ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కోవిడ్ 19 మహమ్మారి ఎదుర్కున్న తీరులో విఫలమైన నేపథ్యంలో రాబోయే మహమ్మారి పట్ల మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలని భావిస్తూ, తనకు అధికారాలు కావాలని కోరుతోంది. ప్రపంచ దేశాలను నిర్దేశించడానికి తనకు అధికారాలు పెంచడానికి అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు (ఐహెచ్‌ఆర్), ప్రపంచ మహమ్మారి ఒప్పందం హెచ్‌ఈఆర్పీ గురించి తన సభ్య దేశాలతో చర్చల ప్రక్రియను ప్రారంభించింది. ఈ మూడు దారుల ద్వారా తన అధికారాలరను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ ఆరోగ్యం మీద తన గుత్తాధిపత్యం స్థాపించుకోవడానికి, కొనసాగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మే 2024 కల్లా పూర్తి కావాలని భావిస్తోంది. వీటి ద్వారా అన్ని దేశాలలో ఆరోగ్యంపై జాతీయ ప్రణాళికలను శాసించే విధంగా ఈ ఒప్పందాలను తయారు చేస్తున్నారు. ముసాయీదా ఒప్పందాల గురించి చర్చించడం ప్రారంభించారు. అయితే, ఇది కేవలం ఆరోగ్య రంగం కాకుండా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆహారం తదితర రంగాలకు కూడా తన ‘ప్రభావం’ విస్తరించే ప్రయత్నంలో డబ్ల్యూహెచ్‌ఓ ఉంది.
దీని వెనుక ఉన్న శక్తులు బిల్ గేట్స్, క్లాస్ శ్వాబ్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ) వంటి ప్రముఖులు ఉన్నారు. ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని, ఒక కొత్త ప్రాపంచిక వ్యవస్థను స్థాపించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. భారత దేశం కూడా ఈ చర్చలలో పాల్గొంటోంది. కానీ మన దేశంలో, పార్లమెంటులో దీనిపై చర్చ లేదు. కనీసం ప్రస్తావన కూడా చాల తక్కువ. పైగా చాలా మంది ప్రజలకు అసలు ఈ విషయం కూడా తెలియదు. ఈ విషయం మీద అవగాహన పెంచాల్సిన అవసరం మాత్రం ఉంది. భారత ప్రజాస్వామ్యాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఒక సమావేశం నిర్వహిస్తున్నారు అధికారులు.
రౌండ్ టేబుల్ సమావేశం : డబ్యూహెచ్‌ఓ ప్రపంచ మహమ్మారి ఒప్పందం (Global Pandemic Accord): దేశ సార్వభౌమత్వానికి , పౌరుల హక్కులకు పొంచి ఉన్న విపత్తు తేదీ : 09-08-2023
సమయం : ఉదయం 10 - 2 గంటలకు
ప్రదేశం : ఆడిటోరియం సెమినార్ హాల్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ & సోషల్ స్టడీస్ ( సెస్ ) బేగంపేట్, హైదరాబాద్
వక్తలు : ప్రొఫెసర్ కోదండరాం, డా. దొంతి నర్సింహ రెడ్డి, సరస్వతి కవుల ప్రెజెంటేషన్ తర్వాత ఓపెన్ ఫోరమ్ చర్చ.
(చదవండి: మళ్లీ మహమ్మారి కొత్త వేరియంట్ కలకలం..భయం గుప్పెట్లో దేశాలు!)
Comments
Please login to add a commentAdd a comment