Agricultural schemes
-
జీడీపీలో తగ్గుతున్న వ్యవసాయం వాటా.. కారణం చెప్పిన మంత్రి
కరోనా సమయంలో అన్ని రంగాలు కుదేలైనా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు మాత్రం వృద్ధి నమోదు చేశాయి. అలాంటి వ్యవసాయ రంగానికి సంబంధించి దేశ జీడీపీలో వాటా తగ్గుతుందని గణాంకాలు చెబుతున్నాయి. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 1990-91లో 35 శాతంగా ఉండేదని, 2022–23లో 15 శాతానికి తగ్గిందని లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముంద్రా వెల్లడించారు. ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్ వేగంగా వృద్ధి చెందడంతోనే వ్యవసాయ రంగం వాటా తగ్గిందని మంత్రి పార్లమెంట్లో పేర్కొన్నారు. ‘ప్రొడక్షన్ పడిపోవడం వల్ల వ్యవసాయ రంగం వాటా తగ్గిపోలేదు. పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్లో ఉత్పత్తులు వేగంగా పెరగడమే ఇందుకు కారణం’ అని ఆయన వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు గత ఐదేళ్లలో ఏడాదికి 4 శాతం చొప్పున వృద్ధి సాధించాయని మంత్రి అన్నారు. వ్యవసాయానికి సంబంధించి కేవలం మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. గ్లోబల్ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 4 శాతంగా ఉందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ప్రొడక్షన్ పెంచడానికి, సుస్థిరాభివృద్ధికి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, వనరులను సమర్థంగా వినియోగించేందకు ప్రభుత్వం వివిధ పథకాలు, సంస్కరణలు, పాలసీలు తీసుకొచ్చిందని వివరించారు. కేంద్రం ప్రభుత్వం రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2.81 లక్షల కోట్లు విడుదల చేశామన్నారు. ఇదీ చదవండి: మళ్లీ ఉద్యోగుల సమరం.. మార్పు ఖాయం? -
మరింత మంది రైతన్నలకు లబ్ధి
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో మరింత మంది రైతులకు మేలు చేకూర్చేలా మరిన్ని సంస్కరణలు తెచ్చారు. నోటిఫై చేసిన పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా ఒకే రీతిలో బీమా రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టారు. మరో వైపు కొన్ని జిల్లాల్లో పెరిగిన సాగు విస్తీర్ణాన్నిబట్టి కొత్త పంటలను బీమా పరిధిలోకి తెచ్చారు. ఈ మేరకు మార్గదర్శకాల్లో మార్పులు చేయడమే కాకుండా, ప్రస్తుత వ్యవసాయ సీజన్ నుంచే అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులపై పైసా భారం పడకుండా ఈ క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్ బీమా కవరేజ్‌ను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఒక సీజన్‌కు సంబంధించిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే చెల్లిస్తోంది. ఇలా 2019లో శ్రీకారం చుట్టిన ఈ పథకం ద్వారా గడిచిన 4 ఏళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారం చెల్లించింది. పరిహారం లెక్కింపులో పారదర్శకత కోసమే సాధారణంగా ఇరిగేటెడ్, నాన్ ఇరిగేటెడ్ కేటగిరీల్లో పంటలు సాగవుతుంటాయి. పూర్వం నుంచి ఇరిగేటెడ్ (నీటి వసతి కల్గిన) విభాగంలో సాగయ్యే పంటలను దిగుబడి ఆధారితంగా, నాన్ ఇరిగేటెడ్ (వర్షాధారం) కేటగిరిలో సాగయ్యే పంటలను వాతావరణ ఆధారితంగా పరిగణనలోకి తీసుకొని బీమా కవరేజ్ కల్పిస్తున్నారు. దిగుబడి ఆధారిత పంటలకు వాస్తవ, హామీ దిగుబడిలోని వ్యత్యాసాల ఆధారంగా, వాతావరణ ఆధారిత పంటలకు ప్రతికూల, సాధారణ వాతావరణ పరిస్థితుల్లోని వ్యత్యాసాలను బట్టి బీమా పరిహారం లెక్కిస్తారు. స్థానికంగా ఉండే నీటి వసతినిబట్టి కొన్ని జిల్లాల్లో ఒకే పంట రెండు కేటగిరిల్లోనూ సాగవుతుంటుంది. దీంతో ఒకే జిల్లాలో ఒకే పంటకు సాగయ్యే విధానాన్ని బట్టి రెండు విధాలుగా బీమా కవరేజ్ కల్పిస్తూ నోటిఫై చేయాల్సి వచ్చేది. ఫలితంగా పక్క పక్క సర్వే నంబర్లలో సాగయ్యే ఒకే పంటకు ఒకే పంట కాలంలో కొంత వాతావరణ, మరికొంత దిగుబడి ఆధారంగా లెక్కించి పరిహారం చెల్లించాల్సి వచ్చేది. ఫలితంగా జరిగిన పంట నష్టం ఒకటే అయినా, పరిహారంలో వ్యత్యాసాలు ఉండేవి. ఉదాహరణకు నోటిఫైడ్ జిల్లాల్లో ప్రధానంగా పత్తి, వేరుశనగ పంటలు 95 శాతం విస్తీర్ణంలో వర్షాధారం, 5 శాతం నీటి వసతి కింద, మిరప 85 శాతం నీటి వసతి, 15 శాతం వర్షాధారం కింద సాగవడం వలన ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో పరిహారం ఉండేది. ఖరీఫ్‌లో నోటిఫై చేసిన పసుపు పంటకు కృష్ణా జిల్లాలో వాతావరణ ఆధారంగా, అల్లూరి సీతారామరాజు, వైఎస్సార్ జిల్లాల్లో దిగుబడి ఆధారంగా పరిగణించేవారు. ఇలా మిరప, పత్తి, పసుపు, జొన్న, వేరుశనగ వంటి పంటల విషయంలో పూర్వం నుంచి రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పరిహారం లెక్కింపు, పంపిణీలో అసమానతలు తొలగించడమే లక్ష్యంగా పంటల బీమా మార్గదర్శకాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇక నుంచి నోటిఫై చేసిన జిల్లాల్లో ఖరీఫ్‌లో మిరప, పసుపు జొన్న పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా పూర్తిగా దిగుబడి ఆధారంగానే పరిగణిస్తారు. పత్తి, వేరుశనగ పంటలను పూర్తిగా వాతావరణ ఆధారితంగా పరిగణిస్తారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా సాగవుతున్న ఆముదం పంటను కొత్తగా పంటల బీమా పరిధిలోకి తెచ్చారు. నోటిఫైడ్ జిల్లాల్లో దానిమ్మ, బత్తాయి, నిమ్మ, జీడిమామిడి పంటలను వాతావరణ ఆధారిత బీమా పరిధిలోకి తీసుకొచ్చారు. నాటిన మూడో ఏడాది నుంచి దానిమ్మకు, నాలుగో ఏడాది నుంచి బత్తాయి పంటకు ఖరీఫ్‌లోనూ, మూడో ఏడాది నుంచి జీడిమామిడి, నాలుగో ఏడాది నుంచి నిమ్మ తోటలకు రబీలోనూ బీమా రక్షణ కల్పిస్తారు. 2023–24 సీజన్ కోసం నోటిఫికేషన్ జారీ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాది పీఎంఎఫ్‌బీవైతో కలిసి బీమా పథకం అమలు చేయగా, యూనివర్సల్ కవరేజ్‌కు కేంద్రం విముఖత చూపడంతో ఆ తర్వాత రెండేళ్ల పాటు కంపెనీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించింది. ఈ క్రాప్ ప్రామాణికంగా యూనివర్సల్ కవరేజ్‌కు కేంద్రం దిగి రావడంతో 2022–23 సీజన్ నుంచి దిగుబడి ఆధారిత పంటలకు పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేస్తోంది. వాతావరణ ఆధారిత పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా బీమా రక్షణ కల్పిస్తోంది. 2023–24 సీజన్ కోసం దేశంలోనే అత్యల్ప ప్రీమియంతో బీమా కవరేజ్‌కు ముందుకొచ్చిన కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. జిల్లాలవారీగా కవరేజ్ కల్పించే కంపెనీలతో పాటు నోటిఫైడ్ పంటల వివరాలతో ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. ఖరీఫ్–2023లో 15 పంటలకు దిగుబడి ఆధారంగా, 6 పంటలకు వాతావారణ ఆధారంగా, రబీ 2023–24లో 13 పంటలకు దిగుబడి ఆధారంగా, 4 పంటలకు వాతావరణ ఆధారంగా నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుబడి ఆధారిత పంటలకు ఖరీఫ్‌లో గ్రామం, మండల, జిల్లా యూనిట్‌గా బీమా కవరేజ్ కల్పిస్తుండగా, వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం మండలం యూనిట్‌గా బీమా కవరేజ్ కల్పిస్తున్నారు. అసమానతలకు తావులేకుండా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పంటల బీమా లెక్కింపు, పరిహారం చెల్లింపుల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు పంటల బీమా మార్గదర్శకాల్లో కీలకమైన మార్పులు తీసుకొచ్చాం. నీటి వసతి, వర్షాధారం ప్రాతిపదికన కాకుండా ఇక నుంచి పూర్తిగా వాతావరణ, దిగుబడి ఆధారంగానే పంటలకు బీమా రక్షణ ఉంటుంది. నోటిఫై చేసిన జిల్లాల్లో నోటిఫై చేసిన పంటలు నష్టపోయే రైతులకు ఒకే రీతిలో పరిహారం దక్కు తుంది. లెక్కింపులో, చెల్లింపుల్లో ఎలాంటి అసమానతలు ఉండవు. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
సాగు పరిశోధనలో అమెరికా సహకారం కావాలి.. మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పరిశోధన రంగంలో అమెరికా సహకారం ఆశిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిరంజన్ రెడ్డి బృందం మూడో రోజు గురువారం వాషింగ్టన్ డీసీలో వ్యవసాయ శాఖ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఐటీ, ఫార్మ్ ఎకనామిక్స్, సీడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చించింది. వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు పథకం ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి ఇస్తున్నామన్నారు. ఎన్ఐఎఫ్ఏ డైరెక్టర్ మంజిత్ మిశ్రా మాట్లాడుతూ వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన చాలా ముఖ్యమన్నారు. కానీ ఆ పరిశోధనను అర్థవంతమైన ఫలితాలుగా మార్చడంలో రాజకీయ నాయకుల పాత్ర చాలా కీలకమని చెప్పారు. నిరంజన్ రెడ్డి వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ఉన్నారు. ఇది కూడా చదవండి: వీవోఏల గౌరవ వేతనం రూ.8 వేలకు పెంపు -
కేసీఆర్ పాలనలో వ్యవసాయ విధ్వంసం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణను విత్తన భాండాగారంగా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, కానీ రాష్ట్రాన్ని కల్తీ సీడ్‌బౌల్‌గా కల్వకుంట్ల కుటుంబం మార్చిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ విధ్వంసం జరిగిందని విమ ర్శించారు. కల్తీ విధానాలపై ఉక్కుపాదం మోపుతా మని అసెంబ్లీలో, బయట సీఎం కేసీఆర్ పేర్కొన్న ప్పటికీ ఏ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ‘రైతుగోస.. బీజేపీ భరోసా’ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం దండుగలా మారింది.. ‘వ్యవసాయ ఒక పండుగ అన్నారు కానీ కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఏర్పడింది. ఇన్పుట్ సబ్సిడీ, విత్తన సబ్సిడీ, పంటల బీమా పథకం అమలు చేయడం లేదు. గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయని కారణంగా లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారు. ఇక వరి పంట వద్దని ప్రభుత్వమే చెబుతోంది. మరోవైపు వ్యవసాయ రుణాలు రావడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా వ్యవసాయ రుణాల మీద పావలా వడ్డీ ఇవ్వడం లేదు. రైతుబంధు అన్నింటికీ పరిష్కారంలా వ్యవహరిస్తోంది. అందరికంటే ఎక్కువగా కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆత్మహత్యల్లో 75 శాతం కౌలు రైతులవే ఉన్నాయి. ఐదేళ్లుగా రైతు రుణమాఫీ వాయిదా వేసి ఎన్నికలకు ముందు ప్రకటించారు. అయినా మెజార్టీ రైతులకు మాఫీ జరగలేదు. నాలుగున్నరేళ్లుగా వడ్డీలు, చక్రవడ్డీలు పెరిగిపోయి రూ.లక్ష అప్పు ఇప్పుడు రూ.2 లక్షలకు చేరింది. ధరణి పోర్టల్‌తో 20 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు..’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా సమస్యలను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అనేక ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతినే మిగిల్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా కుటుంబం కోసం బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలన్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. -
‘ఉపాధి’లో మళ్లీ ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దాదాపు పూర్తిగా ఆగిపోయే వేసవి కాలంలో పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. పనులు దొరకక పేదలు నగరాలకు వలస పోయే దుస్థితి లేకుండా సొంత ఊళ్లలోనే వారికి పనులు కలి్పంచడంలో ఏపీ ఏటా ముందుంటోంది. ప్రత్యేకించి వేసవి రోజుల్లో ఉపాధి పనుల కల్పనలో గత నాలుగేళ్లగా మన రాష్ట్రమే దేశంలో తొలి స్థానంలో నిలుస్తోంది. ఈ వేసవిలో కూడా ఏప్రిల్ 1 నుంచి శనివారం (మే 20) వరకు 6.83 కోట్ల పనిదినాల పాటు రాష్ట్ర ప్రభుత్వం పనులు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 99 శాతం గ్రామ పంచాయతీలు అంటే.. 13,132 గ్రామ పంచాయతీల్లో కేవలం 50 రోజుల్లోనే మొత్తం 31.70 లక్షల కుటుంబాలకు పని దొరికింది. ప్రభుత్వం కల్పించిన పనులతో ఈ కుటుంబాలు రూ.1,657.58 కోట్ల మేర లబ్ధి పొందడం విశేషం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన తమిళనాడు 50 రోజుల కాలంలో 5.20కోట్ల పనిదినాలపాటు పనులు కలి్పంచింది. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఉన్నాయి. ఒక్కొక్కరికి రోజుకు రూ.245 ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు ఈ ఏడాది అధిక మొత్తంలో కూలి సైతం గిట్టుబాటు అయ్యింది. ఈ 50 రోజుల్లో కూలీలకు సరాసరిన రోజుకు రూ.245 చొప్పున కూలి లభించింది. మరోవైపు ఈ పనులకు 60 శాతానికి పైగా మహిళలే హాజరై ఉపాధి పొందారు. అలాగే మొత్తం 6.83 కోట్ల పనిదినాల పాటు ఉపాధి పొందిన వారిలోనూ దాదాపు 32% మేర ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు తెలిపారు. -
వ్యవసాయ మౌలిక వసతుల కల్పనలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆస్తుల కల్పనకు 2021–22 బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం రూ.11,477 కోట్లు కేటాయించినట్లు నాబార్డు వార్షిక నివేదిక స్పష్టం చేసింది. ఈ రంగంలో సగటు వార్షిక వృద్ధి రేటు 2.2 శాతం ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో కేటాయింపులపై నాబార్డు వార్షిక నివేదిక విశ్లేషించింది. చదవండి: ఏది నిజం: రోడ్లపై గుంతలా? రామోజీ కళ్లకు గంతలా? ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు మధ్యప్రదేశ్, తెలంగాణ, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాల కేటాయింపులు తిరోగమనంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఏపీలో వ్యవసాయ రంగంలో స్టోరేజి, వేర్‌హౌసింగ్, సాగునీరు, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో గ్రామ స్థాయిలోనే వ్యవసాయానికి అవసరమైన సకల మౌలిక వసతులను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగానే రైతులు పండించిన పంటల నిల్వ కోసం అవసరమైన గోదాములను సైతం నిర్మిస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్ని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే సేకరిస్తున్న విషయం తెలిసిందే. రూ.2,269.30 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 10,315 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో ఇప్పటికే 2,287 భవనాల నిర్మాణాలు పూర్తి కాగా మరో 1,948 భవనాలు తుది దశలో ఉన్నాయి. మొత్తం నిర్మాణాలను ఈ ఏడాది సెపె్టంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారుల లక్ష్యంగా నిర్ధారించుకున్నారు. అలాగే, పాడి రైతుల కోసం రూ.399.01 కోట్ల వ్యయంతో తొలి దశలో 2,535 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల నిర్మాణాలను చేపట్టిన విషయం తెలిసిందే. -
తక్కువ వడ్డీకే రుణాలు అందేలా చూడండి: సీఎం వైఎస్ జగన్
-
ఇక ఎంచక్కా సీడ్లెస్ పుచ్చ!
సాక్షి, అమరావతి: రైతు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వినూత్న పరిశోధనలు, ఆవిష్కరణలు చేస్తున్నాయి. మారుతున్న అభిరుచులు, ఆహార అలవాట్లు, అదును తప్పి కురుస్తున్న వర్షాలు, వాతావారణ మార్పులకు అనుగుణంగా కొత్త వంగడాలనూ విశ్వవిద్యాలయాలు రూపొందిస్తున్నాయి. అందులో భాగంగా వచ్చిందే గింజలేని (సీడ్లెస్) పుచ్చ. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వరిలో అత్యధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేస్తే.. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీడ్లెస్ పుచ్చ వంగడాలు రెండింటిని రూపొందించింది. వీటికి షోనిమా, స్వర్ణగా నామకరణం చేసి మార్కెట్లో విడుదల చేసింది. పాలిహౌస్‌లలో పెంపకం.. పుచ్చకాయ ముక్కల్లో నల్లగా ఉండే గింజల్ని తీసేసి తినడం మన అలవాటు. ఎందువల్లనో గాని ఆ గింజల్ని మనం తినం. ఊసేస్తుంటాం. ఇకపై ఆ అవసరం ఉండదు. కొబ్బరి ముక్క మాదిరిగా ఏకంగా గుజ్జునంతటినీ తినొచ్చు. కేరళలోని త్రిచూర్ ప్రాంతంలోని వెల్లినక్కర వద్ద కొత్తగా నిర్మించిన పాలిహౌస్‌లో ఆ రాష్ట్ర ఉద్యాన శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా సీడ్లెస్ పుచ్చను సాగుచేసి అబ్బుర పరిచింది. అయితే ఈ పుచ్చరకాన్ని పాలి హౌసులో మల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిన పెంచారు. బిందు సేద్యంతో యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఈ పంటను సాగు చేసి సత్ఫలితాలను సాధించిన తర్వాత రైతుల కోసం ప్రదర్శనలో పెట్టారు. ఆ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ టి.ప్రదీప్ కుమార్ కథనం ప్రకారం ఇదో అసాధారణ హైబ్రీడ్ విత్తనం. ఎకరానికి రూ.1.2 లక్షల ఆదాయం.. ఈ సీడ్లెస్ పుచ్చ పంట మంచి లాభసాటి. ఇప్పటి లెక్క ప్రకారం ఎకరానికి రూ.50 వేల ఖర్చు అవుతుంది. ఇది నాలుగు నెలల పంట. ఎకరానికి రూ.1.2 లక్షల వరకు సంపాయించవచ్చునని అంచనా. కేరళ అగ్రి వర్సిటీలోఒక్కో గింజను రూపాయి చొప్పున అమ్ముతున్నారు. కిలోకి 30వేల గింజలు వస్తాయి. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడొచ్చు. రైతుల అనుభవాలు ఇలా.. త్రిచూరు జిల్లాలో పలువురు రైతులు సీడ్లెస్ పుచ్చను సాగు చేసి లక్షలు గడించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు పలు వీడియోలను కూడా రూపొందించి వివిధ వెబ్సైట్లలో పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక తదితర ప్రాంతాల్లో ఈ పంట ఎక్కువగా సాగయ్యే అవకాశాలున్నాయి. -
వ్యవసాయం పండుగే.. రైతు ముంగిటకే పథకాలు
ఆకివీడు: ‘పల్లెటూరు మన భాగ్య సీమరా, పాడిపంటలకు లోటు లేదురా’ అన్న కవి మాటలను నిజం చేసేలా రాష్ట్రంలో సీఎం జగన్ పాలన సాగుతోంది. పల్లె ప్రగతికి పట్టం కడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పథకాలను అమలుచేస్తుండటంతో అన్నదాతలు ఆనందంగా జీవనం గడుపుతున్నారు. రెండేళ్ల పాలనలో వ్యవసాయాన్ని పండుగ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో జిల్లాలో వ్యవసాయ, ఆక్వా రంగాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. వీటి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోంది. జిల్లాలో 5.85 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంది. సుమారు 80 వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. ఆరు వేల ఎకరాల్లో కూరగాయాల పంటలు పండిస్తున్నారు. పాడి రైతులకు అదనపు ఆదా యం లక్ష్యంగా అమూల్ పాల సేకరణ కేంద్రాలను ఇటీవల ప్రభుత్వం ఏర్పాటుచేసింది. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల వద్ద మహిళా రైతుల నుంచి పాలు సేకరిస్తున్నారు. పశువుల పెంపకం, పశుగ్రాసం, పాల ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. రైతు ముంగిటకే పథకాలు ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా, పంటల బీమా, సున్నావడ్డీ రుణాలు అందిస్తూ రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడుతోంది. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో రైతుల చెంతకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ–క్రాపింగ్ విధానంతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారంతో పాటు పంటల బీమా వర్తింపజేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానించి మద్దతు ధరలు అందిస్తున్నారు. దళారుల బెడద లేకుండా కళ్లాల్లోనే ధాన్యాన్ని అమ్ముకునేలా ఏర్పాట్లు చేశారు. కౌలువ్యవస్థను కూడా పటిష్ట పరిచేలా కౌలుచట్టంలో మార్పులు తీసుకువచ్చారు. భూమి యజమానికి నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కౌలు వ్యవస్థ పటిష్టపడింది. మీసం మెలేస్తున్న రొయ్య రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులు అభివృద్ధి చేసేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. కోవిడ్ విపత్తులోనూ ధరలో లాబీయింగ్‌ను అరికట్టి మద్దతు ధరను ప్రకటించి, కొనుగోలు చేయించారు. ఆక్వా చెరువులకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా, ఈ మార్కెట్ సదు పాయం, ఆక్వా ల్యాబ్‌ల ఏర్పాటు, నాణ్యమైన సీడు, ఫీడు, మందులు అందించేలా చర్యలు తీసుకున్నా రు. ఆక్వాజోన్లతో త్వరితగతిన ఆక్వా అనుమతులు లభిస్తున్నాయి. చేపలు, రొయ్యలకు మార్కెట్ కల్పించేలా ఈ–వెహికల్స్ ఏర్పాటుచేయనున్నారు. ఈనెల 9 నుంచి చైతన్య యాత్రలు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9వ తేదీ నుంచి రైతు చైతన్య యాత్రలను నిర్వహించేలా కార్యాచరణ ప్రకటించింది. వ్యవసాయశాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ క్రాప్, రైతు భరోసా కేంద్రం విధివిధానాలు, పంటల బీమా, వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతుల్లో అవగాహన పెంచేలా చైతన్య యాత్రలను నిర్వహించనున్నారు. వ్యవసాయ సంబంధిత అంశాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించేలా సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. -
తండ్రి బాటలో తనయుడు
వెబ్‌డెస్క్: రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే అన్నాడో ముఖ్యమంత్రి. ఆయన తర్వాత ఆ పదవిలోకి వచ్చిన చీఫ్ మినిష్టర్ మొదటి సంతకాన్ని రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపైనే చేశారు. ఇప్పటికే పద్దెనిమిదేళ్లు గడిచిపోయాయి. ఎవరూ కరెంటు తీగలపై బట్టలు ఆరేయడం లేదు, కానీ పంట చేలలలోకి నీరు పరవళ్లు తొక్కుతూనే ఉంది... రైతు కళ్లలో వెలుగులు విరజిమ్ముతూనే ఉన్నాయి. ఇందులో మొదటి ముఖ్యమంత్రి సీబీఎన్ అయితే రెండో చీఫ్ మినిష్టర్ డాక్టర్ వైఎస్సార్. రైతు దినోత్సవం రైతు కష్టాలే తన కష్టాలుగా భావించారు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. అందుకే ధైర్యంగా తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రకటించారు. దానికి తగ్గట్టే రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు అందించేందుకు జలయజ్ఞం, రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేశారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రైతుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా లెక్కకు మిక్కిలిగా పథకాలు అమలు చేస్తున్నారు. రైతు పక్షపాతి అయిన వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఆ మహనీయుడి స్ఫూర్తితో రైతు దినోత్సవం రోజున భారీ ఎత్తున రైతు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. రైతు దినోత్సవం సందర్భంగా ఏపీలో జులై 8న చేపడుతున్న ప్రారంభోత్సవ కార్యక్రమాలు ► రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో రూ. 413.76 కోట్లతో నిర్మించిన 1,986 రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం. ► రూ. 79.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 100 వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్, ఆక్వా, సీఏడీడీఎల్ ల్యాబ్‌లు ► రూ. 96.64 కోట్ల వ్యయంతో తొలి విడత నిర్మించిన 645 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ► రూ. 31.74 కోట్ల వ్యయంతో నిర్మించిన 53 కొత్త వెటర్నిటీ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్లు ► పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రూ.7.53 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన టెలిమెడిసిన్ కాల్ సెంటర్ ప్రారంభం. ► రూ. 3 కోట్ల వ్యయంతో ఆరు కొత్త రైతు బజార్లు రైతు దినోత్సవం సందర్భంగా ఏపీలో జులై 8న చేపడుతున్న శంకుస్థాపన కార్యక్రమాలు రైతు భరోసా కేంద్రాల స్థాయిలో 1,262 గోడౌన్ల నిర్మాణాలు. దీని కోసం రూ. 400.30 కోట్ల కేటాయించారు రూ. 2000.17 కోట్ల వ్యయంతో ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి పోస్ట్‌హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ ఏర్పాటు పనులు అనకాపల్లిలో బెల్లం, రాజమండ్రిలో అరటి, శ్రీకాకుళంలో జీడిపప్పు, చిత్తూరులో మామిడి, బాపట్లలో చిరుధాన్యాలు, వైఎస్సార్ కడపలో అరటి, హిందూపురంలో వేరుశనగ, కర్నూలులో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ పనులు నాడు-నేడు కింద రూ. 212.31 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్ యార్డుల్లో అభివృద్ధి పనులు రూ. 45 కోట్ల వ్యయంతో కొత్తగా 45 రైతు బజార్ల ఏర్పాటు వైఎస్సార్‌కడప జిల్లా ఊటుకూరులో రూ. 2 కోట్ల వ్యయంతో కడక్‌నాథ్ పౌల్ట్రీ ఏర్పాటు రూ. 15 కోట్లతో నాబార్డు ప్రాజెక్టు -
రైతుల ఉద్యమానికి నెలలు; ఈ నెల 26న ‘బ్లాక్ డే’
న్యూఢిల్లీ: కేంద్ర తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఉద్యమం ప్రారంభమై ఈ నెల 26వ తేదీకి 6 నెలలు అవుతుందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజున ‘బ్లాక్ డే’గా పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా శనివారం పిలుపునిచ్చింది. 40కి పైగా రైతుల సంఘాల ఐక్యవేదికే ఈ కిసాన్ మోర్చా. ఈనెల 26న ఇళ్లు, దుకాణాలపై నల్లజెండాలను ఎగురవేయాలని, వాహనాలకు నల్లజెండాలు కట్టుకోవాలని రైతు నేత బల్బీర్‌సింగ్ రాజేవాల్ శనివారం ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలకు నిరసనగా ‘చలో ఢిల్లీ’ నినాదంతో రైతులు నవంబరు 26న ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారని తెలిపారు. వణికించే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు చాలారోజుల పాటు ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధించిన విషయం తెలిసిందే. కేంద్రంతో పలుమార్లు రైతు సంఘాల చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. అప్పటినుంచి దేశనలుమూలల నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రి, సింఘు, ఘాజీపూర్‌లలోని ధర్నా స్థలాలకు వచ్చి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. మే 26తో మోదీ మొదటిసారి అధికారం చేపట్టి ఏడేళ్లు అవుతుందని రాజేవాల్ తెలిపారు. -
చట్టాలకు బ్రేకులేయండి
న్యూఢిల్లీ/చండీగఢ్ : అహింసాయుతంగా నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని సుప్రీంకోర్టు గురువారం ఉద్ఘాటించింది. రైతు సమస్యల పరిష్కారానికి వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలతో ‘నిష్పాక్షిక, స్వతంత్ర’ కమిటీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో.. మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. రైతుల నిరసన తెలిపే హక్కును హరించకూడదని సూచించింది. అయితే, నిరసన ప్రదర్శన అనేది ఇతరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదని, ఎవరికీ ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగరాదని పేర్కొంది. పౌరులు స్వేచ్ఛగా తిరుగాడే, ఇతర సదుపాయాలు పొందే హక్కులకు అడ్డంకి కాకూడదని న్యాయస్థానం అభిప్రాయపడింది. నిరసన తెలిపే హక్కు అంటే అర్థం నగరంలోని రోడ్లన్నీ మూసివేయడం కాదని తేల్చిచెప్పింది. ఇప్పటికిప్పుడు వ్యవసాయ చట్టాల ప్రామాణికత ప్రధానం కాదని స్పష్టం చేసింది. రైతులు చర్చలకు ముందుకు రాకుండా ఆందోళన కొనసాగిస్తున్నంత మాత్రాన ఫలితం ఉండదని, రైతాంగం డిమాండ్లు నెరవేరాలంటే చర్చలు తప్పనిసరి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే పేర్కొన్నారు. ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకుండా నిరసనలను నిరోధించే హక్కు పోలీసులకు, అధికారులకు ఉందని గుర్తు చేశారు. జరుగుతున్న పరిణామాలు బాధాకరం రైతు ఆందోళనలకు సంబంధించిన అన్ని వాదనలు, రైతు సంఘాల అభిప్రాయాలను విన్న తరువాత, అలాగే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేసిన తరువాత మాత్రమే రైతు సమస్య పరిష్కారానికి కమిటీ నియమిస్తామని జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మేము కూడా భారతీయులమే. రైతుల దయనీయ స్థితి గురించి ఆందోళన చెందుతున్నాం. జరుగుతున్న పరిణామాల పట్ల కలవర పడుతున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తే రైతులు చర్చలకు ముందుకు రారని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలను నిలిపివేయాలని తాము కోరడం లేదని, రైతులు చర్చలకు ముందుకు వచ్చేందుకు వీలుగా తాత్కాలికంగా వాటి అమలును వాయిదా వేయాలని కోరుతున్నట్టు ధర్మాసనం తెలిపింది. రైతు సంఘాలు, నిపుణులతో కమిటీ భారీ సంఖ్యలో రైతులను నగరంలోకి అనుమతిస్తే వారు హింసకు పాల్పడరని ఎవరు హామీ ఇవ్వగలరు? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ హింస జరిగితే కోర్టు అడ్డుకోలేదని, అది కోర్టు పనికాదని గుర్తుచేసింది. పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత పోలీసులు, ఇతర అధికారులపై ఉంటుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వంతో చర్చలు జరపకపోతే నిరసన ఉద్దేశం నెరవేరదని భారతీయ కిసాన్ యూనియన్(భాను)ని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ప్రతినిధులు, రైతు సంఘాలతో పాటు పాలగుమ్మి సాయినాథ్ లాంటి నిపుణులను కమిటీలో నియమించనున్నట్లు వెల్లడించింది. ఆగిన మరో అన్నదాత గుండె సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న మరో రైతు గుండె ఆగిపోయింది. టిక్రీ బోర్డర్లో పంజాబ్‌కు చెందిన 38ఏళ్ల రైతు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. మరణించిన రైతును భటిండా జిల్లాకు చెంది న జై సింగ్‌గా గుర్తించారు. జై సింగ్ కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉ ద్యోగం ఇవ్వాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. నరేంద్రసింగ్ తోమర్ బహిరంగ లేఖ రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని కేం ద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. ఆయన తాజాగా రైతులకు బహిరంగ లేఖ రాశారు. చిన్న, సన్నకారు రైతాంగం ప్రయోజనాల కోసమే కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు పునరుద్ఘాటించారు. అభ్యంతరాలుంటే చర్చలకు ముందుకు రావాలని కోరారు. తోమర్ లేఖను అందరూ చదవాలని ప్రధాని మోదీ కోరారు. చట్టాల ప్రతులు చింపిన కేజ్రీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. తాను రైతాంగానికి ద్రోహం చేయలేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కొత్త చట్టాల ప్రతులను అసెంబ్లీలో చించివేశారు. ఈ చట్టాలు బీజేపీ ఎన్నికల నిధుల కోసమే తప్ప రైతుల ప్రయోజనం కోసం కాదని ఆరోపించారు. ‘‘గడ్డకట్టే చలిలో, కేవలం రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య రోడ్లపైనే నా దేశ రైతాంగం నిద్రిస్తుంటే, వారికి నేను ద్రోహం చేయలేను. తొలుత నేను ఈ దేశ పౌరుడిని, ఆ తరువాతే ముఖ్యమంత్రిని’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరసన ఉద్యమంలో ఇప్పటికే 20 మంది రైతులు మరణించారని, ఇంకెప్పుడు మేల్కొంటారని కేంద్రాన్ని ప్రశ్నించారు. మంత్రులతో అమిత్ భేటీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం పలువురు సహచర మంత్రులతో భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్లతో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. రైతుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహనా కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.బీజేపీ శ్రేణులు ఎంతవరకు రైతాంగాన్ని చేరగలిగారనే అంశంపై సమీక్షించినట్టు తెలుస్తోంది. -
ఆ ఘటనలు పునరావృతం కాకూడదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, సన్నద్ధతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని, ఎట్టి పరిస్ధితుల్లో ఏ సమస్యలు రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతీ పంట కూడా ఆర్బీకే నుంచి ప్రొక్యూర్ చేయాలని, పంటలకు కనీస గిట్టుబాటు ధర తప్పకుండా రావాలని పేర్కొన్నారు. (చదవండి: ఎస్పీ బాలు మృతికి సీఎం జగన్ సంతాపం) ‘‘ప్రతీ ఆర్బీకే వద్ద పంటలన కనీస మద్దతు ధరల (ఎమ్మెస్పీ)పై పెద్ద డిస్ప్లే బోర్డు ఉండాలి. భవిష్యత్తులో ఆర్బీకేలు ధాన్యం సేకరణకు కూడా పూర్తి స్థాయిలో కేంద్రాలుగా నిలవాలి. రైతులు ఎక్కడ ఏ పంట వేయకూడదో అది పక్కగా చూసుకోవాలి. దీన్ని సీరియస్‌గా ఎన్ఫోర్స్ చేయాలి. ఆ మేరకు వారికి సలహా ఇవ్వాలి. ఏ పంట వేస్తే లాభం? దేనికి ధర ఉంది? వంటి అన్ని అంశాలపై రైతులకు చెప్పడంతో పాటు, ఆ తర్వాత వారికి అంతే డబ్బు వచ్చే మార్గం చూపాలి. పంటలు పండిన తర్వాత మార్కెటింగ్ ఇబ్బందులు రాకుండా చూడాలి. వీటన్నింటినీ జాయింట్ కలెక్టర్లు చూడాలి. వారు రైతులకు అన్ని విషయాలు క్లియర్‌గా చెప్పాలి. వాటర్ రియాలిటీ, మార్కెట్ రియాలిటీ ఆధారంగా జేసీలు రైతులకు అవగాహన కల్పించాలి. ఆ తర్వాత పంటల అమ్మకాలకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుందని చెప్పాలి. ఈ ప్రక్రియలో స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలను కూడా ఇన్వాల్వ్ చేయాలి. సార్టెక్స్ వెరైటీని ప్రమోట్ చేయాలి. బ్రొకెన్ రైస్‌ను కూడా వాల్యూ ఎడిషన్ చేయాలని’’ సీఎం సూచించారు. కాటన్ కొనుగోళ్ళలో స్కామ్‌లు జరగకూడదని, కొత్తగా మనం ఎలా కొనుగోలు చేస్తున్నాం అనేది ఈసారి చూపాలని సీఎం అన్నారు. పత్తి రైతులకు న్యాయం జరగాలని, మన ప్రభుత్వ హయాంలో రెప్యుటేషన్ పోగొట్టుకోకూడదని సీఎం స్పష్టం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెంచి రైతుకు మరింత మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందో చూసి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ మీద మరింత ఫోకస్ పెట్టడంతో పాటు బహిరంగ మార్కెట్లో ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుదారుల వివరాల డేటాను ఆ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తద్వారా రైతుల ఉత్పత్తులకు మరింత మార్కెట్ సదుపాయం కలిగేలా చేసి రైతులకు మేలు చేయాలన్నారు. ఈ సీజన్లో కూడా దాదాపు రూ.3300 కోట్ల మేర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు జరగాలని, ఆ మేరకు ధరల స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేశామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
బీజేపీకి ఊహించని షాకిచ్చిన మిత్రపక్షం
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో అధికార బీజేపీకి ఊహించని షాక్ ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వ్యవసాయ రంగాల సంస్కరణ బిల్లుకు ఎన్డీయే ప్రధాన మిత్రపక్షం శిరోమణీ అకాలిదళ్ వ్యతిరేకించింది. ఈ మేరకు ఆయా బిల్లులకు పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆ పార్టీ విప్ జారీచేసింది. ప్రస్తుత సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బిల్లులను అడ్డుకోవాలని నిర్ణయించింది. కాగా వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు మోదీ సర్కార్ మూడు ఆర్డినెన్స్‌లను ఇటీవల జారీచేసిన విషయం తెలిసిందే. నిత్యావసర సరుకులపై ఓ ఆర్డినెన్స్, రైతులకు సాధికారిత కల్పించడంతో పాటు గిట్టుబాటు ధరలు కల్పించే ఉద్దేశంతో మరో ఆర్డినెన్స్, వ్యవసాయ ఉత్పత్తులకు వాణిజ్యపరమైన ప్రోత్సాహం కల్పించే పేరుతో మరో ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టారు. (చైనా నుంచి చొరబాట్లు లేవు) వీటికి సంబంధించిన బిల్లులను ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదం తెలపాలని కేంద్రం భావించింది. నిత్యావసరాల సవరణ బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. అయితే కేంద్రం ప్రతిపాదిత బిల్లులపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన నిర్వహించారు. దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని అకాలిదళ్ ఎంపీలకు విప్ జారీచేసింది. రాజ్యసభలో బిల్లును వ్యతిరేకించాలని అకాలిదళ్ నిర్ణయించింది. మరోవైపు ఉత్తర భారతంలో మొదలైన రైతు మద్దతు ఉద్యమం త్వరలోనే దక్షిణాదికి కూడా విస్తరిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. కాగా పంజాబ్‌లో ఎన్నో ఏళ్లుగా బీజేపీ-అకాలిదళ్ భాగస్వామ్యంగా ఉన్న విషయం తెలిసిందే. (వ్యవసాయం కార్పొరేటీకరణ ?) ప్రభుత్వం చెబుతున్నదేంటి ? మొదటి బిల్లు రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) ప్రకారం రైతులు పండించిన పంటల్ని మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనలు ఉండవు. తమ ఉత్పత్తుల్ని ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మార్కెట్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎక్కువ ధర వచ్చినప్పుడే తమ పంటను అమ్ముకోవచ్చు. ఇక రెండో బిల్లు రైతుల ధరల హామీ, సేవల ఒప్పందం ప్రకారం పంటలు వేయడానికి ముందే వ్యాపారస్తులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత వస్తుంది. కాంట్రాక్ట్ సేద్యాన్ని చట్టబద్ధం చేయడం వల్ల వ్యాపారులు ఒప్పందాలను ఉల్లంఘించడం కుదరదు. ఇక మూడో బిల్లు నిత్యావసరాల సవరణ బిల్లు ప్రకారం చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి ఆహార ఉత్పత్తుల నిల్వలపై ఆంక్షలు తొలగిపోతాయి. -
నాణ్యమైన ఉత్పత్తులు అందించాలి: కన్నబాబు
సాక్షి, విజయవాడ: వ్యవసాయ, అనుబంధ సేవలు రైతు వద్దకే తెచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు పనితీరు-వ్యవసాయ యాంత్రీకరణపై శనివారం ఆయన సమీక్ష జరిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య, పశు సంవర్ధక, మత్స్యశాఖ, ఉద్యాన శాఖ, ఇతర అనుబంధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాల పనితీరు, ఇతర సాంకేతిక అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. (టమాటో ఛాలెంజ్‌తో రైతులకు ఊరట) వ్యవసాయానికి కావాల్సిన ఉత్పత్తులు మార్కెట్ ధర కన్నా నాణ్యమైన, తక్కువ ధరతో రైతులకు అందించేలా కేంద్రాలు పని చేయాలని అధికారులకు మంత్రి కన్నబాబు సూచించారు. ఈ కేంద్రాల్లో కొత్తగా పశుగ్రాసం, ఖనిజ లవణాలు మిశ్రమాలు, పశువుల దాణా తదితర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు రైతులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతులకు అందించే ఉత్పత్తుల్లో నాణ్యత తగ్గకుండా, త్వరితగతిన సేవలు అందించేలా ఆయా కంపెనీల ను సన్నద్ధం చేయాలని పేర్కొన్నారు. అగ్రోస్ సంస్థ నోడల్ ఏజెన్సీ గా ఉండి వ్యవసాయ, అనుబంధ శాఖలతో సమన్వయం చేసుకుని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మరింత సేవ చేయాలని మంత్రి కోరారు. మరిన్ని కంపెనీలతో ఆయా ఉత్పత్తుల కోసం ఒప్పందాలు చేసుకునేలా చూడాలన్నారు. నర్సరీ ఉత్పత్తులను కూడా ప్రోత్సహించాలని అధికారులకు మంత్రి కన్నబాబు సూచించారు. (రెండో విడత 'వైఎస్సార్ నేతన్న నేస్తం') -
అన్నదాతకు వెన్నుదన్ను
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా ఉంటామనే భరోసా కల్పిం చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం అందించడం లక్ష్యంగా ‘వైఎస్సార్ రైతు భరోసా’ అమలుకి రంగం సిద్ధమవుతోంది. లబ్ధిదారుల గుర్తింపు కోసం బుధవారం నుంచి సర్వే ప్రారంభించారు. కేవలం భూమి ఉన్న రైతులు మాత్రమే వర్తిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (పీఎంకేఎస్‌ఎన్‌ఎస్) లోని రైతుల వివరాలను పరిశీలించిడంతో పాటు పెద్ద కౌలు రైతులు గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25న అర్హులు జాబితాను ప్రకటించనున్నారు. కిసాన్ పథకం కింద సన్న, చిన్నకారు రైతులకు కేంద్రం మూడు విడతలుగా మొత్తం రూ.6వేలు సాయం ఇస్తుండగా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.6500 సాయం అందించనుంది. పెద్ద కౌలు రైతులకు రూ.12500 పూర్తి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఒకే విడతగా పెట్టుబడి సా యం రైతులందరికీ అందించనుంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ పథకం సాయం కేవలం భూమి కలిగిన సన్న, చిన్నకారు రైతులకు మాత్రమే అందుతోంది. ఏటా మూడు విడతల్లో రూ.6వేలు మొత్తాన్ని కేంద్రం జమ చేస్తోంది. కాగా ప్రతి రైతు కుటుంబానికి రూ.12500 చొప్పున ముందుగానే పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం అమలుకి చర్యలకు చేపట్టారు. అక్టోబర్ 15 నుంచి అమలుకానున్న అమలుకా నున్న ‘వైఎస్సార్ రైతుభరోసా’ పథకం కోసం లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేశారు. పీఎం కిసాన్ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు అందించనున్న రూ. 6వేలుకి రాష్ట్ర ప్రభుత్వం రూ.6500 జమచేసి మొత్తం రూ.12500 చెల్లించనుంది. కౌలు, పెద్ద రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రూ. 