breaking news
press freedom
-
భావ ప్రకటన స్వేచ్ఛను బంధిస్తారా?
పత్రికా స్వేచ్ఛకు సంబంధించి భారత రాజ్యాంగంలో ప్రత్యేకించి ప్రస్తావించక పోయినప్పటికీ, 19(1)(ఎ) అధికరణం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను పొందుపరిచారు. తద్వారా పాత్రికేయులు, రచ యితలు, కవులు, కళాకారులు, సృజనాత్మక నిపుణులు తమ భావా లను నిర్ద్వంద్వంగా స్పష్టం చేసే హక్కులు పొందారు. ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తున్నప్పటికీ సహేతుకమైన విమర్శ లను సాదరంగా ఆహ్వానించాల్సిందే. అర్థవంతమైన సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీతనం వహించాలి. పత్రికలు సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారధిగా నిలబడాలి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేర వేయాలి. మీడియా ప్రచురించిన వార్తల్లో వాస్తవాలను గ్రహించి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పాలనలో దిద్దుబాట్లకు శ్రీకారం చుట్టాలి. అంతేగానీ తాము చేసేదంతా మంచేననీ, దాన్నెవరూ ప్రశ్నించకూడదనీ ప్రభుత్వాలు భావిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన విస్తుగొలిపేలా ఉంది. ‘ఫలానా ప్రమోషన్లలో అవినీతి జరిగిందని’ ఎవరో మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘సాక్షి’ పత్రిక రాసిన వార్త మీద పోలీసులు కేసు నమోదు చేయడం; ఎడిటర్, రిపోర్టర్లకు పోలీసులు నోటీసులు జారీ చేసి పోలీసు స్టేషన్లో ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి సహేతుకమైన సంకేతం. ఎడిటర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం నిర్ద్వంద్వంగా నియంతృత్వ పోకడే. ప్రతిష్ఠాత్మక ‘ఇండియా టుడే’ మీడియా గ్రూపు కన్సల్టెంట్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ సైతం ఈ చర్యల పట్ల ధర్మాగ్రహం వ్యక్తం చేశారంటే సమస్య తీవ్రత ఎంతటిదో అర్థమ వుతుంది. ‘పీ4 పథకం ముఖ్య నేత పిచ్చికి పరాకాష్ట’ అనీ, ‘ఎమ్మెల్యేలు అందరూ అవినీతి పరులే’ననీ రాసిన పత్రిక మీద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే సదరు పత్రిక రాసి నవి వాస్తవాలని ప్రభుత్వం ఒప్పుకున్నట్టేనా? మరెందుకు కొన్ని పత్రికల పట్ల పక్షపాత వైఖరి?నిస్సందేహంగా మీడియాకు ‘లక్ష్మణ రేఖ‘ అవసరమే. అయితే ఇది స్వీయ నియంత్రణ రేఖ కావాలే కానీ, భావప్రకటన కుత్తుక మీద కత్తిలా ఉండకూడదు. మీడియాను బందిఖానాలో ఉంచాలను కుంటే రౌడీలు రాజ్యమేలతారు. అది మరింత ప్రమాదకరం!– ప్రొ‘‘ పీటా బాబీవర్ధన్జర్నలిజం విభాగ పూర్వాధిపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం -
భావ ప్రకటన స్వేచ్ఛపై దాడే
సాక్షి, అమరావతి: ప్రభుత్వ తప్పిదాలు, వైఫల్యాలను ప్రజల పక్షాన ఎండగడుతున్న ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ సర్కారు వరుసగా కేసులు బనాయించడం భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేయడమేనని ‘ఇండియా టుడే’ గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ తీవ్రంగా ఖండించారు. విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలపై వార్తను ప్రచురించినందుకు ‘సాక్షి’పై కేసులు నమోదు చేయడం, అదే వార్తను ప్రచురించిన మిగతా పత్రికలు, చానళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ కోసం ‘సాక్షి’కి అండగా నిలబడతామని ప్రకటించారు. అది ప్రాథమిక హక్కు..రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూ రాజ్‌దీప్ సర్దేశాయ్ ‘సాక్షి’తో మాట్లాడారు. భావ ప్రకటన స్వేచ్ఛ వరి్ధల్లితేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని విశ్వసిస్తూ రాజ్యాంగ నిర్మాతలు ఆరి్టకల్ 19(1)ఏ ద్వారా ప్రాథమిక హక్కుగా కల్పించారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి పత్రికా రంగం అవిరళ కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల పక్షాన ‘సాక్షి’ నిలదీస్తూ కథనాలు ప్రచురిస్తోందన్నారు. ‘సాక్షి’ ప్రచురించే వార్తా కథనాలపై ప్రభుత్వానికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ఖండిస్తూ వివరణ ఇవ్వాలని, అప్పటికీ సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుల్లో పరువు నష్టం దావా వేయవచ్చన్నారు. అంతేగానీ ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, విచారణ పేరుతో ఆయన ఇంట్లో సోదాలు చేయడం, పోలీసు స్టేషన్లకు రప్పించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా ఈ రీతిలో పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తున్న దాఖలాలు లేవన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలిస్తే క్రిమినల్ చట్టాలను పోలీసులు దురి్వనియోగం చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు తమ బాధ్యతకు కట్టుబడి ఉండాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం, పత్రికా స్వేచ్ఛ వికాసానికి ‘సాక్షి’కి అండగా నిలుస్తామని ప్రకటించారు. -
‘సాక్షి’పై కక్ష... పత్రికా స్వేచ్ఛపై దాడే!
సాక్షి, న్యూఢిల్లీ: ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఈ ధోరణి పత్రికా స్వేచ్ఛపై దాడి అని ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రపు హక్కును అణచివేయడానికి ఏపీ ప్రభుత్వం క్రిమినల్ చట్టాలను ఆయుధంగా వాడుకుంటోందనేందుకు ఇది ఒక నిలువెత్తు నిదర్శనం అని అభిప్రాయపడింది. అధికారంలో ఉన్నవారికి అసౌకర్యం కలిగించే వార్తలు రాసినందుకు దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై ఒకటికి రెండు కేసులు నమోదు చేసే ఆందోళనకర సంస్కృతి కొనసాగుతోందని పేర్కొంది.‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై కేసుల నమోదు కూడా ఇందులో భాగమేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ లహిరి, ప్రధాన కార్యదర్శి నీరజ్ ఠాకూర్ సోమవారం ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు. ‘‘సాధారణ వార్తలు రాసినందుకే ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై కేసులు బనాయించి, వ్యవస్థాగతంగా వేధిస్తున్నారు.ఏపీలోని వేర్వేరు జిల్లాల్లో భారతీయ న్యాయ సంహిత కింద 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ప్రతిపక్ష పార్టీ నేత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తను ప్రచురించినందుకే రెండు స్టేషన్లలో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అదే వార్తను ఇతర పత్రికలు, మీడియా సంస్థలు సైతం ఇచ్చాయి. కేవలం ‘సాక్షి‘ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని వేధించడం కక్షసాధింపు అని స్పష్టంగా కనిపిస్తోంది. ఎఫ్ఐఆర్లను పరిశీలించిన తర్వాత, పత్రిక సంపాదకవర్గంపై క్రిమినల్ చట్టాలను అసంబద్ధంగా, ఎంపిక చేసినట్లుగా ప్రయోగించారని అర్థమవుతోంది’’ అని తెలిపారు. ⇒ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్లో ‘సాక్షి’ జర్నలిస్టులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడాన్ని గమనించామని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వార్తలు రాసిన జర్నలిస్టులను వేధించకుండా... పోలీసులను కట్టడి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది. సంపాదకీయపరమైన వివాదాలను సివిల్ చట్టాల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ, క్రిమినల్ చట్టాల ద్వారా కాదని తాము విశ్వసిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. -
ప్రజాస్వామ్య పునాదులపై దాడి
సాక్షి, న్యూఢిల్లీ: జర్నలిస్టులు, మీడియా సంస్థలపై పెరుగుతున్న దాడులను ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) తీవ్రంగా ఖండించింది. ‘సాక్షి’మీడియా సంస్థ, వారి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, వేధింపులపై ఐఎన్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు ఐఎన్ఎస్ అధ్యక్షుడు ఎం.వి. శ్రేయామ్స్ కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పత్రికా రంగంపై జరుగుతున్న ఈ దాడులను ప్రజాస్వామ్య పునాదులు, పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఐఎన్ఎస్ అభివర్ణించింది. ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’జర్నలిస్టులపై పలుమార్లు దాడులు జరగడంతో పాటు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వారిపై అక్రమ కేసులు బనాయించి, విచారణల పేరుతో వేధిస్తున్నారని ఐఎన్ఎస్ దృష్టికి వచ్చిందన్నారు. మీడియా కార్యాలయాలు, సాక్షి ఎడిటర్ నివాసంలో సోదాలు నిర్వహించడం వంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. స్వతంత్ర జర్నలిజాన్ని అణచివేసే ధోరణి.. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కే ఇలాంటి చర్యలను సొసైటీ తీవ్రంగా ఖండిస్తోందని ఐఎన్ఎస్ తెలిపింది. ఈ దాడులు స్వతంత్ర జర్నలిజాన్ని అణచివేసే ఒక ఆందోళనకరమైన ధోరణిలో భాగమని శ్రేయామ్స్ కుమార్ అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులు ఎలాంటి భయం, బెదిరింపులు, హింసకు గురికాకుండా తమ వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించగలగాలని సూచించింది. దేశంలో పత్రికా రంగం శత్రువు కాదని.. ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని బలోపేతం చేసే మిత్రపక్షమని ఐఎన్ఎస్ పేర్కొంది. మీడియా ప్రతినిధులకు భద్రత కల్పించాలి.. ఇక ఈ దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, మీడియా ప్రతినిధుల రక్షణకు తగిన చట్టపరమైన భద్రత కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఐఎన్ఎస్ డిమాండ్ చేసింది. బెదిరింపులు, హింసను ఎదుర్కొంటున్న జర్నలిస్టులు, మీడియా సంస్థలకు తాము అండగా నిలుస్తామని సొసైటీ పునరుద్ఘాటించింది. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఐఎన్ఎస్ సెక్రటరీ జనరల్ మేరీ పాల్ కూడా తెలిపారు. -
‘సాక్షి’పై అక్రమ కేసులు ఉపసంహరించాలి
సాక్షి జర్నలిస్ట్‌లపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించాలని ఢిల్లీ టీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా స్వేచ్ఛను కాపాడలని పేర్కొంది. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించాలని ఓ ప్రకటన విడుదల చేసింది.‘ప్రజాస్వామ్యంలో వేధింపులు, అక్రమ కేసులకు తావులేదు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పోలీస్ కేసులు, విచారణ పేరుతో నోటీసులు ఏ మాత్రం సరికాదు. ఆంధ్రప్రదేశ్‌లో తమకు వ్యతిరేక వార్తలు రాస్తున్నారన్న నెపంతో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి సహా మరికొంత జర్నలిస్టులపై పోలీస్ కేసులు నమోదు చేసి, విచారణ కోసం పోలీస్స్టేషన్లకు రమ్మని గంటల తరబడి విచారిస్తూ,వేధింపులకు గురి చేయటం ఏ మాత్రం సమ్మతం కాదు. ముఖ్యంగా ఒక నాయకుడు పెట్టిన ప్రెస్మీట్పెట్టిన వార్తను ప్రచురించినందుకు ఎడిటర్ సహా, రాసిన విలేకరిపై క్రిమినల్కేసు నమోదు చేయటం విచారకరం. వాస్తవాలకు భిన్నంగా వార్తలు వస్తే, వాటిని తిరిగి ప్రచురించమని, తమ వాదనలు కూడా వేయాలని కోరే హక్కు ప్రభుత్వంతో పాటు అందరికీ ఉంది. కానీ వివరణలు ఇవ్వకుండా జర్నలిస్టులను బెదిరించే ధోరణిలో పోలీస్‌కేసులు నమోదు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సుప్రీంకోర్టు సైతం అనేక సందర్భాల్లో భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించాలని పదేపదే హితువు పలికింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం పునరాలోచన చేసి పోలీస్ కేసులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాము’ అని ఢిల్లీ టీయూడబ్యూజే అధ్యక్షులు నాగిళ్ల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గోపీకృష్ణ, కోశాధికారి కొన్నోజు రాజులు ప్రకటనలో పేర్కొన్నారు. -
పత్రికల స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్య రక్షణకు పెను విఘాతం
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీల గళాన్ని వినిపిస్తున్న పత్రికలపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు ధోరణిపై ప్రజా సంఘాల నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వినిపించడమే ప్రతిపక్ష పార్టీల కర్తవ్యమని, పత్రికలు, మీడియా బాధ్యత కూడా ఇదేనన్నారు. కానీ ప్రజా సమస్యలను వినిపించుకోకుండా ఏకపక్షంగా గొంతు నొక్కే ప్రయత్నం ప్రజా క్షేత్రంలో చెల్లుబాటు కాదని హెచ్చరించారు. సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు.పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబమే పత్రికా స్వేచ్ఛ. సామాజిక మాధ్యమాల యుగంలో ప్రెస్‌మీట్‌ను వక్రీకరించకుండా యథాతథంగా ప్రచురించడం సంపాదకుడి బాధ్యత. సాక్షి ఎడిటర్‌గా తన విద్యుక్త ధర్మాన్ని పాటించిన ఆర్.ధనంజయరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం సరైన చర్య కాదు. ఫిర్యాదులోని అంశాల్లో ఆధారాలు పరిశీలించకుండా కేసులు నమోదు చేయడం సరికాదు. పత్రికా సంప్రదాయాలు, విలువలు కాపాడేలా ప్రభుత్వం, అధికారులు వ్యవహరించాలి. నేతలు తమ పార్టీ విధానాలను వెల్లడిస్తే, వాటి ఆధారంగా ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం సరికాదు. – కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అఎడిటర్పై కేసులు పెట్టే సంస్కృతి ఏమిటి? విలేకరుల సమావేశంలో ఒక నాయకుడు మాట్లాడిన అంశాలను పత్రికలో ప్రచురిస్తే.. పత్రిక సంపాదకునిపై ఏకంగా కేసు నమోదు చేయడం ఏమిటి? ఇదెక్కడ న్యాయం? ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా, అందులో పనిచేసే వారిని, ఎడిటర్ ధనంజయరెడ్డిని వేధించేలా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిపై కేసు పెట్టొచ్చు కానీ... అది ప్రచురించిన సంపాదకునిపై కేసు పెట్టడం అధికార దుర్వినియోగమే. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుంది. ధనంజయరెడ్డిపై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి. తన విధిని నిర్వర్తిస్తున్న సంపాదకునిపై కేసులు పెట్టే సంస్కృతికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకాలి. – టి.హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం పత్రికా స్వేచ్ఛ మన ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభం. కానీ తరచుగా పత్రికలు, జర్నలిస్టులపై, చివరకు ఎడిటర్లపైనా దూషణలతోపాటు భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక మీడియా సమావేశాన్ని ప్రచురించినందుకు సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయడం కూడా ఇలాంటి కోవలోనికి వస్తుంది. విమర్శ హేతుబద్ధం కానప్పుడు, విమర్శ చేసినఅ∙వారిపై చట్టబద్ధ చర్య తీసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఈ విషయంపై పత్రిక సంపాదకునిపై కేసు పెట్టడం కక్ష సాధింపు చర్యనే. దీనిని ఖండిస్తూ ఎడిటర్, ఇతర జర్నలిస్టులపైన నమోదు చేసిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై ఎడిటర్ గిల్డ్ స్పందించాలని కోరుతున్నా. – విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలుఇది కక్షసాధింపు ధోరణే తెలుగు రాష్ట్రాల్లో పాలక పక్షాలు.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతిపక్షాల గొంతును వినిపిస్తున్న మీడియాపైనా కక్షసాధింపు ధోరణి కనిపిస్తోంది. కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి పెరగడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ ఆలోచన విధానం నుంచి ప్రభుత్వాలు బయటకు రావాలి. ప్రతిపక్షాల పాత్రను అణఅచివేయడం వారి స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదం. – సంధ్య, పీఓడబ్ల్యూ నేతమీడియాపై కేసులు సరికాదు ఉద్దేశ పూర్వకంగా మీడియాపై కేసులు పెట్టడం సరికాదు. మీడియాలో కేవలం పాలక పక్షం వార్తలే కాదు. ప్రతిపక్షం వార్తలు కూడా వస్తాయి. ప్రతిపక్ష పార్టీల వార్తలు రాసినందుకు మీడియాపై కేసులు నమోదు చేయడమంటే జర్నలిజంపైన దాడి చేయడమే. ఇది పూర్తిగా అక్రమం. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు సరికాకపోతే వాస్తవాలను వెల్లడించి రాజకీయ పోరాటం చేయాలి కానీ కేసులు పెట్టకూడదు. – ఎస్ఎల్ పద్మ, ప్రజాపంథ -
