PEDDI Reddy
-
పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం
-
భారీ జనంతో పెద్ది రెడ్డి నామినేషన్
-
కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి
-
ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం కృషి చేస్తున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
-
బీజేపీ లో ప్రజలకు దగ్గరై పనిచేసేపరిస్థితిలేకే రాజీనామా
-
నెల్లూరు జిల్లాలో మంత్రులు పెద్దిరెడ్డి,గౌతమ్ రెడ్డి,అనిల్ కుమార్ పర్యటన
-
కేసీఆర్ వరంగల్ పర్యటన: ఆ రోజు ఏం జరిగింది?
-
అందరూ భౌతిక దూరం పాటించాలి
-
మండలిలో రాజేంద్రప్రసాద్ అసభ్య వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: శాసనమండలిలో గ్రామ సచివాలయాలపై వాడీవేడి చర్చ సాగింది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కొమ్ములొచ్చాయని అన్నారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై మంత్రులు పెద్దిరెడ్డి, కన్నబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్‌ది టీవీ చర్చల్లో అరే.. ఒరే అని బూతులు తిట్టించుకునే సంస్కృతి అని ఎద్దేవా చేశారు. సభలో ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మంత్రులు డిమాండ్ చేశారు. అనంతరం మండలిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్లు, సచివాలయాల ద్వారా 4లక్షల 50వేల పైగా ఉద్యోగాలు ఇవ్వడం దేశంలో ఇదే ప్రథమం అని అన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత భారీస్థాయిలో ఉద్యోగాలు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. గ్రామ సచివాలయాలను ఎప్పుడో ఏర్పాటు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. మరి సచివాలయ వ్యవస్థను ఎందుకు అమలు చెయ్యలేదు. గ్రామ సచివాలయాల వ్యవస్థల వల్ల సర్పంచ్ల అధికారాలు దెబ్బతింటాయని టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీల అధికారాలను జన్మభూమి కమిటీలు హరిస్తే ఎందుకు మాట్లాడలేదు’ అని ప్రశ్నించారు. హజ్ భవన్ స్థలం కోసం అన్వేషణ: డిప్యూటీ సీఎం మండలిలో డిపప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ఇమాంలు, మౌజన్లకు 2020 మార్చిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. ‘ 9వేలమంది ఇమాంలు, 9వేల మంది మౌజన్ లు ఉన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులను తీసుకుంటున్నాం. విజయవాడలో హజ్ భవన్ పేరుతో చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. తర్వాత పట్టించుకోలేదు. చంద్రబాబు శంఖుస్థాపన చేసిన హజ్ భవన్ కు రెండు వైపులా శ్మశానాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హజ్ భవన్ కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం 5వేలమంది ఇమాంలు, మౌజన్ లకే గౌరవ వేతనం అందించారు. మేము అర్హులైన అందరికీ గౌరవ వేతనం ఇస్తాం. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుతాం’ అని అన్నారు. -
తెలంగాణ బీజేపీలోకి భారీ చేరికలు
సాక్షి, ఢిల్లీ: బీజేపీ తెలంగాణలో పట్టు బిగిస్తోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుపొంది.. అందరినీ ఆశ్చర్యపరిచిన కమలం పార్టీ.. తాజాగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికల్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. టీడీపీ నేతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, బోడ జనార్దన్, మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్ రెడ్డి, పీసీసీ మైనారిటీ నేత షేక్ రహమతుల్లా గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు నాయకులకు కమలం కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. -
కడప దర్గాలో ఉపముఖ్యమంత్రి ప్రత్యేక ప్రార్థనలు
సాక్షి, కడప : కడప పెద్ద దర్గాలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారిగా కడపకు వచ్చిన అంజాద్ బాషాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి కడప నగరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దర్గాలోని మాజర్ల వద్ద చదర్లను ఉంచి మంత్రి అంజాద్ బాషా ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు అమరావతిలోని సచివాలయంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. పంచాయతీ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. -
అవినీతిలో ఏపీ నంబర్ 1
పలమనేరు: రాష్ట్రాన్ని అభివృద్దిలో కాకుండా అవినీతిలో నంబర్ 1 చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో సోమవారం వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రోజా మాటాడారు. ఇక్కడ నారా లోకేశ్ దండుకున్న అవినీతి సొమ్మును దాచేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి అమరనాథరెడ్డి ఇటీవల కొరియాకు వెళ్లారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిలో మన రాష్ట్రం స్థాయి దారుణంగా దిగజారిందన్నారు. దేశంలోనే అత్యధిక హెచ్ఐవీ కేసుల్లో, మహిళల అక్రమ రవాణాల్లో, అప్పుల్లో రాష్ట్రాన్ని నంబర్ 1 చేశారని పత్రికలే చెబుతున్నాయని గుర్తుచేశారు. ఉంగరం, వాచీ కూడా లేదంటూనే దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు ఎలా ఎదిగారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించి మంత్రి అయిన అమరనాథరెడ్డి టీవీల్లో మీసాలు తిప్పడం కాదు సొంత జిల్లాలో ఓ పరిశ్రమనైనా నెలకొల్పారా? అని నిలదీశారు. ఈ ప్రభుత్వంలో అన్నివర్గాలకు బాధలు తప్పడం లేదని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... రాజకీయాల్లోకి రాకముందు మిద్దె లేని చంద్రబాబు ఇన్ని రూ.వేల కోట్లను ఎలా సంపాదించారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అయితేనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.సునీల్‌కుమార్, పార్టీ నేత జె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
వికృత నగరంగా హైదరాబాద్: పెద్దిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు తెగి పంట నష్టం జరిగిందని, భాగ్యనగరం అభాగ్య నగరంగా, వికృత నగరంగా మారిందని టీటీడీపీ నేత పెద్దిరెడ్డి అన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం సచివాలయం నుంచి సమీక్షిస్తారా అని ధ్వజమెత్తారు. సెక్రెటేరియట్‌కు కేసీఆర్ వస్తే బ్రేకింగ్ న్యూస్, ఏదైనా మాట్లాడితే షాకింగ్ న్యూస్‌గా ఉందని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం ఫాం హౌస్‌కే పరిమితమైతే నగరంలో 10 శాతం రోడ్లే దెబ్బతిన్నాయని సమాచారం వస్తుందన్నారు. -
'హోదాపై చర్చ తర్వాతే ప్రకటన చేయాలి'
-
సొంత అన్ననే చంపి .. ఇంట్లో పూడ్చిపెట్టాడు
ఆస్తి కోసం సొంత అన్నను కిరాతకంగా హతమార్చి ఇంట్లోనె పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వైఎస్సార్‌కడప జిల్లా సింహాద్రిపురం మండలం మిథునాపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగాధర్‌రెడ్డి(43), పెద్ది రెడ్డి మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తికి సంబంధించిన విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం పెద్దిరెడ్డి అన్నపై దాడి చేసి కర్రలతో చితకబాది హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనె పూడ్చి పెట్టాడు. గంగాధర్‌రెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
'టీడీపీకి ఓటేస్తానని స్టీఫెన్ చెప్పారు'
-
16న కాంగ్రెస్‌లో పెద్దిరెడ్డి చేరిక?
హుజూరాబాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానవర్గం నుంచి ఆయనకు ఆహ్వానం అందగా.. ఆ పార్టీ ముఖ్య నేతలతో ఢిల్లీలో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ నెల 16న కరీంనగర్లో జరిగే సోనియాగాంధీ బహిరంగ సభలో పెద్దిరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
కిరణ్, బాబు ‘సమైక్య’డ్రామా
పుంగనూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ముసుగులో ము ఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు హైడ్రామా ఆడుతున్నారని మాజీమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పుంగనూరు మండలంలోని చెలిమిగడ్డలో గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహిం చారు. అక్కడ విలేకరులతో మాట్లాడు తూ కిరణ్ సమైక్యం పేరుతో నటిస్తూ సోనియాగాంధీకి కోవర్టుగా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. విభజన బిల్లు పెడితే రాజీనామా చేస్తానని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి నేడు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కోవర్టు కిరణ్‌కు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. విభజన కోసం తొలుత లేఖ ఇచ్చి ఇప్పుడు సమైక్య నాటకం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ సమైక్య నినాదం పేరుతో పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ, చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలతో సమైక్యాంధ్ర ధర్నాలు చేయిస్తూ ఎవరికి వారు నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం తొలి నుంచి జగన్మోహన్రెడ్డి పోరాటం చేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన జరగకుండా వైఎ స్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరు జగన్మోహన్రెడ్డి నాయకత్వాని బల పరచి ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నేతలు ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి, రెడెప్ప, వెంకటరెడియాదవ్, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, నాగరాజరెడ్డి గంగిరెడ్డి, షరీఫ్, నయాజ్, కిజర్‌ఖాన్, తులసమ్మ, సుబ్బమ్మ, హేమావతి తదితరులు పాల్గొన్నారు. -
కిరణ్‌పై పెద్దిరెడ్డి విసుర్లు