12500 చొప్పున ఒకే విడతలో అందజేయనుంది. రైతు భరోసాకు కౌలు రైతులు అర్హులే గ్రామ వలంటీర్ల ద్వారా కౌలు రైతుల గుర్తింపునకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రాథమిక సర్వేలో భాగంగా సొంత వ్యవసాయ భూమిలేని సాగుదారులను వలం టీర్ల గుర్తిస్తారు. కౌలుదారులకు చెందిన ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంక్‌ఖాతా వివరాలు సేకరించి నిర్దేశిత ప్రొఫార్మాలో నమోదు చేసి వ్యవసాయ రెవెన్యూ అధికారులకు అందజేస్తారు. పరిశీలన అనంతరం లబ్ధిదారుల జాబితాలను అధికారులు, గ్రామ సభల్లో ప్రకటించి ఏమైనా మార్పులు, చేర్పులుంటే చేస్తారు. ఈ జాబితాలో మండల స్థాయిలో తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారులు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, ఏడీఏలు, పరిశీలిస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో తుది జాబితాను ఖరారు చేసి ఈ నెల 25న ప్రకటించనున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం 2.55 లక్షల హెక్టార్లు కాగా అందులో సుమారు 5లక్షల మందికి పైగా రైతులున్నారు. వీరితో పాటు కౌలు రైతులు లక్ష మంది వరకు ఉంటారు. ఈ ఏడాది వరి సాగు 2.13లక్షల హెక్టార్లు లక్ష్యంగా నిర్ణయించారు. అంతేకాకుండా 36వేల హెక్టార్ల అపరాలు, మొక్కజొన్న, పత్తి, చెరుకు సాగు చేస్తున్నారు. మిగిలిన భూమిలో 6వేల హెక్టార్లలో కూరగాయల పంట సాగు చేస్తున్నారు. దీనిలో 3,11,590 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిదారులను గుర్తించారు. పక్కాగా అనర్హులు ఏరివేతకు బుధవారం ఈ నెల 25వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నారు. పీఎం కిసాన్ జాబితాలో అధిక సం ఖ్యలో అనర్హులున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ జాబితా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం రైతుల అందరికీ తెలిసే విధంగా పంచాయతీ కార్యాలయాల్లో వద్ద ప్రదర్శించనున్నారు. 2019 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు వెబ్‌ల్యాండ్‌లో జరిగిన మార్పులు, చేర్పులు, మ్యుటేషన్లలో గుర్తించిన రైతులు జాబితా ఆధారంగా గ్రామస్థాయిలో, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు జాబితాలో స్పష్టమైన కారాణాలు పేర్కొంటూ జాబితా నుంచి తొలగిస్తారు. వెబ్‌ల్యాండ్‌లో ఇటీవల జరిగిన మార్పులు చేర్పులు వలన గుర్తించిన అనర్హత కలిగిన రైతులు ఇప్పటివరకు ఏ జాబితాలో నమోదు కానిరూతులు ఉంటే జాబితాలో చేరుస్తారు. రైతు భరోసాకు ఉండాల్సిన అర్హతలివే.. -ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి కింద లబ్ధి పొందిన రైతులు కూడా వైఎస్సార్ రైతు భరోసాకు అర్హులే. -సొంతంగా భూమి ఉంటే 10సెంట్లు నుంచి 5ఎకరాలు ఉన్న ప్రతి రైతుకి ఈ పథకం వర్తిస్తుంది. -భూ యజమాని మరణిస్తే వారి వారసులు, భార్య ఉంటే వారి పేరున ఉన్న భూములు వివరాలను వెబ్‌ల్యాండ్‌లో మార్చుకోవాలి. ఒకే రేషన్‌కార్డులో గల కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే పథకం వర్తిస్తుంది. వ్యవసాయ ఉద్యానవన, పట్టు పరిశ్రమ నడిపే రైతులు, భూమిలేక కౌలుదారుగా సాగుచేస్తున్న రైతులు అర్హులే. -తల్లిదండ్రులు చనిపోతే వాళ్లకి ఉన్న వారసులులో మాత్రమే కౌలుకి చేసినట్లు అవుతుంది. -కౌలురైతుకి 50 సెంట్లు లేదా అంతకంటే ఎక్కువ సాగు చేస్తూ అతని పేరున భూమి లేకుంటే ఈ పథకం వర్తిస్తుంది. -భూ యజమాని అంగీకారంతో కౌలు రైతులకి ఈ పథకం వర్తిస్తుంది. -భూయజమాని తన భూమిని ముగ్గురు లేదా నలుగురికి కౌలుకిస్తే భూ యజమానితో పాటు ఆ కౌలు రైతుల్లో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. -డీ పట్టా భూముల్లో సాగు చేస్తున్న రైతులకి ఈ పథకం వర్తిస్తుంది. -ఆన్లైన్లో భూమి నమోదు కాని రైతుకి కూడా ఈ పథకం వర్తిస్తుంది. -ఉద్యానవన పంటలు పట్టుపరిశ్రమ చేస్తున్న రైతులకి వర్తిస్తుంది. -స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో గుమస్తాలు, క్లాస్–4 సిబ్బంది, గ్రూప్ డి ఉన్న రైతులకి ఈ పథకం వర్తిస్తుంది. -ఆధార్ నంబర్లు రిజిస్టర్ కాకుంటే వెంటనే నమోదు చేసుకోవాలి. అర్హులకు పథకం అందజేస్తాం.. వైఎస్సార్ రైతు భరోసాలో జిల్లాలో రైతులంతా వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నాం. బుధవారం నుంచి గ్రామగ్రామాన రైతులకి పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. మూడు రకాల జాబితాల్లో ఉండే వివరాలు పరిశీలిస్తారు. అర్హులందరికి పధకం వర్తించేందుకు కృషి చేస్తున్నాం. రైతులతో సమావేశాలు ఏర్పాటుచేస్తున్నాం. దీన్ని వినియోగించుకుంటే రైతులకు ఎంతో లాభం చేకూరుతుంది. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో ఎంతోమంది రైతులకు ఊరటనిస్తుంది. ఈ నెల 25వరకు సర్వే చేయనున్నాం. రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. – బి.జి.వి ప్రసాద్, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్, శ్రీకాకుళం -
‘పోడు వ్యవసాయం చేసేవారికీ రైతు బీమా’
సాక్షి, హైదరాబాద్: పోడు వ్యవసాయం చేసుకునేవారికి కూడా రైతు బీమాను వర్తింపచేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఈ అంశంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి చెప్పాలని సీఎం ఆదేశించినట్టు వెల్లడించారు. ఆదివారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఈ వివరాలు తెలిపారు. టీఆర్ఎస్ సభ్యులు వెంకటేశ్వరరెడ్డి, బాల్క సుమన్, సతీశ్‌కుమార్‌లు రైతుబీమా గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యురాలు సీతక్క పోడు వ్యవసాయం చేసుకుంటున్నవారి గురించి అడిగారు. ఆ రైతులకు కూడా రైతు బీమాను వర్తింపచేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని, వారికి కూడా అండగా ఉంటామని మంత్రి సమాధానం చెప్పారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని సీతక్క గట్టిగా పేర్కొంటుండటంతో, పురాణగాథల్లో సహనానికి మారుపేరుగా ఉన్న సీతమ్మ తరహాలో, ఆపేరుతో ఉన్న సీతక్క కూడా ఓపికగా ఉంటే అన్నింటికి సమాదానాలు వస్తాయని మంత్రి చమత్కరించారు. రైతు బీమా లబ్ధి అందటం లేదన్న అంశానికి ఆయన వివరణ ఇస్తూ, శాసనసభా సమావేశాలు ముగిసిన తర్వాత ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది 31 లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లించారని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ 164 మండలాల్లో కూడా గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. -
గళమెత్తారు..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రజా సమస్యలపై జెడ్పీటీసీ సభ్యులు గళమెత్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో తీరొక్క సమస్యలపై ప్రశ్నించారు. ప్రధానంగా జిల్లాలోని పలువురు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందలేదని, దీంతో వారు రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారని, దీనిపై రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అలాగే మత్స్య సహకార సంఘాలకు కట్టిన భవనాలకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శనివారం జరిగిన జిల్లా పరిషత్ సాధారణ చివరి సర్వసభ్య సమావేశానికి జెడ్పీ చైర్మన్ బరపటి వాసుదేవరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, మార్కెటింగ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, వైద్య, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ సాగింది. జిల్లాలో రైతుల వెతలను పట్టించుకునే వారే కరువయ్యారని, రెవెన్యూపరమైన పనులు సామాన్యులకు అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొందని, జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ బాగుచేయలేనంతగా దెబ్బతిన్నదని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కో ఆప్షన్ సభ్యుడు జియావుద్దీన్ పేర్కొన్నారు. అనేక మండలాల్లో రైతులకు ఇంకా పట్టాదారు పాస్ పుస్తకాలు చేరనేలేదని, సాంకేతిక అంశాలను తప్పులుగా భూతద్దంలో చూపుతూ రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుబంధు ఆర్థిక సహాయాన్ని అధికారులు అడ్డుకుంటున్నారని, పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఉన్న లోపాలను, సాంకేతిక తప్పిదాలను సరి చేయాల్సిన క్షేత్రస్థాయి సిబ్బంది అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అలాగే మత్స్య సహకార సంఘాలకు కట్టిన భవనాలకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శనివారం జరిగిన జిల్లా పరిషత్ సాధారణ చివరి సర్వసభ్య సమావేశానికి జెడ్పీ చైర్మన్ బరపటి వాసుదేవరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, మార్కెటింగ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, వైద్య, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ సాగింది. జిల్లాలో రైతుల వెతలను పట్టించుకునే వారే కరువయ్యారని, రెవెన్యూపరమైన పనులు సామాన్యులకు అందుబాటులో రాని పరిస్థితి నెలకొందని, జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ బాగుచేయలేనంతగా దెబ్బతిన్నదని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కో ఆప్షన్ సభ్యుడు జియావుద్దీన్ పేర్కొన్నారు. అనేక మండలాల్లో రైతులకు ఇంకా పట్టాదారు పాస్ పుస్తకాలు చేరనేలేదని, సాంకేతిక అంశాలను తప్పులుగా భూతద్దంలో చూపుతూ రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుబంధు ఆర్థిక సహాయాన్ని అధికారులు అడ్డుకుంటున్నారని, పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఉన్న లోపాలను, సాంకేతిక తప్పిదాలను సరి చేయాల్సిన క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బోనకల్, ఏన్కూరు జెడ్పీటీసీ సభ్యులు సైతం ఇదే అంశంపై ప్రభుత్వ విధానాలను నిలదీశారు. ఐదేళ్ల తమ పదవీ కాలంలో ప్రజలకు ఎంతో సేవ చేయాలని భావించామని, నిధుల కొరత కారణంగా అనేక పనులు చేయకుండానే పదవీ కాలాన్ని ముగించాల్సి వస్తోందని పలువురు జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని కౌలు రైతులకు భూమి కార్డులు ఇవ్వాలని, వారికి రైతుబంధు వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జేసీ అనురాగ్ జయంతి మాట్లాడుతూ రైతుబంధు, ఆర్ఓఆర్, పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో ఎదురవుతున్న ఇబ్బందిని, రైతులకు జరుగుతున్న అసౌకర్యంపై తక్షణమే చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే దీనిని అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా జిల్లా అధికార యంత్రాంగం భావించి అనేక చోట్ల గ్రామసభలు నిర్వహించి.. ఈ తరహా ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అలాగే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతులకు డబ్బులు చెల్లించే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని, అందరికీ డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సభ్యులు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని శాఖలవారీగా సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. మత్స్య శాఖ నిధులతో పలుచోట్ల సంఘ భవనాలు నిర్మిస్తే.. ఇప్పుడు డబ్బులు లేవని ఇబ్బంది పెడుతున్నారని, అప్పుడున్న నిధులు వెనక్కిపోవడానికి బాధ్యులు ఎవరో తేల్చాలని, ఏళ్ల తరబడి నిర్మించిన భవనాలకు డబ్బులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోవడం మినహా మరో మార్గం లేదని బోనకల్ జెడ్పీటీసీ సభ్యుడు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డిప్యూటీ సీఈఓ అప్పారావు స్పందిస్తూ.. ఈ నిధులకు సంబంధించి ప్రభుత్వానికి తక్షణమే లేఖ రాయడంతోపాటు నిధుల లభ్యతపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రభుత్వ పర్యవేక్షణ అనేక అంశాల్లో కరువవడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, తాలిపేరులో చేప పిల్లలు వేస్తామని అధికారులు మాకు సమాచారం ఇచ్చారని, నాలుగు లారీల్లో చేప పిల్లలు వస్తున్నాయని వేసేందుకు ఆహ్వానించారని.. తీరా తాము అక్కడికి వెళ్లేసరికి లారీలు, చేప పిల్లలు లేవని, ఇదేమిటని పరిశీలిస్తే.. తాలిపేరు చెరువులో చేప పిల్లలను వదిలేశామని చెబుతున్నారని, ఆ ప్రాంతంలో లారీ టైర్ల అచ్చులు సైతం పడకుండా అన్ని లారీలు ఎలా వచ్చాయో ఇప్పటికీ అర్థం కావడం లేదని దుమ్ముగూడెం జెడ్పీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఏన్కూరు జెడ్పీటీసీ సభ్యురాలు మాట్లాడుతూ ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లో దళారుల దందా రాజ్యమేలుతోందని, రైతుకు తీవ్రస్థాయిలో అన్యాయం జరుగుతోందని, ఇదేమిటని ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు ప్రశ్నిస్తే.. వారిని లోబరుచుకోవడానికి దళారులు ప్రయత్నిస్తున్నారని, దీనిపై అధికారులు దృష్టి సారించకపోతే రైతు అన్యాయమైపోతాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లందు జెడ్పీటీసీ చండ్ర అరుణ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అందించే రైతుబంధు డబ్బులను కొన్ని బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, ఇది తీవ్రవైన విషయంగా ప్రభుత్వం పరిగణించాలని, రైతుకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే నగదును పాత అప్పుల కింద బ్యాంకు అధికారులు జమ చేసుకునే పద్ధతికి అధికారులు చెక్ పెట్టకపోతే రైతుబంధు పథకం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పలు ఉదాహరణలను వివరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జెడ్పీ చైర్మన్ బరపటి వాసుదేవరావు మాట్లాడుతూ గత ఐదేళ్లలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలను అర్హులైన పేదలకు అందించడంలో ప్రజాప్రతినిధులంతా పాలుపంచుకున్నారని అన్నారు. సమావేశంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ మౌలాన, జియావుద్దీన్, ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళాలకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల్లోనూ విత్తనమేళాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాయలం ఆడిటోరియం ఆవరణలో శుక్రవారం ‘‘విత్తనమేళా–2019’’ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికే తలమానికంగా ఉండేలా సీఎం కేసీఆర్ రైతులకి విప్లవాత్మకమైన పథకాలు అమలు చేస్తున్నారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుల రుణమాఫీ, మిషన్ కాకతీయ, విత్తన సరఫరా, మార్కెట్ల ఆధునీకరణ వంటి ఎన్నో పథకాల్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. కేసీఆర్ ప్రతి ఎకరానికి నీరు అందివ్వాలనే ఉద్దేశ్యంతో కాళేశ్వరం, పాలమూరు వంటి ప్రాజెక్టుల్ని చేపట్టారన్నారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే ఈ నెల 27 తర్వాత రుణమాఫీ అమలు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో తెలంగాణలో కోట్లాది మందికి వ్యవసాయం ద్వారానే ఉపాధి కల్పించే విధంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. యువత కూడా వ్యవసాయం వైపు పెద్దసంఖ్యలో ఆకర్షితులయ్యేలా ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు సంప్రదింపులు అందించేందుకు కొత్త ‘యాప్’లు అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన నాణ్యత ప్రమాణాలతో కూడిన వ్యవసాయ ఉత్పత్తులని పండించేలా తెలంగాణ రైతులు అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. వ్యవసాయానికి సంబంధించి కొత్త కార్యక్రమాల్ని రూపొందిస్తూ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్న వ్యవసాయవర్సిటీ వీసీ డా.వి. ప్రవీణ్‌రావును ఇదే పదవిలో మరో మూడేళ్లపాటు కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషనర్ రాహుల్ బొజ్జా, వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి డా.వి.ప్రవీణ్‌రావు, పరిశోధనా సంచాలకులు డా.జగదీశ్వర్ పాల్గొన్నారు. -
రైతు స్వేదంతో రాజకీయ సేద్యం
గత సంవత్సరం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సౌరాష్ట్ర ప్రాంత రైతులు బీజేపీ ప్రభుత్వాన్ని ఓటమి అంచుల్లోకి తీసుకుపోవడం, ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను రైతులు సాగనంపడం, రైతుబంధు పథకంతో తమను ఆదుకున్న తెలంగాణ ప్రభుత్వానికి రైతులు ఘనవిజయం కట్టబెట్టడం చూస్తుంటే.. ఓటింగ్ సమయంలో రైతులు నిర్ణయాధికారాన్ని శక్తిమంతంగా ప్రకటించే స్థితికి చేరుకున్నారని భావించక తప్పదు. రాజకీయ విధానాలు, ఆర్థికవ్యవస్థ చలనం రైతులను అధోగతికి చేరుస్తున్న నేపథ్యంలో, ఎన్నికల సమయంలో రైతుల సంఘటిత నిర్ణయం ఒక్కటే వారిని ముందుకు తీసుకుపోయే మార్గంలా కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబర్ 11 తర్వాత భారత రాజకీయాల్లో వ్యవసాయం కేంద్ర బిందువై కూర్చుంది. కానీ ఇది వ్యవసాయ పునరుజ్జీవనానికి తోడ్పడుతుందా అన్నదే ప్రశ్న. ప్రజాభిప్రాయం చాలా స్పష్టంగా వెల్లడైంది. గత సంవత్సరం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు మత ఆగ్రహాన్ని చక్కగా ప్రదర్శించారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో పాలక బీజేపీని ఓటమి అంచులదాకా తీసుకురావడం అనేది ఆ ప్రాంతంలో తీవ్రమైన వ్యవసాయ దుస్థితిని స్పష్టంగా చాటి చెప్పంది. గ్రామీణ నాడిని పట్టుకోవడంలో వైఫల్యం, వీధుల్లోకి వచ్చిన రైతుల్లో పెరుగుతున్న ఆగ్రహావేశాలు వ్యవసాయం ప్రధానంగా ఉండే హిందీ ప్రాబల్య రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో పాలక ప్రభుత్వాలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పొందిన పరాజయం ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగానే చిత్రిం చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ తనకు అధికారమిస్తే వ్యవసాయ రుణాల మాఫీని, వరిపంటకు అధిక గిట్టుబాటు ధరలను కల్పిస్తామని వాగ్దానం చేసినప్పటికీ, పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకం ద్వారా రైతులకు ప్రత్యక్ష నగదు ప్రోత్సాహం కలిగించిన అపార ప్రజాదరణతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అద్వితీయ విజయం సాధించారు. దేశంలోనే ప్రప్రథమంగా అమలైన ఈ వినూత్న పథకం ద్వారా తెలంగాణలోని భూ యజమానులు సంవత్సరానికి ఎకరా భూమికిగాను రూ. 8,000ను వ్యవసాయ దిగుబడి ఖర్చులను ప్రభుత్వం నుంచి సహాయకంగా పొందారు. ఈ మొత్తాన్ని ఖరీఫ్, రబీ సీజన్లలో రెండు దఫాలుగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం లోని 58 లక్షలమంది రైతులకు అందించి రికార్డు సృష్టించింది. ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం 2018–19 బడ్జెట్లో రూ. 12,000 కోట్లమేరకు కేటాయించింది. ఈ పథకం కింద రైతుకు అందించే నగదును రూ. 10,000కు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వెంటనే జార్ఖండ్ రాష్ట్రం ప్రభుత్వం కూడా ఎకరా భూమికి రైతుకు రూ. 5,000లను అందించే పథకాన్ని ప్రకటించి తెలంగాణ బాటలో నడిచింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యవసాయ రుణాల మాఫీపై ఎన్నికల ప్రచార సమయంలో చేసిన హామీని అమలు చేస్తూ సంతకాలు పెట్టడంలో ప్రదర్శించిన వేగాన్ని పరిశీలించినట్లయితే, వ్యవసాయానికి సంబంధించినంతవరకు ఈ రాజకీయ అత్యావశ్యకతను కాంగ్రెస్ పార్టీ గుర్తించిందని స్పష్టంగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక్కోరైతుకు గరి ష్టంగా 2 లక్షల రూపాయల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. దీనికయ్యే ఖర్చు దాదాపు రూ.35,000 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో వ్యవసాయ రుణాల మాఫీకోసం వరుసగా రూ. 18,000 కోట్లు, రూ. 6,100 కోట్లను ఖజానా నుంచి వెచ్చించనున్నాయి. ఈ రుణమాఫీలు పూర్తిగా అమలయితే 83 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుతుంది. రైతుల రుణమాఫీ వల్ల జమాఖర్చుల పట్టీలు (బ్యాలెన్స్ షీట్స్) అస్తవ్యస్థమవుతాయని, పైగా ఇది చెడు సంప్రదాయాన్ని నెలకొల్పుతుందని ఆర్థికవేత్తలు, బ్యాంకర్లు, ప్రణాళికా కర్తలు మొత్తుకుంటున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రుణమాఫీలపై తిరుగులేని విధంగా ప్రకటన చేశారు. ‘రైతులకు నేనిచ్చే సందేశం ఒక్కటే. ఈ దేశం మీది. మీ రుణాలను మొత్తంగా మాఫీ చేయవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తాయి. వ్యవసాయ రుణ మాఫీలను చేసేంతవరకు ప్రధానిని మేం నిద్రపోనీయం. ఒకవేళ మోదీ ఈ పనిచేయనట్లయితే, నూటికి నూరు శాతం కాంగ్రెస్ అందుకు పూనుకుంటుందని మాట ఇస్తున్నా. ‘రాహుల్ గాంధీ వాదనలో కాస్త హేతువు ఉంది మరి. 2014 ఏప్రిల్ నుంచి 2018 ఏప్రిల్ మధ్యకాలంలో మన దేశ కార్పొరేట్ రంగం నుంచి రాబట్టలేని రూ. 3.16 లక్షల కోట్ల మొండి బకాయిలను కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. ఇంత భారీ మొత్తాన్ని కేంద్రం రద్దు చేస్తున్నా ఘనత వహించిన మన ఆర్థికవేత్తలూ లేక బ్యాంకర్లు కిమ్మనడం లేదు. గావుకేకలు పెట్టడం లేదు. ఆర్తనాదాలు చేయడం లేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించగా చాలాచోట్ల గ్రామీణ ప్రజలు నాతో ఇదే విషయమై వాదులాటకు దిగారు. కార్పొరేట్ కంపెనీల భారీ రుణాలను ఉన్నపళాన రద్దు చేస్తున్నప్పుడు రైతుల రుణాలను ఎందుకు రద్దు చేయరు అనేది వారి ప్రశ్న. నిజానికి వారి ఆగ్రహం కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ పైకి మళ్లింది. ఎందుకంటే కార్పొరేట్ రుణాలను రద్దు చేయడం ఆర్థిక ప్రగతికి దారితీస్తుందని ఆయన రికార్డుపూర్వకంగా ప్రకటించారు. మరోవైపున ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేశాక రైతు రుణ మాఫీని ప్రకటించినప్పుడు, అది జాతీయ బ్యాలెన్స్ షీట్లను దెబ్బతీస్తుందని, నైతికపరంగా అది అపాయకారి అని నాటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. అయినప్పటికీ, హిందీ ప్రాబల్య ప్రాంతంలో ఓటర్లు ఇచ్చిన స్పష్టమైన తీర్పు వ్యవసాయాన్ని భారత రాజకీయరంగం కేంద్రపీఠంలోకి తీసుకొచ్చింది. రాజకీయ ఎజెండాలో వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం లభించింది. దీని సందేశం చాలా స్పష్టంగానూ, బిగ్గరగానూ వినిపించింది. బహుశా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎన్నికల తీర్పు వ్యవసాయ సమాజంలో కొట్టొచ్చినట్లుగా ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించినట్లు సంకేతాలు వెలువరించింది. మతం, కులం, సిద్ధాంతాలు ప్రాతిపదికన రాజకీయ పార్టీల విభజన విధానాలకు దాటి ఆలోచిస్తున్న రైతాంగం, ఇప్పుడు తమ సామూహిక ఓటింగ్ శక్తిని వాస్తవంగా గ్రహిస్తున్నారు. ప్రభుత్వాలను అమాంతంగా పడదోయగల శక్తి తమకుందని ఇటీవలి ఎన్నికలు వారికి స్పష్టంగా బోధపర్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికలను కూడా ఈ ప్రధానాంశం తప్పనిసరిగా ప్రభావం చూవవచ్చు. జనాభాలో దాదాపు 50 శాతం మంది అటు ప్రత్యక్షంగానో, ఇటు పరోక్షంగానో వ్యవసాయరంగంలో మునిగివున్న దేశంలో, ఎట్టకేలకు రైతులు తమను తాము మరింత ఆత్మవిశ్వాసంతో ప్రకటించుకునే స్థితికి చేరుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయరంగంలో వాస్తవ ఆదాయాలు ఘనీభవించిపోయాయి. ఇటీవలే ఓఈసీడీ జరిపిన అధ్యయనం ప్రకారం, భారత్‌లో గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయ రాబడులు యధాతథంగా ఉండిపోయాయని తెలుస్తోంది. అంతకుముందు యూఎన్సీడీఏడీ (అంక్టాడ్) నిర్వహించిన అధ్యయనం ప్రకారం, అంతర్జాతీయంగానే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ద్రవ్యోల్బణం కారణంగా 1995 నుంచి 2005 వరకు స్తబ్దతలో ఉండిపోయాయని తేలింది. ఇక ఇటీవల నీతి అయోగ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2011–12 నుంచి 2015–16 మధ్య అయిదేళ్ల కాలంలో వ్యవసాయోత్పత్తి వేగంగా పెరిగినప్పటికీ వ్యవసాయంలో వాస్తవాదాయం అర్థ శాతం కంటే అంటే 0.44 శాతం కంటే తక్కువగా ఉందని తెలిసింది. మన దేశంలో రైతులు నిజంగానే పంటలు పండించడం అనే శిక్షకు గురైనట్లుంది. కొన్ని మినహాయింపులను దాటి చూస్తే, ప్రతి సంవత్సరం వారు పండిస్తున్న పంటల దిగుబడి ఖర్చుకు తక్కువ రాబడినే నిత్యం పొందుతూ వస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడానికి దేశ ఆర్థిక భారం మొత్తాన్ని అనాయాసంగా రైతులపై మోపుతున్నారు. రైతు తన జీవిత పర్యంతం అప్పులతోటే పుట్టడం, అప్పులతోటే బతుకీడ్చటం నిజంగా నరకప్రాయమైనది. బతకాలంటే అప్పు చేయక తప్పని పరిస్థితి. మరోవైపున ఆ తీసుకున్న అప్పు పర్వతభారంలాగా పెరిగిపోతూ ఉంటుంది. రైతు జీవితం పొడవునా అలుముకున్న ఆర్థిక దుస్థితి ఇదేమరి. దేశంలోని 17 రాష్ట్రాల్లో లేక దాదాపుగా సగం దేశంలో వ్యవసాయ కుటుంబం సగటు ఆదాయం సంవత్సరానికి కేవలం రూ.20,000 మాత్రమే అని ఎకనమిక్ సర్వే 2016 ప్రకటించడం దేశాన్ని నివ్వెరపర్చింది. రాజకీయ విధానాలు, ఆర్థికవ్యవస్థ చలనం రైతులను అధోగతికి చేరుస్తున్న నేపథ్యంలో దేశ రాజకీయ ఆవరణంలో ఎన్నికల సమయంలో రైతుల సంఘటిత నిర్ణయం ఒక్కటే వారిని ముందుకు తీసుకుపోయే మార్గంలా కనిపిస్తోంది. ఈ రాజకీయ మూలమలుపు వ్యవసాయదారులను నూతన పునరుజ్జీవన దిశగా నడిపిస్తుందా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. వ్యాసకర్త: దేవిందర్‌శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
రుణ మాఫీ హామీలు సరికాదు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో రాజకీయ పార్టీలిస్తున్న రుణాల మాఫీ హామీలను రిజర్వు బ్యాంకు మాజీ గవర్నరు రఘురామ్ రాజన్ తప్పుబట్టారు. రుణాల మాఫీ అనేది ఎన్నికల హామీల్లో భాగం కాకూడదన్నారు. ‘‘దీనివల్ల వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుంది. రాష్ట్రాల ద్రవ్య పరిస్థితులపై ఒత్తిడికి దారి తీస్తుంది’’ అన్నారాయన. పార్టీలు ఇలాంటి హామీలివ్వకుండా చూడాలంటూ తాను ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాసినట్లు చెప్పారాయన. ‘‘నిజం చెప్పాలంటే వ్యవసాయ రంగంలోని నైరాశ్య పరిస్థితుల్ని పరిష్కరించాల్సిన అవసరం చాలా ఉంది. కాకపోతే అది రుణాల మాఫీ ద్వారానేనా? అన్నది మాత్రం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ రుణాలు తీసుకునేది కొందరు మాత్రమే’’ అని రాజన్ చెప్పారు. ‘భారతదేశానికి కావాల్సిన ఆర్థిక వ్యూహం’ అనే అంశంపై ఒక నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రుణాలు కాస్తంత పలుకుబడి కలిగిన వారికే వస్తుంటాయని, వారికే ఈ మాఫీతో లబ్ధి కలుగుతుందని చెప్పారాయన. ఈ మాఫీలు రుణ సంస్కృతిని విషతుల్యం చేస్తాయని, కేంద్ర– రాష్ట్రాల బడ్జెట్లపై ఒత్తిడి పెంచుతాయని వ్యాఖ్యానించారు. రుణాల పంపిణీ లక్ష్యాలు కూడా... ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రభుత్వాలు మోపే రుణాల పంపిణీ లక్ష్యాలు కూడా ప్రమాదకరమైనవేనని రాజన్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వం నిధులివ్వకుండా పీఎస్‌బీలపై ఇలాంటి లక్ష్యాలు రుద్దటం సరికాదు. ఇవి భవిష్యత్తు ఎన్పీఏల వాతావరణానికి దారితీస్తాయి. పీఎస్‌బీలను తగినంత నిధులతో పటిష్టం చేయాలి’’ అని చెప్పారు. ఏదైనా అవసరం ఉండి చేస్తే దానికి వెంటనే బడ్జెట్ నిధుల నుంచి సర్దుబాటు చేయాలని సూచించారు. ప్రయివేటీకరణే పరిష్కారం కాదు... ప్రభుత్వరంగ బ్యాంకుల సమస్యలకు ప్రైవేటీకరణ ఒక్కటే పరిష్కారం కాదని రఘురామ్ రాజన్ స్పష్టంచేశారు. రుణాల పంపిణీ లక్ష్యాలు, ప్రభుత్వ పథకా>ల పంపిణీ బాధ్యతలు ప్రభుత్వ బ్యాంకులపై రుద్దడం వంటి జోక్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లిక్విడిటీ కవరేజీ రేషియో, నెట్ స్టెబుల్ ఫండింగ్ రేషియోలను దీనికి ప్రత్యామ్నాయంగా పేర్కొన్నారు. వచ్చే జనవరి నుంచి అమల్లోకి వచ్చే విధంగా లిక్విడిటీ రేషియోను పావు శాతం తగ్గిస్తూ ఆర్బీఐ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది 19 శాతం ఉండగా, ప్రతీ త్రైమాసికానికి పావు శాతం చొప్పున 18 శాతానికి వచ్చే వరకు తగ్గించాలన్నది ఆర్బీఐ నిర్ణయం. బ్యాంకిం గ్ రంగంలో భారీ ఎన్పీఏల సమస్య నేపథ్యంలో... పీఎస్‌బీల బోర్డులను నిపుణులతో భర్తీ చేయాల్సిన అవసరాన్ని రాజన్ గుర్తు చేశారు. పీఎస్బీ బోర్డుల్లో నియామకాలకు ప్రభుత్వం దూరంగా ఉండాలని సూచించారు. ‘‘ఎక్కువ సమస్య పీఎస్బీల్లో ఉంది. అలాగని, ప్రైవేటు రంగ బ్యాంకులు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు, ఇతర పాత తరం ప్రైవేటు బ్యాంకులు కూడా దీనికి అతీతం కాదు. పాలనను, పారదర్శకతను ప్రోత్సాహకాలను మెరుగుపరచాలి. కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకుల్లోనూ సమస్యలున్న నేపథ్యంలో... ప్రభు త్వరంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారం కాబోదు’’ అని రాజన్ వివరించారు. గవర్నెన్స్ విధానంపై లోతుగా అధ్యయనం ఆర్బీఐ బోర్డు సమావేశంలో నిర్ణయం ముంబై: కొత్త గవర్నర్‌గా నియమితులైన శక్తికాంత దాస్ సారథ్యంలో శుక్రవారం తొలిసారిగా భేటి అయిన ఆర్బీఐ బోర్డు.. గవర్నెన్స్ విధానాలపై మరింత లోతుగా పరిశీలన జరపాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, దేశీయంగాను.. అంతర్జాతీయంగాను ఎదురవుతున్న సవాళ్లు, లిక్విడిటీ, రుణ వితరణ, కరెన్సీ నిర్వహణ, ఆర్థిక అక్షరాస్యత తదితర అంశాలపై చర్చించింది. ’ఆర్బీఐ గవర్నెన్స్ అంశంపై బోర్డు చర్చించింది. దీన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది’ అని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన సమావేశం అనంతరం ఆర్బీఐ క్లుప్తంగా ఒక ప్రకటన జారీ చేసింది. 2017–18లో బ్యాంకింగ్ తీరుతెన్నులు, పురోగతి విషయాలకు సంబంధించిన ముసాయిదా నివేదిక గురించి 18 మంది సభ్యుల బోర్డు చర్చించినట్లు వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో మాజీ బ్యూరోక్రాట్ శక్తికాంత దాస్‌ను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. 25వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాస్ సారథ్యంలో బోర్డు సమావేశం కావడం ఇదే తొలిసారి. గతంలో ఉర్జిత్ పటేల్ సారథ్యంలో నవంబర్ 19న ఆర్బీఐ బోర్డు సమావేశమైంది. దాదాపు పది గంటల పాటు ఇది సాగింది. రిజర్వ్ బ్యాంక్ వద్ద ఎంత స్థాయిలో అత్యవసర నిల్వలు ఉండాలి తదితర అంశాలను సూచించేందుకు ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో బోర్డు నిర్ణయించింది. అయితే, ఆరుగురు సభ్యులతో ఏర్పాటు కావాల్సిన ఈ కమిటీకి చైర్మన్‌గా ఎవరిని నియమించాలన్న విషయంలో కేంద్రం, ఆర్బీఐకి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ప్రతిపాదన ముందుకు సాగలేదు. అది జోక్యం చేసుకోవడం కాదు ఆర్బీఐతో విభేదాలపై జైట్లీ న్యూఢిల్లీ: ఎన్నికైన సార్వభౌమ ప్రభుత్వం రుణాలు, ద్రవ్య లభ్యత అంశాలను పరిష్కరించాలని ఆర్బీఐని కోరడం, ఆ సంస్థ స్వయంప్రతిపత్తిలో జోక్యం చేసుకోవడం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆర్బీఐతో అంశాలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్బీఐ స్వతంత్రతను గౌరవిస్తున్నాం కనుకనే మార్కెట్ ఎదుర్కొంటున్న ఈ అంశాల గురించి మాట్లాడుతున్నామని ఫిక్కీ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ చెప్పారు. ప్రభుత్వం చెబుతున్న అంశాలు ఆర్బీఐ అధికార, చట్ట పరిధిలోనే ఉన్నాయన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో రుణాలు, లిక్విడిటీ వంటి మరో సవాలు దేశీయంగా అవసరం లేదని చెప్పారు. సమాచారం, చర్చించడం, దృష్టికి తీసుకురావడం అన్నది ఆర్థిక వ్యవస్థ పనిచేసే విధానంలో భాగమేనని గుర్తు చేశారు. మార్కెట్ ఎదుర్కొంటున్న సవాళ్లను ఒక్క ప్రభుత్వమే కాదని, పారిశ్రామిక సంఘాలైన ఫిక్కీ సైతం ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 3.3 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జైట్లీ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7–8 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ గుర్తింపును నిలబెట్టుకుంటుందన్నారు. -
త్వరలో వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: జనవరి నాలుగో వారంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర సహకార రిజిస్ట్రార్ శాఖ సిద్ధం చేసింది. ఇప్పటికే అన్ని జిల్లాల సహకార శాఖ అధికారులకు రిజిస్ట్రార్, కమిషనర్ ఎం.వీరబ్రహ్మయ్య స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణపై ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని అందులో పేర్కొన్నారు. ప్యాక్స్‌లలో ముసాయిదా ఓటర్ల జాబితాను శుక్రవారం ముద్రించాలని, వాటిపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను ఈ నెల 21 వరకు స్వీకరించాలని పేర్కొన్నారు. పర్సన్ ఇన్చార్జి కమిటీ వాటన్నింటిని పరిష్కరించి తుది ఓటర్ల జాబితాను ఈ నెల 22న ప్రచురించాల్సి ఉంది. జాబితాను ఈ నెల 23న సహకార శాఖ రిజిస్ట్రార్ ఆమోదానికి పంపాలి. రాష్ట్ర స్థాయిలో సహకార శాఖ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనుంది. వాటిన్నింటిని పరిష్కరించి 28వ తేదీన ఆమోదం తెలపనున్నారు. ఆ తరువాత పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే జనవరి 15 నుంచి లేదా నాలుగో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం 906 ఫ్యాక్స్‌లు ఉన్నాయి. వీటికి ఇప్పుడు పర్సన్ ఇన్‌చార్జ్‌లు పాలక వర్గాలుగా కొనసాగుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో కొన్ని, ఫిబ్రవరిలో ముగిశాయి. మరో నెల గడిస్తే ఏడాది అవుతుంది. హైదరాబాద్ నుంచే పర్యవేక్షణ.. గతంలో మాదిరి కాకుండా ఈసారి ఎన్నికలు వేరుగా జరగనున్నాయి. 1964 సహకార చట్టంలోని ఎన్నికల ప్రక్రియను తెలిపే 22వ నియమానికి సవరణలు ప్రభుత్వం గతంలో సవరణలు చేసింది. దీని ప్రకారం హైదరాబాద్ నుంచే ఎన్నికల అధికారులను నియమించి పర్యవేక్షణ చేయనున్నారు. ఎన్నికలకు సంబంధించిన వ్యయాన్ని ఎన్నికల అధికారి ప్రతిపాదనలు సమర్పించి సొసైటీ నుంచే ఖర్చు చేసే విధానానికి సవరణలో స్వస్తి చెప్పారు. లోటుపాట్లు, అవినీతి చోటు చేసుకుంటున్నందున ఎలక్షన్ నిర్వహణ వ్యయం మొత్తం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నుంచే వెళ్తోంది. -
చెరువుల పేరుతో లూటీ
యర్రగొండపాలెం (ప్రకాశం): ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పారుదల, వ్యవసాయాభివృద్ధి పథకం కింద మంజూరైన నిధులు కాజేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ పనులకు సంబంధించి గతనెలలో బాక్సు టెండర్లను టీడీపీ వర్గీయులతో వేయించి ఇప్పుడిప్పుడే ఆ పనులకుగాను అగ్రిమెంట్లు చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు. సహజంగా రోడ్లు, భవనాల శాఖ రూ.1 లక్ష పనులు, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలు రూ.5 లక్షల మేరకు పనులకు ఆన్లైన్ టెండర్లను వేయాల్సి ఉంటుంది. ఈ టెండర్లలో రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు పాల్గొనవచ్చు అనే నిబంధన ఉంది. అందుకు విరుద్ధంగా జిల్లాలో ఈ టెండర్ల ప్రక్రియను పూర్తిగా మార్చివేశారు. కోట్లాది రూపాయల ప్రజల సొత్తును టీడీపీ నాయకులకు కట్టబెట్టడానికి బాక్సు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు వేయటానికి కాంట్రాక్టర్లు షెడ్యూల్ దాఖలు చేయాల్సి ఉంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పనులకు గాను టెండర్లు మరో విధంగా వేశారు. నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి తన అధికారాన్ని ఉపయోగించి షెడ్యూల్‌ను తనకు అనుకూలంగా ఉన్న టీడీపీ వర్గీయులకే అందేలా చర్యలు తీసుకున్నారు. అందుకుగాను టెండరు దక్కించుకున్న టీడీపీ నేత ఆయనకు 10 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉందని నియోజకవర్గంలో ఆ వర్గానికి చెందిన నాయకులే చర్చించుకుంటున్నారు. సింగిల్ టెండర్ అయితే నిబంధనలను పూర్తిగా వ్యతిరేకించిన వారవుతారన్న ఉద్దేశంతో మరో ఫాల్ట్ టెండర్‌ను వేయించారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు : ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే, ఎస్‌ఎన్‌పాడు ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పారుదల, వ్యవసాయ అభివృద్ధి పథకం కింద మంజూరైన ఈ పనులు 100 ఎకరాలకుపైబడి ఉన్న చెరువులలో మాత్రమే చేయాల్సి ఉంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో మొ దటి విడత కింద 3 చెరువులకు రూ.7.70 కోట్లు నిధులు మంజూరయ్యాయి. పెద్దదోర్నాల మండలంలోని వై.చెర్లోపల్లి చెరువు అభివృద్ధికి రూ 3.70 కోట్లు, పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె చెరువుకు రూ.2.50 కోట్లు, దేవరాజుగట్టు, పెద్దారవీడు చెరువులకు ఒకే ప్యాకేజి కింద రూ.1.50 కోట్లు ప్రకారం మంజూరయ్యాయి. ఈ నిధులు కాజేయటానికి అధికార పార్టీకి చెందిన నాయకులు పోటీపడ్డారు. అయితే తనకు అత్యంత సన్నిహింతంగా ఉండేవారితో మాత్రమే నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి ఈ టెండర్లు వేయించారని ఆరోపణలు వినవస్తున్నాయి. అప్పనంగా ప్రజల సొత్తును కాజేయటానికి అధికార పార్టీకి చెందిన వారు ప్రయత్నిస్తున్నారు. దీనివలన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. జిల్లాలో చెరువులకు రూ.37 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులకు ఆన్లైన్ టెండర్లు పిలువాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు బాక్సు టెండర్లను పిలవడం శోచనీయం. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని చెరువులకు మంజూరైన రూ.7.70 కోట్ల పనులకు సింగిల్ టెండర్లు మాత్రమే వేయించుకున్నారు. కంటి తుడుపుగా మరొకరితో తప్పుడు టెండరు వేయించారు. షెడ్యూల్ కూడా టీడీపీ వర్గానికి చెందిన కాంట్రాక్టర్లకే ఇచ్చారు. అగ్రిమెంట్లు జరగకుండా రాష్ట్ర నీటిపారుదల మంత్రి, చీఫ్ ఇంజినీరు చర్యలు తీసుకోవాలి. ఈ టెండర్లపై సమగ్రంగా దర్యాప్తు జరపాలి. ఇప్పటికే 100 ఎకరాలలోపు ఉన్న చెరువులలో నీరు – చెట్టు పథకం కింద కోట్లాది రూపాయలు కాజేశారు. చెరువులను ఆడ్డంగా పెట్టుకొని టీడీపీ జేబులు నింపుకుంటున్నారు. -
కేంద్ర వ్యవసాయ పథకాల్లో నగదు బదిలీ
రాష్ట్ర వ్యవసాయ శాఖలకు కేంద్రం ఆదేశాలు ⇒ నేడు ఢిల్లీలో రాష్ట్రాల వ్యవసాయ ఉన్నతాధికారులతో వర్క్‌షాప్ సాక్షి, హైదరాబాద్: కేంద్రం ద్వారా రాష్ట్రాల్లో అమలుచేసే 10 వ్యవసాయ పథకాల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే నగదు బదిలీ (డీబీటీ) విధానాన్ని అమలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. పంటల బీమా సొమ్ము రైతుకు చేరడంలో జాప్యమవుతుండటంతో పంట నష్టపోయిన రైతు పరిహారం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఎంఐడీహెచ్ పథకం ద్వారా ఉద్యాన రైతులకిచ్చే సూక్ష్మ సేద్యం సబ్సిడీ సొమ్ము పక్కదారి పడుతోందన్న విమర్శలూ ఉన్నా యి. ఈ నేపథ్యంలో డీబీటీ అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. దీన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు డీబీటీ పోర్టల్ సిద్ధం చేసింది. దీని ద్వారా సబ్సిడీ సొమ్ము నేరుగా రైతుల ఖాతాలకే చేరుతుంది. అగ్రి క్లినిక్స్, అగ్రి బిజినెస్ సెంటర్స్ (ఏసీఏబీసీ) పథకం, వ్యవసాయ యాంత్రీకరణ, పీఎంకేఎస్‌వై, సమగ్ర ఉద్యానాభివృద్ధి సంస్థ (ఎంఐడీహెచ్), వ్యవసాయ విస్తరణలో సం స్కరణల పథకం, విత్తనాలు, మొక్కల మెటీరియల్ పథకం, రైతులకు పంట రుణాల వడ్డీ పథకం, పంటల బీమా పథకం, జాతీ య ఆహార భద్రత మిషన్, వ్యవసాయ సహకార సమగ్ర పథకాల్లో ఈ విధానాన్ని అమ లుచేస్తారు. లబ్ధిదారుల జాబితాను డీబీటీ పోర్టల్‌లో పొందుపరుస్తారు. దీనివల్ల పర్యవేక్షణ సులువుగా ఉంటుందనేది కేంద్రం ఆలోచన. ప్రతి పథకానికి ఒక యునిక్ కోడ్ నంబర్ ఇవ్వడంతో పాటు పథకాల పురోగతిని పోర్టల్‌లో ఉంచుతారు. డీబీటీ విధానం అమలుపై రాష్ట్రాలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ సోమవారం ఢిల్లీలో వర్క్‌షాప్ నిర్వహించనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నద్ధం... కేంద్రం ద్వారా అమలు చేసే పథకాలతోపాటు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అమలుచేసే పథకాల్లోనూ డీబీటీని అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. విత్తనాలు, వ్యవసాయ యంత్రాలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఇక నుంచి రైతు ఖాతాల్లో నేరుగా జమ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి నేరుగా లబ్ధిదారులకు నగదు బదిలీ అమలు చేస్తారు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. వరి, సోయాబీన్, శనగ, వేరుశనగ, పచ్చిరొట్ట తదితర విత్తనాలను రైతులకు 33 శాతం సబ్సిడీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ సరఫరా చేస్తోంది. ఈ బాధ్యతలను కొన్ని సంస్థలకు అప్పగించి, దీనికి ఇచ్చే సబ్సిడీని రైతు ఖాతాలో జమచేస్తారు. వ్యవసాయ యంత్రాల సబ్సిడీ కూడా రైతు ఖాతాలో జమ చేస్తారు.