‘సాక్షి’పై కొనసాగుతున్న కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న సాక్షి పత్రికపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. అక్రమ కేసులు, విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో పోలీసు అధికారులకు పదోన్నతులు కల్పించలేదని ప్రచురించిన కథనంపై నమోదు చేసిన అక్రమ కేసులో సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, మరో ఇద్దరు పాత్రికేయులు తాడేపల్లి పోలీసుల ఎదుట గురువారం విచారణకు హాజరయ్యారు. పోలీసులు విచారణ పేరుతో మూడు గంటలపాటు వేచి ఉండేలా చేశారు.పాత్రికేయ ప్రమాణాలు, విలువలకు విరుద్ధంగా ప్రశ్నలు సంధించడం విస్మయ పరిచింది. బాధితుల వివరాలు వెల్లడించాలని, సంస్థ నిర్వహణకు సంబంధించిన అంతర్గత అంశాలు బహిర్గతం చేయాలని పట్టుబట్టడం గమనార్హం. రాజ్యాంగ నిబంధనలు, పాత్రికేయ ప్రమాణాలు, విలువలను కచ్చితంగా పాటిస్తున్నామని సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులు స్పష్టం చేశారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబమే పత్రికా స్వేచ్ఛ. సామాజిక మాధ్యమాల యుగంలో ప్రెస్‌మీట్‌ను వక్రీకరించకుండా యథాతథంగా ప్రచురించడం సంపాదకుడి బాధ్యత. సాక్షి ఎడిటర్‌గా తన విద్యుక్త ధర్మాన్ని పాటించిన ఆర్.ధనంజయరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం సరికాదు. ఫిర్యాదులోని అంశాల్లో ఆధారాలు పరిశీలించకుండా కేసులు నమోదు చేయడం భావ్యం కాదు. నేతలు తమ పార్టీ విధానాలను వెల్లడిస్తే, వాటి ఆధారంగా ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం సరికాదు. – కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ఎడిటర్పై కేసులు పెట్టే సంస్కృతి ఏమిటి?విలేకరుల సమావేశంలో ఒక నాయకుడు మాట్లాడిన అంశాలను పత్రికలో ప్రచురిస్తే.. ఆ పత్రిక సంపాదకునిపై ఏకంగా కేసు నమోదు చేయడం ఏమిటి? ఇదెక్కడి న్యాయం? ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా, సాక్షిలో పనిచేసే వారిని, ఎడిటర్ ధనంజయరెడ్డిని వేధించేలా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిపై కేసు పెట్టొచ్చు కానీ.. అది ప్రచురించిన సంపాదకునిపై కేసు పెట్టడం అధికార దుర్వినియోగమే. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుంది. ఈ సంస్కృతికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకాలి. – టి.హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాంపత్రికా స్వేచ్ఛ మన ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఒక మీడియా సమావేశాన్ని ప్రచురించినందుకు సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేయడం సరికాదు. విమర్శ హేతుబద్ధం కానప్పుడు, విమర్శ చేసిన వారిపై చట్టబద్ధ చర్య తీసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఈ విషయంపై పత్రిక సంపాదకునిపై కేసు పెట్టడం కక్ష సాధింపు చర్యే. దీనిని ఖండిస్తూ ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై ఎడిటర్ గిల్డ్ స్పందించాలని కోరుతున్నా. – విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలుబెదిరింపు ధోరణి సరికాదుపోలీసుల పదోన్నతుల్లో అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకు ప్రభుత్వం సాక్షిపై కక్షగట్టడం సరికాదు. లోపాలను ఎత్తిచూపితే బెదిరింపు ధోరణికి దిగడం సమర్థనీయం కాదు. సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పోలీస్ కేసులు పెట్టి విచారణ పేరుతో వేధించడం సరి కాదు. పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించేలా పోలీసులు తీరు ఉంది. ఏదైనా అభ్యంతరకరమైన విధంగా వార్తా కథనం ప్రచురిస్తే.. పోలీసు అధికారులు రిజాండర్ ఇచ్చే అవకాశం ఉంది. పోలీసులు తమ వాదనను కూడా సంబంధిత పత్రికకు చెప్పొచ్చు. అంతేగాని అధికారం చేతిలో ఉందని కేసులు పెట్టి బెదిరింపు ధోరణికి దిగడం మానుకోవాలి. – కె.రామకృష్ణ, సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిఇది కక్ష సాధింపు ధోరణేతెలుగు రాష్ట్రాల్లో పాలక పక్షాలు.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతిపక్షాల గొంతును వినిపిస్తున్న మీడియాపైనా కక్ష సాధింపు ధోరణి కనిపిస్తోంది. కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి పెరగడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ ఆలోచన విధానం నుంచి ప్రభుత్వాలు బయటకు రావాలి. ప్రతిపక్షాల పాత్రను అణచి వేయడం, పత్రికల స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదం. ఏకపక్షంగా పత్రికల గొంతు నొక్కే యత్నం ప్రజా క్షేత్రంలో చెల్లుబాటు కాదు. – సంధ్య, పీఓడబ్ల్యూ నేతమీడియాపై కేసులు సరికాదు ఉద్దేశ పూర్వకంగా మీడియాపై కేసులు పెట్టడం సరికాదు. మీడియాలో కేవలం పాలక పక్షం వార్తలే కాదు. ప్రతిపక్షం వార్తలు కూడా వస్తాయి. ప్రతిపక్షాల వార్తలు రాసినందుకు మీడియాపై కేసులు నమోదు చేయడమంటే జర్నలిజంపై దాడి చేయడమే. – ఎస్ఎల్ పద్మ, ప్రజాపంథా నాయకురాలువిచారణ సందర్భంగా పలు ప్రశ్నలు!» సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. విజయవాడలోని సాక్షి కార్యాలయంలో అర్ధరాత్రి తనిఖీల పేరుతో వేధింపులకు తెగబడ్డారు. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కును కాలరాస్తూ నమోదు చేసిన అక్రమ కేసుపై సాక్షి పత్రిక ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కఠిన చర్యలు చేపట్టవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణకు సహకరించాలని సూచించింది.» న్యాయస్థానం ఆదేశాల మేరకు సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇద్దరు పాత్రికేయులు తాడేపల్లి పోలీసు స్టేషన్లో సీఐ పి.వీరేంద్ర బాబు ఎదుట గురువారం విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా పోలీసులు దాదాపు 3గంటలపాటు నిరీక్షించేలా చేశారు. అసలు పత్రికా నిబంధనలను, నియమావళికి విరుద్ధంగా ప్రశ్నలు సంధించడం గమనార్హం.» బాధితుల వివరాలు చెప్పకూడదన్నది సహజ న్యాయ సూత్రం. కానీ పదోన్నతులు కల్పించక పోవడంతో తాము నష్టపోయామని సాక్షి పత్రిక దృష్టికి తీసుకువచ్చిన పోలీసు అధికారుల పేర్లు, వివరాలు చెప్పాలని పోలీసులు పదే పదే ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పదోన్నతులు కోల్పోయిన డీఎస్పీలు బాధితులు అవుతారు. కానీ వారి పేర్లను చెప్పాలని తాడేపల్లి పోలీసులు పట్టుబట్టారు. » సాక్షి పత్రిక నిర్వహణ, రోజువారీ పనితీరు అన్నది ఆ సంస్థ అంతర్గత వ్యవహారం. ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని పత్రికకు సంబంధించిన అంతర్గత అంశాలను కూడా వెల్లడించాలని పోలీసులు ప్రశ్నించడం విస్తుగొలుపుతోంది. పోలీసులు సంధించిన 35 ప్రశ్నలకు సాక్షి ప్రతినిధులు లిఖిత పూర్వకంగా, మౌఖికంగా సమాధానాలు ఇచ్చారు.» రాజ్యాంగ నిబంధనలు, పాత్రికేయ ప్రమాణాలు, విలువలను సాక్షి పత్రిక కచ్చితంగా పాటిస్తోందని స్పష్టం చేశారు. పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బ తీయడం తమ అభిమతం ఏమాత్రం కాదని, ప్రజల ప్రయోజనాల పరిరక్షణే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. ఎటువంటి బాహ్య ఒత్తిడికి తలొగ్గకుండా పాత్రికేయ ప్రమాణాలు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను తు.చ. తప్పక పాటిస్తున్నామని సాక్షి ప్రతినిధులు విస్పష్టంగా చెప్పారు. న్యాయవాదుల సమక్షంలో నిర్వహించిన విచారణ ప్రక్రియను పోలీసులు వీడియో తీశారు. -
కలంపై కూటమి కత్తి.. ఖండించాలి గొంతెత్తి
సాక్షి, హైదరాబాద్: పత్రికాస్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును ఏపీ, తెలంగాణకు చెందిన పలు రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరు పత్రికల గొంతునొక్కడమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్చార్జి, రిపోర్టర్లపై ఏపీ ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు కేసులు పెట్టి ఆఫీస్‌కు వచ్చి మరీ నోటీసులు అందజేయడంపై వారు మండిపడ్డారు. ‘సాక్షి’ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో ప్రచురితమైన వార్తపై చద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేసు పెట్టి నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. వార్తాపత్రికలో వచ్చిన ఏదైనా వార్తపై అభ్యంతరాలుంటే ఖండించడం, వివరణ ఇవ్వడం సంప్రదాయం కాగా.. ఏకంగా కేసులు పెట్టి సాక్షి జర్నలిస్టులకు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. పత్రికాస్వేచ్ఛకు విఘాతం, భంగం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు వ్యవహరించడాన్ని నిరసించారు. పలు పార్టీల నాయకులు, జర్నలిస్టు సంఘాల నేతల అభిప్రాయాలు.. వారి మాటల్లోనే..కక్షపూరితం.. అత్యంత దుర్మార్గం ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ పట్ల రాజకీయ పార్టీలకు గౌరవం ఉండాలి. అది లేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. పత్రికా స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అని ప్రభుత్వంలో ఉన్న వారికి తెలియంది కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ఏ ఈ హక్కును ప్రసాదించింది. దీనిని ఉల్లంఘించి ఇష్టానుసారం పాలన సాగిస్తామంటే కుదరదు. రాజకీయ నేతలు మాట్లాడిన మాటలను ప్రజల వద్దకు తీసుకెళ్లే మాధ్యమం మీడియా. ఈ క్రమంలో వారికి ఇష్టం లేని మాటలు మాట్లాడారని ప్రజల గొంతుక అయిన పత్రిక పట్ల, పత్రిక ఎడిటర్ పట్ల కక్ష పూరితంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. ప్రజాస్వామ్యానికి ఏమాత్రం ఇది మంచిది కాదు. రాత్రి తర్వాత కచ్చితంగా పగలు అనేది వస్తుందని పాలకులు గుర్తుంచుకోవాలి. సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. – బొత్స సత్యనారాయణ, శాసన మండలి విపక్ష నేత భయపెట్టి దారికి తెచ్చుకోవాలనే కుతంత్రం రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడిన మాటలను ప్రచురించినందుకుగాను ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం ఎంత మాత్రం సరికాదు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపే. సాక్షి దినపత్రిక వాస్తవాలను వెలికి తెస్తోందని, ప్రభుత్వ పెద్దల నిర్వాకాలను బట్టబయలు చేస్తోందని ఇలా దుర్మార్గంగా కేసులు పెట్టడం ఎంత మాత్రం భావ్యం కాదు. పత్రికలో వచ్చిన వార్త లేదా కథనంలో ఏవైనా అభ్యంతరాలుంటే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చు. లేదా రిజాయిండర్ ఇవ్వొచ్చు. దానికి స్పందించకపోతే పరువునష్టం దావా వేసుకోవచ్చు. భయపెట్టి, తన దారిలోకి తెచ్చుకోవాలనే కుతంత్రంతో తప్పుడు కేసులు పెట్టడాన్ని సమాజం హర్షించదు. వెంటనే సాక్షి ఎడిటర్‌పై కేసులను ఎత్తివేయాలి. – భూమన కరుణాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేత కేసులు పెట్టడం పద్ధతి కాదు వార్తాపత్రికల్లో వచ్చే ప్రతి విమర్శపై కేసులు పెట్టడం పద్ధతి కాదు. ఎవరి మీద అయినా కేసు పెట్టడానికి ముందు, నోటీసులు ఇవ్వడానికి ముందే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం చట్టవిరుద్ధం. ప్రచురితమైన వార్తలపై అభ్యంతరాలుంటే వివరణ లేదా రిజాయిండర్ ఇవ్వాలి. దానిని ఆ పత్రిక ప్రచురించకపోతే తదుపరి చర్యలు తీసుకునే వీలుంటుంది. – ఎన్.రామచందర్‌రావు, సీనియర్ న్యాయవాది, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పత్రికాస్వేచ్ఛపై దాడే సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసును తీవ్రంగా ఖండస్తున్నాం. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణిస్తున్నాం. ఏపీలో అదిరించి, బెదిరించి మీడియాను, రిపోర్టర్లను లొంగదీసుకోవాలని కూటమి కుట్రపన్నతోంది. రిపోర్టర్ ఉద్యోగమే.. ఎవరు ఏ అంశాలు మాట్లాడితే వాటిని యథాతథంగా ప్రచురించడం. ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీ విధానం మేరకు మాట్లాడితే దాన్ని ప్రచురించడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుగా చిత్రీకరించడం, తప్పుడు కేసులు నమోదు చేయడం తప్పు. – దాసోజు శ్రావణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సమంజసం కాదు ఒక రాజకీయ నాయకుడు పెట్టిన ప్రెస్‌మీట్ వార్తను ప్రచురించినందుకు సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసు పెట్టడం సమంజసం కాదు. అది పత్రికాస్వేచ్ఛను హరించడమే. కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. ఆధారాల్లేని కేసులు చట్టప్రకారమే కాదు.. ప్రజల ముందు కూడా నిలబడవు. – జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే -
‘సాక్షి’పై కక్ష సాధింపు..
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి సర్కారు ఘోర వైఫల్యాలు.. అంతులేని అవినీతి, అక్రమాలపై ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ‘సాక్షి’ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం దమనకాండను ప్రదర్శిస్తోంది. ఎమర్జెన్సీ దురాగతాలను తలదన్నేలా బరి తెగిస్తోంది. ‘సాక్షి’ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు గతంలో పలుచోట్ల దాడులకు తెగబడగా ఇటీవల విజయవాడ ఆటోనగర్‌లోని ప్రధాన కార్యాలయంలో అర్ధరాత్రి పోలీసులు చొరబడి అరాచకంగా వ్యవహరించడం తెలిసిందే. గతంలో కార్యాలయాలపై దాడులకు పురిగొల్పగా.. ఇప్పుడు వార్త ప్రచురించినందుకు నోటీసులు, అక్రమ కేసులు నమోదు చేయడం విభ్రాంతి కలిగిస్తోంది. ఓ రాజకీయ పార్టీ నేత మాట్లాడిన అంశాలను ప్రచురించినందుకు మీడియాపై కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవని ప్రజాస్వామికవాదులు, పాత్రికేయ సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రజల గొంతుకగా నిలిచే మీడియా గొంతు నులిమే యత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికారులతో ఫిర్యాదులు ఇప్పించడం.. ఆ వెంటనే ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం కూటమి సర్కారుకు పరిపాటిగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తే.. వాటిని ఖండించవచ్చు లేదా సంబంధిత అధికారి లేదా పదవిలో ఉన్న నాయకుడు పరువు నష్టం దావా వేసుకునే వీలుంది. అయితే చంద్రబాబు సర్కారు కొత్త సంస్కృతికి తెర తీసింది. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించడం... ఎడాపెడా అక్రమ కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పే ప్రక్రియను ఎంచుకుంది. పత్రికలో ప్రభుత్వ వ్యతిరేక వార్త వస్తే చాలు.. వెంటనే కేసు రిజిస్టర్ చేయాలనేలా మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త విలేకరుల సమావేశంలో మాట్లాడిన అంశాలను వార్తగా ప్రచురించినందుకు తాడేపల్లి పోలీసులు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు. అక్రమ కేసు నమోదు చేయడమే కాకుండా.. బీఎన్ఎస్ఎస్ 35 (3) కింద నోటీసులు జారీ చేశారు. పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ గతనెల 16వ తేదీన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ మాయలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని బతికించుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం ఛానళ్లకు మళ్లించి పొన్నూరు నియోజకవర్గంలో 72 వేల ఎకరాల్లోపంట పొలాల ముంపునకు కారణమైందని ఆరోపించారు. దీనికి సంబంధించి.. ‘అమరావతి కోసం పొన్నూరును ముంచేశారు’ శీర్షికన ప్రచురించిన వార్తపై గుంటూరు ఛానెల్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీహెచ్ అవినాష్ ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు 518/2025 కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తాడేపల్లి పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కార్యాలయానికి చేరుకుని ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి నోటీసులు అందచేశారు. బీఎన్ఎస్ఎస్లో సెక్షన్లు 353(1), 61(2), డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2025 సెక్షన్ 54 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అందచేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. దీనితో పాటు మరో అక్రమ కేసులోనూ ఎస్ఐ నోటీసులు అందజేశారు. పోలీసు శాఖలో డీఎస్పీల నుంచి అదనపు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించడానికి లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు రాసిన ‘పైసా మే ప్రమోషన్’ కథనంపై తాడేపల్లి పోలీసులు మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఈ అక్రమ కేసులో 61(2), 196(1),353(2) రెడ్‌విత్ 3(5) బీఎన్ఎస్ఎస్, పోలీసుల్లో అసంతృప్తిని రెచ్చగొట్టడం 1922 చట్టం కింద అక్రమ కేసులు నమోదు చేసి నోటీసులు ఇవ్వడం గమనార్హం.తీవ్రంగా ఖండించిన పాత్రికేయ సంఘాలు, సీనియర్ జర్నలిస్ట్‌లు‘సాక్షి’ దినపత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో ప్రచురితమైన వార్తకు సంబంధించి ఏకంగా పత్రిక సంపాదకుడు ఆర్.ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్చార్జి, రిపోర్టర్, వార్తను వెబ్ ఎడిషన్‌లో ప్రచురించినందుకు ఇన్చార్జిగా ఉన్న ధనంజయరెడ్డిపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు అక్రమ కేసులు బనాయించి నోటీస్‌లు ఇవ్వడాన్ని పలు జర్నలిస్టుల సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్ట్‌లు, సంపాదకులు తీవ్రంగా ఖండించారు. పత్రికలో ఏదైనా వార్త వస్తే దానిపై అభ్యంతరాలుంటే వివరణ కోరడం లేదా రిజాయిండార్ ఇవ్వడం ఆనవాయితీ కాగా ఏకంగా అక్రమ కేసులు మోపి ‘సాక్షి’ జర్నలిస్టులను కోర్టుకు ఈడ్వటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించేలా ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు వ్యవహరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై జర్నలిస్ట్సంఘాల నేతలు, సీనియర్ పాత్రికేయుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..ఖండన ఇవ్వకుండా సంపాదకుడిపై కేసులా?దినపత్రికలు ప్రచురించే వార్తల్లో పొరపాట్లు ఉంటే సంబంధిత వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం వాస్తవాలు తెలియచేస్తూ వివరణ ఇవ్వడం, వక్రీకరణలు ఉంటే ఖండించడం ఒక పద్ధతి. ఉద్దేశపూర్వకంగా అసత్యాలు రాసి వాటి మీద సవరణలు తెలిపినా ప్రచురించని మీడియా సంస్థల మీద చర్యలు తీసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ కమిషనర్‌కు దఖలు పరుస్తూ చాలా ఏళ్ల క్రితం ఒక జీవో వెలువడింది. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ జీవోను సవరించి సమాచార శాఖ కమిషనర్‌కు ఉన్న అధికారాలను ఆయా శాఖల కార్యదర్శులకు బదిలీ చేశారు. దీనిపై అప్పటి ప్రతిపక్ష టీడీపీ, దాని వందిమాగధ మీడియా చేయని రభస లేదు. ఇప్పుడు అదే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణ పత్రికా గోష్టిలో కొండవీటి వాగు మళ్లింపు వల్ల పంట పొలాలు మునిగి రైతులకు నష్టం వాటిల్లిందని పేర్కొన్న విషయాన్ని ‘సాక్షి’ రిపోర్ట్ చేసినందుకు నేరుగా సంపాదకుడి మీద కేసు పెట్టి పోలీసులను పంపే దాకా వచ్చింది ప్రభుత్వం. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరోలా పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటాయని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. – దేవులపల్లి అమర్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ స్టీరింగ్ కమిటీ మెంబర్రాజ్యాంగ హక్కుల హననం..‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ఒక వార్త విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏకంగా ఎడిటర్‌పై పోలీసు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమరావతి కోసం పొన్నూరు అనే ప్రాంతాన్ని ముంచేశారు అంటూ వైఎస్సార్ సీపీకి చెందిన ఒక నాయకుడు చేసిన ఆరోపణను ఆయన వ్యాఖ్యల రూపంలోనే ‘సాక్షి’లో ప్రచురించారు. దానిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అదే పత్రికాముఖంగా ఖండించాలేగానీ ఈ విధంగా పోలీస్ కేసులు పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు.రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా మీడియా స్వేచ్ఛను హరిస్తూ పోలీస్ కేసులు పెడితే జర్నలిస్ట్ సంఘాలుగా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిపై నమోదు చేసిన పోలీస్ కేసును వెంటనే ఉపసంహరించుకునేలా అక్కడి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. – అల్లం నారాయణ, ఆస్కాని మారుతి సాగర్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక మీడియాపై దాడి..ఏపీలో పరిస్థితి చూస్తుంటే... పోలీస్‌రాజ్యం మినహా ప్రజారాజ్యం నడుస్తున్నట్లు కనిపించడంలేదు. ఎల్లో మీడియా తమ అవసరం కోసం ప్రభుత్వంలో లోపాలు ఎత్తిచూపుతూ వార్తలు రాస్తే కేవలం రిజాయిండర్ లేదా వివరణ మాత్రమే అడుగుతున్నారు. చంద్రబాబు పర్యవేక్షణలోని ‘సూర్యఘర్’పై వారు వార్తలు రాస్తే ఖండన మాత్రమే ఇచ్చారు. అదే ‘సాక్షి’ పత్రిక అమరావతికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తను మాత్రమే రాస్తే ఎడిటర్‌కు నోటీస్‌లు ఇవ్వటాన్ని చూస్తుంటే.. పత్రికాస్వేచ్ఛను హరించాలనే తాపత్రయమే కనిపిస్తోంది. సోషల్ మీడియాను సైతం నియంత్రంచడానికి నేపాల్‌లో ఏం జరిగిందంటూ మాట్లాడడం సరికాదు. సాక్షిలో ప్రచురితమైన వార్తకు ఖండన ఇవ్వకుండా, వివరణ కోరకుండా నేరుగా కేసులు పెట్టడాన్ని చూస్తుంటే జర్నలిజం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు విపక్షంలో ఉండగా సీఎంతో సహా ఎవరి మీద పడితే వారి మీద నానా విమర్శలు చేశారు. ఇప్పుడు తనపై వాస్తవాలు రాస్తున్నా భరించలేకపోవడం ప్రజాస్వామ్య హననమే.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్ -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు!
ఎమర్జెన్సీ నాటి దురాగతాలను తలపిస్తోన్న రాష్ట్ర పరిస్థితి సాక్షి, అమరావతి: ఎన్నికల హామీల అమల్లో ఘోర వైఫల్యం.. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం.. అంతులేని అవినీతి, అక్రమాలపై ప్రజల పక్షాన నిలబడి నిలదీస్తున్న ‘సాక్షి’ మీడియాపై ఆది నుంచీ చంద్రబాబు కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రజల గొంతుకగా ప్రతిధ్వనిస్తున్న ‘సాక్షి’పై పోలీసులను ఉసిగొలిపి, అక్రమ కేసులు బనాయిస్తూ బరితెగిస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను యథేచ్ఛగా కాలరాస్తూ.. పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తూ.. ఎమర్జెన్సీ నాటి దురాగతాలను గుర్తుచేస్తోంది. సోమవారం ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై తాడేపల్లి పోలీసు స్టేషన్లో నమోదు చేసిన అక్రమ కేసులే ఇందుకు తార్కాణం. దీనిని అడ్డుపెట్టుకుని సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు విజయవాడ ఆటోనగర్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో పోలీసులు దాడికి తెగబడ్డారు. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి 2 గంటల వరకూ హల్చల్ చేస్తూ భయోత్పాతం సృష్టించారు. ఇంతకూ ఆ అక్రమ కేసు ఎందుకు బనాయించారంటే.. పోలీసు అధికారుల హక్కులపై ‘సాక్షి’ గళమెత్తినందుకే. బరితెగింపునకు నిలువెత్తు నిదర్శనం.. రాష్ట్రంలో డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్యానల్ కాల పరిమితి ఆగస్టు 31తో ముగిసింది. కానీ.. పదోన్నతులు ఇవ్వకపోవడంతో డీఎస్పీలు తీవ్రంగా నష్టపోయారు. కొందరు గత నెల 31న రిటైరయ్యారు. మళ్లీ కొత్తగా ప్యానల్ ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పించే సరికి మరికొందరు రిటైరవుతారు. భారీగా ముడుపులు ఇవ్వలేదనే నెపంతోనే తమకు పదోన్నతులు ఇవ్వలేదని పలువురు డీఎస్పీలు వాపోయారు. పోలీసు శాఖ క్రమశిక్షణను గౌరవిస్తూ.. ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రకటనలు జారీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచి్చంది. దీంతో కూటమి ప్రభుత్వం ‘సాక్షి’పై అక్రమ కేసులతో దాడికి తెగబడింది. ఏ పోలీసు అధికారుల హక్కుల కోసమైతే సాక్షి గళమెత్తిందో.. అదే పోలీసు అధికారులతోనే అక్రమ కేసు నమోదు చేయించి అత్యంత దుర్మార్గానికి పాల్పడింది. ఆ ఫిర్యాదు కూడా రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్‌తో చేయించి మరీ అక్రమ కేసు పెట్టడం గమనార్హం. ఆ ఫిర్యాదు మేరకు తాడేపల్లి స్టేషన్లో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై బీఎన్ఎస్ సెక్షన్లు 61(2), 196(1), 353(2) కింద కేసు(క్రైమ్ నంబరు 543/ 2025) నమోదు చేశారు. ఆది నుంచీ అక్రమ కేసులే.. చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ‘సాక్షి’పై అక్రమ కేసులతో దాడి చేస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో యథేచ్ఛగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది. కూటమి అరాచకాలను ఎక్కడికక్కడ ప్రశి్నస్తుండడంతో గొంతు నొక్కే దుస్సాహసానికి ఒడిగడుతోంది. రాజ్యాంగం కల్పించిన ఆరి్టకల్–19 (1)(ఏ)లోని భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తోంది. అక్రమ కేసులు బనాయించడాన్ని న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు తప్పుబడుతున్నా ప్రభుత్వ తీరు మారడం లేదు. భావ ప్రకటనపై వచ్చే ఫిర్యాదుల కేసు నమోదు విషయాల్లో పాటించాల్సిన ప్రమాణాలపై పోలీసుశాఖతోపాటు జిల్లా మేజి్రస్టేట్లకు హైకోర్టు ఇటీవల స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించింది. అయినా సరే.. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు, ఎత్తిచూపుతున్న ‘సాక్షి’ని అక్రమ కేసులతో వేధించడమే పనిగా పెట్టుకుంది.రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. బాపట్ల టౌన్, టెక్కలి, కోనేరుసెంటర్, నరసరావుపేట: సాక్షి ఎడిటర్, మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా మంగళవారం బాపట్ల జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో పట్టణ పోలీసులకు వినతిపత్రం అందజేశారు. » సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలంటూ బందరు డీఎస్పీ చప్పిడి రాజాకు మచిలీపట్నం ‘సాక్షి’ పాత్రికేయుల బృందం మంగళవారం రాత్రి వినతిపత్రం అందజేసింది. » సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసుపై పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పాత్రికేయులు నిరసించారు. మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా ప్రెస్‌క్లబ్, నరసరావుపేట, ఏపీ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఏపీడబ్ల్యూయు జే) ప్రతినిధులు ఇన్చార్జి డీఎస్పీ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. అక్రమ కేసు వెనక్కి తీసుకోవాలి రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతున్న ‘సాక్షి’ దిన పత్రికపై ప్రభుత్వ ప్రోత్సాహంతో పోలీసు అధికారులు అక్రమ కేసులు పెట్టడం తగదు. జర్నలిస్టు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రతిఘటించాలి. – శాసపు జోగినాయుడు, ఏపీ జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షుడు అర్ధరాత్రి చొరబాటు దారుణం రాజకీయ కక్షలు కార్పణ్యాలతో ‘సాక్షి’ మీడియా సంస్థపై దాడికి దిగడం ఆమోదయోగ్యం కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని మరచిపోకూడదు. సాక్షి కార్యాలయంపై పోలీసుల దాడి, ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. అర్ధరాత్రి పత్రికా కార్యాలయంలోకి చొరబడటం అసమంజసం, అనైతికం. – స్వాతిప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాకినాడ యూపీ బాటలో ఏపీ ఏపీలో ప్రభుత్వం ‘సాక్షి’ ఎడిటర్, జర్నలిస్టులపై వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాసినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదు. ఆరి్టకల్ 19(1)ఎ ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంది. సాక్షి కార్యాలయాల్లోకి చొరబడి జర్నలిస్టులను విచారించడం అనైతికం. – నల్లి ధర్మారావు, స్సామ్నా రాష్ట్ర అధ్యక్షుడుపత్రికా స్వేచ్ఛపై దాడి.. పత్రికా ఎడిటర్‌పై కేసు పెట్టడం అంటే కచ్చితంగా పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తున్నట్లే. భావ వ్యక్తీకరణను అడ్డుకోవద్దని, తప్పుడు కేసులు పెట్టొద్దని కోర్టులు అధికారులకు చీవాట్లు పెడుతున్నా లెక్క చేయడం లేదు. – బి.మురళీకృష్ణ, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యులు మీడియా స్వేచ్ఛను హరించడమే.. కూటమి సర్కారు మీడియా స్వేచ్ఛను హరిస్తోంది. అర్ధరాత్రి ‘సాక్షి’ కార్యాలయంలోకి పోలీసులను పంపి వేధింపులకు దిగడం సమంజసం కాదు. అధికారంలో ఉన్న వారి మీద వార్తలు రాస్తే అక్రమ కేసులు పెడతారా? ఏదైనా సమస్య ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలి. రిజాండర్ ఇవ్వాలి. – మచ్చా రామలింగా రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పత్రికలను ఇబ్బంది పెట్టే సంప్రదాయం మంచిది కాదు ప్రజల పక్షాన గళమెత్తుతున్న ‘సాక్షి’ గొంతు నులిమే చర్య ఇది. పత్రికా స్వేచ్ఛను కాలరాసే విధానాలు ప్రభుత్వం మానుకోవాలి. పత్రికలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. – కొత్తపల్లి అనిల్‌కుమార్ రెడ్డి, ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుఇప్పటి వరకు ‘సాక్షి’పై అక్రమంగా నమోదు చేసిన కేసులివీ..» గత ఏడాది ఆగస్టు 31న విజయవాడ వరదల సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీ సినందుకు ‘సాక్షి’పై అక్రమ కేసు నమోదు » పల్నాడు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తను తెలంగాణలో దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని ప్రచురించినందుకు ఈ ఏడాది ఏప్రిల్ 9న అక్రమ కేసు » కర్నూలు జిల్లాలో ప్రభుత్వ టీచర్ కుటుంబం కిడ్నాప్ ఉదంతాన్ని వెలుగులోకి తెచి్చనందుకు.. అదే జిల్లాలో ఓ ఐపీఎస్ అరాచకాలను ఎండగట్టినందుకు ‘‘సాక్షి’’ పత్రికపై అక్రమ కేసులు నమోదు » అనంతపురంలో బాలికపై టీడీపీ మూకలు అత్యాచారం చేసిన దారుణాన్ని ప్రశి్నంచినందుకు సాక్షి టీవీపై అక్రమ కేసు » ఇటీవల భారీ వర్షాలకు రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని వీడియో ఆధారాలతో సహా ప్రసారం చేసిన సాక్షి టీవీపై అక్రమ కేసు » శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై సభాహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు » వాట్సప్ గవర్నెన్స్ ముసుగులో చేస్తున్న సంక్షేమ పథకాల ఎగవేత, ఓట్ల తొలగింపుపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై న్యాయస్థానంలో ఫిర్యాదుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అనుమతి ఇస్తూ మార్చి 5న ఉత్తర్వులు జారీ » మే 8న పోలీసులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా విజయవాడలో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో తనిఖీల పేరుతో హల్చల్ (ఓ పత్రిక ఎడిటర్ నివాసంలో తనిఖీల పేరుతో వేధింపులకు దిగడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి) » ‘సాక్షి’ టీవీ డిబేట్లో సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అనని మాటలను అన్నట్లుగా జూన్ 9న అక్రమ కేసు, అరెస్టు. -
'సాక్షిపై దాడులు.. మీడియా స్వేచ్ఛను హరించడమే'
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ మీడియా స్వేచ్ఛను హరిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. అర్ధరాత్రి సాక్షి కార్యాలయంలోకి పోలీసులను పంపి వేధింపులకు దిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాక్షి కార్యాలయంలోకి వచ్చిన పోలీసులు వీరంగం చేశారని.. డీఎస్పీల ప్రమోషన్లలో జరిగిన అక్రమాలపై వార్తలు రాస్తే దాడి చేస్తారా? అంటూ జూపూడి ప్రశ్నించారు.‘‘తొలుత వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మీద పడి అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు సాక్షి మీద అర్ధరాత్రి దాడులు చేశారు. దేశానికి అర్ధరాత్రి వస్తే.. కూటమి ప్రభుత్వం అదే అర్ధరాత్రి పత్రికా స్చేచ్చని హరించేసింది. ఇది నియంతృత్వం కాదా?. ఎడిటర్ ధనుంజయరెడ్డి మీద అక్రమ కేసు పెట్టించారు. పోలీసుల మేలు కోరుతూ వార్త రాస్తే అదే పోలీసులతో అక్రమ కేసు పెట్టించారు. మే 8న కూడా ధనుంజయ రెడ్డి ఇంట్లో అక్రమంగా సోదాలు చేశారు. అధికారంలో ఉన్నవారి మీద వార్తలు రాస్తే అక్రమ కేసులు పెడతారా?. పోలీసులను పంపించి భయపెట్టాలని చూస్తారా?’’ అంటూ జూపూడి ధ్వజమెత్తారు.’’ఏపీలో అప్రజాస్వామ్యం నడుస్తోందనటానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని పాలకులు భావిస్తున్నారు. మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తామంటే కుదరదు. వీధి రౌడీలాగ ప్రభుత్వం వ్యవహరిస్తామంటే ఒప్పుకోం’’ అంటూ జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు. -
‘సాక్షి’పై మరో అక్రమ కేసు
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘సాక్షి’పై ప్రభుత్వ కక్షసాధింపు, పోలీసుల అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే అక్రమ కేసులు నమోదుచేస్తామని పత్రికలను, మీడియాను బెదిరించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ‘రాయలసీమలో అనకొండ ఐపీఎస్’ పేరుతో ఓ ఐపీఎస్‌పై ‘సాక్షి’ శుక్రవారం ఓ కథనం ప్రచురించింది. అదే రోజు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ విలేకరుల సమావేశం నిర్వహించి తనపైనే కథనం రాశారని.. తాను నిజాయితీపరుడినని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శనివారం కర్నూలు త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ‘సాక్షి’పై సెక్షన్ 132, 308 (3), 353 (1)(బి), 356 (3), రెడ్‌విత్ 61(2) బీఎన్ఎస్ ప్రకారం అక్రమ కేసు నమోదుచేశారు. డీఐజీ సీసీ రత్నప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సీఐ శేషయ్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎఫ్ఐఆర్లో ఏ–1గా సాక్షి అమరావతి బ్యూరో, ఏ2గా సాక్షి మేనేజ్మెంట్, పబ్లిషర్ పేరును చేర్చినట్లు తెలుస్తోంది. డీఐజీ సీసీ ఫిర్యాదు చేయడమేంటి? ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంలో ఓ ఐపీఎస్ అని మినహా అందులో పేరులేదు. డీఐజీ కోయ ప్రవీణ్ తనపైనే వార్త రాశారని విలేకరుల సమావేశం నిర్వహించి మరీ చెప్పారు. డీఐజీ చెప్పినట్లు ఆయనపైనే వార్త రాస్తే, ఆయన పరువుకు నష్టం వాటిల్లిందని భావిస్తే కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ, డీఐజీ సీసీ రత్నప్రకాశ్ బాధితుడు ఎలా అవుతారు? అతనెలా ఫిర్యాదు చేస్తారు? అతని ఫిర్యాదు మేరకు కేసు ఎలా నమోదుచేస్తారు? అనేది పోలీసులే చెప్పాలి. నిజానికి.. ప్రభుత్వం, అధికారులు చేసే మంచిని పత్రికలు ఎలా ప్రచురిస్తాయో, తప్పొప్పులు, లోటుపాట్లు, అవినీతి ఆరోపణలు ఉన్నా అలాగే ప్రచురిస్తాయి. ఇది పత్రికలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇదే భావప్రకటనా స్వేచ్ఛ. దీనిపై బాధితులకు అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. గతంలో అభ్యంతరాలున్న వారు కోర్టులను ఆశ్రయించేవారు. కానీ, కర్నూలు పోలీసులు కొత్త పంథాను అవలంభిస్తున్నారు. తప్పుడు కేసులు నమోదుచేస్తున్నారు. పత్రికలు వార్తలు రాస్తే కేసులు నమోదుచేయడం ఏంటని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు పలుమార్లు ఖండించినా, ఆందోళనలు నిర్వహించినా పోలీసుల్లో మార్పులేదు.గతంలోనూ తప్పుడు కేసు నమోదు.. ఇక గతేడాది డిసెంబరు 22న కర్నూలులో మునీర్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారు. తన భూమిని మరొకరికి కట్టబెట్టాలని పోలీసులు బెదిరిస్తున్నారని, తాను పనిచేస్తున్న స్కూలుకు పోలీసులు వచ్చి తనను కిడ్నాప్ చేశారని, డీఐజీ కోయ ప్రవీణ్ సూచనలతోనే ఈ వ్యవహారం జరిగిందని.. పలుమార్లు డీఐజీ పిలిపించి కోర్టులతో పనిలేదు, సెటిల్ చేసుకోవాలని చెప్పారని మునీర్ విలేకరులకు చెప్పారు. ఈ విషయాన్ని ప్రముఖ పత్రికలు ప్రచురించగా.. వివిధ ఛానెళ్లూ ప్రసారం చేశాయి. కానీ, అప్పుడు కూడా ‘సాక్షి’పై మాత్రమే కేసు నమోదుచేశారు. ఈ కిడ్నాప్ వ్యవహారంపై ‘సాక్షి’ కథనం రాస్తే త్రీటౌన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు విధులకు సాక్షి విలేకరి ఆటంకం కల్గించారని తప్పుడు కేసు నమోదుచేశారు. కిందిస్థాయి పోలీసులు తప్పుడు కేసులు నమోదుచేస్తే డీఎస్పీ, ఎస్పీలను కలిసి బాధితులు విన్నవిస్తారు. కానీ, ఐపీఎస్ అధికారుల సూచనల మేరకే తప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ఇలా పత్రికలపై తప్పుడు కేసులు కడుతుంటే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో.. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఏ స్థాయిలో తొక్కేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. -
పత్రికా స్వేచ్ఛ కొందరికే ప్రత్యేకమా?
ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అనే పదాలు గడచిన మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదాలు. బీఆర్ఎస్ నాయకులపై జుగుప్సాకరమైన థంబ్‌నైల్స్ పెట్టి వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు మహా టీవీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడి ముమ్మాటికీ ఖండనార్హమే. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదు. ఎవరు ఎవరిపై దాడి చేసినా కచ్చితంగా ఖండించాల్సిందే. ఇదే సమయంలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛలు కొందరు ప్రత్యేకమైన జర్నలిస్టులకు, సెలక్టివ్ మీడియా గ్రూపులకు మాత్రమే ఉంటాయా? ఇంకెవరికీ ఉండవా? ఇప్పుడు ఈ ప్రశ్నలు సామాన్య ప్రజానీకాన్ని తొలిచేస్తున్నాయి.మహా టీవీ కార్యాలయంపై దాడి జరిగిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఛోటోమోటా నాయకులు సైతం తీవ్ర స్థాయిలో స్పందించి దాడిని తీవ్రాతి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియా సంస్థలపై దాడులు హేయమైన చర్యగా అభివర్ణించారు. సరిగ్గా ఇక్కడే సామాన్య ప్రజానీకం గందరగోళానికి గురవుతున్నారు. ఈ దాడి జరగడానికి మూడు వారాల ముందు ‘సాక్షి’ టీవీలో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో ఒక జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సదరు జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను, చర్చా కార్యక్రమం నిర్వహించిన యాంకర్‌కూ, ‘సాక్షి’ యాజమాన్యానికీ ముడి పెట్టి ఏపీలో కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ విరుచుకుపడ్డాయి. గతంలో మార్గదర్శిపై ఉండవల్లి అరుణ్ కుమార్ కేసులు వేసినప్పుడు ఇది మీడియాపై దాడి అని రామోజీరావు అంటే... ఇవే రాజకీయ పార్టీలు, నాయకులు స్వరం కలపడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏకంగా యాంకర్‌గా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టుపై అట్రాసిటీ కేసు కూడా పెట్టి అరెస్ట్ చేసింది. అయితే ఈ సందర్భంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, టీడీపీ మహిళా కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని ‘సాక్షి’ పత్రిక ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి దాడులకు పూనుకున్నారు. ఆస్తులు ధ్వంసం చేశారు. కానీ ఈ సంఘటన ప్రజాస్వామ్యం మీద, పత్రికా స్వేచ్ఛ మీద దాడిలా ఎవరికీ కనిపించకపోవడం విచిత్రం. ఏకంగా పదికి పైగా ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తే ఒక్క కేసు లేదు, ఎవరినీ అరెస్ట్ చేయలేదు.అదే తెలంగాణకు వచ్చే సరికి... బీఆర్ఎస్ నాయకులపైనా, ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా జుగుప్సాకరంగా పెట్టిన థంబ్‌నైల్స్‌పై ఆగ్రహానికి గురైన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో సదరు టీవీ యాజమాన్యానికి సుద్దులు చెప్పడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు. పైగా టీవీ ఛానల్‌కు అండగా నిలబడుతూ బీఆర్ఎస్ కార్యకర్తల చర్యను తీవ్రంగా ఖండించారు. సాక్షిపై దాడి విషయంలో సమర్థింపు మాటలు మాట్లాడిన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇప్పుడు మహా టీవీపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడి అంటున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు అర్థంకాక సామాన్య ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు.ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకేసి రాజకీయ పార్టీలు సొంతగా మీడియా సంస్థలు కలిగి ఉండటం తగదని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలు మీడియా సంస్థలు కలిగి ఉండటం ఈ నాటిది కాదు. కాంగ్రెస్ పార్టీ సొంతగా నేషనల్ హెరాల్డ్ పత్రికను ఎన్నో దశాబ్దాలుగా నడుపుతోంది. వామపక్షాలు సైతం ప్రతి రాష్ట్రంలో ఎప్పటి నుంచో సొంత పత్రికలు నడుపుతున్నాయి. ఇక బీజేపీ ఎంపీలు ఒకరిద్దరికి మీడియా సామ్రాజ్యాలే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సంస్థను ప్రారంభించారు. ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత మీడియా సంస్థ అయ్యింది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలకు ఎప్పటి నుంచో వార్తా పత్రికలు ఉన్నాయి. విశాలాంధ్ర పేరుతో సీపీఐ, ప్రజాశక్తి పేరుతో సీపీఎం పార్టీలు దశాబ్దాలుగా పత్రికలు నడుపుతున్నాయి. అలాగే 10 టీవీ పేరుతో సీపీఎం, 99 టీవీ పేరుతో సీపీఐలు చెరో శాటిలైట్ న్యూస్ ఛానల్‌ను ప్రారంభించాయి. ఇప్పుడు ఆ ఛానళ్ళ యాజమాన్యాలు మారినప్పటికీ అందులో పనిచేస్తున్న జర్నలిస్టుల్లో చాలా మంది పార్టీల అనుబంధ సభ్యులే. ‘ఈనాడు’ రామోజీరావు స్వయంగా తాను కాంగ్రెస్‌కు బద్ద వ్యతిరేకినని న్యాయస్ధానాల్లో చెప్పుకున్నారు. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి మంత్రి వర్గ కూర్పు, తనకు నచ్చని మంత్రులను క్యాబినేట్ నుంచి తీసివేయించే వరకూ ‘ఈనాడు’ ఎంత కీలకంగా వ్యవహరించిందో రాష్ట్ర ప్రజలందరికీ చర్విత చరణమే. ఇక ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ టీడీపీ కోసం ఏ విధంగా పనిచేస్తారనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాధాకృష్ణ సహాయంతో టీడీపీలో టిక్కెట్లు ఖరారు చేయించుకున్న నాయకులెందరో లెక్కలేదు. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి 7 గంటలు అవ్వగానే సాంబశివరావు అనే జర్నలిస్ట్ టీవీ 5 తెరమీదకు వచ్చి ఏడెనిమిది నిమిషాల పాటు ధర్మోపన్యాసం చేస్తూ జగన్‌ను తిట్టడం, చంద్రబాబును పొగడటం నిత్యకృత్యం అన్న విషయం ప్రేక్షకులందరికీ తెలుసు. సాంబశివరావు అటు వెళ్లిన వెంటనే ఇటు మూర్తి అనే మరో జర్నలిస్టు రాత్రి 9 గంటలకు వచ్చి ఇచ్చే ప్రవచనాలు వర్ణనాతీతం. ఈ ఇద్దరి మధ్యలో రాత్రి 8 గంటలకు ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ అనే ఛానల్లో వెంకట కృష్ణ సూక్తిముక్తావళి ఉంటుంది. దీని సారంశం కూడా జగన్‌ను ఆడిపోసుకోవడం, చంద్రబాబును ఆకాశానికి ఎత్తడం! వీరందరి మధ్యలో మహా టీవీ వంశీ తనదైన శైలిలో న్యూస్ రూమ్‌లో కూర్చుని దర్బార్లు నడిపిస్తాడు. టీడీపీ సహజీవనం చేసే ఈ మీడియా సంస్థలు అన్నీ ఇప్పుడు ముసుగులు వేసుకుని ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెబుతుంటే నమ్మే పరిస్థితుల్లో తెలుగు సమాజం లేదన్న విషయం అందరూ గుర్తించాలి. – రుద్రుడు ‘ తెలుగు పాఠకుడు -
పత్రికా స్వేచ్ఛ అణచివేత.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
సాక్షి, హైదరాబాద్: పత్రికాస్వేచ్ఛను హరిస్తూ మీడియా ప్రతినిధులను అరెస్టు చేయడంపై సీనియర్ సంపాదకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టు సమాజమంతా ఐక్యంగా ఉండాలని, ప్రభుత్వాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మీడియాపై ప్రభుత్వాలు చేస్తున్న ఒత్తిడి, అణచివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలపై స్పందించకుంటే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలను మీడియా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యం– పత్రికాస్వేచ్ఛ’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.సీనియర్ జర్నలిస్టు ఆర్.దిలీప్ రెడ్డి ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ‘ప్రభుత్వాలు జర్నలిస్టులను భయపట్టేలా వ్యవహరిస్తున్నాయి. కొమ్మినేని శ్రీనివాస రావు కించపరిచే వ్యాఖ్యలు చేయకపోయినా ఆయనను అరెస్టు చేయడం అన్యాయం. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది’ అని సీనియర్ సంపాదకులు అన్నారు.ఇటీవల ఏపీలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడాన్ని ముక్త కంఠంతో ఖండించారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇటీవల సంపాదకుడు రహమాన్‌పై కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, ఉపాధ్యక్షుడు కె.శ్రీకాంత్‌రావు, ట్రెజరర్ రాజేష్, సభ్యులు బాపూరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సంపాదకులు వ్యక్తపర్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే... - కె.రామచంద్రమూర్తి ,సీనియర్ సంపాదకులుపత్రికా స్వేచ్ఛను కోరుకునేది ప్రజలే.. పత్రికా స్వేచ్ఛ అనేది ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. దీన్ని ప్రధానంగా కోరుకునేది ప్రజలే. పత్రికలు చురుకుగా ఉన్నప్పుడే ప్రతీ విషయం ప్రజలకు చేరుతుంది. కానీ ప్రస్తుతం ప్రతికాస్వేచ్ఛ ప్రమాదంలో పడింది. కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం చూస్తుంటే ఏపీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో స్పష్టమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గత 40 ఏళ్లుగా ఏ వర్గాన్నీ గౌరవించిన మనిషి కాదు. ప్రతీ రంగంలో తన వ్యతిరేకులను అణచివేయడం ఏళ్లుగా చూస్తున్నాం. ప్రస్తుతం ప్రతికా స్వేచ్ఛనే కాదు... అన్ని స్వేచ్ఛలు హరించుకుపోతున్నాయి. నియంత పాలన మాదిరిగా ప్రభుత్వాలను నిర్వహిస్తున్నారు. - టంకశాల అశోక్, సీనియర్ సంపాదకులుమీడియాను భయపెట్టే ప్రయత్నమిది.. కొమ్మినేని అరెస్టుతో మీడియాను భయపెట్టే ప్రయత్నం జరుగుతోంది. కొమ్మినేని తప్పు లేకు న్నా.. ఒకరకమైన భయం కలిగించే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. రాజకీయ నేతలు తమకు అనుకూలంగా ఉండే వార్తలే రాయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం మీడి యా స్వతంత్రంగా లేదు. రాజకీయ పారీ్టల మద్దతుతో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ పాత్రికేయులు తమ పరిమితులకు లోబడి వాస్తవాలను మాత్రమే రాయాలి. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వా మ్యం రెండూ వేర్వేరు కాదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కొమ్మినేని అరెస్ట్‌తో ఆగుతుందని అనుకోవడం లేదు. దీంతో భయపడి మిగతావారు వ్యతిరేక వార్తలు రా యకుండా ఉంటారని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మిగతా జర్నలిస్టులు రియాక్ట్ కాకుంటే ఎలా..? - దేవులపల్లి అమర్ ,సంపాదకులు మన తెలంగాణకక్ష సాధింపునకు పరాకాష్ట సాక్షి టీవీ డిబెట్లో కొమ్మినేని శ్రీనివాసరావు అనని మాటలకు ఆయన్ను అరెస్టు చేయడం సరికాదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పింది. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానాలి. కొమ్మినేని అరెస్టే సరి కాదని న్యాయస్థానం స్పష్టంచేస్తుంటే, సాక్షి కార్యాలయాలపై దాడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. టీడీపీ కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సరైన కారణం లేకుండా ఎవరినైనా అరెస్టు చేయొచ్చని, ఎవరి ఇంట్లోనైనా సోదాలు చేయొచ్చనే తప్పుడు సంప్రదాయానికి తెరతీసింది. ఇది రాబోయే రోజుల్లో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగించనుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. - ఆర్.ధనంజయ రెడ్డి, ఎడిటర్, సాక్షిఒక్కో మీడియా ఒక్కో వైఖరితో.. ప్రస్తుత రోజుల్లో ఒక్కో మీడియా ఒక్కో వైఖరితో ఉంది. ఈ పరిస్థితుల్లో ఐదు పేపర్లు, పది టీవీ చానళ్లు చూస్తే తప్ప వాస్తవాలేంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం మీడియా ప్రతినిధులను అరెస్టు చేస్తుంటే... ఇక్కడ రేవంత్ ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీలోనే గుడ్డలూడదీసి కొడతానంటోంది. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి అరెస్టులను వ్యతిరేకించాలి. అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులుపాత్రికేయుల భద్రత గురించి ఆలోచించాలి రాజకీయ కక్ష సాధింపులో మీడియా పావులుగా మారుతోంది. ఏపీ, తెలంగాణ అనే కాదు.. చాలా రాష్ట్రాల్లో మీడియా టార్గెట్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో పాత్రికేయుల భద్రత గురించి ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాచా రం అందించే ఏ వ్యవస్థ అయినా మీడియా కిందనే గుర్తించాలి. ఓ వార్త విషయంలో ప్రైవేటు వ్యక్తులు కేసు పెడితే నాపై కూడా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టి అరెస్టు చేశారు. ఇదివరకు సోషల్ మీడియా వాళ్లను అరెస్ట్ చేసినప్పుడు ప్రధాన స్రవంతి మీడియా పెద్దలు పట్టించుకోలేదు. ఇప్పుడది మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వచ్చింది. కొమ్మినేని అరెస్టుతో ఎంతపెద్ద జర్నలిస్టునైనా అరెస్టు చేస్తామనే అభిప్రాయాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లింది. - కె.శ్రీనివాస్, సీనియర్ సంపాదకులుసుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా కొన్ని మీడియా సంస్థలు వెక్కిరిస్తున్నాయి కొమ్మినేని అరెస్టు... సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన తీరు ఏపీ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. కొన్ని మీడియా సంస్థలు జర్నలిజం విలువలను దిగజార్చుతున్నాయి. కొమ్మినేని అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కొమ్మినేని నవ్వితే అరెస్టు చేయడాన్ని కక్ష సాధింపుగా కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు సూచనలపై కొందరు వ్యంగ్యంగా చర్చిస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు సెక్షన్లు తెలియకుండా చర్చలు పెట్టేస్తున్నారు. ఇది మీడియా ఉనికికే ప్రమాదకరం. - విజయ్ బాబు,సీనియర్ సంపాదకులుపత్రికలకు స్వేచ్ఛ లేదు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పత్రికలకు స్వేచ్ఛ ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా.. వార్త రాసినా ఉపేక్షించే పరిస్థితిలో లేవు. అందుకు తాజా ఉదా హరణ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు వ్యవహారమే. వాస్తవానికి ఆయనను అరెస్టు చేయడం సమంజసం కాదు. - దిలీప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్..అయినా ప్రజా ప్రయోజన వార్తలు ఆగవు గద్వాల జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తారనే స్థానికుల సమాచారంతో నేను వార్తలు రాశాను. ఇథనాల్ పరిశ్రమ అత్యంత ప్రమాదకరమైంది. దీంతో ప్రజలు ఆందోళనబాట పట్టారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నన్ను అరెస్టు చేసింది. అయినా ప్రజలకు ప్రయోజనం కలిగించే వార్తలు రాయడం ఆపను. - రహమాన్, సంపాదకులుకలిసి ఉంటేనే మనుగడవ్యవస్థలో అన్ని రంగాలు ప్రభుత్వ కనుసన్నల్లోనే ఉంటున్నాయి. దీంతో జర్నలిస్టులను అకారణంగా టెర్రరిస్టుల మాదిరిగా అరెస్టు చేసి వారికి బెయిల్ రాకుండా చూసే ప్రయత్నం జరుగుతోంది. జర్నలిస్టు సమాజమంతా కలిసికట్టుగా ఉంటేనే మీడియా మనుగడ ఉంటుంది. - శైలేష్ రెడ్డి, సీఈఓ, టీ న్యూస్ -
ప్రభుత్వ కర్కశత్వంపై అక్షర గర్జన
విజయవాడ స్పోర్ట్స్/జి.కొండూరు: ‘సాక్షి’ కార్యాలయాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దురుద్దేశంతో చేస్తున్న దాడులను ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు, కార్మిక సంఘాలు, న్యాయవాదులు, వామపక్ష నాయకులు, సీనియర్ జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. నాణేనికి మరోవైపు ఉన్న ప్రపంచాన్ని చూపిస్తూ ప్రజల సమస్యల్ని వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షిపై దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. పత్రిక కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని నినదించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను రెడ్‌బుక్ ప్రమాదంలో పడేసిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.సాక్షి కార్యాలయాలపై టీడీపీ నాయకులు చేస్తున్న దాడులకు నిరసనగా విజయవాడ గాం«దీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఇచి్చన పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి జర్నలిస్టు, జర్నలిస్టు సంఘాల నాయకులు తరలివచ్చి ధరాలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా కొనసాగింది.టీడీపీ గూండాల చర్యలకు నిరసనగా ఫ్లకార్డులను ప్రదర్శించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడండి, రెడ్‌బుక్ పాలనను అంతం చేయండి, పత్రికా కార్యాలయాలపై దాడులు సిగ్గు.. సిగ్గు.. అనే నినాదాలతో ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఒగ్గు గవాస్కర్, సాక్షి ప్రతినిధులు బీవీ రాఘవరెడ్డి, విశ్వనా«థ్‌రెడ్డి, ఎన్.సతీ‹Ù, ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి, చందు శివాంజనేయులు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర పాల్గొన్నారు.సాక్షిపై కక్షసాధింపు చర్యలను ఖండిస్తున్నాం మీడియా సంస్థలు తప్పులు, పొరపాట్లు చేశాయని భావిస్తే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రం సమంజసం కాదు. ఇది కేవలం కక్షసాధింపు చర్యే. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను ఈ ప్రభుత్వం దురి్వనియోగం చేస్తోంది. సాక్షిపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ఖండిస్తున్నాం. – కె.పోలారి, ఇఫ్టూ నేతనా సర్విసులో ఇలాంటివి చూడలేదు నా సర్విసులో మీడియా సంస్థలు, జర్నలిస్టులపై ఇటువంటి దాడులు చూడలేదు. మీడియా సంస్థలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూడటం ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. – వెంకటేశ్వరరెడ్డి, రిటైర్డ్ పోలీసు అధికారి నిరంకుశ చర్య మంచిది కాదు ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులను, దమన కాండలను జర్నలిస్టు సంఘాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకోవడం దుర్మార్గం. జర్నలిస్టులు, మీడియా సంస్థలపై ప్రభుత్వం నిరంకుశ వైఖరి ప్రదర్శించడంమంచి చర్య కాదు. – సీహెచ్.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి, చిన్న, మధ్య తరగతి పత్రికల సంఘం (సామ్నా) -
సాక్షి కార్యాలయాల వద్ద పచ్చ మూకల విధ్వంసం
రాజానగరం/ఏలూరు/ఏలూరు టౌన్: సాక్షి కార్యాలయాల వద్ద కూటమి మూకల విధ్వంసకాండ కొనసాగుతోంది. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని సాక్షి ముద్రణా కార్యాలయంతోపాటు ఏలూరులోని ప్రాంతీయ కార్యాలయం వద్ద కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రౌడీ మూకలు బీభత్సం సృష్టించాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని సాక్షి ముద్రణా కార్యాలయంపైకి రాజానగరం, అనపర్తి ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ (జనసేన పార్టీ), నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (బీజేపీ), అనపర్తి టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగుల ఆధ్వర్యాన ముష్కరులు దాడికి తెగబడ్డారు.ప్రధాన గేటు ముంగిట సాక్షి పత్రికలను వేసి దహనం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, సాక్షి మీడియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి నేమ్ బోర్డును పెకలించారు. అడ్డుకోబోయిన పోలీసులకు గాయాలయ్యాయి. కాగా, సాక్షి కార్యాలయాలపై కూటమి నేతల దాడులను అరికట్టాలని కోరుతూ తూర్పు గోదావరి, కాకినాడ ఎస్పీలు నరసింహ కిషోర్, బిందుమాధవ్లకు మీడియా ప్రతినిధులు వినతిపత్రాలు అందించారు.ఫర్నిచర్ తగులబెట్టి భీతావహ వాతావరణం ఏలూరు ఎన్ఆర్ పేటలోని ‘సాక్షి’ ప్రాంతీయ కార్యాలయం వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన 500 మందికిపైగా టీడీపీ గూండాలు భీతావహ వాతావరణం సృష్టించారు. కార్యాలయం వద్ద ఫరి్నచర్‌ను పెట్రోల్ పోసి తగులబెట్టారు. భారీగా మంటలు చెలరేగటంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తొలుత కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు ముష్కరులు యతి్నంచారు. కార్యాలయం ఆవరణలో కింద ఉన్న ఫరి్నచర్పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, కార్యకర్తలు ఏప్రిల్ 22న కూడా ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడి చేసి కంప్యూటర్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.సాక్షి కార్యాలయాలపై దాడులు హేయం టీడీపీ ప్రభుత్వం సాక్షి మీడియా గ్రూప్ టార్గెట్‌గా చేస్తున్న పనులు అత్యంత హేయం. అమరావతి మహిళల పేరుతో తొలుత సాక్షి మీడియా ఆఫీసులపై దాడి చేసిన పచ్చమూకలు... మరో అడుగు ముందుకేసి, ఏలూరు సాక్షి కార్యాలయంపై పెట్రోల్ బాటిళ్లు, రాళ్లతో దాడి చేసి ఫరి్నచర్కు నిప్పు పెట్టడం దుర్మార్గం. ఈ అనైతిక చర్య వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. అక్రమ కేసుతో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం దారుణం. – కురసాల కన్నబాబు,వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రిపథకం ప్రకారమే దాడులుసాక్షి కార్యాలయాలపై మూడు రోజులుగా పథకం ప్రకారం టీడీపీ ముష్కరులు దాడులు చేస్తున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయం ఆవరణలోని ఫర్నిచర్‌కు నిప్పుపెట్టడం దుర్మార్గం. మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడే. హింసాత్మక చర్యలు భవిష్యత్‌లో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయి. దాడులతో ప్రశ్నించే వారిని భయపెట్టలేరు. ఈ అరాచకాలపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్రమ కేసులో కొమ్మినేని అరెస్టును ఖండిస్తున్నా. – బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో విపక్ష నేతకూటమి అరాచకాలు పతాకస్థాయికి ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులకు పాల్పడడం దారుణం. టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి ఈ అరాచకాలకు తెగబడుతున్నాయి. ఏలూరు సాక్షి ఆఫీసులోని ఫర్నిచర్ తగులబెట్టడం అత్యంత దారుణం. – గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి -
AP: ‘సాక్షి’పై దాడులు.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన
ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు.ఈ క్రమంలోనే.. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’పై దాడులకు ఉసిగొలిపింది.తెలుగువారి మనస్సాక్షిగా.. పేదవాడి గొంతుకై.. నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. ఈ దాడులపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.మీడియాపై అధికార పార్టీ దౌర్జన్యం తగదు శ్రీకాకుళం: అమరావతిపై ఇటీవల సాక్షి టీవీ చానల్లో జరిగిన చర్చలో దొర్లిన కొన్ని వ్యాఖ్యలపై నిరసనల పేరుతో అధికారపార్టీ దౌర్జన్యాలకు దిగడం దారుణమని, మీడియా కార్యాలయాలను ధ్వంసం చేయడం సరైన విధానం కాదని సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు ఖండించారు. మీడియాపై దాడి అప్రజాస్వామికమని పేర్కొన్నారు. దాడి ఘటనలను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్.ఈశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ జగదీ‹Ù, సనపల రమేష్ ఖండించారు.ప్రభుత్వ తప్పిదాలను ‘సాక్షి’ ప్రశ్నిస్తుందనే అక్కసుతోనే..ఏపీలో సాక్షి’ కార్యాలయాలపై అకారణంగా టీడీపీ గూండాలు దాడులపై రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి సిబ్బంది నిరసనసోమవారం కొవ్వొత్తుల ప్రదర్శనతో టీడీపీ దాడులపై మండిపాటుప్రభుత్వ తప్పిదాలను ‘సాక్షి’ ప్రశ్నిస్తుందనే అక్కసుతోనే దాడులుఇవి కుట్రపూరిత, కక్ష పూరిత దాడులంటూ ధ్వజంపత్రికా స్వేచ్ఛపై దాడి: డీజేయూ'సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టు, సాక్షిపై దాడులను ఖండించిన డీజేయూ ఏపీ రాష్ట్ర కమిటీవిశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు దుర్మార్గమైన చర్య,ఇది పత్రికా స్వేచ్ఛపై దాడిసాక్షి కార్యాలయాలపై దాడుల సరికాదుసాక్షి కార్యాలయాలపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు తగవు: ఏపీయూడబ్ల్యూజేసాక్షి పత్రిక కార్యాలయాలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఖండించిన ఏపీయూడబ్ల్యూజేదాడులతో పాటు పత్రిక ప్రతులను దహనం చేయడం వంటి చర్యలు దిగ్భ్రాంతి కలిగించాయిసాక్షి కార్యాలయా లపై దాడులకు పూనుకోవడం గర్హనీయంపత్రికా కార్యాలయాలపై దాడులు చేసే సంస్కృతి ప్రమాదకరం ‘సాక్షి’పై దాడుల్ని ఖండించిన ఐజేయూసాక్షి టీవీ నిర్వహించిన ఒక చర్చ కార్యక్రమంపై నిరసన పేరుతో ఏపీలోని సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు జరిపి, ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నట్టు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కె.విరాహత్ అలీ, కె.రాంనారాయణ, సీనియర్ సంపాదకుడు డాక్టర్ కె.రామచంద్రమూర్తి సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విధ్వంస సంస్కృతి ఏ రకంగానూ సమర్థనీయం కాదన్నారు. కొమ్మినేనిపై కేసు నమోదు చేయడం సరైంది కాదని, క్షమాపణ చెప్పిన జర్నలిస్టును విడుదల చేయాలని కోరారు. సాక్షి పత్రిక, చానల్ కార్యాలయాల ధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ‘సాక్షి’కార్యాలయాలపై దాడులను ఖండిస్తున్నాం సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును ఐజేయూ మాజీ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ తీవ్రంగా ఖండించారు. విశ్లేషకుడి మాటలను సాక్షి మీడియా ఖండించినప్పటికీ అరెస్ట్ చేశారన్నారు. 70 ఏళ్ల కొమ్మినేనిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి టాక్ షోలు చేసే వారు అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని.. కొమ్మినేనిపై పెట్టినట్టు వారందరిపైనా అక్రమ కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. మహిళలను కించపరిచేవిధంగా, వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎవరూ మాట్లాడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. -
పత్రికా స్వేచ్ఛపై సర్కారు మరోదాడి
