పుంగనూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ముసుగులో ము ఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు హైడ్రామా ఆడుతున్నారని మాజీమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పుంగనూరు మండలంలోని చెలిమిగడ్డలో గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహిం చారు. అక్కడ విలేకరులతో మాట్లాడు తూ కిరణ్ సమైక్యం పేరుతో నటిస్తూ సోనియాగాంధీకి కోవర్టుగా పని చేస్తున్నారని దుయ్యబట్టారు.
విభజన బిల్లు పెడితే రాజీనామా చేస్తానని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి నేడు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కోవర్టు కిరణ్‌కు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. విభజన కోసం తొలుత లేఖ ఇచ్చి ఇప్పుడు సమైక్య నాటకం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ సమైక్య నినాదం పేరుతో పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ, చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలతో సమైక్యాంధ్ర ధర్నాలు చేయిస్తూ ఎవరికి వారు నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం తొలి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తున్నారని ఆయన తెలిపారు.
రాష్ట్ర విభజన జరగకుండా వైఎ స్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాని బల పరచి ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నేతలు ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి, రెడెప్ప, వెంకటరెడియాదవ్, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, నాగరాజరెడ్డి గంగిరెడ్డి, షరీఫ్, నయాజ్, కిజర్‌ఖాన్, తులసమ్మ, సుబ్బమ్మ, హేమావతి తదితరులు పాల్గొన్నారు.
కిరణ్, బాబు ‘సమైక్య’డ్రామా
Published Thu, Feb 13 2014 4:11 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement