land ordinance
-
ఆ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: ల్యాండ్ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. అంతకుముందు రోజే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. భూసేకరణ చట్టానికి సంబంధించిన ల్యాండ్ ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది మూడోసారి. ఆర్డినెన్స్ రూపంలో ఉన్న దీనిని ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో కూడా చట్టరూపంలోకి మార్చలేకపోవడంతో తిరిగి మరోసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయడంతోపాటు ఆ బిల్లు భవిష్యత్ మనుగడ కోసం తప్పకుండా ఆర్డినెన్స్ అవసరం అని ప్రధాని చెప్పడంతో కేబినెట్ దానిని శనివారం ఆమోదించింది. -
మూడోసారి భూ ఆర్డినెన్స్
జారీ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం సాక్షి, న్యూఢిల్లీ: ‘భూ’ బిల్లుపై కేంద్రం పట్టు వదలటం లేదు. విపక్షాలు, రైతు సంఘాలు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, రాజ్యసభలో సరైన సంఖ్యాబలం లేకపోయినా, భూసేకరణ బిల్లు విషయంలో ఎన్డీఏ సర్కారు వెనక్కి తగ్గటం లేదు. ఇప్పటికే రెండు సార్లు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను మూడోసారి జారీ చేయాలని నిర్ణయించింది. గత మార్చి నెలలో రెండోసారి జారీ చేసిన భూ ఆర్డినెన్స్ గడువు జూన్ మూడో తేదీతో ముగియనుండటంతో తిరిగి జారీ చేసేందుకు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం చేస్తే.. గత ఏడాది కాలంలో కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ల సంఖ్య 13కు చేరుకుంటుంది. 2013 భూసేకరణ చట్టానికి ప్రతిపాదించిన సవరణల్లో 13 కేంద్ర చట్టాలను చేర్చటం ద్వారా రైతులకు కొన్ని ప్రధాన ప్రాజెక్టులలో పరిహారం లభించేలా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని కేబినెట్ సమావేశానంతరం కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. ఆర్డినెన్స్‌ను తిరిగి జారీ చేయకపోతే.. రైతులకు పరిహారం చెల్లించటానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి పద్ధతంటూ ఉండదని అన్నారు. 2013 నాటి భూసేకరణ చట్టానికి డిసెంబర్ 29న మోదీ సర్కారు తొలి ఆర్డినెన్స్ జారీ చేసింది. 10 అధికారిక సవరణలతో లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ, సంఖ్యాబలం లేని కారణంగా రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టడానికి కూడా సాహసించలేకపోయింది. బడ్జెట్ తొలి దశ సమావేశాలు ముగిసిన తరువాత రెండోసారి ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. మలిదశ సమావేశాల్లోనూ బిల్లుకు మోక్షం లభించకపోవటంతో 30 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. బంగ్లాతో ఒప్పందాలకు ఓకే.. జూన్ తొలివారంలో బంగ్లాదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ దేశంతో కుదుర్చుకోనున్న రెండు ఒప్పందాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇరుదేశాల మధ్య మానవ అక్రమ రవాణా నిరోధక ఒప్పందంతో పాటు, జల రవాణా ఒప్పందానికి కేంద్రం అంగీకరించింది. దీంతో పాటు గుజరాత్, మహారాష్ట్రల్లోని పారిశ్రామిక వాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 4,318 కోట్ల నిధుల కేటాయింపునకు కేంద్ర ఆమోదం లభించింది. అంతేకాకుండా, స్వీడన్‌తో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో పరస్పర సహకార ఒప్పందానికీ కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. హెచ్ఆర్ఏ నగరాల స్థాయిల్లో మార్పులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి అద్దె, రవాణా అలవెన్స్‌లకు సంబంధించి 2011 జనాభా లెక్కల ప్రకారం నగరాలు, పట్టణాలను అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు ను ‘జెడ్’ తరగతి నుంచి ‘వై’ తరగతికి అప్‌గ్రేడ్ చేశారు. ఇక నుంచి నెల్లూరులోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘వై’ తరగతి కింద ఇంటి అద్దె అలవెన్స్‌లు అందనున్నాయి. 2011 జనాభా లెక్కలను అనుసరించి అహ్మదాబాద్, పుణేలను ‘వై’ తరగతి నుంచి ‘ఎక్స్’ తరగతికి, 21 పట్టణాలను ‘జెడ్’ తరగతి నుంచి ‘వై’ తరగతికి అప్‌గ్రేడ్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పట్టణ, నగరాల అప్‌గ్రేడ్ 1.04.2014 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఘనంగా అంబేడ్కర్ 125వ జయంతి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి వేడుకలకు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు తదితరులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ 16 కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేబినెట్‌కు నోట్ సమర్పించింది. ఇందులో ప్రధానంగా 15, జన్‌పథ్‌లో రూ. 197 కోట్లతో అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటు ఒకటి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ అన్నారు. -
మరోసారి భూ ఆర్డినెన్స్!!
-
మరోసారి భూ ఆర్డినెన్స్!!
భూసేకరణ చట్టం సవరణ బిల్లుపై వెనుకడుగువేయబోమని ప్రకటించిన దరిమిలా ఆ బిల్లుపై మరోసారి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈ బిల్లుపై రెండుసార్లు ఆర్డినెన్స్ జారీ అయ్యాయి. అయితే జూన్ 3తో గడువు ముగుస్తుండటంతో మరోసారి ఆర్డినెన్స్ తేవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన నివాసం 7 రేస్ కోర్స్ లో శనివారం జరిగిన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భూ సేకరణ చట్టం సవరణ బిల్లుపై మరోసారి ఆర్డినెన్స్ జారీ చేయాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు పంపాలని తీర్మానించింది. భూ బిల్లుపై ఏర్పాటయిన పార్లమెంటరీ జాయింట్ కమిటీ తొలి సమావేశంలోనూ విసక్ష సభ్యులు ప్రభుత్వం తీరును ఎండగట్టారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేడీ, టీఎంసీ సహా లెఫ్ట్ పార్టీలకు చెందిన సంభ్యులు హాజరయ్యారు. వారికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, న్యాయశాఖలకు చెందిన అధికారులు బిల్లులోని సవరణలపై వివరించారు. 2013లో యూపీఏ ప్రభుత్వం భూసేకరణ చట్టం తీసుకువచ్చింది. దీని ప్రకారం ఏదేనీ ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించాల్సి వచ్చినప్పుడు కనీసం 70 నుంచి 80 శాతం రైతులు అందుకు అంగీకరించడం తప్పనిసరి. అయితే ఈ నిర్ణయంవల్ల పలు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని భావించిన ఎన్డీఏ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి కొన్ని కీలకమైన సవరణలు చేసి, రాష్ట్రపతి అనుమతితో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో మాత్రం వీగిపోయిన సంగతి తెలిసిందే. -
ఆ ఆర్డినెన్స్‌పై కోర్టులో కేసు వేద్దామా!
లెఫ్ట్ పార్టీలు, హక్కుల సంఘాల చర్చలు 1986 నాటి సుప్రీం తీర్పు ఏపీకి వర్తిస్తుందని అంచనా హైదరాబాద్: భూసేకరణ చట్టం-2013లోని రెండు మూడు అధ్యాయాలను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడానికి ఊతమిచ్చిన కేంద్ర ప్రభుత్వ భూ సేకరణ చట్ట సవరణ ఆర్డినెన్స్‌పై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేయాలని లెఫ్ట్ పార్టీలు, హక్కుల సంఘాలు యోచిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకురావాల్సిన ఆర్డినెన్స్‌ను కేంద్రం ఇప్పటికే రెండుసార్లు తీసుకువచ్చి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఈ సంఘాలు భావిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ వాస్తవ బాధితుల తరఫున పిల్ దాఖలు చేసే విషయమై సాధ్యాసాధ్యాలను సీపీఐ, సీపీఎం, రైతు సమాఖ్య, పీయూసీఎల్ నేతలు చర్చించారు. మరోసారి హైదరాబాద్‌లో న్యాయప్రముఖులతో కలిసి చర్చించాలని నిర్ణయించారు. బిహార్ ప్రభుత్వానికి, డాక్టర్ డీసీ వాద్వాకు మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు 1986లో ఓ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. చట్టసభలు అస్తిత్వంలో ఉండి, నడుస్తున్నప్పుడు పదేపదే ఆర్డినెన్స్‌లు జారీ చేయడం చెల్లదన్నది ఆ తీర్పు సారాంశం. -
నేడు భూ ఆర్డినెన్స్‌పై రౌండ్ టేబుల్ సమావేశం
కడప అగ్రికల్చర్ : రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే భూ ఆర్డినెన్స్‌పై బుధవారం ఉదయం కడప నగరంలోని ఎద్దుల ఈశ్వరరెడ్డి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామసుబ్బారెడ్డి, జి చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలను, మేధావులను ఆహ్వానించామన్నారు. ప్రయివేట్ భాగస్వామ్య ప్రాజెక్టులకు 80 శాతం పచ్చని వ్యవసాయ భూములను లాక్కొనేందుకు రంగం సిద్ధమైందని, దీనిపై రాజ్యసభలో కూడా చర్చ సాగుతోందని పేర్కొన్నారు. ఈ తరుణంలో రైతులు కూడా వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. -
భూ ఆర్డినెన్స్‌పై రాజ్యసభలో రగడ
సర్కారు ‘ప్రకటన’పై విపక్షాల ఆందోళన ఆర్డినెన్స్ పునఃజారీపై గ్రామీణాభివృద్ధి సహాయమంత్రి ప్రకటన తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెల్ లోకి దూసుకెళ్లిన టీఎంసీ, ఎస్పీ సభ్యులు న్యూఢిల్లీ: భూసేకరణపై ఆర్డినెన్స్‌ను పునఃజారీ చేయటంపై గురువారం రాజ్యసభలో వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించిన ప్రభుత్వానికి ప్రతిపక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. భూ సేకరణ, పునరావాసం, పునర్నిర్మాణంలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు (సవరణ) ఆర్డినెన్స్ - 2015 జారీ చేయటం ద్వారా తక్షణం చట్టం చేయటానికి గల పరిస్థితులపై వివరణ ఇస్తూ ఒక ప్రకటనను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సుదర్శన్భగత్ రాజ్యసభకు సమర్పించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేందర్‌సింగ్ ఉదయం సభలో ఉన్నప్పటికీ.. సహాయమంత్రి తన ప్రకటనను సమర్పించటానికి కొద్ది నిమిషాల ముందే వెళ్లిపోయారు. అయితే.. ఈ ప్రకటనను తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ సభ్యులు కూడా లేచి నిరసన తెలపాలంటూ టీఎంసీ నేత డెరెక్ ఓ’బ్రెయిన్ పిలుపునివ్వటం కనిపించింది. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని కొనసాగనివ్వబోమని ఎస్పీ సభ్యులు నినాదాలు చేశారు. వెల్ లో ఆందోళనకు దిగారు. తృణమూల్ సభ్యులు కూడా వారితో జతకలిశారు. టీఎంసీ సభ్యుడు నదీం ఉల్ హక్ అజెండా పత్రం నకలును చింపి విసిరేశారు. భూసేకరణ బిల్లును సభలోకి తీసుకొస్తే దానినీ అలానే చేస్తానని చెప్పారు. గందరగోళం కొనసాగటంతో చైర్మన్ సభ వాయిదా వేశారు. అంతకుముందు గజేంద్ర మృతికి సభ నివాళులు అర్పించింది. -
భూ సేకరణ బిల్లుపై చర్చకు సిద్ధం: మోదీ
న్యూఢిల్లీ : భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చకు సిద్ధమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. కాగా లోక్ సభ బడ్జెట్ మలివిడత సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలిరోజే వివాదాస్పదమైన భూసేకరణ ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశ పెట్టేందుకు మోదీ సర్కారు యోచిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వ, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలతో పరిస్థితి వేడెక్కింది. ఈ నేపథ్యంలో సభలో ఈ అంశంపై పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగే అవకాశం ఉంది. -
భూసేకరణపై మళ్లీ ఆర్డినెన్స్
న్యూఢిల్లీ: భూసేకరణపై మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తక్షణం రాజ్యసభను ప్రొరోగ్ చేయాలని శుక్రవారం సాయంత్రం సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేకపోవటం, విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయటం తప్ప ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన సీసీపీఏ సమావేశంలో మంత్రులు సుష్మాస్వరాజ్, మంత్రి వెంకయ్యనాయుడు, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరు కాకపోయినప్పటికీ ఆయన ఈ నిర్ణయాన్ని బలపరిచారు. డిసెంబర్ 31న జారీ చేసిన భూసేకరణల ఆర్డినెన్స్ కాలపరిమితి ఏప్రిల్ 5తో ముగియనుంది. అంతకంటే ముందే రాజ్యసభను ప్రొరోగ్ చేసి కొత్త ఆర్డినెన్స్ జారీ చేయాలని సీసీపీఏ సిఫార్సు చేసినట్లు వెంకయ్య విలేకరులకు తెలిపారు. అయితే ఎప్పటిలోగా జారీ చేస్తారో చెప్పలేదు ఫిబ్రవరి 23న ప్రారంభమైన బడ్జెట్ తొలి దశ సమావేశాలు మార్చి 20న ముగిశాయి. ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు మలిదశ సమావేశాలు జరుగనున్నాయి. భూసేకరణ బిల్లును తొలిదశ బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ ఆమోదించింది. విపక్షాలవ్యతిరేకతతో రాజ్యసభలో ప్రవేశపెట్టలేకపోయింది. రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల్లో ఏదో ఒక సభను ప్రొరోగ్ చేస్తే తప్ప ఆర్డినెన్స్‌ను తిరిగి జారీ చేసే అవకాశం ప్రభుత్వానికి లేదు. అందుకే రాజ్యసభను ప్రొరోగ్ చేయాలని నిర్ణయించారు. కొత్త ఆర్డినెన్స్‌లో 9 సవరణలు.. లోక్‌సభలో భూసేకరణ బిల్లును ఆమోదించినప్పుడు ప్రతిపాదించిన 9 సవరణలను కొత్త ఆర్డినెన్స్‌లో చేరుస్తారు. ఈ సవరణలకు కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. బిల్లును రాజ్యసభలో ఆమోదింపచేసుకోవటం కోసం 9 సవరణలతో పాటు మరిన్ని ప్రతిపాదనలతో మలిదశ సమావేశాల్లో రాజ్యసభ ముందుకు బిల్లును తీసుకురావటానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి ఆర్డినెన్స్‌లో తొలగించిన ‘భూసేకరణకు 80 శాతం రైతుల అనుమతి తప్పనిసరి’ అంశాన్ని కొద్ది మార్పులతో తిరిగి చేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అయితే దీన్ని 80 % కాకుండా 51%కి తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక ప్రభావ అంచనా స్థానంలో భూ ఒప్పందాలను పరిశీలించేందుకు నిపుణుల బృందాల ఏర్పాటును ఆర్డినెన్స్‌లో పొందుపరచాలని కేంద్రం యోచిస్తోంది. ప్రాజెక్టుకు అవసరానికి మించి భూమిని సేకరించారా, దాని వల్ల స్థానికులపై ప్రతికూల ప్రభావం ఏదైనా పడుతుందా అన్న అంశాలను బృందాలు పరిశీలిస్తాయి. -
మోదీకి అగ్నిపరీక్ష
భూసేకరణ చట్టం సవరణ బిల్లు భూకంపం సృష్టించడంలో ఆశ్చర్యం లేదు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన దేశంలో పరిశ్రమల కోసం, వాణిజ్యం కోసం వ్యవసాయ భూములు సేకరించడం అంత సులువు కాదు. భూసేకరణలో న్యాయమైన పరిహారం, పునరావాసంలో పారదర్శకతకు హామీ ఇచ్చే చట్టం (రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ లాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్, 2013) పూర్వపక్షం చేస్తూ మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ చట్టంలోని పదవ సెక్షన్‌ను సవరించడం ద్వారా రెండు ప్రధాన మైన రక్షణలను తొలగించడం అన్నదాతలలో అశాంతికి దారితీసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో నెలకొల్పే పరిశ్రమల కోసం, వాణిజ్య సంస్థల కోసం భూములు సేకరించే క్రమంలో డెబ్బయ్ శాతం మంది యజమానులు అంగీకరిస్తేనే భూమిని సేకరించాలన్న నిబంధనను తొలగించారు (ప్రైవేటు సంస్థలు సేకరించాలంటే ఎనభై శాతం మంది యజమానులు ఒప్పుకోవాలి). వాస్తవానికి భూమి సేకరించ డానికి ఉద్దేశించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే గ్రామసభలు నిర్వహించి వ్యవసాయదారుల ఆమోదం తీసుకోవాలి. పర్యావరణంపైన భూసేకరణ ప్రభావం ఎట్లా ఉంటుందో మదింపు (సోషల్ ఇంపాక్ట్ ఎసెస్మెంట్) చేసిన తర్వా తనే, పర్యావరణానికి ఏ మాత్రం ప్రమాదం లేనట్టు ధ్రువీకరించుకున్న అనంతరమే వ్యవసాయ భూమి సేకరించాలన్న నిబంధనను సైతం ఆర్డినెన్స్ నీరు గార్చింది. ఫలితంగా రైతుల ఇష్టానికి విరుద్ధంగా ప్రభుత్వం బలవంతంగానైనా భూమి సేకరించవచ్చునంటూ ఇచ్చిన ఆర్డినెన్స్ స్థానే చట్టం తీసుకురావడానికి బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టడం రాజకీయ సంక్షోభానికి దారితీస్తున్నది. యూపీఏ హయాంలో అవినీతికి వ్యతిరేకంగా జనలోక్‌పాల్ చట్టాన్ని తేవాలంటూ ఉద్యమించిన అన్నా హజారే తిరిగి జంతర్‌మంతర్‌లో ప్రత్యక్షమైనారు.. లోగడ యూపీఏ సర్కార్‌కు వ్యతిరేకంగా సాగిన అన్నా ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ శ్రేణులు బలపరి చాయి. ఇప్పుడు భూసేకరణ చట్టానికి తూట్లు పొడవడాన్ని విరోధిస్తూ అన్నా చేపట్టిన ఉద్యమానికి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నది. వాస్తవానికి భూసేకరణను కష్టతరం చేస్తూ, తమ భూములపైన వ్యవసాయదారులకు తిరుగులేని అధికారం ఇస్తూ చట్టం చేయడం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రమేయం ఉంది. ఆర్డినెన్స్ స్థానే బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో పార్లమెంటుకు హాజరు కాకుండా ‘సెలవు’పైన రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళినప్పటికీ భూసేకరణ చట్టాన్ని నీరు గార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రతిఘటిస్తోంది. అవినీతి వ్యతిరేక పోరాటంలో పట్టణ ప్రాంతాలలోని మధ్యతరగతి యువత ఆవేశపడి అన్నా ఉద్యమాన్ని హృదయ పూర్వకంగా సమర్థించింది. గ్రామీణ ప్రాంతా లకు చెందిన వ్యవసాయదారుల హక్కుల రక్షణ కోసం అదే అన్నా హజారే ఇప్పుడు ఉద్యమం చేసినా, పాదయాత్ర చేసినా మధ్యతరగతి ప్రజలు అంతగా స్పందిస్తారా అన్నది ప్రశ్న. ఎన్డీఏకు లోక్‌సభలో ఆధిక్యం ఉన్నప్పటికీ రాజ్యసభలో తగినంత బలం లేదు. కనుక లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో సవరణ బిల్లు వీగిపోవడం తథ్యం. ఎగువ సభ, దిగువ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి వివాదాస్పద మైన బిల్లులకు ఆమోదం పొందాలని నరేంద్రమోదీ ప్రభుత్వం తలబోస్తున్నట్టున్నది. అది ఎంతవరకూ సాధ్యమో చూడాలి. భూసేకరణ చట్టం సవరణకు ప్రతికూలత కేవలం ప్రతిపక్షాల నుంచి మాత్రమే కాదు. స్వపక్షంలోనూ ఈ సవరణలను ప్రతిఘ టిస్తున్న రైతుబాంధవులున్నారు. అన్నాహజారే దీక్షాప్రాంగణలో భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు కూడా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో రాజధాని నిర్మాణంకోసం భూసేకరణ చేయడంలో రైతుల అభీష్టాన్ని తుంగలో తొక్కుతున్న తెలుగుదేశం ప్రభుత్వంపైన మేథాపాట్కర్ నిప్పులు చెరిగారు. 2013నాటి చట్టం రూపకల్పనలో పాత్ర పోషించిన అరుణారాయ్ బిల్లును వ్యతిరేకిస్తు న్నారు. పార్లమెంటు సంయుక్త సభ నిర్వహించి లేదా ప్రతిపక్షాలను ఒప్పించి సవరణ బిల్లుకు ఆమోదం పొందినప్పటికీ సవరించిన చట్టాన్ని అమలు చేయడం కష్టం. 2013లో భూసేకరణ చట్టం తీసుకురావడంలో రాహుల్ గాంధీకీ, కాంగ్రెస్ పార్టీకీ రాజకీయ కారణాలు ఉండి ఉండవచ్చును కానీ వ్యవసాయ భూములను యథేచ్ఛగా పరిశ్రమలకూ, వ్యాపారాలకూ ధారాదత్తం చేసే రైతు వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకవలసిన అవసరం అప్పుడు దేశంలో ఉన్న మాట వాస్తవం. యూపీఏ సర్కార్ తెచ్చిన చట్టం రైతులకు పూర్తిగా అనుకూలమైనదీ, పరిశ్రమలకు వ్యతిరేకమైనదీ అయితే ఎన్డీఏ ప్రభుత్వం జారీ చేయించిన ఆర్డినెన్స్, దాని స్థానంలో ప్రవేశపెట్టిన బిల్లు రైతులకు పూర్తిగా వ్యతిరేకమైనదీ, పరిశ్రమలకు అనుకూలమైనదీ. రైతుల ప్రయోజనాలకూ, పారిశ్రామికీకరణకూ మధ్య వైరుధ్యం తలెత్తకుండా పాలకులు జాగ్రత్త వహించాలి. రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే సంపద సృష్టించడానికి అవసరమైన సదుపాయాలను పరిశ్రమలకూ, వాణిజ్య సంస్థలకూ కల్పించవలసిన అవసరం ఉన్నది. రైతు వ్యతిరేక ముద్ర వేయించుకున్న ప్రభుత్వం కానీ పేదల పట్ల సానుభూతి లేదని పేరు తెచ్చుకున్న ప్రభుత్వం కానీ ఈ దేశంలో ఎక్కువకాలం మనుగడ సాగించలేదు. ఆరేడేళ్ళ కిందట వ్యవసాయ భూము లను పరిశ్రమల కోసం స్వాధీనం చేసుకోవడంపైన వివాదం చెలరేగిన సమయంలో వామపక్షవాదిగా పేరు తెచ్చుకున్న నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ సైతం మధ్యేమార్గాన్ని సూచించారు. సంపద సృష్టి అవసరమే. వ్యవసాయదారుల ప్రయోజ నాలను కాపాడవలసిందే. ఇందుకోసం పట్టుదలకు పోకుండా సామరస్యంతో వ్యవ హరించి రాజీమార్గం కనుక్కోవాలి. ఆర్థిక సంస్కరణల అమలులో మోదీ సర్కార్ ఎదుర్కొంటున్న మొదటి గడ్డు సమస్య ఇది. -
భూ ఆర్డినెన్స్‌పై హజారే సమరం
జంతర్‌మంతర్ వద్ద రెండ్రోజుల దీక్ష సాక్షి, న్యూఢిల్లీ: రైతులకు అన్యాయం చేసే భూసేకరణ ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని గాంధేయవాది అన్నా హజారే డిమాండ్ చేశారు. ఆంగ్లేయుల హయాంలో కూడా రైతులకు ఇంతటి అన్యాయం జరగలేదని, వారి పాలనలో కంటే దారుణమైన ఆర్డినెన్సును మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ధ్వజమెత్తారు. ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకొని, భూసేకరణ చట్టం-2013లోనే రైతుకు మరింత మేలు చేకూర్చే అంశాలను జోడించి మంచి చట్టం తేవాలన్నారు. ఆర్డినెన్స్‌ను రద్దు చేయకుంటే మూడు, నాలుగు నెలలు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించి ఢిల్లీలోని రాంలీలా మైదానం నుంచి జైల్‌భరో కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. భూసేకరణపై ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆయన సోమవారం జంతర్ మంతర్ వద్ద రెండ్రోజుల నిరసన దీక్ష ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన రైతులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచీ రైతులకు ఎప్పుడూ ఇలాంటి అన్యాయం జరిగి ఉండకపోవచ్చు. ఈ అప్రజాస్వామ్యకమైన ఆర్డినెన్స్‌ను అమలు చేయడమంటే రైతుల భూమిని ప్రభుత్వం కబ్జా చేయడమే. బ్రిటిష్ పాలకులు కూడా మన రైతులకు ఇంత అన్యాయం ఎప్పుడూ చేయలేదు. అధికారంలో కాంగ్రెస్, విపక్షంలో మీరు(బీజేపీ) ఉండగా ఇద్దరూ కలిసి 2013లో భూసేకరణ చట్టాన్ని చేశారు. ఇప్పుడు మీ(బీజేపీ) ప్రభుత్వం ఏర్పడ్డాక అకస్మాత్తుగా ఈ ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది రైతులకు తీరని అన్యాయం చేయడమే’ అని అన్నారు. ‘ఎన్నికల ముందు మంచిరోజులు తెస్తామన్నారు. ప్రజలు నమ్మి ఓటేశారు. కానీ ఇప్పుడు నిర్భందంగా రైతుల భూములను పారిశ్రామికవేత్తలకిస్త్తున్నారు. మంచిరోజులు ప్రజలకు రాలేదు. కార్పొరేట్లకే వచ్చాయి’ అని అన్నారు. రెండో స్వతంత్ర పోరాటం.. ‘భారత్ గణతంత్ర దేశంగా ఆవిర్భవించాక ప్రజలే యజమానులని, ప్రభుత్వం సేవకుడని చెప్పారు. అయితే ప్రస్తుతం ఇది తలకిందులైంది. ఈ ఉద్యమాన్ని దేశంలోని ప్రతీ జిల్లాకు తీసుకువెళ్తా. ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం. వ్యవసాయ ఆధారిత దేశంలో రైతుల నుంచి వారి అనుమతి లేకుండా భూమిని ఎలా లాక్కుంటారు’ అని హజారే నిలదీశారు. రైతులకు జరగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనడానికి జైలుకెళ్లడానికీ సిద్ధమేనన్నారు. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ మాట్లాడుతూ... ప్రజలకు కావాల్సింది రాలేగావ్ సిద్ధినమూనా అని, గుజరాత్ నమూనాఅభివృద్ధి కాదన్నారు. అన్నాతో కేజ్రీవాల్ భేటీ.. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సాయంత్రం మహారాష్ట్ర సదన్‌లో అన్నా హజారేను కలుసుకున్నారు. ఇద్దరూ గంటపాటు చర్చించారు. అనంతరం కేజ్రీవాల్ సన్నిహితుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ... మంగళవారం మధ్యాహ్నం అరవింద్ కేజ్రీవాల్ కూడా అన్నా దీక్షలో కూర్చుంటారని తెలిపారు. -
ఆ విషయంలో మేం మారం.. అందుకు ఒప్పుకోం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు మద్దతిస్తాం కానీ భూసేకరణ సంబంధించిన ఆర్డినెన్స్ విషయంలో తమ వైఖరి మార్చుకోబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ మాత్రం మెతకగా వ్యవహరించలేమని తెలిపింది. సమావేశాల నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఆదివారం ఉదయం కలిశారు. సమావేశాలు సజావుగా సాగేందుకు తాము సహకరిస్తామని సోనియా చెప్పినట్లు తెలిపారు. అయితే, కాంగ్రెస్‌కే చెందిన ఆనంద్ శర్మ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ భూసేకరణ ఆర్డినెన్స్‌పై రాజీపడబోమన్నారు. బొగ్గు ఆర్డినెన్స్ విషయంలో కూడా వెనక్కి తగ్గబోమని చెప్పారు. చట్టసభల్లో అందరి ఆమోదంతో చేయాల్సిన చట్టాలను బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి వేరే మార్గం ద్వారా ఆమోదింప చేసుకోవాలని చూస్తోందని విమర్శించారు. భూసేకరణ ఆర్డినెన్స్ ముమ్మాటికీ రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నదేనని, దానికి తాము అంగీకరించబోమని చెప్పారు. -
‘భూ ఆర్డినెన్స్‌పై లోక్‌పాల్ తరహా ఉద్యమం’
ఫరీదాబాద్: భూసేకరణ ఆర్డినెన్స్‌పై లోక్‌పాల్ తరహా ఉద్యమం చేస్తామని సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు. ఈ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములవ్వాలని, అవవసరమైతే జైలుకూ వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఈ నెల 23, 24న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద హజారే దీక్ష చేపట్టనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఫరీదాబాద్ నుంచి ‘జల్-జంగిల్-జమీన్’ మార్చ్ టు ఢిల్లీని ఆయన ప్రారంభించారు. పంజాబ్, హరియాణా, యూపీ నుంచి 50వేల మందికి పైగా రైతులు ఈ దీక్షలో పాల్గొనబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అనుకున్నది సాధించేవరకు ఢిల్లీని వదలమని, ‘జైల్ భరో’నూ ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం పేద రైతుల భూములు లాక్కొని పారిశ్రామికవేత్తలకి అప్పగిస్తోందన్నారు. భూసేకరణ చట్ట సవరణలపై కేంద్రానికి వ్యతిరేకంగా హజారే చేపట్టనున్న నిరసనకు ఆయన కోరితే మద్దతిస్తామని ఆమ్ఆద్మీ పార్టీ ప్రకటించింది. -
‘భూ’ఆర్డినెన్స్‌పై నిరసనలు
న్యూఢిల్లీ: భూ సేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆర్డినెన్స్ అమానుషమైందని, రైతుల జీవితాల్ని, వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తుందని వామపక్ష రైతు సంఘాలు విమర్శించాయి. తాజా ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతామని సీపీఐ, సీపీఎంలకు చెందిన రైతు సంఘాలైన అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్) (రెండు పార్టీల సంఘాలకూ ఒకే పేరు) నేతలు హన్నామ్ మొల్లా, అతుల్ కుమార్ తెలిపారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాగా, ఆర్ఎస్ఎస్ ఆర్థిక విభాగమైన స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్జేఎం) కేంద్ర తాజా ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా గళమెత్తింది. దీన్ని అమలు చేసేముందు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. ప్రధానంగా యూపీఏ ప్రభుత్వం భూసేకరణచట్టంలో పొందుపరిచిన ఆహారభద్రతా ప్రమాణాలు, సామాజిక ప్రభా వ అంచనాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎస్జేఎం వ్యతిరేకించింది.