Public movements
-
ప్రజా ఉద్యమాలే తీర్చిదిద్దాయి
సాక్షి, హైదరాబాద్: ‘ఒక ఒంటరిని, ఏకాకిని అయిన నన్ను సాహిత్య, ప్రజా ఉద్యమాలు సామూహికం చేశాయి. నల్లగొండ జిల్లా మారుమూల పల్లెటూరిలో పుట్టి పెరిగిన నన్ను ప్రజాఉద్యమాలు అక్కున చేర్చుకొని సమష్టి జీవితాన్ని అందించాయి.’ అని ప్రముఖకవి, రచయిత నిఖిలేశ్వర్ అన్నారు. తన జీవన ప్రస్థానంపై రాసిన ‘నిఖిలలోకం’ (జీవితచరిత్ర)తోపాటు ఆయన రాసిన మరోగ్రంథం ‘సాహిత్య సంగమం’ పుస్తకాల ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ శివంరోడ్డులోని ఓ హోటల్లో జరిగింది. ప్రముఖకవి కె.శివారెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, నగ్నముని రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిఖిలేశ్వర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని అత్యంత గాఢంగా ప్రభావితం చేసిన దిగంబర సాహిత్యం మొదలుకొని విరసం, అరసం, తదితర సాహిత్య ఉద్యమాలతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీరవల్లి తన సొంత గ్రామమైనా, హైదరాబాద్‌లోనే తన జీవితం ఆరంభమైందన్నారు. నగ్నముని మాట్లాడుతూ సామాజిక వైరుధ్యాలు, సంక్లిష్టతలను అవగాహన చేసుకొనేందుకు జీవితచరిత్రలు దోహదం చేస్తాయన్నారు. అరవయ్యోదశకం నాటి ఆరుగురు దిగంబర కవుల్లో ప్రస్తుతం తాను, నిఖిలేశ్వర్ మాత్రమే ఉన్నట్టు గుర్తు చేశారు. శివారెడ్డి మాట్లాడుతూ దిగంబర కవుల సాహిత్యం నుంచి తాను గొప్ప స్ఫూర్తి, ప్రేరణ పొందినట్టు చెప్పారు. తెలుగుభాష, సాహిత్యాన్ని నవ్యపథంలో నడిపించిన ఘనత వారిదేనన్నారు. తన పదహారో ఏట మొట్టమొదటిసారి దిగంబర కవులను సంభ్రమాశ్చర్యాలతో చూసినట్టు ప్రముఖ రచయిత్రి ఓల్గా గుర్తు చేసుకున్నారు. నిఖిలేశ్వర్, శివారెడ్డి వంటి ప్రముఖుల జీవితాలను విద్యార్ధిదశలో ఎంతో దగ్గరగా చూసే అవకాశం తనకు లభించిందని నందిని సిధారెడ్డి అన్నారు. సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్,తెలకపల్లి రవి, మానవహక్కుల వేదిక కార్యకర్త ఎస్.జీవన్‌కుమార్, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ చంద్రశేఖర్, జతిన్‌కుమార్, నిఖిలేశ్వర్ కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
మాస్తి వెంకటేశ అయ్యంగార్: జననం, మరణం ఒకేరోజు!
