
న్యూఢిల్లీ/అమరావతి: అమరావతిలో భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ వివరాలను మీడియా ప్రచురించకూడదన్న ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఈ విషయం గురించి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆనంద్ సహాయ్ గురువారం సాక్షి టీవీతో మాట్లాడారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. నేర న్యాయ వ్యవస్థ(క్రిమినల్ జస్టిస్ సిస్టం)లో తొలి మెట్టు ఎఫ్ఐఆర్ అని, ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఎఫ్‌ఆర్‌పైను రిపోర్టు చేయకూడదని చెప్పడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.(చదవండి: ఈ తీర్పును పునఃసమీక్షించాల్సిందే)
హైకోర్టు ఉత్తర్వులు ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఉన్నాయని, బలమైన శక్తుల పేర్లు ఎఫ్ఐఆర్‌లో ఉండటం వల్లే ఇలా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అసలు విచారణ జరిగితేనే నిజానిజాలు పాలూ, నీళ్లలా తేలిపోతాయని, అలాంటప్పుడు దర్యాప్తునకు అడ్డుపడటం ఎందుకు అని ఆనంద్ సహాయ్ ప్రశ్నించారు. ఇలా మీడియా గొంతును నొక్కడం ప్రజాస్వామ్యాన్ని హరించడమేనన్నారు. హైకోర్టు తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. (చదవండి: హైకోర్టు ఉత్తర్వులు: కారణాలు సహేతుకంగా లేవు!)
Comments
Please login to add a commentAdd a comment