భ్రూణ హత్యల నివారణకు సేవ్ గర్ల్ చైల్డ్ అంశంపై అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించనున్నట్టు వుమెన్....
డాబాగార్డెన్స్: భ్రూణ హత్యల నివారణకు సేవ్ గర్ల్ చైల్డ్ అంశంపై అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించనున్నట్టు వుమెన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధి లతా చౌదరి తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆడపిల్లలు లేకపోతే సమాజమే ఉండదన్నారు. లింగ నిర్థారణ పరీక్షలను చట్టబద్ధం చేయాలని, లింగ నిర్థారణ పరీక్షలలో ఆడపిల్ల అని తేలితే అప్పటి నుంచి ఆ గర్భస్త శిశువు బాధ్యతను, కాన్పు అయ్యేవరకు తల్లీ, బిడ్డా బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. సేవ్‌గర్ల్‌చైల్డ్ పేరిట నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్‌లు ఎనిమిది నిమిషాల వ్యవధిలో ఉండాలని, జూలై 30వ తేదీలోగా హెచ్‌డీ క్వాలిటీ, 1920 పిక్స్ అండ్ ఎంపీ-4తో అందజేయాలన్నారు.
పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలతోపాటు మూడు కన్సొలేషన్ బహుమతులు అందజేయనున్నట్టు చెప్పారు. మరిన్ని వివరాలకు (email address) orldwomenera@gmail.com(website)www.wwsoindia.org ఇంటినెంబరు 402, ఐదో అంతస్తు, సాయినాథ్ ద్వారకామాయి అపార్ట్‌మెంట్, నిజాంపేట్, హైదరాబాద్-90 చిరునామాకు పంపాలని లేదా 9989576755, 9866516741 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.