నేడు సమైక్య బంద్ | bandh today samiyaka andhra | Sakshi
Sakshi News home page

నేడు సమైక్య బంద్

Published Thu, Feb 13 2014 12:52 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

నేడు సమైక్య బంద్ - Sakshi

నేడు సమైక్య బంద్

విశాఖపట్నం ,న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లును కేబినేట్ లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ బంద్ కు పిలుపునిచ్చింది. పార్టీ పిలుపు మేరకు జిల్లాలో బంద్‌కు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. దీనిని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు పిలుపునిచ్చారు.

సమైక్యాంధ్రకు కట్టుబడి ఉద్యమం చేస్తున్న తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా జిల్లా ప్రజలు నిలవాలని కోరారు. జేఏసీ, సమైక్యాంధ్ర వాదులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొని తమ వ్యతిరేకతను డిల్లీకి తెలియజేయాలన్నారు.

సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ ఆందోళనకు ప్రభుత్వ, ప్రయివేట్ విద్యాసంస్థలు, ఆర్టీసీ కార్మికులు, పెద్ద, చిన్న వ్యాపారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులు ఇబ్బందులు పడైనా మనం, మన ముందు తరాలు బాగుండడానికి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement