న్యూఢిల్లీ: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీ–2023లో భారత్ 11 స్థానాలు దిగజారింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా బుధవారం విడుదల చేసిన నివేదికలో 161వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. 180 దేశాల్లో పత్రికారంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల ఆధారంగా ఇచ్చే ఈ ర్యాంకుల్లో గతేడాది భారత్ 150వ స్థానంలో నిలిచింది.
దీనిపై పత్రికా సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ‘భారత్ సహా పలు దేశాల్లో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కల్గుతోందని స్పష్టమవుతోంది. మీడియా క్రియాశీలక పాత్ర పోషించలేకపోవడం దారుణం’’ అని ది ఇండియన్ విమెన్స్ ప్రెస్ కోర్స్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment