
రేపు ముస్లిం మైనార్టీల ర్యాలీ
ముస్లిం మతాచారాలు, చట్టాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ ముస్లిం మైనార్టీ సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ, అవగాహన ర్యాలీ ఏర్పాటుచేశామని సామాజిక కార్యకర్త ఫారూఖ్ షుబ్లీ తెలిపారు.
విజయవాడ (గాంధీనగర్) : ముస్లిం మతాచారాలు, చట్టాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ ముస్లిం మైనార్టీ సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ, అవగాహన ర్యాలీ ఏర్పాటుచేశామని సామాజిక కార్యకర్త ఫారూఖ్ షుబ్లీ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ర్యాలీ పంజా సెంటర్ నుంచి చిట్టినగర్‌లోని మోతీమస్జిద్ వరకు జరుగుతుందన్నారు. ముస్లిం పర్సనల్ లా విషయంలో కేంద్రప్రభుత్వ జోక్యం సహించేది లేదని చెప్పారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం నగర అ«ధ్యక్షుడు గౌస్‌మొహిద్దీన్, కో–ఆప్షన్ సభ్యుడు ఫతావుల్లా, నజీర్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు సలీం ఫర్వేజ్, అహలె సున్నత్ జమాత్ ప్రతినిధి అబ్దుల్ రహీం, అహలె హదీస్ జమాత్ నగర అధ్యక్షులు అతీఖుర్ రెహ్మాన్, ముఫ్తి సయ్యద్ పాల్గొన్నారు.