తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది.
హుజూరాబాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానవర్గం నుంచి ఆయనకు ఆహ్వానం అందగా.. ఆ పార్టీ ముఖ్య నేతలతో ఢిల్లీలో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ నెల 16న కరీంనగర్‌లో జరిగే సోనియాగాంధీ బహిరంగ సభలో పెద్దిరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.