సాక్షి, తిరుపతి : ‘‘కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు’’ అని, వైఎస్సార్ జిల్లాకు ఉక్కు పరిశ్రమ సాధనే ధ్యేయమని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు ఉద్ఘాటించాయి. శుక్రవారం ‘కడప ఉక్కు పరిశ్రమ సాధన’ అంశంపై తిరుపతిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వామపక్షాలతోపాటు పలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. రానున్న రోజుల్లో అందరిని కలుపుకుని ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ఐక్యవేదిక ప్రకటించింది.
కేంద్రం తీరని అన్యాయం చేసింది
కడప : ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం తీరని అన్యాయం చేసిందని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పి. రామసుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం వైఎస్సార్ కడప జిల్లాలో అఖిలపక్షం చేపట్టిన ఉక్కు ఉద్యమానికి ఏపీయూడబ్ల్యూజే తరపున ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖిలపక్షం చేపట్టే ప్రతి ఆందోళనలో పాల్గొంటామన్నారు. జర్నలిస్టు యూనియన్‌గా జిల్లా ప్రజలకు అండగా ఉంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment