న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24లో వ్యవసాయంలో ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. రైతులకు రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధిని మరింత పెంచుతాన్నామన్నారు. కరువు ప్రాంత రైతులకు 5 వేల 300 కోట్లు కేటాయించారు.
వీటితో పాటు వ్యవసాయంతో పాటు డెయిరీ, మత్స్యశాఖలను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మత్స్య కారుల అభివృద్ధి కోసం ఈ ఏడాది భారీగా నిధులు కేటాయించారు. అందులో భాగంగా పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు కేటాయించారు. అలాగే రైతుల ఉత్పత్తుల నిల్వ కోసం గిడ్డంగుల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment