ఉరవకొండ, న్యూస్‌లైన్ : టాస్క్‌ఫోర్‌స ఎస్‌ఐ రాగిరి రామయ్య, సిబ్బంది నుంచి తమకు ప్రాణహాని ఉందని గుంతకల్లుకు చెందిన పెరవలి రాజేష్‌చౌదరి, పత్రాల సురేష్, నారాయణ ఆరోపించారు. ఆదివారం గుంతకల్లులోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేష్‌చౌదరి మాట్లాడుతూ.. టాస్క్‌ఫోర్‌స పోలీసుల ఆగడాలను ఈ నెల 8వ తేదీ తర్వాత సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు.
అలాగే వారి నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. మే 13న తాను వ్యాపారానికి సంబంధించిన రూ.3 లక్షల నగదును నారాయణ వద్ద ఉంచానన్నారు. అదే నెల 15న ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ వేస్తున్నామంటూ తనతో పాటు మరో నలుగురిని ఎస్‌ఐ రాగిరి రామయ్య, వారి సిబ్బంది అరెస్ట్ చేశారన్నారు. నారాయణ వద్ద ఉన్న రూ.3 లక్షలతో పాటు, మిగతా వారి వద్ద ఉన్న రూ.12 లక్షలు బలవంతంగా లాక్కున్నారన్నారు. అయితే తమను అరెస్ట్ చేసి.. రూ.11.17 లక్షలు మాత్రమే పట్టుకున్నట్లు మీడియాకు చూపారని ఆరోపించారు.
మిగతా సొమ్ము ఏమైందో టాస్క్‌ఫోర్‌స పోలీసులే చెప్పాలన్నారు. పత్రాల సురేష్ వూట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అరుుతే టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ ఫోన్ చేసి ‘నీవు బెట్టింగ్ ఆడుతున్నట్లు ఒప్పకోకపోతే బట్టలూడదీసి కొట్టుకుంటుపోతా.. వెంటనే రూ.2 లక్షలు ఇవ్వు’ అని డివూండ్ చేసినట్లు ఆరోపించారు. ఎస్‌ఐ అండదండలతో కానిస్టేబుల్స్ వురింత రెచ్చిపోరుు ఇంట్లోకి చొరబడి తీవ్ర పదజాలంతో వూట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ నుంచి మాకు ప్రాణహాని
Published Mon, Jun 2 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM
Advertisement
Advertisement