Round Table Conference
-
ప్రమాదంలో ముస్లిం సమాజం
సాక్షి, అమరావతి: కూటమి కుతంత్రంతో ముస్లిం సమాజం పెను ప్రమాదంలో పడిందని, ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం హక్కులు కాపాడతానని భరోసా ఇచ్చిన సెక్యులర్ లీడర్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవడం మన ధర్మమని ముస్లిం మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ), ముస్లిం ఆలోచనపరుల వేదిక(ఎంటీఎఫ్)ల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం రౌంట్ టేబుల్ సమావేశం జేఏసీ రాష్ట్ర కన్వినర్ షేక్ మునీర్ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించారు. ‘ముస్లిం సమస్యలు–ప్రజాస్వామ్య పరిరక్షణ మార్గాలు’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని ముస్లిం ఉలేమాలు, జమాత్‌ల ప్రతినిధులు, డాక్టర్లు, లాయర్లు, పలు రంగాలకు చెందిన నిపుణులు, ఆలోచనపరులు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. పలువురు మాట్లాడుతూ.. విద్యాపరంగాను, సామాజికంగాను అత్యంత వెనుకబాటుకు గురైన ముస్లింలకు వైఎస్సార్ నాలుగు శాతం రిజర్వేషన్లు కలి్పంచారని తెలిపారు. అవి మతపరమైన రిజర్వేషన్లుగా దు్రష్పచారం చేసి ఎన్డీఏ కూటమి ముస్లిం సమాజాన్ని దారుణంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందన్నారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, వక్ఫ్ బోర్డును తీసివేస్తామనే ప్రకటనలతో మైనారీ్టల పట్ల వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలను అవమానిస్తున్న ఎన్డీఏ కూటమితో గతంలోనూ, ఇప్పుడు జతకట్టిన చంద్రబాబు ముస్లిం సమస్యలపై పోరాడుతానంటే ఎలా నమ్మాలని ప్రశి్నంచారు. కూటమిలో చేరిన టీడీపీ, జనసేన రానున్న కాలంలో బీజేపీలో విలీనం కావడం ఖాయమన్నారు.ప్రసంగించిన వారిలో తబ్లిక్ జమాత్ అధ్యక్షుడు అక్బర్ బాషా, జమాత్ అహ్లెహదీస్ అధ్యక్షుడు నసీర్ ఉమరి, కార్యదర్శి అతీఖ్ రెహమాన్, జమాత్ అయిమ్మ ఉలమ ప్రతినిధులు ముఫ్తి యూసుఫ్, ముఫ్తీ హబీబ్, అహ్లె సున్నత్ వల్ జమాత్ ప్రతినిధి ఖలీల్, ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ ప్రతినిధి అబ్దుల్ మతీన్, ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ప్రతినిధి హబీబ్ రెహమాన్, అంజుమాన్ ఇస్లామియా ఉపాధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, మోహిద్దీన్, షఫీ అహ్మద్, ముస్లిం ఆలోచనపరుల వేదిక రాష్ట్ర కనీ్వనర్ యజ్దూనీఖాన్ తదితరులున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిద్దాం రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకోసం ముస్లింలంతా ఏకతాటిపై పనిచేయాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్టు ముస్లిం జేఏసీ రాష్ట్ర కనీ్వనర్ షేక్ మునీర్ అహ్మద్ మీడియాకు తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లు కాపాడతానని సీఎం వైఎస్ జగన్ ప్రకటించాకే బీజేపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పారీ్టలు మూకుమ్మడిగా ఆయనపై దాడిని పెంచాయన్నారు. ధైర్యంగా ముస్లింలకు అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్‌ను మరోసారి గెలిపించుకోవడం మన బాధ్యతగా తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటేసినా బీజేపీ కూటమికే లాభం రాష్ట్రంలో ముస్లిం సమాజానికి చెందిన ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ విషయంలో ముస్లింలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ– విజయవాడ) మాజీ అధ్యక్షుడు డాక్టర్ రెహమాన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ముస్లిం ఓట్లు చీలిపోయి పరోక్షంగా బీజేపీ, దాని కూటమి పారీ్టలకే మేలు చేసినట్టవుతుందన్నారు. ప్రతి ముస్లిం ఓటు వైఎస్సార్సీపీ అభ్యర్థులకే పడేలా ఎవరికి వారే బాధ్యత వహించాలని సూచించారు. -
చిన్నారుల్లో సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇలా చేయండి
చిన్నారుల ఆరోగ్యం ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఓ వైపు తల్లిదండ్రుల్లో అవగాహన లోపం, మరోవైపు జంక్ ఫుడ్ వీర విహారం.. పాఠశాల విద్యార్ధుల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటీవలే ఏఐజీ ఆసుపత్రి నిర్వహించిన ఓ సర్వేలో శారీరకంగానే కాక మానసికంగా కూడా అనారోగ్యం పాలు జేసే శక్తి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌కు ఉందని దీనిని వినియోగిస్తున్న వారిలో చిన్నారులే అధికమని తేలింది. ఈ సందర్భంగా 8–5–1–0 పేరిట ఒక హెల్త్ ఫార్ములాను ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఫ్యూచర్ ఫుడ్ ఫౌండేషన్, కంట్రీ డిలైట్, పలు పాఠశాలల ఆధ్వర్యంలో చిన్నారుల ఆరోగ్యంపై ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఈ ఫార్ములా రూపకర్తలు మాట్లాడారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే.. కారణాలెన్నో.. నిశ్చల జీవనశైలి, పెరిగిన స్క్రీన్ సమయం శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరగడం, అవుట్డోర్ లో ఆటలకు దూరంగా ఉండటం వలన వ్యాయామం తగ్గిపోయింది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చక్కెరలు అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరిగిపోయింది. ఇది ఊబకాయంతో మొదలై గుండె సంబంధ సమస్యల దాకా దారితీసింది. కాలుష్య కారకాలు టాక్సి¯Œ ్సతో సహా పర్యావరణ కారకాలు పిల్లలు ఎదుర్కొంటున్న ఆరోగ్య ప్రమాదాలను మరింత Mపెంచుతున్నాయి. జీవనశైలి కారకాలకు మించి, పిల్లల ఆరోగ్యం క్షీణించడంలో సామాజిక అంశాలు కూడా పాత్ర పోషిస్తాయి. సమగ్ర వికాసానికి ఈ హెల్త్ ఫార్ములా.. పాఠశాల పిల్లల్లో ఆరోగ్యాన్ని, సమగ్ర వికాసాన్ని పునర్నిర్వచించే లక్ష్యంతో ఈ 8–5–1–0 ఫార్ములా రూపొందింది. రోజుకి 8గంటల నిద్ర , 5 రకాల పండ్లు కూరగాయలు, 1 గంట వ్యాయామం, హాని కలిగించే ఆహారం, అలవాట్లను సున్నాకి చేర్చడం...అనేదే ఈ ఫార్ములా అంతరార్ధం. పోషకాహారం, వ్యాయామం, తగినంత విశ్రాంతిల మేలు కలయిక ఇది. తల్లిదండ్రులు పాఠశాలలకు ఆచరణాత్మక సాధనంగా ఉపయోగపడుతుంది. పిల్లలను సరైన ఆరోగ్యం వైపు నడిపిస్తుంది. దీని అమలులో భాగంగా జీవనశైలి మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇదొక అలవాటుగా మారడానికి కొంత వ్యవధి పడుతుంది. ఇది వారాల నుంచి నెలల వరకు ఉండవచ్చు. సాధారణంగా పెద్ద పిల్లల కంటే చిన్నారులు దీన్ని చాలా సులభంగా అలవరచుకోవచ్చు. . ఇంటి వాతావరణం తల్లిదండ్రుల ప్రమేయాన్ని బట్టి ఈ వ్యవధి ఆధారపడి ఉంటుంది. కొంతమంది పిల్లలు వారాల్లోనే అలవాటు పడతారు, మరికొందరికి నెలలు పట్టవచ్చు. ఆరోగ్య అక్షరాస్యత అవసరం... నేటి పాఠ్యాంశాల్లో ఆహార అక్షరాస్యత తప్పనిసరి అని అన్ని పాఠశాలల్లో ఏకాభిప్రాయం వచ్చింది. ఈ రౌండ్‌టేబుల్ సమావేశం 8–5–1–0 నియమాన్ని ఎలా అమలులోకి తీసుకురావాలి అనేదాన్ని చర్చించింది. దీని పట్ల పాఠశాలల నుండి స్పందన ప్రోత్సాహకరంగా ఉంది, కొన్ని పాఠశాలలు ఇప్పటికే వారి సాధారణ అభ్యాసాలు/తరగతులలో ఆరోగ్యకరమైన ఆహార సంస్కృతి పెంచేలా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆహార అక్షరాస్యతను పెంపొందించడానికి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పని చేయడానికి ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మనకు అవసరం. ఈ సందర్భంగా కంట్రీ డిలైట్ సహ వ్యవస్థాపకులు గాదె చక్రధర్ మాట్లాడుతూ దేశ భవితకు మూల స్థంభాల్లాంటి చిన్నారుల ఆరోగ్యకరమైన భవిత విషయంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములం కావాలనే ఉద్ధేశ్యంతోనే ఈ కార్యక్రమలో చేతులు కలిపామన్నారు. ఈ హెల్త్ ఫార్ములాను స్వాగతిస్తున్నామన్నారు. ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ నిర్వాహకులు పవన్ అగర్వాల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పాఠశాలలన్నింటికీ ఈ ఫార్ములా చేరువయ్యేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. ఇదీ చదవండి: జస్ట్ ఈమూడు వ్యాయామాలు చేయండి! బరువు తగ్గడం ఖాయం! -
హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కోవిడ్ 19 మహమ్మారి ఎదుర్కున్న తీరులో విఫలమైన నేపథ్యంలో రాబోయే మహమ్మారి పట్ల మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలని భావిస్తూ, తనకు అధికారాలు కావాలని కోరుతోంది. ప్రపంచ దేశాలను నిర్దేశించడానికి తనకు అధికారాలు పెంచడానికి అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు (ఐహెచ్ఆర్), ప్రపంచ మహమ్మారి ఒప్పందం హెచ్ఈఆర్పీ గురించి తన సభ్య దేశాలతో చర్చల ప్రక్రియను ప్రారంభించింది. ఈ మూడు దారుల ద్వారా తన అధికారాలరను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్యం మీద తన గుత్తాధిపత్యం స్థాపించుకోవడానికి, కొనసాగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మే 2024 కల్లా పూర్తి కావాలని భావిస్తోంది. వీటి ద్వారా అన్ని దేశాలలో ఆరోగ్యంపై జాతీయ ప్రణాళికలను శాసించే విధంగా ఈ ఒప్పందాలను తయారు చేస్తున్నారు. ముసాయీదా ఒప్పందాల గురించి చర్చించడం ప్రారంభించారు. అయితే, ఇది కేవలం ఆరోగ్య రంగం కాకుండా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆహారం తదితర రంగాలకు కూడా తన ‘ప్రభావం’ విస్తరించే ప్రయత్నంలో డబ్ల్యూహెచ్ఓ ఉంది. దీని వెనుక ఉన్న శక్తులు బిల్ గేట్స్, క్లాస్ శ్వాబ్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ) వంటి ప్రముఖులు ఉన్నారు. ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని, ఒక కొత్త ప్రాపంచిక వ్యవస్థను స్థాపించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. భారత దేశం కూడా ఈ చర్చలలో పాల్గొంటోంది. కానీ మన దేశంలో, పార్లమెంటులో దీనిపై చర్చ లేదు. కనీసం ప్రస్తావన కూడా చాల తక్కువ. పైగా చాలా మంది ప్రజలకు అసలు ఈ విషయం కూడా తెలియదు. ఈ విషయం మీద అవగాహన పెంచాల్సిన అవసరం మాత్రం ఉంది. భారత ప్రజాస్వామ్యాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఒక సమావేశం నిర్వహిస్తున్నారు అధికారులు. రౌండ్ టేబుల్ సమావేశం : డబ్యూహెచ్ఓ ప్రపంచ మహమ్మారి ఒప్పందం (Global Pandemic Accord): దేశ సార్వభౌమత్వానికి , పౌరుల హక్కులకు పొంచి ఉన్న విపత్తు తేదీ : 09-08-2023 సమయం : ఉదయం 10 - 2 గంటలకు ప్రదేశం : ఆడిటోరియం సెమినార్ హాల్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ & సోషల్ స్టడీస్ ( సెస్ ) బేగంపేట్, హైదరాబాద్ వక్తలు : ప్రొఫెసర్ కోదండరాం, డా. దొంతి నర్సింహ రెడ్డి, సరస్వతి కవుల ప్రెజెంటేషన్ తర్వాత ఓపెన్ ఫోరమ్ చర్చ. (చదవండి: మళ్లీ మహమ్మారి కొత్త వేరియంట్ కలకలం..భయం గుప్పెట్లో దేశాలు!) -
