సాక్షి, కడప: జిల్లాలో జరగబోయే దర్గా వార్షిక ఉర్సు ఉత్సవాలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా గురువారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్‌లతో సమావేశమయ్యారు. జనవరి 8 నుంచి 15వరకు జరిగే దర్గా వార్షిక ఉర్సు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అనంతరం డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మాట్లాడుతూ దర్గా ఉర్సు ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో దర్గా పీఠాధిపతితో పాటు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment