మధ్యాహ్నం 12.50:
వైఎస్సార్ కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప పర్యటన ముగిసింది. కడప విమానాశ్రయం నుంచి సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు.
12:20PM
►డిప్యూటీ సీఎం అంజాద్‌బాష కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు.
11:50AM
►పుష్పగిరి కంటి ఆస్పత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.
11:45AM
►పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్‌కు చేరకున్న సీఎం జగన్
11:30AM
►సీఎం వైఎస్ జగన్ కడప జిల్లాకు చేరుకున్నారు. కాసేపట్లో పుష్పగిరి కంటి ఆస్పత్రిని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
10:00AM
సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి కడప బయల్దేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా కుమార్తె పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అలాగే రిమ్స్ వద్ద ఏర్పాటు చేసిన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించనున్నారు.
సీఎం పర్యటన నేపధ్యంలో అధికారులకు సూచనలిస్తున్న జిల్లా కలెక్టర్ విజయరామరాజు
08:50AM
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ఆదివారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఏర్పాట్లను పరిశీలించారు. మొదట కడప విమానాశ్రయం, రిమ్స్‌లోని జీజీహెచ్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద బారికేడ్లు, వీఐపీ, వీవీఐపీ గ్యాలరీ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. నూతనంగా నిర్మించిన పుష్పగిరి కంటి ఆస్పత్రికి చేరుకుని అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను, అనంతరం ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాష కుమార్తె వివాహం జరిగే జయరాజ్ గార్డెన్స్ వద్దకు చేరుకుని పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, బందోబస్తుకు పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీలు గౌతమి, సాయికాంత్‌వర్మ, ధ్యానచంద్ర, శిక్షణ కలెక్టర్ కార్తీక్, ఆర్డీఓలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు, వెంకట రమణ, డ్వామా పీడీ యదుభూషణరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వర్‌రెడ్డి, ఐసీడీఎస్, ఏపీఎంఐపీ పీడీలు పద్మజ, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండండి : ఎస్పీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన నేపధ్యంలో విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బు రాజన్ ఆదేశించారు. శనివారం జయరాజ్ గార్డెన్స్‌లో పోలీసు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సీఎం జిల్లాలో అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి పర్యటన ముగించుకుని వెళ్లే వరకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఎస్పీ అధికారులకు పలు సూ చనలు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) దేవప్రసాద్, కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి, ఏఆర్ డీఎస్పీ రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు వెంకట కుమార్, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎస్పీ కడప విమానాశ్రయం తదితర ప్రదేశాల్లో జిల్లా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.
కడపకు పలువురు మంత్రుల రాక
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాష కుమార్తె వివాహం ఆదివారం జరగనున్న నేపథ్యంలో పలువురు మంత్రులు జిల్లాకు చేరుకోనున్నట్లు కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. వివరాలు..
►స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి తానేటి వనిత ఆదివారం రేణిగుంట నుంచి రోడ్డు మార్గాన కడపకు చేరుకుంటారు. జయరాజ్ గార్డెన్స్‌లో వివాహానికి హాజరవుతారు. రాత్రికి కడపలో బస చేస్తారు. 21వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు పరీడానగర్, నిరంజన్‌నగర్, శివానందపురంలలో ఏర్పాటు చేసిన స్థానిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. అనంతరం కడపలోని బాయ్స్ చిల్డ్రన్ హోం, దిశా పోలీసుస్టేషన్, రిమ్స్‌లోని సఖి వన్‌స్టాప్ సెంటర్‌లో జరిగే కార్య క్రమాల్లో పాల్గొంటారు. అలాగే స్వధార్ హోం, భారతరత్న మహిళా మండలిని సందర్శిస్తారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి ఆ రోజు రాత్రి తిరుపతికి బయలుదేరి వెళతారు.
సమావేశంలో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది (ఇన్‌సెట్) మాట్లాడుతున్న ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్
►రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శనివారం రాత్రి కర్నూలు నుంచి రోడ్డు మార్గాన కడపకు చేరుకుంటారు. ఆదివారం జరిగే వివాహ కార్యక్రమంలో పాల్గొని అనంతరం నెల్లూరు మీదుగా విజయవాడకు వెళతారు.
►రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఆదివారం ఉదయం కడపకు చేరుకుని డిప్యూటీ సీఎం అంజద్‌బాష కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం ఆయన పోరుమామిళ్ల, గిద్దలూరు మీదుగా నరసరావుపేటకు బయలుదేరి వెళతారు.
►మంత్రి శంకరనారాయణ తిరుమల నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటలకు కడపకు చేరుకుంటారు. వివాహం వేడుకల్లో పాల్గొని 3 గంటలకు పెనుగొండకు బయలుదేరుతారు.
►మంత్రి అనికుమార్ యాదవ్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కడపకు చేరుకుని వివాహ వేడుకల్లో పాల్గొని రాత్రి 8 గంటలకు నెల్లూరుకు బయలుదేరుతారు.
జయరాజ్ గార్డెన్స్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్ సురేష్ బాబు
ఏర్పాట్ల పరిశీలన
కడప నగర శివార్లలోని జయరాజ్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజద్‌బాషా, మేయర్ సురేష్ బాబు పరిశీలించారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రామమోహన్‌రెడ్డి, యల్లారెడ్డి, శివకేశవ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment