
సాక్షి, విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టులపై ఆదివారం బీజేపీ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, ఆ ప్రాజెక్టు కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు.
బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులను చంద్రబాబు నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా కేంద్రం అండగా ఉంటుందన్నారు. అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాలను ప్రభుత్వం పరిష్కరించాలని విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment