నేడు లండన్‌కు స్పీకర్ కోడెల బృందం | Today Speaker group going on London | Sakshi
Sakshi News home page

నేడు లండన్‌కు స్పీకర్ కోడెల బృందం

Published Sat, Sep 5 2015 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

నేడు లండన్‌కు స్పీకర్ కోడెల బృందం

నేడు లండన్‌కు స్పీకర్ కోడెల బృందం

హైదరాబాద్: వాతావరణ మార్పులతో పాటు పర్యావరణ అంశాలపై జరిగే రౌండ్ టేబుల్ సమావే శంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు నేతృత్వంలోని బృందం ఆరు రోజుల పర్యటనకై శనివారం బ్రిటన్ రాజధాని లండన్‌కు వెళ్లనుంది. 

వాతావరణ మార్పుల వల్ల సమాజానికి జరుగుతున్న నష్టంపై చర్చించేందుకు నిర్వహించే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా బ్రిటిష్ హైకమిషన్ ఆహ్వానించింది. బ్రిటన్ ప్రభుత్వ ఇంధన, వాతావరణ మార్పుల శాఖ, యూకే కార్బన్ ట్రస్ట్ నిర్వహించే ఈ సమావేశంలో కోడెలతో పాటు రాష్ర్ట అటవీ పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శాసనసభ  ఇన్‌చార్జి క్యాదర్శి కె.సత్యనారాయణ, 8 మంది ఎంపీల బృందం పాల్గొననుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement