రామన్నకు తిలకం దిద్దుతున్న పుష్పలత
ఆదిలాబాద్‌టౌన్/ఎదులాపురం: ఆదిలాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి జోగురామన్న గెలుపును ఆకాంక్షిస్తూ ముదిరాజ్ సంఘం రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పుష్పలత ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్‌లోని ఉజ్జయిని మాతా ఆలయం నుంచి తీసుకొచ్చిన కుంకుమను శుక్రవారం ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న నివాసంలో ఆయనను కలిసి తిలకం దిద్దారు. ఈ ఎన్నికల్లో కారు జోరుగా దూసుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు శివయ్య, మహిళ నాయకులు తదితరులు ఉన్నారు.
అభివృద్దే టీఆర్‌ఎస్‌ను గెలుపిస్తుంది
ఎదులాపురం: టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మళ్లీ ఆ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాయని ముదిరాజ్ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పుష్పలత ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమంకోసం టీఆర్‌ఎస్ చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్ నాలుగేళ్లలో చేసి చూపిందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సలేందర్ శివయ్య ముదిరాజ్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షరాలు శకుంతల ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, షాద్‌నగర్ టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు ప్రేమకళ ముదిరాజ్, మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు గోదావరి, అనిత, సరోజ, లస్మన్న, దారవేణి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment