవెన్యూ అధికారికి ఎన్‌జీవోల సమ్మె నోటీసు
- సమ్మెలోకి 20 వేల మంది ఉద్యోగులు
- ఉపాధ్యాయులు, ఆర్‌టీసీ కార్మికులు సమ్మెకు దూరం
సాక్షి, చిత్తూరు: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం మళ్లీ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును కేంద్రం వెనక్కు తీసుకోవాలన్న డిమాండ్‌తో జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికిపైగా ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. రెవెన్యూశాఖ ఉద్యోగుల అసోసియేషన్ సమ్మెలో కీలకపాత్ర పోషిస్తోంది. ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ నాయకులు జిల్లా రె వెన్యూ అధికారికి బుధవారం ఉదయం కలెక్టరేట్‌లో సమ్మె నోటీసు అందజేశారు.
విభజన బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్‌లో బిల్లును ఉపసంహరించుకునే వరకు సమ్మె నిరవధికంగా కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో 20 విభాగాలకుపైగా ప్రభుత్వ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు స మ్మెలో పాల్గొంటున్నారు. జిల్లా అధికారులు పాల్గొనడం లేదు. జిల్లా అధికారుల అసోసియేషన్ ఇంకా నిర్ణయం ప్రకటించలేదు.
తహశీల్దార్ కార్యాలయాల మూత
జిల్లాలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మెను ఉద్ధృతం చేశారు. మొత్తం 66 తహశీల్దారు కార్యాలయాలను బుధవారం సాయంత్రం 6 గంటలకే మూసేశారు. గురువారం ఉదయం నుంచి నిరవధికంగా విధులకు హాజరుకారాదని తీర్మానించారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు రోజుకొక రూపంలో ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. తలారీ నుంచి తహశీల్దారు వరకు జిల్లాలో దాదాపు 2000 మంది రె వెన్యూ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో గురువారం నుంచి స ర్టిఫికెట్ల జారీ, ఇళ్లపట్టాల మంజూరు, ఇతర రెవెన్యూసేవలు నిలిచిపోనున్నాయి.
సమ్మెలో ఇతర ప్రభుత్వ శాఖలు
వాణిజ్యపన్నులు, వ్యవసాయ, స్టాంప్ రిజిస్ట్రేషన్లు, సహకారశాఖ, తూనికలు కొలతలు, సివిల్ సప్లయిస్, హౌసింగ్, డీఆర్‌డీఎ, డ్వామా, బీసీ, ఎస్సీ, మైనారిటీ సంక్షేమశాఖల ఉద్యోగులు, పంచాయతీరాజ్, మున్సిపల్ ఉద్యోగులు సమ్మెకు మద్దతు ప్రకటించారు. తిరుపతి ము న్సిపల్ కార్పొరేషన్, చిత్తూరు కార్పొరేషన్, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుంగనూరు, నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో అత్యవసర సేవలు మినహా మిగిలిన వారు గురువారం నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు.
ఆర్‌టీసీ, విద్యుత్, విద్యాశాఖ సమ్మెకు దూరం
ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు, కార్మికుల ఇతర డి మాండ్లపై అంగీకారం కుదరడంతో ప్రస్తుతానికి కార్మికులు సమ్మెకు దూరంగా ఉన్నారు. అయితే ఎన్‌జీవోల రోజువారి ఆందోళనలో పా ల్గొంటామని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. పరీక్షల సమయం కా వడంతో ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగులు విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సమ్మెకు దూరంగా ఉన్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మెకు పిలుపు ఇవ్వకపోవడంతో ఆశాఖ ఉద్యోగులు సమ్మెలో లేన్నట్లే. గెజిటెడ్ అధికారుల్లో తహశీల్దార్లు మినహా ఇతర శాఖల అధికారులు సమ్మెలోకి వెళుతున్నట్లు ఇంకా ప్రకటించలేదు.