కడప అగ్రికల్చర్ : రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే భూ ఆర్డినెన్స్‌పై బుధవారం ఉదయం కడప నగరంలోని ఎద్దుల ఈశ్వరరెడ్డి భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామసుబ్బారెడ్డి, జి చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలను, మేధావులను ఆహ్వానించామన్నారు. ప్రయివేట్ భాగస్వామ్య ప్రాజెక్టులకు 80 శాతం పచ్చని వ్యవసాయ భూములను లాక్కొనేందుకు రంగం సిద్ధమైందని, దీనిపై రాజ్యసభలో కూడా చర్చ సాగుతోందని పేర్కొన్నారు. ఈ తరుణంలో రైతులు కూడా వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.