న్యూఢిల్లీ : భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చకు సిద్ధమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. కాగా లోక్ సభ బడ్జెట్ మలివిడత సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది.
తొలిరోజే వివాదాస్పదమైన భూసేకరణ ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశ పెట్టేందుకు మోదీ సర్కారు యోచిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వ, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలతో పరిస్థితి వేడెక్కింది. ఈ నేపథ్యంలో సభలో ఈ అంశంపై పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగే అవకాశం ఉంది.