మాస్తి వెంకటేశ అయ్యంగార్ ప్రముఖ కన్నడ రచయిత. ఆయన తన రచనలకు గాను భారతీయ సాహిత్య రంగంలో అత్యుత్తమ పురస్కారమైన ‘జ్ఞానపీఠ్’ను అందుకున్నారు. కన్నడ భాషలో చిన్నకథల రచనలో మాస్తి ప్రసిద్ధులు. ఆయన చిన్నకథల పుస్తకానికి ‘కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం‘ లభించింది. శ్రీనివాస కలం పేరుతో ఆయన రచనలు చేశారు. కన్నడ సాహిత్యరంగంలో మాస్తి కన్నడద ఆస్తి (మాస్తి కన్నడకు ఆస్తి) అన్న సూక్తి బహుళ ప్రచారం పొందింది. మాస్తి వెంకటేశ అయ్యంగార్ 1891 జూన్ 6న నేటి కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలోని కోసహళ్లిలో జన్మించారు. చదవండి: ఆకుపచ్చని అమృతం కళాశాల విద్యను అభ్యసించిన మాస్తి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో ఎం.ఎ. చేశారు. మైసూరు మహారాజా ప్రభుత్వంలో మైసూరు సివిల్ సర్వీసెస్ లో చేరి కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. అంచెలంచెలుగా జిల్లా కమీషనర్ బాధ్యతల్లో పనిచేశారు. దివాన్ పదవికి తను అన్ని విధాలా అర్హుడైనా తనకన్నా తక్కువ సంవత్సరాల సర్వీసు ఉన్న సహోద్యోగికి ఆ పదవిని ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజీనామా చేశారు. కన్నడ సాహిత్యంలో చిన్నకథల ప్రక్రియ వికాసంలో మాస్తి వెంకటేశ అయ్యం గార్ ది ప్రధాన పాత్ర. మొదట ఇంగ్లిష్ భాషలో రచనలు చేసిన మాస్తి, అనంతరం కన్నడ భాషలో రాయడం ప్రారంభించారు. 17 ఆంగ్ల పుస్తకాలు, 123 కన్నడ గ్రంథాలు రచించారు. ఆయన తొలినాళ్ల రచనల్లో బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలపై నిరసన ‘కలం’ కనిపిస్తుంది. మాస్తి 1986 జూన్ 6న బెంగళూరులో మరణించారు. -
పోరు బాట.. అగ్గిబరాటా
స్వరాజ్య సాధన కోసం నిర్మించుకున్న ఆధునిక రాజకీయ పోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన తొలి అడుగు. డిసెంబర్ 28,1885న ఇది ఆవిర్భవించింది. ఇందుకు దోహదం చేసిన ప్రజా సంఘాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ రాజకీయ చైతన్యం తేవడానికి పనిచేసినవే. ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ (1836, కలకత్తా, ద్వారకానాథ్ టాగూర్ స్థాపించారు), బ్రిటిష్ ఇండియా సొసైటీ (1839, లండన్ , విలియం ఆడమ్), బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ (1843, కలకత్తా), బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ (1852, కలకత్తా ద్వారకానాథ్ టాగూర్), మద్రాస్ నేటివ్ అసోసియేషన్ (1852, మద్రాస్, గాజుల లక్ష్మీనరసుచెట్టి), బాంబే అసోసియేషన్ (1852,బొంబాయి, జగన్నాథ్ శంకర్ సేథ్), ఈస్టిండియా అసోసియేషన్ (1866, లండన్ , దాదాభాయ్ నౌరోజీ), నేషనల్ ఇండియన్ అసోసియేషన్ (1867, లండన్ , మేరీ కార్పెంటర్), పూనా సార్వజనిక్ సభ (1876, పూనా, ఎంజి రేనడే, జీవీ జోషి, ఎస్‌హెచ్ చిప్లుంకర్), ఇండియన్ సొసైటీ (1872, లండన్, ఆనందమోహన్ బోస్) ఇండియన్ అసోసియేషన్ (1876, కలకత్తా, సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్‌మోహన్ బోస్), మద్రాస్ మహాజన సభ (1884, మద్రాస్, ఎం. వీరరాఘవచారి, జి. సుబ్రహ్మణ్య అయ్యర్, పి.ఆనందాచార్యులు), బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ (1885, బొంబాయి, ఫిరోజ్‌షా మెహతా, కేటీ తెలాంగ్, బద్రుద్దీన్ తాయబ్జీ).. వంటి వన్నీ స్వరూజ్య చింతనకు భూమికను ఇచ్చినవే. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ (1905, పూనే, గోఖలే) కూడా అలాంటి సేవ చేసింది. చరిత్రలో సక్రమంగా నమోదు కాకున్నా తీవ్ర జాతీయవాద ఉద్యమం తనదైన ఉనికిని చాటుకున్న మాట నిజం. మిత్ర మేళా (1899, నాసిక్), అనుశీలన్ సమితి (1902, బెంగాల్), అభినవ్ భారత్ (1904, పూనా), స్వదేశీ బాంధబ్ సమితి (1905, బెంగాల్), ఇండియన్ హోంరూల్ సొసైటీ, (1905, లండన్ ), ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ (1907, అమెరికా) గదర్ పార్టీ (1913, అమెరికా), జుగాంతర్ పార్టీ (1914, బెంగాల్), బెర్లిన్ కమిటీ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ (1915, జర్మనీ) సంస్థలు నాటి భారతీయ యువతరం మీద గట్టి ప్రభావాన్ని చూపిన సమయమది. జర్మన్ కుట్ర.. బెంగాల్ పుట్ర మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ విప్లవకారుల సాయంతో భారత్‌లోని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక జాతీయ స్థాయి సాయుధ పోరు నిర్వహించాలని గదర్ పార్టీ పథకం వేసింది. దీనికే హిందూ జర్మన్ కుట్ర అని పేరు. ఇది కూడా భారతీయ యువతరం మీద నాడు విశేషమైన ప్రభావం చూపింది. జాతీయ కాంగ్రెస్‌లోని మితవాదుల ఉద్యమ పంథాయే ఇలాంటి ఒక అగ్నివర్షాన్ని కురిపించింది. నిజానికి భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం అతివాదుల చేతులలోకి రావడానికి కారణం మితవాదుల ధోరణి. ఈ మార్పుకు అవకాశం ఇచ్చిన చారిత్రక పరిణామమే బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం లేదా స్వదేశీ ఉద్యమం (1905–1911). కర్జన్ విభజన.. ఉద్యమ గర్జన పాలనా సౌలభ్యం పేరుతో జూలై 19,1905 న వైస్రాయ్ కర్జన్ బెంగాల్ విభజనను ప్రకటించాడు. అక్టోబర్ 16న విభజన అధికారికంగా అమలులోకి వచ్చింది. ఇది బ్రిటిష్ జాతి ముద్ర స్పష్టంగా ఉన్న విభజించు పాలించు చర్య. జాతీయోద్యమంలో కీలకంగా ఉన్న బెంగాలీలను విభజించడంతో పాటు, హిందువులను ముస్లింలను విడదీయడం ఈ చర్య ఉద్దేశంగా కనిపిస్తుంది. 7 కోట్ల 80 లక్షల 50 వేల జనాభాతో కూడిన పెద్ద ప్రెసిడెన్సీ బెంగాల్. మొత్తం బెంగాల్, బిహార్, ఒరిస్సా, అస్సాం ఇందులో ఉండేవి. అస్సాం ప్రత్యేక అధికారి పాలనలో మాత్రం ఉండేది. తూర్పు బెంగాల్‌లోని 15 జిల్లాలు, బిహార్, ఒరిస్సాలను కలిపి ఒక భాగం, మిగిలిన బెంగాల్, అస్సాం ఒక ప్రాంతంగాను విభజించారు. తూర్పు బెంగాల్ రాజధానిగా ఢాకాను ప్రకటించారు. ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువ. మొత్తంగా రెండింటిలోనూ బెంగాలీలు అల్ప సంఖ్యాకులుగా మారారు. ఈ విధంగా కాకుండా, బెంగాల్ భాష మాట్లాడేవారితో ఒక రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చునని సురేంద్రనాథ్ బెనర్జీ వంటివారు వాదించారు. ఇంతకీ ఈ రాజకీయ సంక్షోభం సృష్టించిన వైస్రాయ్ కర్జన్ పదవి.. విభజన ప్రకటన తరువాత మూడువారాలకే (ఆగస్ట్ 16) పోయింది. అయినా ఉద్యమ సెగను చవి చూశాడు. – డా.గోపరాజు నారాయణరావు -
పేదలకు మాటలు.. పెద్దలకు చేతలు
⇒ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడతాం ⇒జిల్లాలో పార్టీ విస్తరణకు పకడ్బందీ ప్రణాళిక ⇒పోడు భూముల సమస్యపై మరో ఉద్యమం ⇒ఈ ప్రభుత్వానిదీ అవకాశవాద వైఖరే... ⇒సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పేదలకు మాటలు చెబుతూ పెద్దల కోసం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ అవకాశవాద వైఖరిని ఎండగట్టేందుకు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. శుక్రవారం నుంచి మూడురోజులపాటు మధిరలో జరిగే పార్టీ జిల్లా మహాసభలను పురస్కరించుకొని పార్టీ ఉద్యమ కార్యాచరణ- విస్తరణ అంశాలపై గురువారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత లేదు... ప్రజల సంక్షేమం కోసం రూపొందించిన అనేక పథకాల అమలులో కేసీఆర్ ప్రభుత్వానికే సరైన స్పష్టత లేదు. ప్రజలను ఆకట్టుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యత పేదలకు సంక్షేమాన్ని పంచడానికి ఇవ్వలేకపోతున్నారు ఈ తరహా పాలనపై తమ పార్టీ రాబోయే రోజుల్లో ఆందోళనలు నిర్వహించడానికి సమాయత్తం అవుతోంది. జిల్లాలో సీపీఎంను అన్ని మండలాలు, గ్రామాల్లో మరింత పటిష్టపరిచేందుకు కార్యాచరణ రూపొందించుకుంటాం. ప్రజా ఉద్యమాల నిర్మాణం..ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించిన ఘనత మా పార్టీకి ఉంది. రూ.3.50లక్షలతో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామన్న కేసీఆర్ ఇప్పుడు మాట మారుస్తున్నారు. అందులో రూ.లక్ష పేదలు చెల్లించాలన్న నిబంధన పెట్టారు. లక్ష రూపాయలు ఇవ్వగలిగిన వారు పేదవారు ఎలా అవుతారు?. ఎన్నో ఉద్యమాలు నిర్మించాం.. మూడేళ్లుగా జిల్లాలో ప్రధాన సమస్యల పరిష్కారం కోసం మా పార్టీ అనేక ఉద్యమాలు నిర్వహించింది. పాలక వర్గాలు దిగివచ్చి పలు సమస్యలను పరిష్కరించాయి. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం మరిన్ని ఉద్యమాలు చేస్తాం. జిల్లాలో రూ.10 వేల కోట్లతో 10 లక్షల ఎకరాల భూమిని సాగు చేసే అవకాశం ఉంది. మూడు పంటలు పండించడానికి అనువైన పరిస్థితి ఉంది. వీటిపై ప్రభుత్వాన్ని కదిలించేందుకు సాగునీటి సాధన యాత్ర నిర్వహించాం. దుమ్ముగూడెం నుంచి పాలేరు వరకు, అక్కడి నుంచి ఖమ్మం వరకు 12 రోజులపాటు 1000 మందితో నిర్వహించిన పాదయాత్ర ప్రభుత్వాన్ని కదలించింది. మా ఆందోళనల ఫలితంగా అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ రూ.100 కోట్లు అదనంగా కేటాయించింది. దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లా సస్యశ్యామలం కావాలంటే ప్రభుత్వం రూపొందించిన డిజైన్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఖమ్మం రూరల్ మండలం వరకే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మున్నేరు మీద అక్విడేట్ నిర్మించి దీని ద్వారా పాలేరు వరకు పొడిగిస్తే రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉంది. అలాగే మరో రెండున్నర లక్షల ఎకరాలకు సాగర్ ద్వారా నీరు అందుతుంది. మేము చేసిన పోరాటాల ఫలితంగానే దుమ్ముగూడెం నుంచి సాగర్ టేల్‌పాండ్‌ను రద్దు చేశారు. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం విధి విధానాలను వెల్లడించాల్సి ఉంది. భవిష్యత్‌లోనూ జిల్లాలో మిత్రపక్షమైన సీపీఐతో కలిసి ఐక్య కార్యాచరణ ఉద్యమాలు నిర్వహిస్తాం. ఐక్య ఉద్యమాల ఆవశ్యకత పెరిగింది... తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐక్య ఉద్యమాల ఆవశ్యకత మరింత పెరిగింది. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలనే డిమాండ్‌తో త్వరలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని యోచిస్తున్నాం. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే డిమాండ్‌తో మరో ఉద్యమం చేస్తాం. జిల్లాలో అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. అటవీ అధికారులు, గిరిజనులను అనేక ఇబ్బందులు, వేధింపులకు గురి చేస్తున్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పూర్తి హక్కు కల్పించేందుకు గిరిజనులతో కలిసి ఓ పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. జిల్లాలో దళితులు, గిరిజనులకు విద్య, వైద్య, ఉపాధి, ఆరోగ్య అంశాల్లో తీరని అన్యాయం జరుగుతోంది. వీరికి ఆయా అంశాల్లో న్యాయం జరిగేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వారి సంక్షేమానికే కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకతపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో జిల్లా నుంచి సీపీఎం ప్రధాన భూమిక పోషిస్తోంది. గత ప్రభుత్వాల బాటలోనే టీఆర్ఎస్...గత ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై పోరాడుతున్న పార్టీలపై నిర్బంధం కొనసాగించాయి. ఈ ప్రభుత్వం సైతం అదే ధోరణితో వ్యవహరిస్తోంది. జిల్లాలో అన్ని వర్గాల ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న సీపీఎం తమకు గల ప్రజా పునాదిని రాజకీయంగా మలచుకోవడంలో కొంత వెనుకబడి ఉంది. పకడ్బందీ రాజకీయవ్యూహాలతో తిరుగులేని శక్తిగా ఎదుగుతాం. నిజాం నవాబు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి, వారి మూకల చేతిలో అమరులైన కొమరంభీమ్, దొడ్డి కొమురయ్యల త్యాగనిరతిని శ్లాఘిస్తూనే.. నిజాం నవాబును గొప్పవాడిగా పొగడటం కేసీఆర్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. దీనిపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను కేసీఆర్ నివృత్తి చేయాలి. టీఆర్ఎస్ వైఖరిని స్పష్టం చేయాలి. రాజకీయంగా గతంలో జరిగిన పొరపాట్లను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో అటువంటివి జరగకుండా మరింత చైతన్యవంతంగా వ్యవహరిస్తాం. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వకుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఆ తర్వాత పార్టీలో మెజార్టీ సభ్యులు వ్యక్తం చేశారు. జిల్లాలో తునికాకు సేకరిస్తున్న గిరిజనులకు న్యాయమైన కూలి, పూర్తిస్థాయి బోనస్ లభించేందుకు ఉద్యమాలు చేయాలని యోచిస్తున్నాం. మూడు రోజులపాటు మధిరలో జరిగే జిల్లా మహాసభల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు తదితరులు పాల్గొంటారు. -
ప్రజా ఉద్యమాలతో మీడియా ఎంతో నేర్చుకోవాలి
హైదరాబాద్, సాక్షి : మీడియాను సమాజం నుంచి వేరుచేసి చూడరాదని, ప్రజా ఉద్యమాలను చూసి మీడియా పాఠాలు నేర్చుకోవాలని సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలు-ఉద్రిక్తతలు-మీడియా పాత్ర అనే అంశంపై బుధవారం హైదరాబాద్, బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో దిలీప్‌రెడ్డి ప్రసంగించారు. హైదరాబాద్ జర్నలిస్టుల యుూనియున్ (హెచ్యుూజే) ఆధ్వర్యంలో విశాలాంధ్ర ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రవుంలో దిలీప్‌రెడ్డి వూట్లాడుతూ, వాస్తవాలను ప్రతిబింబించే విధంగా వార్తలు ఉండాలని, విశ్వసనీయత పత్రికలకు ఊపిరివంటిదన్నారు. వివిధ రకాల మీడియాలో వస్తున్న వార్తలను ప్రజలు విడగొట్టి వురీ చూస్తున్నారని, ఏది ఒప్పో ఏది తప్పో గ్రహిస్తున్నారని అన్నారు. ప్రజాశక్తి పత్రిక ఎడిటర్ తెలకపల్లి రవి మాట్లాడుతూ మీడియా సంస్థలు సత్యనిష్ట, సమతూల్యత, సమభావం పాటించాలని, ఉద్రిక్తతను పెంచేలా వ్యవహరించరాదని, ఏకపక్ష ధోరణలు చూపరాదన్నారు. ప్రింట్ మీడియా సర్కులేషన్ కోసం, ఎలక్ట్రానిక్ మీడియా రేటింగ్ కోసం,రాజకీయ నాయకులు ఓటింగ్ కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. ఎన్టీవీ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ మీడియూ పరిధులను దాటి వ్యవహరిస్తున్నదని, ఇది సరికాదన్నారు. టీఎన్ఎన్ చానల్ ప్రతినిధి పాశం యాదగిరి మాట్లాడుతూ జర్నలిజానికి కుల, మత విచక్షణ ఉండరాదని, ఏకపక్షంగా వ్యవహరిచడం సరికాదని అన్నారు. నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ వూట్లాడుతూ, తెలంగాణ వారు తెలంగాణలో వివక్షకు గురవుతున్నారని, హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోల సభకు అనుమతించిన ప్రభుత్వం, తెలంగాణ వాదుల ర్యాలీకి అనుమతించకపోవడం అవమానకరవున్నారు. ఐజేయుూ ప్రధాన కార్యద ర్శి దేవులపల్లి అమర్ మాట్లాడుతూ, అబద్ధాల పునాదులపై రాష్ట్ర విభజన జరుగుతోంద న్న మీడియూ వాదన సరికాదన్నారు. యజవూన్యాల వైఖరి కారణంగా జర్నలిస్టుల మధ్య చీలికలు రాకూడదన్నారు. కార్యక్రవుంలో హెచ్ఎంటివీ కోఆర్డినేటర్ వి. రహత్, హెచ్యుూజే అధ్యక్షుడు యాదగిరి, సీనియర్ పాత్రికేయులు శైలైష్ రెడి ్డ తదిరులు పాల్గొన్నారు.