జీడీపీలో తగ్గుతున్న వ్యవసాయం వాటా.. కారణం చెప్పిన మంత్రి | Contribution Of Agriculture In GDP | Sakshi
Sakshi News home page

జీడీపీలో తగ్గుతున్న వ్యవసాయం వాటా.. కారణం చెప్పిన మంత్రి

Published Wed, Dec 20 2023 3:52 PM | Last Updated on Wed, Dec 20 2023 4:48 PM

Contribution Of Agriculture In GDP - Sakshi

కరోనా సమయంలో అన్ని రంగాలు కుదేలైనా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు మాత్రం వృద్ధి నమోదు చేశాయి. అలాంటి వ్యవసాయ రంగానికి సంబంధించి దేశ జీడీపీలో వాటా తగ్గుతుందని గణాంకాలు చెబుతున్నాయి.

జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 1990-91లో 35 శాతంగా ఉండేదని, 2022–23లో 15 శాతానికి తగ్గిందని లోక్‌‌‌‌‌‌‌‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌‌‌‌‌‌‌‌ ముంద్రా వెల్లడించారు. ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్ వేగంగా వృద్ధి చెందడంతోనే  వ్యవసాయ రంగం వాటా తగ్గిందని మంత్రి పార్లమెంట్‌లో పేర్కొన్నారు. 

‘ప్రొడక్షన్ పడిపోవడం వల్ల వ్యవసాయ రంగం వాటా తగ్గిపోలేదు. పరిశ్రమలు, సర్వీస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్పత్తులు వేగంగా పెరగడమే ఇందుకు కారణం’ అని ఆయన వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు గత ఐదేళ్లలో ఏడాదికి 4 శాతం చొప్పున వృద్ధి సాధించాయని మంత్రి అన్నారు.

వ్యవసాయానికి సంబంధించి కేవలం మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. గ్లోబల్‌‌‌‌‌‌‌‌ జీడీపీలో  వ్యవసాయ  రంగం వాటా 4 శాతంగా ఉందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ప్రొడక్షన్ పెంచడానికి, సుస్థిరాభివృద్ధికి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, వనరులను సమర్థంగా వినియోగించేందకు ప్రభుత్వం వివిధ పథకాలు, సంస్కరణలు, పాలసీలు తీసుకొచ్చిందని వివరించారు. కేంద్రం ప్రభుత్వం రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2.81 లక్షల కోట్లు విడుదల చేశామన్నారు.

ఇదీ చదవండి: మళ్లీ ఉద్యోగుల సమరం.. మార్పు ఖాయం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement