సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు తెగి పంట నష్టం జరిగిందని, భాగ్యనగరం అభాగ్య నగరంగా, వికృత నగరంగా మారిందని టీటీడీపీ నేత పెద్దిరెడ్డి అన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం సచివాలయం నుంచి సమీక్షిస్తారా అని ధ్వజమెత్తారు. సెక్రెటేరియట్‌కు కేసీఆర్ వస్తే బ్రేకింగ్ న్యూస్, ఏదైనా మాట్లాడితే షాకింగ్ న్యూస్‌గా ఉందని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం ఫాం హౌస్‌కే పరిమితమైతే నగరంలో 10 శాతం రోడ్లే దెబ్బతిన్నాయని సమాచారం వస్తుందన్నారు.