టెక్ పవర్‌హౌస్‌గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కువ సంఖ్యలో సాంకేతిక ఆధారిత (టెక్) ఉద్యోగాలను సృష్టించడం ద్వారా హైదరాబాద్ ‘టెక్ పవర్‌హౌజ్’గా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఎలక్ట్రానిక్స్, విమానయాన, అంతరిక్ష, రక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్, రవాణా, వస్త్రోత్పత్తి రంగాలకు తెలంగాణ నిలయంగా ఉందన్నారు. యూకే పర్యటనలో భాగంగా కేటీఆర్ శుక్రవారం లండన్‌లో భారత హైకమిషనర్ విక్రమ్ కె. దొరైస్వామి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు. వివిధ రంగాలకు చెందిన పెట్టుబడిదారులు పాల్గొన్న ఈ సమావేశంలో తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను కేటీఆర్ వివరించారు. పుంజుకున్న పారిశ్రామికీకరణ రాష్ట్రంలో ప్రాథమిక సమస్యలన్నింటిపైనా దృష్టి సారించి వాటి పరిష్కారానికి ప్రయత్నించామని కేటీఆర్ చెప్పారు. ఆవిష్కరణలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దీంతో వ్యవసాయం, ఐటీ మొదలుకొని అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధ్యమైందని, పారిశ్రామికీకరణ కూడా వేగం పుంజుకుందని తెలిపారు. ‘టీఎస్ఐపాస్ ద్వారా పారిశ్రామిక అనుమతుల విధానంలో పారదర్శకత, వేగం పెరిగాయి. హైదరాబాద్‌లోని ఆవిష్కరణల వాతావరణం, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, ప్రపంచ ప్రసిద్ధ కంపెనీల మూలంగా ఆయా రంగాల్లో అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకొచ్చే సంస్థలకు సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’అని కేటీఆర్ వెల్లడించారు. యూకే విద్యాసంస్థలు కింగ్స్ కాలేజ్, క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వంటి ప్రసిద్ధ సంస్థలతో తెలంగాణ చేసుకున్న భాగస్వామ్యాలను ఆయన ప్రస్తావించారు. భారత హై కమిషనర్ విక్రమ్ కే. దొరైస్వామి మాట్లాడుతూ.. భారీ యంత్రాలు, వైమానిక, రక్షణ, వినోద, విద్యారంగాల్లో యూకే కంపెనీలతో తెలంగాణ భాగస్వామ్యానికి అనేక అవకాశాలు ఉన్నాయని స్పష్టంచేశారు. తెలంగాణలో నూతన సచివాలయం, అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటుతో సహా తొమ్మిదేళ్లుగా సాధించిన ప్రగతిని బ్రిటిష్ భారత వ్యాపారవేత్త బిల్లీమోరియా ప్రస్తావించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్ర వెనుక బాటుతనంపై రౌండ్ టేబుల్ సమావేశం
-
అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో యాత్ర ఎలా?: చెట్టి ఫాల్గుణ
సాక్షి, అల్లూరి జిల్లా: విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుతోనే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తెలిపారు. వికేంద్రీకరణకు మద్దతుగా పాడేరులో గిరిజన సంఘాల అధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పార్టీలకతీతంగా అన్ని వర్గాలను ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. 'శ్రీకృష్ణ కమిషన్ కూడా వెనుక బడిన విశాఖ లో రాజధాని ఏర్పాటు చేయాలని సూచించిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి నినాదం అని మండిపడ్డారు. అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో ఎలా యాత్ర చేపడతారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాటలకు తలొగ్గి ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు వికేంద్రీకరణపై విమర్శలు చేస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులకు కూడా అమరావతి రాజధాని ఇష్టం లేదన్నారు. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు అయితే ప్రయోజనం ఉంటుందని టీడీపీ నేతల్లో కూడా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు మాటలు వినడం మాని ఇప్పటికైనా టీడీపీ నాయకులు బయటకు రావాలని కోరారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అంతటా అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. హైదరాబాద్‌ను విడిచి రావడంతో ఏపీకి నష్టం జరిగిందని ఆదివాసీ ఐక్యవేదిక అభిప్రాయపడింది. విభజన సమయంలోనే వికేంద్రీకరణ జరిగి ఉంటే అమరావతిలో పెట్టిన డబ్బు వృథా అయ్యేది కాదని స్పష్టం చేసింది. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని గిరిజన ఉపాధ్యాయ సంఘం తెలిపింది. గిరిజనుల అభివృద్ధి విశాఖ రాజధానితోనే సాధ్యమని, విశాఖ కేంద్రంగా రాజధాని సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. ఒకే చోట అభివృద్ధి ఎప్పటికైనా ప్రమాదకరని, గిరిజనులు ప్రాజెక్టుల కోస భూములు త్యాగం చేశారని గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తెలిపింది. అమరావతి రైతులు ఉచితంగా భూములు ఇవ్వలేదని పేర్కొంది. -
భారత్‌లో మరింత ఇన్వెస్ట్ చేయండి
టోక్యో: అపార వ్యాపార అవకాశాలు ఉన్న భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలంటూ జపాన్ కార్పొరేట్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో జపాన్‌ది చాలా కీలకపాత్ర అని ఆయన పేర్కొన్నారు. దీన్ని పురస్కరించుకుని ’జపాన్ వారోత్సవాల’ను నిర్వహించడంపై ప్రధాని ప్రతిపాదన చేశారు. జపాన్ పర్యటనలో భాగంగా వ్యాపార దిగ్గజాలతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. 34 సంస్థల సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు దీనికి హాజరయ్యారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఉక్కు, టెక్నాలజీ, ట్రేడింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ తదితర రంగాల కంపెనీల ప్రతినిధులు వీరిలో ఉన్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. జపాన్ కంపెనీలు భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలని మోదీ ఈ సందర్భంగా ఆహ్వానించినట్లు వివరించింది. ‘టాప్ వ్యాపార సంస్థల సీఈవోలతో భేటీ అయ్యాను. భారత్‌లో పుష్కలంగా ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి వివరించాను‘ అని ప్రధాని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. హోండా, సుజుకీ, టయోటా వంటి ఆటోమొబైల్ సంస్థలు, సుమిటోమో కెమికల్, ఫ్యుజిత్సు, నిప్పన్ స్టీల్ కార్పొరేషన్, మిత్సుబిషి కార్పొరేషన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. చాలామటుకు కంపెనీలకు భారత్‌లో పెట్టుబడులు, కార్యకలాపాలు ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు.. భారత్, జపాన్ సహజమైన భాగస్వాములని సమావేశం సందర్భంగా ప్రధాని చెప్పారు. భారత్–జపాన్ సంబంధాలు బలోపేతం అయ్యేందుకు వ్యాపార