Telangana News: అధికారమదంతోనే.. 'సాక్షి విలేకరి'పై దాడి!
Sakshi News home page

అధికారమదంతోనే.. 'సాక్షి విలేకరి'పై దాడి!

Published Thu, Sep 21 2023 4:32 AM | Last Updated on Thu, Sep 21 2023 9:03 AM

- - Sakshi

సంగారెడ్డి: అల్లాదుర్గం సాక్షి విలేకరి వీరేందర్‌పై దాడి చేసిన ఎంపీపీ అనిల్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని దౌల్తాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ అండతోనే ఎంపీపీ అనిల్‌రెడ్డి దాడి చేశారన్నారు. పోలీసులు ఎంపీపీపై చర్యలు తీసుకోకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళ చేస్తామని హెచ్చారించారు. కార్యక్రమంలో దౌల్తాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రెస్‌క్లబ్‌ సభ్యులు శంభులింగం, సంతోష్‌, నగేష్‌, బాబు, భాస్కర్‌ గౌడ్‌, యాదగిరి, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అల్లాదుర్గం సాక్షి విలేకరి వీరేందర్‌పై ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మెదక్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు దొంతి నరేశ్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్సింహచారి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రియాజ్‌ పేర్కొన్నారు. బుధవారం మెదక్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలికితీసే జర్నలిస్టును అధికారమదంతో దాడికి పాల్పడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.

అందిన సమాచారాన్ని బట్టి వార్తలు రాస్తే దుర్భాషలాడుతారా అని ప్రశ్నించారు. ఒకవేళ వార్తలో తప్పుంటే ఖండించాల్సిందిపోయి భౌతిక దాడులకు దిగడం సరైందికాదన్నారు. చంటి క్రాంతికిరణ్‌ జర్నలిస్టు నాయకుడిగా ఉండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినా నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యా నించారు. ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపాలన్నారు. లేకుంటే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మెదక్‌ ప్రెస్‌క్లబ్‌ నాయకులు రాజశేఖర్‌, బీవీకే రాజు,ప్రకాష్‌, చింతల రమేశ్‌, రహమత్‌, చంద్రశేఖర్‌ గౌడ్‌, మువ్వ నవీన్‌, శ్రీని వాస్‌చారి, లక్ష్మీనారాయణ, కార్తీక్‌, రఘు, దుర్గేష్‌, నర్సింలు, వంశీ ,శ్రీకాంత్‌, నవీన్‌రెడ్డి, ఊశ య్య, కృష్ణమూర్తి, సాయిలు, హమీద్‌ పాల్గొన్నారు.

టేక్మాల్‌లో ర్యాలీ..
అల్లాదుర్గం విలేకరిపై దాడిని ఖండిస్తూ బుధవారం టేక్మాల్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నల్లాబడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎంపీపీ అనిల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తహసీల్దార్‌ మల్లయ్యకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. అధికారమదంతో జర్నలిస్టులపై దాడులు చేయడం అమానుషమన్నారు. కార్యక్రమంలో టేక్మాల్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు బాగయ్య, సీనియర్‌ పాత్రికేయులు ఆనంద్‌, మహేదర్‌రెడ్డి, బీరప్ప, నర్సింలు, పులిరాజు, ధనుంజయ, రాజు, రమేష్‌, నాయికోటి రాజు, సాయిలు, ప్రేమ్‌కుమార్‌, నరేందర్‌, రాము, అశోక్‌, కుమార్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

అల్లాదుర్గంలో..
జర్నలిస్టులపై అధికార పార్టీ నాయకుల దాడులు సహించేది లేదని కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు బలరాం, బీజేపీ జిల్లా నాయకుడు బ్రహ్మం హెచ్చరించారు. బుధవారం తహసీల్దార్‌ సతీశ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. అల్లాదుర్గం ఎంపీపీ అనిల్‌ కుమార్‌ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

నాలుగున్నరేళ్లుగా ఎంపీపీగా ఉన్న మీరు అల్లాదుర్గంకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దుర్గయ్య, వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నరేష్‌ నాయకులు సదానందం,, కేశనాయక్‌, వంకిడి రాములు, సాయిబాబా, వీరబోయిన సాయిలు, ముసిరిగారి శ్రీను, నితీశ్‌, లక్ష్మణ్‌, రాజు ఉన్నారు.

ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు..
అల్లాదుర్గం సాక్షి విలేకరి వీరేందర్‌పై దాడి చేసిన ఎంపీపీ అనిల్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్‌ ప్రెస్‌క్లబ్‌ గౌరవ అధ్యక్షుడు అలీం బుధవారం డిమా ండ్‌ చేశారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోని దాడులకు పాల్పడడం అప్రజాస్వామ్యమన్నారు. జర్నలిస్టుపై దాడులు చేయడం.. బెదిరించడం రాజకీయ నాయకులకు ఫ్యాషన్‌గా మారిందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement