ప్రత్యేక హోదాతో ప్రగతి సాధ్యం | special status, progress is possible | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాతో ప్రగతి సాధ్యం

Published Sat, Sep 12 2015 11:41 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదాతో ప్రగతి సాధ్యం - Sakshi

ప్రత్యేక హోదాతో ప్రగతి సాధ్యం

స్పష్టం చేసిన నాయకులు
ప్యాకేజీ సరికాదని వాదన
వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రౌండ్ టేబుల్ సమావేశం
 

రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష పార్టీ నాయకులు,,న్యాయవాదులు, ప్రొఫెసర్లు, విద్యార్థి నాయకులు, మేధావులు గళమెత్తారు. బీచ్‌రోడ్డులోని ఓ హోటల్లో శ నివారం వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వీరంతా ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు.. ప్రత్యేక హోదా వల్ల కలిగే అభివృద్ధ్ది.. ప్యాకేజీ వల్ల వచ్చే నష్టాలను విశ్లేశించారు. ప్యాకేజీ అధికార పార్టీ జేబులు నింపడానికి తప్ప ప్రజలకు ఒరిగేదిలేదని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కంపా హనోకు, జాన్‌వెస్లీ, ప్రచార కమిటి నాయకులు రవిరెడ్డి, ట్రేడ్ యూనియన్‌నాయకులు మస్తానప్ప, నాయకులు సత్తి రామకృష్ణ్ణారెడ్డి, న్యాయవాదులు బీవీఆర్ మూర్తి, సత్యనారాయణ  ప్రొఫెసర్ జాన్,  కాంతారావు తదితరులు పాల్గొన్నారు.  - పెదవాల్తేరు (విశాఖ)
 
 చేతులెత్తేసిన కేంద్ర.. రాష్ర్ట ప్రభుత్వాలు
 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ,టీడీపీ విభజన హామీలిచ్చాయి. అధికారంలోకి వచ్చాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ప్రత్యేక హోదా కావాలని అడిగిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీయే. ప్రత్యేక హోదా వస్తేనే నిరుద్యోగ యువతికి  ఉపాధి కలుగుతుంది. ప్యాకేజీ వస్తే టీడీపీ నాయకుల ఆస్తులు పెరుగుతాయే తప్ప రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు.
 - మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు
 
 చేతులెత్తేసిన కేంద్ర.. రాష్ర్ట ప్రభుత్వాలు

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ,టీడీపీ విభజన హామీలిచ్చాయి. అధికారంలోకి వచ్చాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ప్రత్యేక హోదా కావాలని అడిగిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీయే. ప్రత్యేక హోదా వస్తేనే నిరుద్యోగ యువతికి  ఉపాధి కలుగుతుంది. ప్యాకేజీ వస్తే టీడీపీ నాయకుల ఆస్తులు పెరుగుతాయే తప్ప రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు.
 - మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు
 
 మాటమార్చిన టీడీపీ

 అన్ని జిల్లాల ప్రజలు హైదరాబాద్ వెళ్లి ఆర్ధిక రాజధానిగా ఎదగడానికి కష్టపడ్డారు. విభజనతో హైదరాబాద్‌తో ఉన్న సంబంధాలు తెగిపోయాయి. సోనియాగాంధీ, చంద్రబాబు వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని సోనియా చెప్పారు. ప్రత్యేక హోదా తెస్తామని టీడీ పీ హామీ ఇచ్చి మాట మార్చి ప్యాకేజీ అనడం సరికాదు.    - ఒ.ఆర్.రెడ్డి, మాజీ ఉపకులపతి
 
 ప్యాకేజీ ఐస్‌ముక్క

 ప్యాకేజీ ఐస్‌ముక్కలాంటిది. ప్రజల వద్దకు వచ్చేసరికి కరిగిపోతుంది. ఎలాంటి అభివృద్ధి  ఉండదు. ప్రత్యేక హోదా వల్ల పన్నుల్లో రాయితీలు కలిగి పరిశ్రమలు వస్తాయి. ఐటి అభివృద్ధి పెరిగి పారిశ్రామికంగానే కాకుండా నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుంది. ప్రత్యేక హోదాతో రాష్ట్రాభివృద్ధి జరిగితే ఆ క్రెడిట్ అధికార పార్టీకే చెందుతుంది.    - ప్రసాద్‌రెడ్డి, ఫ్రొఫెసర్
 
 హామీ నెరవేర్చాలి

 రాష్ట్ర విభజన ప్రజలు కోరుకోలేదు. పదిహేనేళ్ల ప్రత్యేక హోదా, రూ.5లక్షల కోట్లు ప్యాకేజీ తెస్తామని టీడీపీ ఇచ్చిన విభజన హామీని నెరవేర్చాలి.     - సూరప్పడు, ప్రొఫెసర్
 
 కేంద్రంపై ఒత్తిడి తేవాలి

 మేధావుల మౌనం జాతికి శాపం. ప్రత్యేక హోదా పక్కన పెట్టి ప్యాకేజీ కావాలని అడుగుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో  శివరామకృష్ణ కమిటీ నివేదిక గురించి మరిచిపోయారు. అధికార పార్టీ ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలి. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
 - బాబు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement