బెంగళూరు, న్యూస్‌లైన్ : తెలుగు తల్లిని నిలువునా చీల్చాలని చూస్తున్న విదేశీవని త కుట్రను తిప్పి కొట్టాలని పలువురు వ క్తలు అభిప్రాయపడ్డారు. బెంగళూరులో ని ఎంజీ రోడ్డులో ఉన్న అజంతా హోట ల్‌లో కర్ణాటక తెలుగు ప్రజా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర రౌండ్ టేబుల్ సమావేశం విజ యవంతమైంది. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి మాట్లాడుతూ... 1947లో మనకు స్వతంత్య్రం వచ్చినా ఫలితం లేకపోయిందని, ఇప్పటికీ విదేశీయులు చెప్పిన విధంగానే మన భారత ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో నివసించే హక్కు ప్రతి భారతీయుడికీ ఉందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత సీమాంధ్ర వాసులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇప్పటి నుంచే ఒత్తిడి పెట్టడం చాలా బాధకరమని అన్నారు. తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం దక్కలేదన్న అక్కసుతో టీఆర్‌ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారని గుర్తు చేశారు. ఒక ఎకరా పొలంలో పంట పండించి రూ. కోటి సంపాదిస్తున్నట్లు కేసీఆర్, ఆ నైపుణ్యం ఏమిటో బహిర్గతం చేస్తే రైతులందరూ మూకుమ్మడిగా బాగుపడతారని అన్నా రు. ఎకరా పొలంలో వ్యవసాయం ద్వా రా రూ. కోటి సంపాదించే రైతు ఈ ప్ర పంచంలోనే లేడని, అదే నిజమైతే తెలంగాణ ఎలా వెనుకబడిందో కేసీఆరే చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌ను లూటీ చేసేందు కే కేసీఆర్ లాంటి దొరలు తెలంగాణ వా దాన్ని వినిపిస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక తెలుగు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బెల్లం రమణ చౌ దరి మాట్లాడు తూ... హైదరాబాద్ అభివృద్ధి సీమాం ధ్రుల వల్లనే సాధ్యమైందని అన్నారు. కర్ణాటక వైఎస్‌ఆర్ యువ వేదిక కార్యదర్శి డాక్టర్ రసూల్ మాట్లాడుతూ.. ని యంతలుగా వ్యవహిం చిన వారు చరి త్రలో బాగుపడిన దాఖలా లు లేవని గు ర్తు చేశారు. రాాష్ట్ర విభజనకు వత్తాసు పలుకుతున్న వారికి ఇదే గతి పడుతుంద ని హెచ్చరించారు.
అనంతరం వక్తల అభిప్రాయాలను లిఖితపూర్వకం గా స్వీకరించారు. వీటి ద్వారా సుప్రీం కో ర్టును ఆశ్రయించనున్నట్లు బొందు రామస్వా మి తెలిపారు. సమావే శం ప్రారంభానికి ముందు మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద చోటు చేసుకున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటనలో మృ తి చెం దిన కోటె వెంకటేష్ యాదవ్‌కు ని వాళులర్పిం చా రు. సమావేశంలో కేటీపీఎ స్ నాయకులు బాబు రాజేంద్రకుమార్, శివకుమార్, హ లసూరు విజయకుమా రి, ప్రతాప్, వరలక్ష్మి, సునీత, అంబరీష్‌రెడ్డి, జీ వరలక్ష్మి, రామచంద్ర, కర్ణాటక వైఎస్‌ఆర్ యువ వేదిక అధ్యక్షుడు సు రే ష్, సుందర్, తెలుగు కళావికాసిని కా ర్యదర్శి శ్రీధరరావు, లావణ్య, చిత్తూరుకు చెందిన టీడీపీ నేత వెంకటరమణ, రాము, ముఖర్జీ, చౌడప్ప, దానం పాల్గొన్నారు.
విదేశీ కుట్రను తిప్పికొట్టండి
Published Mon, Jan 6 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement