Seemandhra Development
-
కొత్త బంగారులోకం!
-
నిస్తేజం
- పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపలేకపోయిన కాంగ్రెస్ సభ - చప్పగా సాగిన అధినేత్రి సోనియా ప్రసంగం - పునర్విభజన బిల్లులోని అంశాలే ప్రస్తావన - సీమాంధ్ర అభివృద్ధి ప్రస్తావన శూన్యం - జనం లేక వెలవెలబోయిన సభా ప్రాంగణం అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌లైన్ : పార్టీ శ్రేణుల్లో నెలకొన్ని నిరాశ, నిస్పృహలను కొంత వరకైనా దూరం చూస్తుందనుకున్న కాంగ్రెస్ సభ మరింత నీరుగార్చింది.కార్యకర్తల్లో ఉత్తేజం నింపుతుందనుకున్న సోనియా ప్రసంగం చప్పగా సాగింది. అధినేత్రి వేంచేసినా సభాప్రాంగణం జనం లేక వెలవెల బోయింది. యూపీఏ చైర్పర్సన్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి గుంటూరు వచ్చారు. శుక్రవారం ఇక్కడి ఆంధ్రా ముస్లిం కళాశాలలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సీమాంధ్రలోని పదమూడు జిల్లాలు ఉన్నా ఇక్కడి నాయకులు ఏరికోరి ఆమె సభ గుంటూరులో పెట్టేలా ప్రయత్నించినా సభను విజయవంతం చేయలేకపోయారు. జిల్లాలోని 17 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు చాలా చోట్ల అభ్యర్థులు ముందుకు రాలేదు. గుంటూరు పశ్చిమ, తెనాలి, వినుకొండ, సత్తెనపల్లి అసెంబ్లీ నియోకజవర్గాల అభ్యర్థులు మినహా మిగిలిన ఎవరూ ప్రజలకు అంతగా పరిచయం లేరు. బాపట్ల ఎంపీ అభ్యర్థిగా మరోసారి బరిలో నిలిచిన పనబాక లక్ష్మి తప్ప నరసరావుపేట, గుంటూరు పార్లమెంటు అభ్యర్ధులు ఇంతకు ముందు ప్రజలకు పరిచయం లేదు. ఈ పరిస్థితిని అధిగమించి కనీసం గుంటూరు జిల్లాలోనైనా క్యాడర్లో ఉత్తేజం నింపుతారని భావించిన నాయకులకు సోనియా సభ నిరాశే మిగిల్చింది. సీమాంధ్ర అభివృద్ధికి, సంక్షేమానికి కొత్తగా హామీలేవీ ఇవ్వలేదు. సీమాంధ్రుల మనోభావాలను, ఆవేదనను అర్థం చేసుకోగలన ని చెప్పిన సోనియాగాంధీ సీమాంధ్రులకు ఏమి కావాలో గుర్తించలేకపోయారు. రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన బిల్లులో పొందుపరిచిన పథకాలనే ఆమె మరోసారి వల్లెవేశారు. సీమాంధ్ర రాజధాని ఏర్పాటు, కొత్తగా రాష్ట్రం ఏర్పాటైతే లోటు బడ్జెట్‌ను అధిగమించేందుకు ఏం చేస్తారు అనే విషయాలను ప్రస్తావించలేదు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని పదేళ్ల పాటు విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి ప్రవేశాలు జరగుతాయని చెప్పిన ఆమె నిరుద్యోగుల సమస్య ఎలా పరిష్కరిస్తారో చెప్పలేదు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి పెంచడం, కొత్తగా ైరె ల్వేజోన్ల ఏర్పాటు వంటివి ప్రస్తావించారు. అనువాదంపై అసహనం.. తన ప్రసంగానికి తెలుగు అనువాదం చేసిన జేడీ శీలంతో సోనియా ఇబ్బంది పడ్డారు. ఆయనే ప్రసంగించినట్లు ఉండటంపై ఆమె పలుమార్లు అభ్యంతరం, అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డికి చెప్పినా జేడీశీలం మాత్రం పట్టించుకోలేదు. సోనియాగాంధీ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారో కొంతసేపు వేదికపై ఉన్న నాయకులకు అర్థంకాక తలలు పట్టుకున్నారు. సభా ప్రాంగణం మొత్తం ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో సమన్వయలోపం సైతం కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రజలను తరలించే బాధ్యతను కేవలం కొంతమంది నాయకులు మాత్రమే తీసుకున్నారు. సభకు వచ్చిన ప్రజలు సైతం సోనియాగాంధీ ప్రసంగం పూర్తికాకుండానే వెనుతిరిగారు. పార్టీ జిల్లా అధ్యక్షునికి వేదికపై లభించని స్థానం.. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావుకు సభావేదికపై స్థానం లభించలేదు. తొలుత ఎమ్మెల్యే మస్తాన్‌వలికి సైతం సభావేదికపైకి వెళ్లేందుకు సెక్యూరిటీ అధికారులు అనుమతించలేదు. తర్వాత దిగ్విజయ్‌సింగ్ చొరవతో ఆయన సభావేదికపైకి వచ్చారు. అలాగే మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లను సైతం నాయకులు పట్టించుకోలేదు. -
సీమాంధ్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
