సీమాంధ్రను అన్ని రంగాల్లో.. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి తప్ప ఏదో ఒక్క నగరానికే అభివృద్ధి పరిమితం కాకూడదని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు.
సీమాంధ్రను అన్ని రంగాల్లో.. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి తప్ప ఏదో ఒక్క నగరానికే అభివృద్ధి పరిమితం కాకూడదని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర అభివృద్ధిపై ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఇన్నాళ్లూ అలా కేవలం ఒక్క హైదరాబాద్ నగరానికి మాత్రమే అభివృద్ధి పరిమితం కావడం వల్లే సమస్యలు వచ్చాయని, అలా ఇకముందు జరగకుండా చూడాలని అన్నారు.
సీమాంధ్ర జిల్లాల్లో సమతుల్యత పాటించాలని, కేంద్రం ప్రకటించిన... నాయకులు చెబుతున్న ప్యాకేజీలన్నీ మోసపూరితమని శాంతా బయోటిక్స్ అధినేత వరప్రసాద్ రెడ్డి అన్నారు. సింగపూర్లా కేవలం ఒకే నగరాన్ని అభివృద్ధి చేస్తే ఎలాగని, అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.