ప్రత్యేక హోదాపై చర్చ జరిగిన తర్వాతే సభలో ప్రకటన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీనిపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట్లాడుతూ హోదాపై ముందు చర్చ చేపట్టాలని, చర్చ తర్వాతే ప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు.