సాక్షి, కడప : కడప పెద్ద దర్గాలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారిగా కడపకు వచ్చిన అంజాద్ బాషాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి కడప నగరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దర్గాలోని మాజర్ల వద్ద చదర్లను ఉంచి మంత్రి అంజాద్ బాషా ప్రార్థనలు నిర్వహించారు.
మరోవైపు అమరావతిలోని సచివాలయంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. పంచాయతీ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment