
సీమాంధ్రను సింగపూర్ చేస్తా: చంద్రబాబు
హైదరాబాద్: సీమాంధ్రను సింగపూర్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీయిచ్చారు. సీమాంధ్రను అభివృద్ధి చేసే సత్తా తమ పార్టీకి ఉందన్నారు. సీమాంధ్రలో టీడీపీ మాత్రమే మిగులుతుందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా రెండు ప్రాంతాల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60కు పెంచుతామన్నారు. కాంగ్రెస్లో టీఆర్ఎస్ కలిసిపోవడం ఖాయమని చంద్రబాబు అన్నారు.