- ఒంగోలు పార్లమెంటు వైఎస్సార్ సీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి మార్కాపురం, న్యూస్‌లైన్ : సీమాంధ్ర అభివృద్ధి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పట్టణంలోని నాదెళ్ల కల్యాణ మండపంలో ప్రముఖ పారిశ్రామికవేత్త నాదెళ్ల సుబ్రహ్మణ్యం శనివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సుకు వైవీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుతో సహా పట్టణంలో తాగునీటి సమస్యను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని వైవీ హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదు : కేపీ కొండారెడ్డి తాను 25 ఏళ్లు ఎమ్మెల్యేగా, జంకె వెంకటరెడ్డి ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణంలోని ఆర్యవైశ్యులను బెదిరించటం,బ్లాక్మెయిల్ చేయటం, లెసైన్స్‌లు రద్దు చేయించటం, అధికారులతో దాడులు చేయించటం వంటి నీచ పనులు చేయలేదని మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి అన్నారు. ఆర్యవైశ్యులకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఎవరికీ భయపడకుండా నిర్భయంగా ఓటు వేసుకోవాలని సూచించారు. ఏ సమయంలో ఎలాంటి కష్టం వచ్చినా పరిష్కరించేందుకు తనతో పాటు జంకె వెంకటరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మీ వెంట ఉంటారని హామీ ఇచ్చారు. మా వద్ద ‘హిమ్’ డబ్బుల్లేవ్.. వైఎస్సార్ సీపీ నేతలెవరూ పేద ప్రజలు దాచి పెట్టుకున్న హిమ్ సంస్థలోని డబ్బును తినలేదని పరోక్షంగా టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిని ఉద్దేశించి కేపీ కొండారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఆర్యవైశ్యులంతా జంకె వెంకటరెడ్డితో పాటు వైవీ సుబ్డారెడ్డికి ఓటు వేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్ పదవిని తొలుత ఆర్యవైశ్యులకే కేటాయించామని, పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో డాక్టర్ కనకదుర్గను ఎంపిక చేశామని కొండారెడ్డి వివరణ ఇచ్చారు. అభివృద్ధి చేస్తా : జంకె తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, నీతి నిజాయితీగా పనిచేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే అభ్యర్థి జంకె వెంకటరెడ్డి అన్నారు. తనకు, వైవీకి ఓట్లు వేయాలని జంకె కోరారు. ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని దృష్టిలో ఉంచుకుని ఆర్యవైశ్యులంతా వైఎస్సార్ సీపీకి ఓటు వేయాలని మాజీ కౌన్సిలర్, ఆర్యవైశ్య సంఘ నాయకుడు చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, మేడా సుబ్బారావులు పిలుపునిచ్చారు. అనంతరం ఆర్యవైశ్య నాయకులు నాదెళ్ల సుబ్రహ్మణ్యం, నాదెళ్ల చంద్రమౌళి, హరగోపాల్, సురేష్‌లు కలిసి ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి. జంకె వెంకటరెడ్డి, కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, తాటిశెట్టి వినయ్‌కుమార్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాజా, మార్కాపురం, పొదిలి మార్కెట్ యార్డు చైర్మన్లు గుంటక సుబ్బారెడ్డి, రమణారెడ్డి, పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, ఆర్యవైశ్య సంఘ నాయకులు గార్లపాటి ఆంజనేయులు, వూటుకూరి రామకృష్ణ, పరుచూరి చంద్ర, మొగిలి సుబ్బరత్నం, నేరెళ్ల భద్రి, గుంపల్లి రత్నంశెట్టి, గ్రంధే రవి, ఇమ్మడిశెట్టి వీరారావు, చాటకొండ చంద్రశేఖర్, తాళ్లపల్లి ప్రసాద్, కాళ్ల ఆది, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు చేతిలో మోసపోవద్దు
ఏలూరు (ఆర్ఆర్ పేట), న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేతిలో మరోసారి మోసపోవద్దని, ఆయనవి ఆచరణ సాధ్యం కాని హామీలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. ఏలూరులోని పలు డివిజన్లలో శుక్రవారం వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయని చంద్రబాబు ఇప్పుడు అధికారమిస్తే చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. హై టెక్ మంత్రాన్ని జపిస్తూ రైతులను పట్టిం చుకోకుండా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుం దన్నారు.మరలా తనకు అధికారమిస్తే ఇంటింటికీ ఉద్యోగం, రూపాయికే టిఫిన్, ఐదు రూపాయలకే భోజనం అందిస్తానని ఆచరణ సాధ్యంకాని హామీలను గుప్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్ర బాబు మాయమాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. చిరస్థాయిగా నిలిచిన వైఎస్సార్ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వారు చెప్పారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను నిలిపివేసి ప్రజాకంటకంగా మారిందని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అధికార పక్షంతో కుమ్మైక్కై రాష్ట్ర విభజనకు సహకరించిందని ఆరోపించారు. సీమాంధ్ర అభివృద్ధి తనతోనే సాధ్యమంటున్న చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సీమాంధ్రుల అభిప్రాయాలకు ఏమాత్రం విలువనివ్వని చంద్రబాబుకు మరోసారి అధికారం అప్పగిస్తే ఈ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేయడానికి కూడా వెనకాడబోరన్నారు. రెండుకళ్ల సిద్ధాంతంతో అటు తెలంగాణ ప్రజలను, ఇటు సీ మాంధ్రులను మోసం చేసేందుకు చం ద్రబాబు తెగించారని చెప్పారు. రాష్ట్ర విభజనలో పాలుపంచుకున్న బీజేపీతో తెలుగుదేశం పొత్తుపెట్టుకోవాలనుకోవడం అనైతికమన్నారు. వీరి కూటమిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఏలూరు రెండో డివిజన్ అభ్యర్థి గుత్తుల బాలా త్రిపుర సుందరి, 16వ డివిజన్ అభ్యర్థి దాసరి రమేష్, 14వ డివిజన్ అభ్యర్థి అబ్బిరెడ్డి వెంకటలక్ష్మి, నాయకులు దాసరి వరలక్ష్మి, ఉదయేశ్వరరావు, బుద్దాల రాము, ఆలా గణేష్, రంగ ముత్యాలు, బత్తిన మస్తాన్ రావు, కోలా భాస్కరరావు, బుద్దాల గోవిందరావు, ఆళ్ల రాంబాబు తదితరులు వారి వెంట ఉన్నారు. -
కేక్‌లా కట్‌చేసి ప్యాకేజీలా..?
సీఐఐ సదస్సులో కేంద్రమంత్రి జైరాం రమేష్‌పై పారిశ్రామికవేత్తల ఆగ్రహావేశాలు సాక్షి, విశాఖపట్నం: ‘‘రాష్ట్రాన్ని కేక్‌లా కట్‌చేశారు.. ఇప్పుడేమో అభివృద్ధి, ప్యాకేజీలంటూ గొప్పలు చెబుతున్నారు. రేపు ఎన్నికల్లో మీరు ఓడిపోతే మాకు దిక్కెవరు? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి’’ అని పలువురు పారిశ్రామికవేత్తలు కేంద్రమంత్రి జైరాం రమేష్‌ను నిలదీశారు. విశాఖపట్నంలో సోమవారం జరిగిన సీఐఐ సదస్సులో మంత్రిని పారిశ్రామికవేత్తలు పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సీమాంధ్ర గురించి మీకేం తెలుసు.. ఎందుకు విభజించారని చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించారు.. ఇప్పుడేమో ప్రత్యేక హోదా.. ప్యాకేజీలంటున్నారు.. అసలు మీరు మళ్లీ అధికారంలోకి రాకపోతే మా భవిష్యత్ ఏమిటి? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి.. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ హామీలను అమలుపరుస్తుందన్న గ్యారంటీ ఏమిటి? అని వరుస ప్రశ్నలు సంధించారు. పారిశ్రామికవేత్త ఆర్వీఎస్ రాజు ప్రత్యేక హోదా పదేళ్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీల ప్రతినిధి ఓ.నరేష్కుమార్ మాట్లాడుతూ సీమాంధ్ర అభివృద్ధి చెంది, కొత్త రాజధాని వచ్చేవరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ తేదీని వాయిదా వేయాలని కోరారు. అనంతరం ప్రసంగించిన ఆయన తెలంగాణ డిమాండ్ ఎప్పటిదోనని, ఒకప్పుడు సీమాంధ్రవాసులు కూడా జైఆంధ్ర ఉద్యమం చేశారు కదా? అని ప్రశ్నించారు. దీంతో పారిశ్రామికవేత్తలంతా ఒక్కసారిగా లేచి అభ్యంతరం వ్యక్తం చేసి మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన.. వారిని మై ఫ్రెండ్స్ అంటూ శాంతపరిచేలా ప్రసంగించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆందోళన కేంద్రమంత్రి జైరాం రమేష్ పర్యటనకు నిరసనగా వైస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆందోళన చేపట్టింది. జైరాం రమేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రం ముక్కలైనా సీఐఐ ఒక్కటిగానే ఉండాలి: జైరాం రమేష్ రాష్ట్ర విభజన నిర్ణయం బాధాకరమేనని కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. రాష్ట్రం ముక్కలైనా పరిశ్రమల సమాఖ్యకు సంబంధించిన సీఐఐ మాత్రం ఒక్కటిగానే ఉండాలని ఆకాంక్షించారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణ జరగకపోవడంతో ఒక్క హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి మొత్తం పరిమితమైందని చెప్పారు. దీనికి నిదర్శనం రాజధానిలో 435 వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాలు ఏర్పడట మేనన్నారు. హైదరాబాద్‌ను అన్నీ దొరికే ఒక ఐలాండ్‌గా మార్చేశారన్నారు. రెండేళ్లలో హెదరాబాద్ కన్నా వేగంగా అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు. -
సీమాంధ్ర అభివృద్ధి అన్ని నగరాల్లో ఉండాలి
సీమాంధ్రను అన్ని రంగాల్లో.. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి తప్ప ఏదో ఒక్క నగరానికే అభివృద్ధి పరిమితం కాకూడదని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర అభివృద్ధిపై ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఇన్నాళ్లూ అలా కేవలం ఒక్క హైదరాబాద్ నగరానికి మాత్రమే అభివృద్ధి పరిమితం కావడం వల్లే సమస్యలు వచ్చాయని, అలా ఇకముందు జరగకుండా చూడాలని అన్నారు. సీమాంధ్ర జిల్లాల్లో సమతుల్యత పాటించాలని, కేంద్రం ప్రకటించిన... నాయకులు చెబుతున్న ప్యాకేజీలన్నీ మోసపూరితమని శాంతా బయోటిక్స్ అధినేత వరప్రసాద్ రెడ్డి అన్నారు. సింగపూర్‌లా కేవలం ఒకే నగరాన్ని అభివృద్ధి చేస్తే ఎలాగని, అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. -
వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్: జైరాం రమేష్
తిరుపతి: సీమాంధ్ర అభివృద్ధికి బీజేపీ ఎలాంటి డిమాండ్ చేయలేదని కేంద్ర మంత్రి జైరాం రమేష్ వెల్లడించారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధానమంత్రిని సోనియా గాంధీయే కోరారని చెప్పారు. ప్రధానమంత్రి ప్రకటించిన ప్యాకేజీలన్ని 1973లో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినవేనని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగానే జరిగిందని సమర్థించుకున్నారు. రానున్న ఐదేళ్లలో కేంద్ర నిధులతో సీమాంద్ర జిల్లాలు బాగా అభివృద్ధి చెందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 371డిలో ఎలాంటి మార్పు లేదని జైరాం రమేష్ స్పష్టం చేశారు. సీమాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నామని తెలిపారు. విశాఖ నుంచి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు రుయా ఆస్పత్రిలో క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి జైరాం రమేష్‌కు చేదు అనుభవం ఎదురయింది. కార్యక్రమంలో మధ్యలోనే మహిళలు వెళ్లిపోయారు. తమకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ ఎంపీ చింతా మోహన్ ఇక్కడి తీసుకొచ్చారని మహిళలు తెలిపారు. -
సీమాంధ్ర, తెలంగాణ పోటీ పడాలి: దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణకు ఇచ్చిన మాటకు తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు. సీమాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి పదేళ్ల పాటు రాయితీలు ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. సీమాంధ్ర నేతలతో వార్ రూమ్ భేటీ ముగిసిన తర్వాత దిగ్విజయ్ విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి విషయంలో సీమాంధ్ర, తెలంగాణ పోటీ పడాలన్నారు. పెట్టుబడులు, అభివృద్ధిలో రెండు ప్రాంతాల మధ్య ఆరోగ్యకర పోటీ ఉండాలని ఆకాంక్షించారు. లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని రాష్ట్ర మంత్రులకు సూచించామన్నారు. బీజేపీ, టీడీపీ, వైఎస్సార్ సీపీ ద్వంద్వ వైఖరిని ఎండగడతామన్నారు. కొత్త సీఎం ఎంపికపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. కొత్త సీఎంపై త్వరలో ప్రకటన వస్తుందని దిగ్విజయ్ అన్నారు. -
సీమాంధ్రను సింగపూర్ చేస్తా: చంద్రబాబు
హైదరాబాద్: సీమాంధ్రను సింగపూర్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీయిచ్చారు. సీమాంధ్రను అభివృద్ధి చేసే సత్తా తమ పార్టీకి ఉందన్నారు. సీమాంధ్రలో టీడీపీ మాత్రమే మిగులుతుందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా రెండు ప్రాంతాల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60కు పెంచుతామన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ కలిసిపోవడం ఖాయమని చంద్రబాబు అన్నారు.