బెంగళూరు: ప్రెస్‌క్లబ్‌లో తాను మాట్లాడిన విషయాలను వక్రీకరించి మీడియాలో ప్రసారం చేశారంటూ నటుడు ప్రకాశ్‌రాజ్ తాజాగా బెంగళూరు ప్రెస్‌క్లబ్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. విలేకరుల ఆహ్వానం మేరకు ప్రకాశ్‌రాజ్ ఆదివారం బెంగళూరుకు వచ్చి పలు విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించడం తెలిసిందే. సినీనటులు రాజకీయాల్లోకి రావడం దౌర్భాగ్యమనీ, వారికి ఓటేయ్యొద్దని తాను ప్రచారం చేస్తాననీ ప్రకాశ్‌రాజ్ అన్నట్లు ఆ రోజున టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి.
అటు తమిళనాడులో కమల్‌హాసన్, రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతుండటం, ఇటు కర్ణాటకలో ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ప్రకాశ్‌రాజ్ వివరణ ఇస్తూ, తాను అసలు అలా మాట్లాడలేదనీ, విలేకరులందరూ అక్కడ ఉండగానే, ప్రెస్‌క్లబ్ సాక్షిగా తన మాటల్ని ఇంతలా వక్రీకరించడం దారుణమని అన్నారు. ఈ తప్పును సరిదిద్దేందుకు ప్రెస్‌క్లబ్ ఏం చర్య తీసుకుంటుందోనని తాను ఎదురు చూస్తున్నాననీ, తనకు తగిన సమాధానం లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment