ప్రజా ఉద్యమాలతో మీడియా ఎంతో నేర్చుకోవాలి
హైదరాబాద్, సాక్షి : మీడియాను సమాజం నుంచి వేరుచేసి చూడరాదని, ప్రజా ఉద్యమాలను చూసి మీడియా పాఠాలు నేర్చుకోవాలని సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలు-ఉద్రిక్తతలు-మీడియా పాత్ర అనే అంశంపై బుధవారం హైదరాబాద్, బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో దిలీప్‌రెడ్డి ప్రసంగించారు. హైదరాబాద్ జర్నలిస్టుల యుూనియున్ (హెచ్‌యుూజే) ఆధ్వర్యంలో విశాలాంధ్ర ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రవుంలో దిలీప్‌రెడ్డి వూట్లాడుతూ, వాస్తవాలను ప్రతిబింబించే విధంగా వార్తలు ఉండాలని, విశ్వసనీయత పత్రికలకు ఊపిరివంటిదన్నారు.
వివిధ రకాల మీడియాలో వస్తున్న వార్తలను ప్రజలు విడగొట్టి వురీ చూస్తున్నారని, ఏది ఒప్పో ఏది తప్పో గ్రహిస్తున్నారని అన్నారు. ప్రజాశక్తి పత్రిక ఎడిటర్ తెలకపల్లి రవి మాట్లాడుతూ మీడియా సంస్థలు సత్యనిష్ట, సమతూల్యత, సమభావం పాటించాలని, ఉద్రిక్తతను పెంచేలా వ్యవహరించరాదని, ఏకపక్ష ధోరణలు చూపరాదన్నారు. ప్రింట్ మీడియా సర్కులేషన్ కోసం, ఎలక్ట్రానిక్ మీడియా రేటింగ్ కోసం,రాజకీయ నాయకులు ఓటింగ్ కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. ఎన్‌టీవీ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ మీడియూ పరిధులను దాటి వ్యవహరిస్తున్నదని, ఇది సరికాదన్నారు.
టీఎన్‌ఎన్ చానల్ ప్రతినిధి పాశం యాదగిరి మాట్లాడుతూ జర్నలిజానికి కుల, మత విచక్షణ ఉండరాదని, ఏకపక్షంగా వ్యవహరిచడం సరికాదని అన్నారు. నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ వూట్లాడుతూ, తెలంగాణ వారు తెలంగాణలో వివక్షకు గురవుతున్నారని, హైదరాబాద్‌లో ఏపీఎన్‌జీవోల సభకు అనుమతించిన ప్రభుత్వం, తెలంగాణ వాదుల ర్యాలీకి అనుమతించకపోవడం అవమానకరవున్నారు. ఐజేయుూ ప్రధాన కార్యద ర్శి దేవులపల్లి అమర్ మాట్లాడుతూ, అబద్ధాల పునాదులపై రాష్ట్ర విభజన జరుగుతోంద న్న మీడియూ వాదన సరికాదన్నారు. యజవూన్యాల వైఖరి కారణంగా జర్నలిస్టుల మధ్య చీలికలు రాకూడదన్నారు. కార్యక్రవుంలో హెచ్‌ఎంటివీ కోఆర్డినేటర్ వి. రహత్, హెచ్‌యుూజే అధ్యక్షుడు యాదగిరి, సీనియర్ పాత్రికేయులు శైలైష్ రెడి ్డ తదిరులు పాల్గొన్నారు.