![YSRCP Youth Wing Round Table Conference In Vijayawada - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/10/ysr-congress-party.jpg.webp?itok=ODcOpCVl)
సాక్షి, విజయవాడ : వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేధావులు, యువజన విద్యార్థి విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి మాట్లాడుతూ.. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న టీడీపీ నాయకులు చర్రిత హీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. బినామీ ఆస్తులను కాపాడుకోవడానికే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని 13 జిల్లాల స్వాగతిస్తున్నారని చెప్పారు.
ప్రొఫెసర్ డాక్టర్ మెహబూబ్ షేక్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నా చంద్రబాబు మాత్రం డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవడానికే.. డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైనా చంద్రబాబుకు బుద్ధి రావడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment