జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించతలపెట్టిన డిండి ఎత్తిపోతలను వ్యతిరేకిద్దామని టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక టీఎన్‌జీఓ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలకు భవిష్యత్తులో కృష్ణానదీ నీళ్లు తప్ప మరో అవకాశం లేదన్నారు.
రైతాంగానికి సాగునీరు, యువతకు ఉపాధి కోసమే జిల్లా ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, డిండి ఎత్తిపోతలతో జిల్లాకు నష్టం జరిగితే తిరగబడతారన్నారు. ఈ విషయంపై ఈనెల 23వ తేదీన టీఎన్‌జీఓ భవన్‌లో వివిధ సంఘాలతో రౌండ్ టేబుల్‌సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో రాఘవాచారి, రామకృష్ణరావు, బాల్‌కిషన్ తదితరుల పాల్గొన్నారు.
‘డిండి ఎత్తిపోతల’ను వ్యతిరేకిద్దాం
Published Fri, Apr 22 2016 2:12 AM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM
Advertisement
Advertisement