వర్గాలు బ్రాండ్ అంబాసిడర్ల పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) అంతర్జాతీయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మందగించినా, భారత్‌లోకి రికార్డు స్థాయిలో 84 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. భారత ఆర్థిక వృద్ధి సత్తాపై ఇన్వెస్టర్లకు ఉన్న ధీమాకు ఇది నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చిలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక పెట్టుబడులను వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల ఎన్ల స్థాయికి పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయని ప్రధాని చెప్పారు. ఇటీవలి కాలంలో ఇండియా–జపాన్ ఇండస్ట్రియల్ కాంపిటీటివ్నెస్ పార్ట్నర్షిప్ (ఐజేఐసీపీ), క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ మొదలైన ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. -
బోస్టన్‌లో హెల్త్ కేర్ ఎట్ గ్లాన్స్ సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్
-
వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు: విష్ణువర్ధన్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టులపై ఆదివారం బీజేపీ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, ఆ ప్రాజెక్టు కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులను చంద్రబాబు నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా కేంద్రం అండగా ఉంటుందన్నారు. అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాలను ప్రభుత్వం పరిష్కరించాలని విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. -
వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్‌టేబుల్ సమావేశం
సాక్షి, విజయవాడ : వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేధావులు, యువజన విద్యార్థి విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి మాట్లాడుతూ.. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న టీడీపీ నాయకులు చర్రిత హీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. బినామీ ఆస్తులను కాపాడుకోవడానికే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని 13 జిల్లాల స్వాగతిస్తున్నారని చెప్పారు. ప్రొఫెసర్ డాక్టర్ మెహబూబ్ షేక్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నా చంద్రబాబు మాత్రం డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవడానికే.. డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైనా చంద్రబాబుకు బుద్ధి రావడం లేదన్నారు. -
‘టీడీపీ ప్రభుత్వమే పంటలను తగులబెట్టించింది’
సాక్షి, తుళ్లూరు : గత టీడీపీ ప్రభుత్వమే రాజధానిలో పంటలను తగులబెట్టించిందని రైతు సంఘం నేత శేషగిరిరావు ఆరోపించారు. గురువారం తుళ్లూరులో రాజధాని రైతులు, కూలీలు ‘చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం’ పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శేషగిరిరావు మాట్లాడుతూ.. చంద్రబాబు బంధువులకు కూడా రాజధానిలో భూములున్నాయని విమర్శించారు. రాజధాని భూములను టీడీపీ నేతలు తమ గుప్పిట్లో పెట్టుకున్నారని.. తమ భూములన బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. రైతులను చంద్రబాబు భయంకరంగా మోసం చేశారని మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో టీడీపీ నేతలు అవినీతిని పాల్పడ్డారని విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ అంటూ రైతులకు నోటీసులు ఇచ్చారని.. భూమి ఇవ్వకపోతే రూ. 5లక్షలే ఇస్తామని చంద్రబాబు బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు గారడీ నుంచి ప్రజలు బయటకొచ్చారని తెలిపారు. సీఆర్డీఏలో ఎన్నో అవకతవకలు జరిగాయని.. రైతులకు చంద్రబాబు చేసిన అన్యాయాన్ని మరచిపోమని అన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు రూ. 58వేల కోట్లు దోచేశారని శేషగిరిరావు ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా తీయించారు : జోగి రమేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారని తెలిపారు. నాలుగున్నరేళ్లుగా అమరావతి పేరుతో చంద్రబాబు ఏమి సాధించారని ప్రశ్నించారు. బాహుబలి గ్రాఫిక్స్, విఠలాచార్య సినిమా జిమ్మిక్కులు చూపించారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ నివాసం అమరావతిలోనే ఉందని.. చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాజధానిపై విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం చంద్రబాబుకు సిగ్గుగా లేదని నిలదీశారు. చంద్రబాబు అంటరానితనాన్ని ప్రోత్సహించారు : భాగ్యరావు దళిత హక్కుల పోరాట నేత మన్నెం భాగ్యరావు మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అంటరానితనాన్ని, వివక్షతను ప్రోత్సహించారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలోని రైతులకు న్యాయం చేయాలని ఆనాడూ ప్రభుత్వం దృష్టికి తీసుకోచ్చిన పట్టించుకోలేదని తెలిపారు. భారతదేశంలో రాజ్యాంగ ఉల్లంఘన చేసింది చంద్రబాబు ఒక్కరేనని విమర్శించారు. రాష్ట్రంలోని దళితులంతా సీఎం వైఎస్ జగన్ వెంట నడిచారని చెప్పారు. భారీగా తరలివచ్చిన రైతులు.. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, సీపీఐ నేతలు, పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. తమకు జరిగిన అన్యాయాన్ని రాజధాని రైతులు రౌండ్‌టేబుల్ దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని పేరిట చంద్రబాబు తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే ఉద్దేశంతోనే.. ఆయన పర్యటనలో నిరసన చేపట్టామని స్పష్టం చేశారు. -
మహమ్మారిలా డెంగీ..
సాక్షి, హైదరాబాద్: డెంగీ మహమ్మారిలా వ్యాప్తిచెందిందని పలువురు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మందికి డెంగీ జ్వరాలు సోకుతున్నాయని, తీవ్రత అధికంగా ఉండటం వల్ల వైద్యులు, ఆసుపత్రులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇటువంటి పరిస్థితి మరెక్కడైనా నెలకొని ఉంటే పరిస్థితిపై రోజూ కొన్ని బులెటిన్లు విడుదల చేసే వారని, కానీ ఇక్కడ మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదని వాపోతు న్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో, ఫాగింగ్ వంటి నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ‘డెంగీని ఎలా ఎదుర్కోవాలి’అనే అంశంపై గురువారం ఫ్లూచరిస్టిక్ సిటీస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న వైద్యులు పలు అభిప్రాయాలు వెల్లడించారు. పాఠశాలలు, కాలేజీల్లో డెంగీ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు విద్యార్థులు గ్లౌవ్స్, ఫుల్ ప్యాంట్ మొదలైన వాటితో యూనిఫాం ధరించడానికి అనుమతించాలని సూచించారు. జూన్ నుంచి వ్యాప్తి విస్తృతం..: డాక్టర్ వసంతకుమార్, అపోలో ఆసుపత్రి ‘డెంగీ ఉన్నట్లు అంగీకరించడం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన మొదటి పని. ఈ సంవత్సరం జూన్ నుంచి డెంగీ, చికున్ గున్యాలు విస్తృతంగా వ్యాపించాయి. ఏటా అనేక కేసులు వస్తున్నప్పటికీ గత 3 దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఇంతటి ఘోరమైన పరిస్థితి చూడలేదు.’ గర్భిణులపై తీవ్ర ప్రభావం: డాక్టర్ విజయలక్షి్మ, సీనియర్ గైనకాలజిస్ట్ ‘ప్రస్తుతం వస్తున్న కేసులు గతంలో ఇచి్చన మార్గదర్శకాలకు తగినట్లుగా లేవు. గర్భిణీలపై డెంగీ తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తస్రావం వల్ల తల్లీ బిడ్డలకు నష్టం జరుగుతుంది. డెంగీ పాజిటివ్ తల్లులకు ప్రసవించే శిశువులకు ఐసీయూలో చికిత్స, పర్యవేక్షణ తప్పనిసరి’ హోమియోపతి మద్దతు తీసుకోవాలి: డా.శ్రీనివాసరావు, కేంద్ర ఆయుష్ ‘హోమియోపతి ద్వారా స్వైన్‌ఫ్లూను నియంత్రించగలిగాం. డెంగీ నియంత్రణకు హోమియోపతి మద్దతు కూడా తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం ఎపిడమిక్ సెల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’ అందరమూ బాధ్యత వహించాలి: డా.విజయానంద్, చిల్డ్రెన్స్ స్పెషలిస్టు ‘డెంగీ మహమ్మారిలా వ్యాపించింది. దీనికి మనమంతా బాధ్యత వహించాలి. ప్రభుత్వం, కొందరు ప్రజలు డెంగీని అత్యంత క్యాజువల్‌గా తీసుకుంటున్నారు. ఇది మరింత నష్టాన్ని కలిగిస్తుంది. వర్షాకాలం ముందు నుంచే చర్యలు తీసుకోవాలి. ప్రజలను చైతన్యం చేయాలి. డెంగీ వస్తే ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోవాలని బాధితులే కోరుతున్నారు. అవసరమా లేదా అనేది వైద్యుడు నిర్ణయించాలి. కానీ ప్రజల్లో భయాందోళనలు పెరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది’ -
టీడీపీ ఎమ్మెల్యే సూరి చర్యపై మానవ హక్కుల సంఘాలు సమావేశం
-
‘చట్టసభల్లో బీసీ ప్రతినిధుల సంఖ్య పెరగాలి’
సాక్షి, హైదరాబాద్ : చట్టసభల్లో బీసీ ప్రతినిధుల సంఖ్య పెరగాలని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన జాతీయ ఓబీసీ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బండారు దత్తాత్రేయ, పొన్నాల లక్ష్మయ్య, ఎల్ రమణ, దేవేందర్ గౌడ్లతో పాటు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. చైతన్యం ద్వారానే మార్పు సాధ్యమని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో శాస్త్రీయత లేకుండా గత ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని విమర్శించారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు ఆ దిశలో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీలంతా ఒకేతాటి పైకి రావాలని పిలుపునిచ్చారు. బీసీలకు రాజ్యాధికారం రావాలన్నారు. ఓటుకు నోటు ఇస్తున్నారు.. అయినా బీసీ సామాజిక వర్గానికే ఓటు వేయాలని కోరారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒత్తిడి పనిచేస్తోంది.. ఒత్తిడితోనే మన హక్కులు సాధించుకోవాలన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు ఎదగాలని అకాంక్షించారు. -
వైఎస్సార్ జిల్లాకు ఉక్కు పరిశ్రమ సాధనే ధ్యేయం
సాక్షి, తిరుపతి : ‘‘కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు’’ అని, వైఎస్సార్ జిల్లాకు ఉక్కు పరిశ్రమ సాధనే ధ్యేయమని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు ఉద్ఘాటించాయి. శుక్రవారం ‘కడప ఉక్కు పరిశ్రమ సాధన’ అంశంపై తిరుపతిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వామపక్షాలతోపాటు పలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. రానున్న రోజుల్లో అందరిని కలుపుకుని ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ఐక్యవేదిక ప్రకటించింది. కేంద్రం తీరని అన్యాయం చేసింది కడప : ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం తీరని అన్యాయం చేసిందని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పి. రామసుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం వైఎస్సార్ కడప జిల్లాలో అఖిలపక్షం చేపట్టిన ఉక్కు ఉద్యమానికి ఏపీయూడబ్ల్యూజే తరపున ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖిలపక్షం చేపట్టే ప్రతి ఆందోళనలో పాల్గొంటామన్నారు. జర్నలిస్టు యూనియన్‌గా జిల్లా ప్రజలకు అండగా ఉంటామన్నారు. -
కేంద్రం దిగ్గొచ్చే వరకు పోరాటం..
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రం దిగ్గొచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని హోదా సాధన సమితి ప్రకటించింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చించడానికి హోదా సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సినీ నటుడు రాంకీ, ప్రొఫెసర్ సదాశివరెడ్డితో పాటు 13 జిల్లాల నుంచి ఉద్యమ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం హోదా సాధన సమితి సభ్యులు ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. మే 22న అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో దీక్ష శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రామ పంచాయితీ స్థాయి నుంచి హోదాకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని నిర్ణయించామని.. ఇందుకు అనుకూలంగా తీర్మానాలు చేయని వారిని ఉద్యమ ద్రోహులుగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు జూన్‌లో గానీ, జూలైలో గానీ బస్సు యాత్ర చేపట్టడంతోపాటు.. బహిరంగ సభలు కూడా నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగ్గొచ్చేలా ఒక మెరుపు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంతిమ పోరాటానికి సిద్ధం కావాలి : రామకృష్ణ ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు అంతిమ పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ రామకృష్ణ పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నేరవేర్చలేదు. ఉత్తరాంధ్ర ప్యాకేజీ నిధుల సంగతి ఇప్పటి వరకు తేలలేదు. జూన్‌లో విద్యాసంస్థలు ప్రారంభమయ్యాక విధ్యార్థులు రోడ్డెక్కె పరిస్థితి నెలకొంది. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు హోదా సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. అలా చేస్తేనే ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. 20 వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో హోదా దీక్షలు ప్రారంభమవుతాయి.. ఆగస్టు 15లోపు శుభవార్త వినాలంటే.. హోదా ఉద్యమాన్ని ఇప్పటినుంచే మరింత తీవ్రతరం చేయాలి’ అని అన్నారు. ఏపీకి నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోం : చలసాని బీజేపీ నేతలు రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఇబ్బంది లేదు కానీ.. ఏపీకి నష్టం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ..‘త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేయబోతున్నాం. హోదా అంశాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దానిపై సలహాలు, సూచనలు స్వీకరించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అందరు కలిసి ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. ఏపీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉద్యమం చేస్తే బాగుంటుంది. ప్రజాభిష్టానికి తలవంచే సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యమ బాట పట్టారు’ అని తెలిపారు. -
నీటి సమస్యను పరిష్కరించుకుందాం
-జీడీపీ నుంచి కోడుమూరుకు మంచినీటి పైపులైన్ అవసరం - రూ. 56 కోట్లతో నాబార్డుకు ప్రతిపాదనలు -అఖిలపక్ష పారీ్టల నేతల రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎంపీ బుట్టా రేణుక కోడుమూరు రూరల్: పార్టీలకతీతంగా కలసి కట్టుగా మంచినీటి సమస్యను పరిష్కరించుకుందామని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. శనివారం ఎంపీ కోడుమూరులో నెలకొన్న మంచి నీటి సమస్యపై స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో అఖిలపక్ష పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన కోడుమూరులో నెలకొన్న నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి కోడుమూరుకు మంచినీటి పైపులైన్ నిర్మాణం చేపట్టడమొక్కటే మార్గమన్నారు. కోడుమూరు, చుట్టు పక్కల గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ. 56కోట్లు అవసరమని నాబార్డుకు ప్రతిపాదనలు పంపామన్నారు. గడిచిన మూడేళ్లల్లో కోడుమూరు నియోజకవర్గంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు, అభివృద్ధి పనులకు రూ.2.17కోట్ల నిధులను ఖర్చు చేశామన్నారు. అన్ని పార్టీల నేతలు కలసి వస్తే నీటి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని ఎంపీ సూచించారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో నిరుద్యోగం, నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేస్తే సాగు, తాగునీటి ఇబ్బందులు ఉండవన్నారు. తన పార్లమెంట్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతి సంవత్సరం పుస్తకం ముద్రిస్తున్నట్లు చెప్పారు. -
సదస్సు నిర్వహించే అర్హత ఎక్కడిది?
రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎంపై పలువురు మహిళా నేతల మండిపాటు సాక్షి, అమరావతి: ‘మహిళల హక్కులను ఏమాత్రం కాపాడలేని ముఖ్యమంత్రి చంద్రబాబుకు జాతీయ మహిళా పార్లమెంటు సదస్సును నిర్వహించే అర్హత, హక్కు ఏమాత్రం లేదని మహిళా సంఘాలు గొంతెత్తాయి. విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత–సవాళ్లు’అనే అంశంపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, ప్రభుత్వ నేతల తీరుపై విరుచుకుపడ్డారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడిన శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళలకు తప్పుడు వాగ్దానం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర రాజధానిలో నిర్వహించే జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు మాత్రం డ్వాక్రా గ్రూపు సభ్యులకు ప్రాతినిథ్యం లేకుండా చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో చేసిన తీర్మానాలపై శుక్రవారం నుండి మూడు రోజుల పాటు నిర్వహించే జాతీయ మహిళా పార్లమెంటు సమావేశంలో చర్చించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేంలో మాజీ పార్లమెంటు సభ్యురాలు చెన్నుపాటి విద్య మాట్లాడుతూ మహిళలు సంఘటితం కావాలన్నారు. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో రాష్ట్రానికి చెందిన మహిళా నేతలకు ప్రాతినిథ్యం కల్పించకపోవడం దురదృష్టకరమని చంద్రబాబు పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నా చర్యలేవని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి తన ప్రసంగంలో నిప్పులు చెరిగారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయమనీ మహిళాలోకానికి ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎఫ్డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అక్కినేని వనజ డిమాండు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి పి.శ్రీలక్ష్మి మాట్లాడుతూ డ్వాక్వా రుణమాఫీ పేరుచెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు తర్వాత అమలు చేయకుండా మహిళల్ని మోసం చేశారన్నారు. ఇతర మహిళా నేతలు కూడా తమ ప్రసంగాల్లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
జిల్లాల విభజన ఏ ప్రాతిపదికన?
హైదరాబాద్: ఏ ప్రాతిపదికన జిల్లాలను విభజిస్తున్నారో అర్థం కావడం లేదని, ఇది ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాల విభజన ప్రాతి పదికను ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభిప్రాయాలను చెప్పేందుకు నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే విభజన నిర్ణయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల ప్రాంతాల విషయంలో షెడ్యూల్ 5, భూరియా కమిటీ సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఆదివాసీలు అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్నారని, 1/70 చట్టం అమలు కావడం లేదని అన్నారు. రాజ్యాంగంలో గిరిజనులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, కేసీఆర్‌కు నిజమైన ప్రేమ ఉంటే గిరిజనులకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డియాండ్ చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ.. రాష్ర్టంలో 12 శాతం ఉన్న ఆదివాసీలు స్వయంపాలిత జిల్లాలు కావాలని ఎంతోకాలం నుంచి డిమాండ్ చేస్తున్నా, విస్మరించడం బాధాకరమన్నారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. ముందు తరాల కోసం ప్రకృతి సంపదను కాపాడుతున్న ఆదివాసీల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ర్ట సాధన కంటే ఇది ప్రజాస్వామికమైన డిమాండ్ అన్నారు. కెచ్చల రంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, టీడీపీ రాష్ర్ట నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్, కరుణం రామకృష్ణ, ఆర్ఎస్పీ నాయకుడు జానకి రాములు, న్యూ డెమోక్రసీ నాయకుడు పోటు రంగారావ్, ఆదివాసీ నాయకులు వట్టం నారాయణ, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు ఝాన్సీ, సూర్యం, ఎం. హన్మేష్, గౌతం ప్రసాద్, ఎస్ఎల్ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుదాం
– 15న సామూహిక నిరాహారదీక్ష – రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం పిలుపు తిరుపతి కల్చరల్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంతవరకు పోరాడుదామని, ఈనెల 15న సామూహిక నిరాహారదీక్షను చేపట్టనున్నట్లు అఖిల పక్ష నేతలు పిలుపునిచ్చారు. సీపీఎం ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం... ప్రత్యేక హోదా సాధిద్దాం’ అనే అంశంపై తిరుపతి యశోదనగర్‌లోని ఎంబీ భవన్లో సోమవారం అఖిలపక్ష నాయకుల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్యాకేజీ జేబులు నింపుకోవడానికి ఉపయోగపడుతాయే తప్ప రాష్ట్రాభివృద్ధి కాదన్నారు. మోదీ, బాబు తిరుపతి ఎన్నికల సభలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి నేడు నిరాకరించడం దగాకోరుతనమేన్నారు. ప్యాకేజీ తాత్కాలిక భిక్ష మాత్రమేనని, హోదా శాశ్వత పరిష్కారమన్నారు. ప్రత్యేక హోదా కోసం వామపక్షాలతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ విభజనకు కారకులు బీజేపీ, టీడీపీ నాయకులే అన్నారు. వీరే ప్రత్యేక హోదాను విస్మరించడం దుర్మార్గమన్నారు. హోదాకు చట్ట సవరణ చేయాల్సిన పని లేదని, ప్రధానే ఇవ్వచ్చని రాజ్యంగంలో ఆ వెసులుబాటు ఉందన్నారు. కేజీ బేసిన్ గ్యాస్ ద్వారా వచ్చే 50 శాతం నిధులను ముఖ్యమంత్రి ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లను బతికించే దశగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె.కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం బంద్ చేపడితే అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, పోలీసుల రాజ్యం నడుస్తోందన్నారు. ప్రభుత్వాల మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించేందుకు రాజకీయాలకు అతీతంగా పోరాడదామని పిలుపు నిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు మాట్లాడుతూ పోలీసులు నిర్భందాలతో ఉద్యమాలను ఆపలేరని చంద్రబాబుకు హెచ్చరిక చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత ప్రభాకర్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఉద్యమిస్తామని తెలిపారు. జనసేన పార్టీ నేత కిరణ్‌రాయల్ మాట్లాడుతూ హోదా కోసం పవన్ కల్యాణ్ కట్టుబడి ఉన్నాడని, ప్రభుత్వ తీరును బట్టి పోరాటాలు రూపకల్పన చేసి ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా అనేక ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. అనంతరం ఈనెల 15న సామూహిక నిరాహారదీక్ష చేపట్టాలని రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో సీపీఎం సీపీఐ నగర కార్యదర్శులు సుబ్రమణ్యం, చిన్నం పెంచలయ్య, బీసీ సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మయ్య, సీఐటీయూ చంద్రశేఖర్‌రెడ్డి, డీవైఎఫ్ఐ జయచంద్ర, ఐద్వా సాయిలక్ష్మి, పీఎన్ఎం నేత శ్రీనివాసులు, నవసమాజ ఫెడరేషన్ నాయకుడు నరేష్, వైఎస్ఆర్సీపీ నేతలు మణి, రాజేంద్ర, సాకం ప్రభాకర్, ఐఎన్టీయూసీ అనూషా, పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. -
‘డిండి ఎత్తిపోతల’ను వ్యతిరేకిద్దాం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించతలపెట్టిన డిండి ఎత్తిపోతలను వ్యతిరేకిద్దామని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలకు భవిష్యత్తులో కృష్ణానదీ నీళ్లు తప్ప మరో అవకాశం లేదన్నారు. రైతాంగానికి సాగునీరు, యువతకు ఉపాధి కోసమే జిల్లా ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, డిండి ఎత్తిపోతలతో జిల్లాకు నష్టం జరిగితే తిరగబడతారన్నారు. ఈ విషయంపై ఈనెల 23వ తేదీన టీఎన్జీఓ భవన్లో వివిధ సంఘాలతో రౌండ్ టేబుల్‌సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో రాఘవాచారి, రామకృష్ణరావు, బాల్కిషన్ తదితరుల పాల్గొన్నారు. -
హంద్రీ-నీవాతోనే జిల్లా సస్యశ్యామలం
► డిస్ట్రిబ్యూటరీలను వెంటనే నిర్మించాలి ► ఆయకట్టుకు నీటి సాధన కోసం ఐక్య పోరాటం ► రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతలు అనంతపురం రూరల్ : హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తేనే జిల్లా సస్యశ్యామలం అవుతుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అయితే.. ఈ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తోందని దుయ్యబట్టారు. సోమవారం అనంతపురంలోని ఎన్జీవో హోంలో హంద్రీ-నీవా డిస్ట్రిబ్యూటరీ పనులను ప్రారంభించి జిల్లాలోని 3 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న డిమాండ్‌తో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అఖిలపక్ష నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ హంద్రీ-నీవా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని గుర్తు చేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించి.. రూ.6,800 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ప్రస్తుత బడ్జెట్లో హంద్రీ-నీవాకు రూ.558 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని చూస్తే ఈ ప్రాజెక్టుపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.12వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. దీనిద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్న చంద్రబాబు ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీల నీరు అందించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే హంద్రీనీవా పనులు వేగవంతంగా పూర్తవుతాయన్నారు. బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించినప్పటికీ హంద్రీ-నీవాను పూర్తి చేసి అనంతపురం జిల్లాకు నీరందిస్తామంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే పట్టిసీమను పక్కన పెట్టి హంద్రీనీవాను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోలేదన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి పట్టిసీమ వైపు మొగ్గు చూపారని విమర్శించారు. హంద్రీ-నీవా ద్వారా జిల్లాలోని ప్రతి ఎకరా ఆయకట్టుకు నీరందించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం జిల్లాకు చేస్తున్న అన్యాయంపై ప్రజలను చైతన్యపరచి ఐక్యఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవా పనులకు రీ టెండర్లు పిలిచి ఐదు రెట్లు ఎక్సెస్‌కు టీడీపీ అనుయాయులకు కేటాయించారని విమర్శించారు. జిల్లాలో 87వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో 33వప్యాకేజీ కింద భూసేకరణ చేపట్టిన టెండర్లను సైతం రద్దు చేశారన్నారు. కుప్పంకు నీరు తీసుకుపోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన కాలువ పనులను మాత్రమే వేగవంతం చేయిస్తున్నారని విమర్శించారు. సీపీఐ సీనియర్ నేత రమణ మాట్లాడుతూ జిల్లా నాయకులు రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి పార్టీలకు అతీతంగా ఆయకట్టుకు నీటి సాధన కోసం ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతు ఆత్మహత్యలను నివారించడం కోసం ప్రతి ఎకరాకు సాగు నీరు తీసుకువచ్చే లక్ష్యంతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ నాయకుడు కేవీ రమణ, అఖిల పక్ష నాయకులు జాఫర్, రంగారెడ్డి, కదలిక ఇమామ్, పెద్దన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఈశ్వరయ్య, శరత్‌చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చింతమనేనిని అరెస్ట్ చేయూలి
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ ఏలూరు (మెట్రో) : అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ శుక్రవారం విరుచుకుపడిన ఘటనను మహిళా, కార్మిక, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది. శనివారం జిల్లా ఐద్యా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు జి.విజయలక్ష్మి అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐద్యా జిల్లా నాయకురాలు జి.విమల మాట్లాడుతూ చింతమనేని జీవితం రౌడీయిజంతో ముడిపడి ఉందన్నారు. తల్లిదండ్రులను కష్టపెట్టటం, కిడ్నాప్ చేసి వివాహం చేసుకోవటం వంటివి ఆయన జీవిత చరిత్రలో ఓ భాగమని చెప్పారు. ఉపయోగించుకుని వదిలిపెట్టేసే వ్యక్తి చింతమనేని అని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తిని చట్టసభలోకి ఎందుకు పంపించారో అర్ధం కావడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు గంపల బ్రహ్మావతి మాట్లాడుతూ ఇటువంటి వారి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఎం జిల్లా అధ్యక్షులు బి.బలరామ్ మాట్లాడుతూ చింతమనేనికి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. టీడీపీకి మహిళలపై ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే అతనిని అరెస్ట్ చేయాలన్నారు. రౌడీషీటర్, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి ఆ పార్టీ పదవులు కట్టబెట్టడం తగదన్నారు. తక్షణమే అంగన్వాడీలకు క్షమాపణ చెప్పాలన్నారు. మున్నుల జాన్గుర్నాథ్ మాట్లాడుతూ రౌడీలతో, గూండాలతో చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారనడానికి చింతమనేని తీరే నిదర్శనమన్నారు. ఐద్వా జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారిత గురించి ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి వెంటనే చింతమనేనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
రైతు ఆత్మహత్యలపై రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత తోపాటు పలువురు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జాగృతి సంస్థ ఆదుకుంటుందని కవిత స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు పిల్లలను చదివిస్తామని చెప్పారు. పంటబీమా విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత నిబంధనలు మార్చాలని కోరారు. 2009 తర్వాత చోటు చేసుకున్న పరిణామాల వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని కవిత పునరుద్ఘాటించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టి.జేఏసీ ఛైర్మన్ కోదండరాం కోరారు. రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను ప్రభుత్వం సమీక్షించాలన్నారు. తక్షణమే రైతులకు రూ.5 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. -
హక్కుల సాధనకు గౌడ కులస్తులు ఏకం కావాలి: పొన్నం
హైదరాబాద్: గౌడ కులస్తులంతా ఏకతాటిపైకి వచ్చి తమ హక్కులను సాధించుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శనివారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో తెలంగాణ గౌడ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హజరైన పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌడ కులస్తుల సంక్షేమానికి చిన్నాచితకా సంఘాలు కాకుండా అన్ని సంఘాలు ఒకే గొడుగు కిందికి వచ్చి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సాక్షాత్తూ మంత్రి అయ్యి ఉండి విస్కీ తాగితే ఆయుష్షు పెరుగుతుందని చెప్పడం సబబు కాదని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావునుద్దేశించి అన్యాపదేశంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పోలీసులకు అధికారం ఇచ్చి దాడులు చేయించి గౌడ కులస్తులను అణచివేసే కుట్ర చేస్తోందన్నారు. ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు నర్సగౌడ్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లే లక్ష్మణ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి శశిధర్రావు, ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌తో పాటు 10 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.