సాక్షి, అమరావతి : రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా సాక్షి దినపత్రికను మరోసారి లక్ష్యంగా చేసుకుంది. ఏపీ శాసనసభ ద్వారా వేధింపులకు దిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికకు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. బడ్జెట్ సమావేశాలకు ముందు ఫిబ్రవరి 25న సాక్షిలో ప్రచురితమైన ఒక వార్త అసెంబ్లీకి, అసెంబ్లీ సభ్యుల హక్కులకు భంగం కలిగించిందని అందులో పేర్కొన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జి. జయసూర్య ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారని, ఈనెల 2న సమావేశమైన కమిటీ పత్రిక ఎడిటర్, సంబంధిత రిపోర్టర్, ప్రింటర్ అండ్ పబ్లిషర్ స్పందన తెలుసుకోవాలని సూచించిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఈ నోటీసుపై స్పందించాలని కోరారు. ఎవరి హక్కుల ఉల్లంఘనా జరగలేదు.. వాస్తవానికి.. ‘సాక్షి’ ప్రచురించిన కథనంలో ఎక్కడా సభా హక్కుల ఉల్లంఘన జరగలేదు. అసెంబ్లీ, అసెంబ్లీ సభ్యులు, అధికారుల ప్రస్తావన అందులో లేదు. వారి హక్కులకుగానీ, వారి హుందాతనానికి గానీ అగౌరవం కలిగే వ్యాఖ్యలు అసలేలేవు. కేవలం పరిపాలనాపరమైన లోపాలను మాత్రమే అందులో ప్రస్తావించారు. శిక్షణా తరగతుల పేరుతో అన్ని ఏర్పాట్లు చేశాక రద్దుచేయడం ద్వారా ప్రజాధనం వృధా అయిందని, ప్రణాళికా లోపంవల్లే ఇది జరిగిందని వ్యవస్థాపరమైన లోపాలను గుర్తుచేస్తూ ఈ కథనంలో రాశారు. కానీ, సాక్షి మీడియాపై కక్షగట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. బడ్జెట్ సమావేశాల్లో ఒక సభ్యుడితో దీనిపై ఫిర్యాదు చేయించి సభా హక్కుల ఉల్లంఘనగా ఆరోపించింది. ఆ సభ్యుడి ఫిర్యాదు మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపగా కమిటీ నోటీసులిచ్చింది. ఇలా కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై వరుస దాడులు చేయిస్తోంది. జర్నలిస్టులను భయపెట్టాలని, పత్రికా స్వేచ్ఛకు పరిమితులు విధించాలనే కుతంత్రంతో ఇలా చేయిస్తున్నట్లు ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు. సాక్షి, సాక్షి సిబ్బందిపై వరుస దాడులు.. ఇక ఇటీవలే సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డి నివాసంలో ‘సిట్’ పోలీసులు అకారణంగా సోదాలు జరిపారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. మద్యం కేసు నిందితుల కోసం అన్వేషించే పేరుతో ఒక పత్రిక ఎడిటర్ నివాసంలో సోదాలు జరిపి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించారు. అలాగే, సమాజంలో జరిగే పలు అంశాలను ప్రతిబింబించే క్రమంలో రాసిన వివిధ కథనాలపై పరువు నష్టం కేసులు వేసింది. మరోవైపు.. సాక్షి విలేకరులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కులు దాడులకు తెగబడుతున్నారు. వారి తప్పులను ఎత్తిచూపడమే నేరమన్నట్లు భౌతిక దాడులకు దిగుతున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అలాగే, గుంటూరు జిల్లా సాక్షి ఛానల్ ప్రతినిధిపై కూటమి నేతలు దాడికి పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలోనూ సాక్షి విలేకరిపై దాడి చేశారు. ఇంకా అనేక చోట్ల సాక్షి మీడియాపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఇప్పుడు అసెంబ్లీ ద్వారా ప్రివిలేజ్ నోటీసు ఇచ్చి పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారు. -
గుర్తుకొచ్చిన ‘నాజీల’ పాలన
ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఏకంగా ఒక ప్రముఖ పత్రికా ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడి సోదాలు చేయడం ఒకప్పటి హిట్లర్ నాజీల పాలనను ప్రజల కళ్లకు కట్టింది. ప్రజాభిప్రాయాన్ని నాణేనికి రెండో పక్క ప్రతిబింబించే ప్రధాన పత్రిక ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డిపై ఇప్పటికే మూడు, నాలుగు కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం, తాజా ఘటన ద్వారా ఏకంగా ఆయన నైతిక స్థైర్యాన్నే దెబ్బతీసే ప్రయత్నం చేసింది. ‘సాక్షి’పై వీలైనప్పుడల్లా విషం కక్కే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోని పోలీ సులు నాటి నాజీ సేనలను గుర్తు చేశారు. నాజీల పాలనలో పత్రికా స్వేచ్ఛ ఎలా ఉందన్న విషయాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటే...ప్రజాభిప్రాయాన్ని నియంత్రించే సాధనాలుగా...అడాల్ప్ హిట్లర్ నాజీ పాలనలో (1933–1945), ప్రెస్ స్వాతంత్య్రాన్ని పూర్తిగా అణచివేశారు. ప్రజాభిప్రాయాన్ని నియంత్రించడానికి పత్రికలను ప్రచార పరికరంగా ఉపయోగించారు. ప్రభుత్వ నిర్దేశాలను అనుసరించి అన్ని మీడియా, పత్రికలు, రేడియో లకు కఠిన నియంత్రణలు విధించారు. జర్మనీలోని అన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ పార్టీకి అనుకూలంగా ఉండాల్సిందే. నాజీ ప్రభుత్వాన్ని ప్రోత్సహించడానికి, నిరసనలు నెమ్మదింపచేయడానికి మీడియానే సాధనంగా వినియోగించారు. నాజీలకు నిరసనలు తెలిపే పత్రికలను మూసివేశారు. వ్యతిరేక వార్తలను ప్రచురించడాన్ని పూర్తిగా నిషేధించారు. యూదులపై ద్వేషాన్ని ప్రేరేపించడానికి, ప్రజల మనస్సులో హిట్లర్, నాజీ పార్టీకి అనుకూల భావనను పెంపొందించేందుకు పత్రికలు పనిచేసేవి.ప్రతి పత్రికనూ జర్మనీ ప్రచార, ప్రజల బోధన మంత్రిత్వ శాఖ (రీచ్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ ఎన్‌లైట్‌మెంట్ అండ్ ప్రాపగాండా) పరిధిలోకి తీసుకొచ్చారు. దీనిని జోసెఫ్ గోబెల్స్ (తప్పుడు ప్రచారానికి ప్రస్తుత నానుడి) నాయకత్వం వహించారు. స్వతంత్రంగా పనిచేసే పత్రికలు, విపక్ష పత్రికలను నిషేధించారు లేదా బలవంతంగా మూసివేశారు. నాజీ పార్టీ ఆమోదించిన సమాచారం మాత్రమే ప్రచురితం కావాలి. ఒక జర్నలిస్ట్ చట్టబద్ధంగా పని చేయాలంటే, రీచ్ ప్రెస్ చాంబర్లో సభ్యత్వం తప్పనిసరి.కమ్యూనిస్టు, సోషలిస్టు, యూదు, లిబరల్ పత్రికలు తొలుత నిషేధానికి గురయ్యాయి. హిట్లర్ లేదా నాజీ పార్టీపై చేసే ఏవైనా విమర్శలను దేశద్రోహం లేదా రాజద్రోహంగా పరిగణించేవారు.పత్రికల నుంచి రేడియో, సినిమాలు, పిల్లల పుస్తకాల వరకు కూడా నాజీ ప్రచారంతో నిండిపోయేవి.చదవండి: ఇప్పటికైనా బౌద్ధాన్ని అర్థం చేసుకున్నామా?భావ ప్రకటనా స్వేచ్ఛ రద్దయ్యింది. జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నారంటే నాజీ ప్రభుత్వానికి సహకరించాలి. లేదంటే జైలుకు పోవాలి. లేదంటే ప్రాణాలే పోగొట్టుకోవాలి.జర్నలిస్టులు నిరంతరం భయంతో నిఘా నీడన బ్రతకాల్సి వచ్చేది. ఒక మాటలో చెప్పాలంటే, నాజీ పాలన పత్రికలను ప్రజాభిప్రాయం ప్రతిబింబించడానికి మాధ్యమాలుగా కాకుండా, తమకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలిచే శక్తిమంతమైన ఆయుధంగా మార్చింది. – ఎన్. భాస్కర్ ప్రసాద్, విజయవాడ -
ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా?: ఆర్.ధనంజయరెడ్డి
సాక్షి, అమరావతి: ఎలాంటి నోటీసులు లేకుండా ఓ పత్రిక ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడి సోదాలు చేయడం దేశ చరిత్రలో ముందెన్నడూ జరగలేదని, ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా.. అని సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాకుండా, ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగానే భావిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రాజకీయ కుట్రలో భాగంగా సోదాల పేరిట పోలీసులు వ్యవహరించిన నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. విజయవాడలోని తన నివాసంలో గురువారం పోలీసుల సోదాల ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక, లిక్కర్, మైనింగ్, విద్యుత్ స్కామ్‌లతో పాటు విజయవాడలో వరదలు, తిరుమలలో తొక్కిసలాట, సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు మద్దతు ధర కల్పించకపోవడం వంటి వరుస వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి గొంతునొక్కాలనే యత్నమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల మూడ్‌ను రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నంలో సాక్షి తన బాధ్యతను నిర్వర్తిస్తోందని చెప్పారు. దాన్ని ఓర్వలేకనే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగడుతున్నారని, దీనిని ఖండించకపోతే ఎవరింట్లోకైనా సరే ఇలాగే చొరబడతారన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఎవరి మీదా కేసు పెట్టకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. పోలీసులకు చట్టం, న్యాయం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేనట్టుగా కన్పిస్తోందని చెప్పారు. ‘ఉదయం ఉన్న ఫళంగా పది మంది పోలీసులు ఇంట్లోకి చొర బడ్డారు. ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఒక డీఎస్పీ, సీఐలతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వచ్చి, ఇల్లు సెర్చ్ చేస్తాం.. ఇది ఓపెన్ చేయండి.. అది ఓపెన్‌చేయండి.. ఇంట్లో ఉన్న వాళ్లను వాళ్లెవరు.. వీళ్లెవరు.. అంటూ ఆరాలు తీయడం దుర్మార్గం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే.. నాపై ఇప్పటికే 3–4 కేసులు పెట్టారుఇప్పటికే నాపై మూడు నాలుగు కేసులు పెట్టారు. ఒకటి సభా హక్కుల ఉల్లంఘన కేసు అన్నారు. ఒక వార్త రాస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి కాటమనేని భాస్కర్ ద్వారా ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి జారీ చేశారు. మొన్నటికి మొన్న తెలంగాణ, ఏపీ ఎడిషన్‌లో ఒకే వార్త వేర్వేరుగా రిపోర్టు అయ్యిందని మరో కేసు పెట్టారు. జర్నలిజం మౌలిక నియమాలు, ఓనమాలు తెలిసిన వారెవరికైనా ఇదేంటని తెలుసు. ఎక్కడన్నా ఒక ఘటన జరిగితే ఆ ప్రాంత రిపోర్టర్ స్పాట్ రాస్తారు. సొంత ఊళ్లో ఉన్న రిపోర్టర్‌కు మరిన్ని వివరాలు తెలుస్తాయి కాబట్టి మరింత లోతుగా ప్రజంట్ చేస్తారు. దాన్ని అడ్డం పెట్టుకొని నాపై కేసు పెట్టారు. కొంత మంది సాక్షి పాత్రికేయులపై కూడా కేసులు పెట్టారు. ఇదంతా సాక్షి గొంతునొక్కే ప్రయత్నంగా చూడాల్సి వస్తుంది. రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాలు ఎందుకొచ్చారు.. సెర్చ్ నోటీసు ఉందా? దాంట్లో నా పేరు ఏమైనా ఉందా? అని సోదాలకు వచ్చిన పోలీసు అధికారులను చాలా స్పష్టంగా అడిగాను. ‘లేదు సర్.. ఇన్ అండ్ అరౌండ్ సెర్చ్ చేస్తున్నాం.. జస్ట్ ఊరికే మీ ఇల్లు చూసేసి పోతాం’ అని చెప్పారు. కానీ వాళ్లు వ్యవహరించిన తీరు చూస్తుంటే రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాల పేరిట వచ్చారని స్పష్టంగా కన్పించింది. నా కార్ నంబర్, నా ఫోన్ నంబర్లు తీసుకున్నారు. వారు స్పష్టమైన లక్ష్యం, ఉద్దేశంతోనే వచ్చినట్టుగా స్పష్టమైంది. వారు చెబుతున్న లిక్కర్ కేసులో నిందితులు నా ఇంట్లో ఎందుకు ఉంటారు? వారికి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడకు ఎందుకు వస్తారు? ఏమైనా అడిగితే పై నుంచి ప్రెజర్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా పొలిటికల్ మోటివేషన్‌తో జరుగుతోందని అర్థమవుతోంది. -
‘సాక్షి’పై సర్కారు అక్కసు
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం నినదిస్తున్న ‘సాక్షి’ పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రజావ్యతి రేక విధానాలను నిలదీస్తున్న ‘సాక్షి’ పత్రికపై అక్రమ కేసులకు తెగబడుతోంది. రెడ్‌బుక్ కుట్రలో తాజా అంకంగా.. కేసు నమోదు చేయాలని రియ ల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)ను ఆదేశిస్తూ ప్రభుత్వం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ‘వాట్సాప్ గవర్నెన్స్’ విధానం పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ యాప్ ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించేదిగా ఉందని పలువురు నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో.. ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కు పరిరక్షణకు బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా సాక్షి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ స్పందించింది. ‘మన మిత్ర.. మరో మారీచుడు’ శీర్షికన గతనెల 3న ఓ కథనాన్ని ప్రచురించింది. గతంలో 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ అంశాలను కూడా ఇందులో ప్రస్తావించింది. ఆ కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే అమాంతంగా పెరిగిపోతున్న సోషల్ మీడియా వేధింపులు, సైబర్ నేరాలు బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం వాటిల్లే పరిస్థితి తలెత్తడం అందర్నీ ఆందోళనపరిచింది. కానీ, ఆ కథనం ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారింది. ‘సాక్షి’ పత్రికపై కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసు వేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. -
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
ప్రతి సంవత్సరం మే-3 న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటారు. మానవ హక్కుల ప్రాముఖ్యత, వాటిని పరిరక్షించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రభుత్వాలు మంచి పాలనను అందించడంలో పత్రికారంగం కీలక పాత్ర పోషిస్తోంది.1993లో ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ మే-3 వ తేదీని ప్రపంచ స్వాతంత్య్ర పత్రికా దినోత్సవంగా ప్రకటించింది. 1991లో యునెస్కో 26వ సర్వసభ్య సమావేశంలో చేసిన సిఫారసుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 1991 విండ్ హోక్ డిక్లరేషన్ ఫలితంగా కూడా ఈ ప్రకటన వచ్చింది. ఇది పత్రికా స్వేచ్ఛ గురించి ఆఫ్రికన్ పాత్రికేయులు తయారు చేసిన ప్రకటన. యునెస్కో నిర్వహించిన ఒక సెమినార్లో సమర్పించబడి మే-3న ముగిసింది. దీంతో ఆ రోజును పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా జరుపుకుంటారు.2023వ సంవత్సరానికి సంబంధించి పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత్ 161 స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 400కి పైగా టీవీ న్యూస్ చానళ్లు ఉన్నాయి. పత్రికలైతే వేలల్లో ఉన్నాయి. ప్రాంతీయ ప్రతికా స్వేచ్ఛ సూచీలో నార్వే, ఐర్లాండ్, డెన్మార్క్‌మొదటి మూడు స్థానాల్లో ఉండగా చివరి స్థానంలో నార్త్ కొరియా ఉంది. -
World Press Freedom Index 2023: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత్ నేలచూపులు
న్యూఢిల్లీ: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీ–2023లో భారత్ 11 స్థానాలు దిగజారింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా బుధవారం విడుదల చేసిన నివేదికలో 161వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. 180 దేశాల్లో పత్రికారంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల ఆధారంగా ఇచ్చే ఈ ర్యాంకుల్లో గతేడాది భారత్ 150వ స్థానంలో నిలిచింది. దీనిపై పత్రికా సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ‘భారత్ సహా పలు దేశాల్లో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కల్గుతోందని స్పష్టమవుతోంది. మీడియా క్రియాశీలక పాత్ర పోషించలేకపోవడం దారుణం’’ అని ది ఇండియన్ విమెన్స్ ప్రెస్ కోర్స్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. -
Sakshi Cartoon: భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ప్రమాదం-వరల్డ్ ప్రెస్ ఫ్రీడం
భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ప్రమాదం-వరల్డ్ ప్రెస్ ఫ్రీడం -
పత్రికా స్వేచ్ఛ.. నానాటికీ తీసికట్టు
న్యూఢిల్లీ: పత్రికా స్వేచ్ఛ సూచిలో మన దేశం ఏమాత్రం మెరుగ్గా లేదు. నానాటికీ తీసికట్టుగా పరిస్థితి తయారైందని తాజా అధ్యయనం వెల్లడించింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్ఎస్ఎఫ్) తాజాగా ప్రకటించిన దేశాల జాబితాలో మన దేశం 150వ స్థానంలో నిలిచింది. గతేడాది భారత్ ర్యాంక్ 142. ప్రతి దేశంలో పాత్రికేయులు, వార్తా సంస్థలు, నెటిజన్లకు ఉన్న స్వేచ్ఛను.. అలాంటి స్వేచ్ఛను గౌరవించే ప్రభుత్వ ప్రయత్నాలను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ హైలైట్ చేస్తుంది. జర్నలిజానికి ‘చెడు’గా పరిగణించబడే దేశాల జాబితాలో భారత్ గతేడాది చేర్చబడింది. జర్నలిస్టులపై జరుగుతున్న హింస, రాజకీయంగా పక్షపాత మీడియా, కేంద్రీకృత మీడియా యాజమాన్యం ఇవన్నీ భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ముప్పుగా పరిణమించాయని ఆర్ఎస్ఎఫ్ నివేదిక పేర్కొంది. ‘ఇండియా స్పెండ్’ నివేదిక ప్రకారం.. ఇంటర్నెట్ షట్‌డౌన్, తప్పుడు సమాచారం విస్త్రృత వ్యాప్తి కూడా గత ఐదేళ్లలో పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం ర్యాంక్ పడిపోవడానికి కారణమని వెల్లడించింది. కాగా, పత్రికా స్వేచ్ఛ సూచిలో నార్వే మొదటి స్థానంలో నిలవగా.. పాకిస్థాన్ 157వ స్థానంలో ఉంది. (క్లిక్: ఇంటర్నెట్ షట్డౌన్లో టాప్ ఎవరంటే?) -
గూగుల్, ఫేస్‌బుక్‌లతో ఆదాయం పంచుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రింట్ మీడియా సమస్యల పరిష్కారానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పలు సూచనలు చేశారు. ఆన్లైన్ వార్తలు ఎక్కువవుతున్నకొద్దీ ప్రింట్ మీడియాకు తగినన్ని ఆదాయ వనరులు సమకూర్చుకోవడం కష్టంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ వార్తల ద్వారా సమకూరే ఆదాయంలో అధికభాగం గూగుల్, ఫేస్బుక్ వంటి టెక్నాలజీ సంస్థలకే దక్కుతోందన్నారు. శుక్రవారం మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసిన ఎంవీ కామత్ ఎండోమెంట్ లెక్చర్‌లో ‘జర్నలిజం.. గతం, వర్తమానం, భవిష్యత్తు’అన్న అంశంపై ఉపరాష్ట్రపతి ఆన్లైన్లో మాట్లాడారు. వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్న గూగుల్, ఫేస్బుక్, స్థానిక మీడియా సంస్థలు కలిసి తమ ఆదాయాన్ని తగురీతిలో పంచుకునేలా జాతీయస్థాయిలో ఏకాభిప్రాయం సాధించాలని ఆకాంక్షించారు. స్థానిక మీడియా సంస్థల వార్తలకు గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలు కొంత రుసుము చెల్లించేలా ఒక చట్టం చేసేందుకు ఆ్రస్టేలియా ప్రభుత్వం సిద్ధం కావడాన్ని ప్రస్తావించారు. వార్తలకు వ్యాఖ్యలు జోడించకండి ఉపగ్రహాలు, ఇంటర్నెట్లు అందుబాటులోకి రావడంతో వార్తా ప్రపంచం తల్లకిందులైనట్లు అయిందని, అసలు, నకిలీ వార్తల మధ్య అంతరం తగ్గిపోయి ఆందోళన రేకెత్తిస్తోందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం, వార్తల రిపోర్టింగ్‌లో తగిన పద్ధతులు పాటించకపోవడం, సామాజిక బాధ్యతాలోపం వంటివి ఎక్కువయ్యాయని, ఎల్లో జర్నలిజమ్, లాభాపేక్ష, నకిలీ వార్తల వంటివి ఆందోళన కలిగించే అంశాలన్నారు. వార్తలకు వ్యాఖ్యలను జోడించవద్దని సూచించారు. -
డెమోక్రసీ ‘నాల్గవ స్తంభం’లో పగుళ్లు!
పత్రికా స్వేచ్ఛ అనేది వ్యాపార స్వేచ్ఛలో భాగమైపోవడమే అత్యంత విస్మయకరం, విచా రకరం. పత్రిక అనేది ఒక వ్యాపారం కానప్పుడే అది స్వేచ్ఛగా ఉన్నట్టు లెక్క. అందుకే అది వ్యాపారానికి దూరంగా ఉండాలి. – కారల్ మార్క్స్ (లిటరేచర్ అండ్ ఆర్ట్స్) అనుమాన పిశాచమనే నీడలో హేతువు, రుజువు, కారణం నిలవవు, ఓడిపోతాయి. న్యాయం చచ్చిపోతుంది. అలాగే కొందరు జర్నలిస్టులు కూడా తాము ఏదో ఎదిగిపోవాలన్న తొందరలో అర్థసత్యాలతో ఏపగింపు కల్గిస్తూ అవే అంతిమ సత్యాలుగా పాఠకులపై రుద్దేస్తూ తమ స్వేచ్ఛను దుర్వినియోగపరచుకుంటారు. ఈ తెచ్చిపెట్టుకున్న దురద పనికిమాలిన చిల్లర మల్లర చెత్త పత్రికలకు వర్తిస్తుందే గానీ ఉత్తమ ప్రమాణాలతో నడిచే గొప్ప పత్రికలకు వర్తించదు. దేన్ని బడితే దాన్ని, ఎవరు ఏది చెబితే దాన్ని నమ్మేవారు మసాలా కబుర్లలో ఆనందం పొందే బాపతు మాత్రమే, ఏది నిజమో, ఏది కట్టుకథో తేల్చుకోలేని వారు మాత్రమే తాత్కాలిక ఆనందానికి లోనవుతారు. కానీ వ్యక్తుల వ్యక్తిత్వాలను నర్మగర్భంగా, ముసుగువేసి నాశనం చేయడానికి అత్యుక్తులు రాసి సెన్సేషనలిజం ద్వారా సర్క్యులేషన్ పెంచుకునే ధోరణి– ఉత్తమ ప్రమాణాలు గల పత్రికలకు పడదు. పచ్చి అబద్ధాలను ఎదుర్కో వడమూ ఆ క్రమంలో కష్టసాధ్యమే. అందుకే ఉత్తమ ప్రమాణాలు గల పత్రికల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇదే క్షమించదగిన జర్నలిజా నికి, క్షమార్హంకాని జర్నలిజానికి మధ్య ఉన్న తేడా. – జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ (ఫ్రమ్ బెంచ్ టు ది బార్ పేజీ. 210) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) మానవాళికి ఎన్ని రకాల అనంతమైన అవకాశాలను ప్రసాదించిందో అంతకన్నా మించిన అనర్థాలను కూడా బలవంతంగా రుద్దుతోంది. యాప్‌లు, వాట్సాప్‌లు, లింకులు, వెబ్ లింకులు, మొబైల్స్, సూట్ కేసులో ఇమిడిపోయే కూపీ (ట్రాకింగ్) వ్యవస్థలూ, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు (పాత టెలిగ్రామ్ భాషను అప్పటికప్పుడు ఆధునికంగా వండివార్చే, బాజా సాధనం) ఇలా సవాలక్ష ముమ్మరిస్తున్న దశలో ఉన్నాం. జుకర్ బర్గ్ రంగంలోకి వచ్చి ఫేస్ బుక్ అనే కూపీ వ్యవస్థను నర్మగర్భంగా రంగంలోకి దించి దేశీయ సాంకేతిక, ఆర్థిక వ్యవస్థలను దేశాల ప్రయోజనాలకు విరు ద్ధంగా దేశీయ ప్రజలే ప్రయోగించేలా చేశాడు. ఆ మాటకొస్తే ఒకప్పుడు చైనీయులపైన నల్లమందు చల్లి, నల్లమందు భాయిలుగా బ్రిటిష్ వాడు ప్రచారం చేసినట్లే జుకర్‌బర్గ్ కూడా ఫేస్బుక్ ద్వారా భారతీయుల వ్యక్తిగత ఫోన్ల సమాచారాన్ని కోట్ల సంఖ్యలో ఫేస్ బుక్‌లో నమోదు చేసి అమెరికా, బ్రిటన్ మాళిగల్లో నిర్లిప్తంచేసి పెట్టాడు. అలా అని బీజేపీ పాలకులు జుకర్‌బర్గ్ ఫేస్బుక్ మనకే ఉపయోగిస్తుందని మురిసిపోయే సమయానికి మన పాలకుల గుట్టు మట్టుల్ని కూడా ఫేస్బుక్లో నిక్షిప్తం చేసేసరికి పాలకులు లబోదిబో మంటున్నారు. ఈ బాగోతం కాలిఫోర్నియాలో మన ప్రధాని హుషా రుగా జుకర్‌బర్గ్‌ను కలుసుకుని కరచాలనం చేసినంత సేపు పట్టలేదు. ఇప్పుడు బీజేపీ వారు జుకర్‌బర్గ్ బీజేపీ రహస్యాలను ప్రైవేట్ వ్యాపార ప్రయోజనాల్లో భాగంగా ఫేస్బుక్ ద్వారా బట్టబయలు చేస్తున్న దశలో ఫేస్‌బుక్‌పై చర్యలు తీసుకోవాలని గగ్గోలు పెడు తున్నారు. మనం చైనాపై ‘గుర్రు’తో డజన్లకొద్దీ టిక్ టాక్‌లను, అప్పో లను నిషేధించినట్లు ప్రకటించుకున్నా అమెరికాతో మనకు పైన వేసు కున్న లింకుల వల్ల జుకర్‌బర్గ్‌ను వదిలించుకోలేము. అమెరికాలో జూకర్బర్గ్ బంధించి ఉంచిన మన ఫోన్ నంబర్లనూ విడుదల చేయించుకోలేని దుస్థితి ఈ సాంకేతిక ఉచ్చు మనచుట్టూ బిగియడానికి కారణం.. మన సర్వర్ల ‘బిస’ అంతా అమెరికాలోనే ఉండటం! ఆంధ్ర ప్రదేశ్‌లో టెక్నాలజీ మాయ చాటున కొన్ని తొత్తు పత్రికలు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్నీ, అటు రాష్ట్ర న్యాయ వ్యవస్థనూ కూడా అబద్ధాల అల్లికతో అభాసుపాలు చేయడానికి సంకల్పించి తప్పుడు కథనాలకు తెరలేపుతున్నాయి. న్యాయవ్యవస్థకూ చట్టబద్ధంగా ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య గండికొట్టి, అడుగువూడిన పాత పాలకులకు ప్రాణప్రతిష్ట చేయాలన్న తాపత్రయంకొద్దీ ‘న్యాయదేవతపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా’ అంటూ అశరీరవాణి కథనాలు అల్లుతోంది: ఒక్క దానికీ రుజువులు లేవు. పైగా రాష్ట్ర హైకోర్టు పేరును దుర్వినియోగపరుస్తూ, అలాంటి అలవాటులోనే ఉన్న ఆ ‘కెప్ట్ ప్రెస్’ అల్లిన కథనం అంతా ఆధునిక టెక్నాలజీ మెలకువలన్నింటినీ దుర్వినియోగం చేసి, ఆ కథనానికి తానే కర్త, కర్మ, క్రియగా మారిన మాస్టర్ అల్లిక అది. ఆ పత్రిక అల్లికల్లోని అంశాలు స్థూలంగా: ‘న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్? వెబ్‌లింక్ ద్వారా మొబైల్‌పై వల; వాట్సాప్ సందేశాలపైన నియంత్రణ, చదవక ముందే రీడింగ్‌మోడ్ లోకి, మాటల్లో అస్పష్టత, సమస్యలపై సాంకేతిక నిపుణులతో పరీక్ష, నెట్వర్క్ మొబైల్ మాత్రం బాగుందని నిర్ధారణ– అయినా అంతు చిక్కని ఇబ్బందులు అయినా నిఘాయే కారణమని అనుమానం, సూట్‌కేసులో ఇమిడిపోయే ట్రాకింగ్ వ్యవస్థ’ వల్ల ‘ఆధునిక టెక్నాలజీతో ఈ పనులన్నీ అత్యంత సులభమని’ ఆ కథనం సారాంశం. ఆ మొత్తం కథనం అంతా ఆధారపడింది వాస్తవాలపైన కాదు, పూర్తిగా ‘సొంత డబ్బా’పైననే! ‘న్యాయాన్ని అమ్మేవాడూ, దోవలు దోచేవాడూ ఒకటే’నన్న జగమెరిగిన మన తెలుగు సామెత. ఆ మాటకొస్తే అబద్ధం అంటేనే అతుకులమూట అనీ, అల్లిన కథనం దాచినా దాగని సత్యమనీ ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. నిజానికి ‘న్యాయదేవతపై నిఘా’ వేసే తెలివితేటలు గాడితప్పి వ్యవహరిస్తున్న నడమంత్రపు పాత్రికేయులకు తప్ప వృత్తి ధర్మాన్ని, ప్రమాణాలను పాటించే వారికి ఉండజాలవు. రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో వైఎస్ జగన్ తనకు మించిన దీటైన పోటాపోటీతో తలపడి ‘ఢీ’కొనగల సత్తా ఉన్నవాడని భావించినందునే లోలోన టీడీపీ అధినేత చంద్రబాబు కుమిలిపోయాడు. అందుకే తప్పుడు ఆరోపణల పైన కుట్ర ద్వారా 16 మాసాలపాటు జైలుపాలు చేశాడని లోకానికి తెలిసి పోయింది. అయినా గత ఆరేళ్లకుపైగా సీబీఐ స్పెషల్ కోర్టులూ ఎంతసేపు ‘ఏవి మీ ఆధారాలు’ అని నిరంతరం ప్రశ్నిస్తూ ఉన్నా ఈ రోజుదాకా జగన్‌పై కేసులు అలా కొనసాగడం రాజ్య వ్యవస్థలో, న్యాయ వ్యవస్థల్లో చెండితనానికి నిదర్శనం కాదా? అంతేగాదు, చివరికి ‘ఆదాని శాసిస్తాడు/మోదీ పాటిస్తాడు/ జగన్ జైలుకు, భార్య భారతి ముఖ్యమంత్రి కుర్చీపైకి’ అనేంతగా పాత్రికేయ అజ్ఞాని బరి తెగించడాన్ని ఇతరులే కాదు, న్యాయ వ్యవస్థ కూడా సహించరానిది. దేశంలో న్యాయవ్యవస్థ పనితీరును గమని స్తున్న వారికి గత 70 ఏళ్లలో మన రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ‘నాలుగు స్తంభాల’లో ఒకటైన పత్రికా వ్యవస్థతో పాటు మిగతా మూడు వ్యవస్థలు కూడా క్రమక్రమంగా ఎలా బీటలిచ్చి పోతు న్నాయో గమనించాల్సిన పరిణామం. దీనికి కారణం– ఈ రాజ్యాంగ వ్యవస్థలేవీ రాజ్యాంగం నిర్దేశిం చిన మౌలిక లక్ష్యాలకు కట్టుబడకుండా గాడితప్పి నడుచుకొంటు న్నాయి. బహుశా అందుకనే సు్రçపసిద్ధ సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ వీఆర్ కృష్ణయ్య కొన్ని విషయాలను ఇలా బాహాటంగా చెప్పగలిగారు: ‘న్యాయమూర్తులుగా పదవీ స్వీకారం చేసే ముందు రాజ్యాంగ నిబంధనలను కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ ప్రతిజ్ఞకు అర్థం– రాజ్యాంగం నిర్దేశించిన సోషలిస్టు, సెక్యులర్, ప్రజాస్వామ్య రాజకీయాలను పాటిస్తానని. ఇదెలా సాధ్యం? న్యాయమూర్తులకు రాజకీయ సిద్ధాంత తాత్వికత అనివార్యం. న్యాయమూర్తుల నియా మకం రాజ్యాంగం ప్రకారం జరిగిందిగానీ రాజ్యాంగానికి అతీతంగా జరగలేదు గనుక ఈ సైద్ధాంతిక నిబద్ధత అనివార్యం. ఒక కోటీశ్వ రుడు– మురికివాడల్లో నివసించే పేదవాడి ముందు నిలబడి నాకు రాజకీయాలు లేవు అని చెబితే అతణ్ణి మీరు నమ్ముతారా? అలాగే ఒక కార్మిక సంఘం నాయకుడు తన పారిశ్రామిక యజమాని ముందు నిల బడి నాకు రాజకీయాలు లేవంటే అది ఒట్టి తొండిమాట. రాజకీయా లున్నంత మాత్రాన వ్యక్తి న్యూనతగా భావించుకోరాదు. ‘నాకు రాజ కీయం’ లేదని దాచటం నేరం. మనం మనసిచ్చి భోళాగా మాట్లా డదాం. ఇతర వృత్తులలో ఉన్నవారి మాదిరిగానే న్యాయమూర్తులకు కూడా రాజకీయాలుంటాయి. కానీ, న్యాయ ప్రక్రియ అనేది మాత్రం కులాలకు, వర్గాలకు, సమూహాలకు అతీతం’! అంతేగాదు, కోర్టు ధిక్కార నేరాధికారాన్ని కోర్టు సమర్థించు కోవాలంటే, జరగాల్సిన న్యాయాన్ని జరగనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నంలో కోర్టు తన ‘ధిక్కార ప్రయోగా’న్ని సమర్థించడం సబబ వుతుందని జస్టిస్ బ్లాక్ (1943) నిర్ధారించాడు. అలాగే కోర్టు తీర్పును సదుద్దేశంతో విమర్శించే ఎవరినీ తప్పుబట్టరాదనీ, అలాంటి విమర్శ సామాన్యుడి హక్కు అనీ ప్రివీకౌన్సిల్‌లో ఏనాడో లార్డ్ అడ్కిన్ ప్రకటిం చాడు. అంతేగాదు, నిజం చెప్పాలంటే, వార్తా పత్రికల్లో వచ్చే విమ ర్శలవల్ల వృత్తి నైపుణ్యంగల ఏ న్యాయమూర్తీ ప్రభావితుడు కాడని క్వీన్స్ కౌన్సిల్ సీనియర్ సభ్యుడు, సుప్రసిద్ధ న్యాయమూర్తి లార్డ్ డెన్నింగ్ స్పష్టం చేశాడు. మీడియాలో వచ్చే విమర్శలకు ఏ న్యాయ మూర్తీ ప్రభావితం కాకనక్కర్లేదనీ, వాటిని వృత్తిరీత్యా వచ్చే ఇబ్బందు లుగానే భావించి న్యాయమూర్తులు కూడా ప్రజల విమర్శను శిరసా వహించడం ధర్మమని లార్డ్ సాల్మన్ ప్రకటించాడు. అన్నింటికన్నా ‘కోర్టు ధిక్కార నేరం’ అనే ఆరోపణల గురించి లార్డ్ డెన్నింగ్ ఒక శిలా శాసనంగానే లభించిన పరిపక్వమైన వాక్యాలను ప్రపంచ న్యాయ శాస్త్రవేత్తలు తరచుగా పేర్కొనడాన్ని మనం మరచిపోరాదు. ‘ఈ కోర్టు ధిక్కారమనే మన అధికారాన్ని మన న్యాయమూర్తుల సొంత గౌరవాన్ని ప్రదర్శించుకోవడానికి ఉపయోగించరాదు. స్పష్ట మైన సాక్ష్యంమీదనే ధిక్కార నేరం మోపాలి. అంతేగానీ మనను విమ ర్శించే వారిని అణచడం కోసం ఈ అధికారాన్ని వినియోగించరాదు. మనం విమర్శకు భయపడరాదు, విమర్శను వ్యతిరేకించరాదు. కానీ అంతకన్నా మనం కోల్పోయే అత్యంత ముఖ్యమైన ప్రాణప్రదమైన స్వేచ్ఛ ఒకటుంది– అదే భావప్రకటనా స్వేచ్ఛ. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన విషయాలపైన సరసమైన వ్యాఖ్య, భోళా విమర్శ చేసే హక్కు పార్లమెంటులోనూ, బయటా, పత్రికల్లోనూ, టీవీలలోనూ పౌరులకు ఉంది. మా ప్రవర్తనే అంతిమ సాక్ష్యంగా నిలబడాలి. అంతే గానీ, చుట్టూ చెడు జరుగుతుంటే మౌనంగా ఉండిపోవటం మార్గం కాదు’ అలా అని, పత్రికలు తమ సర్క్యులేషన్ పెంచుకోవడానికి అవధులు లేని స్వేచ్ఛతో ఇతరులపై తప్పుడు ఆరోపణలు, నిందలు వేయటానికి పూనుకోవటం భావ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే నని డెన్నింగ్ ప్రకటించాడు. అందుకేనేమో క్యూబా విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రో అత్యంత స్పష్టంగా హెచ్చరించిపోయాడు– ‘నా ఒక్కడివల్లే, దేశం మారిపోతుందా? అనుకునే ఏ ఒక్కడివల్లా దేశానికి ప్రయోజనం లేదు’ అని!! వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్ -
పాత్రికేయులు పనికిరారా?
పత్రికా స్వేచ్ఛ అపరిమితమైందేమీ కాదు. పాత్రికేయవృత్తి ప్రమాణాలను రక్షించడానికి, మర్యాదలు కాపాడడానికి నీతి నియమావళులు ఉండాలి. పత్రికా స్వేచ్ఛను విచ్చలవిడిగా వాడుకోకూడదన్నట్టే, ప్రభుత్వాధికారులు తమ విపరీతమైన అధికారాలను కూడా విచ్చలవిడిగా వాడుకోకూడదు. మన సంవిధానమే కాదు ప్రజాస్వామ్య సంవిధానమేదైనా పాలకుల విపరీత అధికారాలను కట్టడి చేయడానికే. ప్రభువులకు అధికారాలు మత్తు కలిగిస్తాయి. ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన కోట్లాది రూపాయలపైన పెత్తనం మొదటి మత్తు. సైనికదళాలమీద అదుపు మరొక మత్తు. జనం మెదళ్ల మీద పెంపుడు మీడియాను ప్రయోగించే బ్లాక్ మెయిల్ పాలన ఇంకొక మత్తు. జాతి భద్రత, సమైక్యత అనే అందమైన జంటపదాల చాటున అధికార దాహంతో కరాళ నృత్యం చేస్తుంటారు. స్వతంత్రమైన మాధ్యమాలు ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించాలి. ఆ స్వతంత్రులు ఈ దుర్మార్గుల దాడులకు బలికాకుండా కాపాడుకోవడానికి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అది ప్రెస్ కౌన్సిల్. ఇది పాత్రికేయుల వృత్తి రక్షణ సంస్థగా పనిచేయాలనే లక్ష్యం నిర్దేశిస్తూ చట్టం చేశారు. ప్రభుత్వం ఒక్కోసారి అన్ని మాధ్యమాల మీద విరుచుకుపడినప్పుడు ప్రెస్ కౌన్సిల్ ప్రజలకోసం, పత్రికల స్వేచ్ఛ కోసం నిలబడవలసి ఉంటుంది. నీతినియమావళి ద్వారా పాత్రికేయులను కొంతవరకు, మందలింపుల ద్వారా అధికారులను కొంతమేరకు పగ్గాలు వేసి ఆపవచ్చు. అదే ప్రెస్ కౌన్సిల్ బాధ్యత. జమ్మూకశ్మీర్‌లో వాక్ స్వాతంత్య్రం పైన ఆగస్టు నెల మొదటి నుంచి ప్రతిబంధకాలు మొదలైనాయి. ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్లు పనిచేయడం లేదు. పత్రికా కార్యాలయాలకు, కలాలకు, నోళ్లకు, మెద ళ్లకు కూడా తాళాలు వేశారు. ఎంత మహానాయకుడైనా సరే కశ్మీర్లో అడుగుపెట్టాలంటే సుప్రీం కోర్టు అనుమతి తీసుకునే పరిస్థితి ఉంది. ఇదేమి అరాచకం అన్నవాడు పాకిస్తాన్ స్నేహితుడో లేదా ఇమ్రాన్ ఖాన్ అల్లుడో అవుతాడు. ‘కనీసం మా పత్రికా కార్యాలయాలనైనా తెరవనివ్వండి. ఏం జరుగుతున్నదో రిపోర్ట్ చేయనీయండి. అక్షరాల వెలుగులపైన ఈ కటిక చీకటి ఆంక్షలు ఇంకెన్నాళ్లో చెప్పండి. కొంచెమన్నా సడలించడానికి వీలుంటుందేమో ఆలోచించి కేంద్ర ప్రభుత్వానికి తగిన రిట్లు జారీ చేయండి’ అని ఒక పత్రికా సంపాదకురాలు సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ముందున్న అనేకానేక అత్యంత ప్రధానమైన వివాదాల మూటలు విప్పి, ఈ వివాదం వినాలో లేదో నిర్ణయించుకునే సర్వస్వతంత్ర వ్యవస్థ మన న్యాయవ్యవస్థ. తీరిక ఉన్నపుడు ఈ వివాదాన్ని కూడా పరిశీలిస్తుందనే ఆశాభావంతో బతకడం మనమే నేర్చుకోవాలి. ఇక్కడ ప్రమాదకరమైన కొత్త విచిత్రమేమంటే, ప్రెస్ కౌన్సిల్ సంస్థాగతంగా పాత్రికేయు రాలి అభ్యర్థనను వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకోవడం. ప్రెస్ కౌన్సిల్ చట్టం ప్రకారం పత్రికా స్వాతంత్య్రం పైన పరిమితుల సమంజసత్వాన్ని పరిశీలించి, పునఃసమీక్షించి, అన్యాయమైన పరిమితులను సడలించాలని, న్యాయమైన పరిమితులు పాటించాలి. కానీ ఈ ఆంక్షలను రక్షించడానికే ప్రెస్ కౌన్సిల్ పూనుకోవడం ఆశ్చర్యకరమైన పరిణామం. ఈ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నది స్వయానా ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షమహాశయుడైన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగారే. కనీసం వారు ప్రెస్ కౌన్సిల్లో ఈ విషయం చర్చించలేదని, ఎవరినీ సంప్రదించలేదని అంటున్నారు. తనకు తానే ప్రెస్ కౌన్సిల్‌ను హోం మంత్రిత్వశాఖ అనుబంధ సంస్థగా మార్చి కలాలకు అండగా కాకుండా తుపాకులకు అండగా పత్రికా కార్యాలయాల తాళాలకు అనుకూలంగా భజన తాళం వేయాలనుకోవడం మన వ్యవస్థల పతనానికి తాజా ఉదాహరణ. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన నిపుణుడూ గౌరవనీయమైన పెద్దమనిషే ఈ విధంగా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే, ఇక రాజ్యాంగానికి దిక్కెవరు? కలాలకు మొక్కెవరు? అసలు ప్రెస్ కౌన్సిల్‌కు అధ్యక్షత వహించడానికి జర్నలిస్టులకు అర్హత లేకపోవడమేమిటనే మౌలికమైన ప్రశ్న ఉదయిస్తున్నది. మెడికల్ కౌన్సిల్‌కు డాక్టర్లు, బార్ కౌన్సిల్‌కు లాయర్లు అధ్యక్షులుగా ఉంటారు. కానీ మరొక వృత్తిపరమైన ప్రమాణ రక్షణ సంస్థకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగారు ఎందుకు అధ్యక్షు డుగా ఉండాలి? పాత్రికేయులలో సమర్థులు, పరి పక్వత కలిగినవారులేరా? ఈ ప్రశ్నలు జర్నలిస్టులు వేయకపోవడం బాధాకరమైన దుష్పరిణామం. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
సాగు సంక్షోభం .. నిరుద్యోగం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ ఎన్నికలు, నిరుద్యోగం, సాగు సంక్షోభం, కరువు, పత్రికా స్వేచ్ఛ వంటి అంశాలను ఆదివారం నాటి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా లేవనెత్తింది. జమ్మూ కశ్మీర్లో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు ముందు కేంద్రం నిర్వహించిన ఈ భేటీలో.. ఈ అంశాలన్నిటినీ పార్లమెంటులో చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇది ఇప్పటికీ ఒక సైద్ధాంతిక పోరాటమేనని కాంగ్రెస్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్ ఎంపీలు అధీర్ రంజన్ చౌదరి, కె.సురేష్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రీన్ తదితరులు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని కూడా విపక్షాలు గట్టిగా ప్రస్తావించాయి. కాగా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని టీఎంసీ నేతలు సుదీప్ బంద్యోపాధ్యాయ్, ఒబ్రీన్లు నొక్కిచెప్పారు. అదే సమయంలో సమాఖ్యవాదం బలహీనపడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ..రాష్ట్రాలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం ఆమోదనీయం కాదని విపక్షాలు స్పష్టం చేశాయి. ‘అధికారంలోకి వచ్చినందుకు ప్రభుత్వాన్ని అభినందించాం. ఇది సైద్ధాంతిక పోరాటం, గతంలోనూ సైద్ధాంతిక పోరాటమే. సైద్ధాంతిక పోరాటంగానే ఉంటుంది కూడా..’ అని ప్రభుత్వానికి చెప్పినట్లు సమావేశం తర్వాత ఆజాద్ విలేకరులకు తెలిపారు. లౌకిక శక్తులకు కాంగ్రెస్ పార్టీ పునాది వంటిదని, ప్రభుత్వంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఆ స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. అధికారంలో లేకపోయినా రైతులు, కార్మికులు, మహిళల అభ్యున్నతికి కృషి కొనసాగిస్తామని అన్నారు. దేశంలో భారీ నిరుద్యోగిత, కరువు పరిస్థితులు, సాగు సమస్యలు, తాగునీటి కొరత వంటి అంశాలపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ‘పత్రికా స్వేచ్ఛ గురించి కూడా లేవనెత్తాం. జర్నలిస్టుల విషయంలో అధికార పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావించాం. వారిని కొడుతున్నారు. వారి గొంతును అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని ఖండిస్తూ ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం..’ అని ఆజాద్ తెలిపారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన అవసరం లేదని, త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలిగినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదన్నారు. ఎన్నికలకు రాష్ట్రాల నిధులు, బ్యాలెట్ పేపర్ల వంటి ఎన్నికల సంస్కరణలను టీఎంసీ లేవనెత్తింది. ప్రతిదానికీ ఆర్డినెన్సును ఉపయోగించడాన్ని కూడా టీఎంసీ ప్రస్తావించింది. దురదృష్టవశాత్తూ 16వ లోక్‌సభలో గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దానిని మితిమీరి ఉపయోగించారని బంద్యోపాధ్యాయ, ఒబ్రీన్ చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వి. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీ ఫలప్రదం: మోదీ ‘ఎన్నికల ఫలితాల తర్వాత, పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఒక ఫలప్రదమైన అఖిలపక్ష భేటీ జరిగింది. విలువైన సూచనలిచ్చిన నేతలకు కృతజ్ఞుడినై ఉంటా’ అంటూ అఖిలపక్ష భేటీ అనంతరం మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం, అలాగే ఎన్డీయే భేటీ ఆదివారం ఢిల్లీలో జరిగాయి. బడ్జెట్, ట్రిపుల్ తలాక్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా పదిహేడవ లోక్‌సభ మొదటి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం, ట్రిపుల్ తలాక్ వంటి ఇతర కీలక చట్టాలు ప్రభుత్వ ఎజెండాలో అగ్రభాగాన ఉండనున్నాయి. మొదటి రెండురోజులు సభ్యుల ప్రమాణ స్వీకారానికి వినియోగిస్తారు. 19న స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మరుసటి రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జూలై 5న బడ్జెట్ ప్రవేశ పెడతారు. 26 వరకు సమావేశాలు కొనసాగుతాయి. జూన్ 20 నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఏపీ ఎంపీల ప్రమాణస్వీకారం సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సోమ, మంగళవారాల్లో లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ వీరితో ప్రమాణం చేయిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీల ప్రమాణస్వీకారం సోమవారం మధ్యాహ్నానికి పూర్తికానుంది. అక్షర క్రమంలో మొదటగా అండమాన్ నికోబార్ ఎంపీలు, తర్వాత ఏపీ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికెన వైఎస్సార్సీపీ ఎంపీలందరూ సోమవారం ఉదయం వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నివాసంలో భేటీ కానున్నారు. -
భారత్‌లో పత్రికా స్వేచ్ఛ దారుణం
లండన్: పత్రికా స్వేచ్ఛలో భారత్ తాజాగా మరో రెండు స్థానాలు దిగజారి 140వ ర్యాంకుకు పరిమితమైంది. పారిస్ కేంద్రంగా పనిచేసే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ 2019 ఏడాదికి పత్రికా స్వేచ్ఛ అంశంలో 180 దేశాలకు ర్యాంకులు కేటాయించింది. ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ – 2019’ పేరిట ఓ నివేదికను సంస్థ గురువారం విడుదల చేసింది. ఎన్నికల సమయం కావడంతో పాత్రికేయుల మీద అధికార బీజేపీ నేతల దాడులు పెరిగిపోయాయని సంస్థ ఈ నివేదికలో పేర్కొంది. భారత్‌లో గతేడాది జర్నలిస్టులపై జరిగిన హింసాత్మక దాడుల్లో ఆరుగురు చనిపోయారనీ, ఏడవ జర్నలిస్టు మృతి అంశంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయంది. ‘భారత్‌లో పాత్రికేయులపై పోలీసులు, మావోయిస్టులు, నేర ముఠాలు, అవినీతి రాజకీయ నాయకులు హింసాత్మక దాడులకు పాల్పడటం, వారిని బెదిరించటం వంటివి చేస్తున్నారు. ఇలాంటి దాడుల వల్ల గతేడాది ఆరుగురు జర్నలిస్టులు చనిపోయారు’ అని నివేదిక తెలిపింది. ఆంగ్లేతర భాషల మీడియాకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయంది. 2018లో భారత్‌కు 138వ ర్యాంకు దక్కగా తాజాగా 140వ స్థానానికి చేరింది. ఇక 2019 ఏడాదికి ప్రపంచ పత్రికా స్వేచ్ఛలో నార్వే మూడోసారి తొలి ర్యాంకు పొందింది. ఫిన్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్‌కు పొరుగు దేశాలైన పాకిస్తాన్ 142వ ర్యాంకు, బంగ్లాదేశ్ 150వ ర్యాంకు పొందాయి. సూచీ చిట్టచివరన తుర్క్మెనిస్తాన్ (180వ ర్యాంకు), ఉత్తర కొరియా (179), చైనా (177), వియత్నా (176) ఉన్నాయి. ఆఫ్రికా దేశాలైన ఇథియోపియా 110వ ర్యాంకును, గాంబియా 92వ ర్యాంకును పొందాయి. -
‘మీడియాకు అదే పెద్ద సవాల్’
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ పత్రికా దినోత్సవం (నవంబర్ 16) సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పాల్గొన్నారు. జూరీ ఎంపిక చేసిన జర్నలిస్టులకు ఆయన అవార్డులు ప్రదానం చేశారు. హిందూ పత్రిక చైర్మన్ ఎన్ రామ్‌కు ఆయన రాజా రామ్మోహన్ రాయ్ అవార్డును అందజేశారు. అవార్డులు పొందిన వారికి అరుణ్ జైట్లీ, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు, జ్యూరీ కన్వీనర్ దేవులపల్లి అమర్ అభినందనలు తెలిపారు. సమావేశంలో జైట్లీ ప్రసంగించారు. ఈ టెక్నాలజీ యుగంలో సమాచారాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని అన్నారు. టెక్నాలజీ ప్రెస్ సెన్సార్ షిప్ ను అనుమతించదని తెలిపారు. ‘మీడియా తన విశ్వసనీయతను తిరిగి పొందడం అనేది ప్రస్తుతం ఉన్న అసలైన సవాల్’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. మీడియా దుర్వినియోగం అయితే దాని మనుగడే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.‘ఎన్ రామ్‌కు రామ్మోహన్ రాయ్ పేరుతో అవార్డు ఇవ్వడం నాకు గౌరవప్రదంగా ఉంది. ఇది మరింత బాధ్యతను పెంచే విధంగా ఉంది’ అని చెప్పారు. -
జర్నలిస్టు స్వాతికి ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు
లండన్: ప్రతిష్టాత్మక లండన్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఫర్ కరేజ్–2018 భారత్‌కు చెందిన పరిశోధనాత్మక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేదిని వరించింది. సామాజిక మాధ్యమాల్లో వేధింపుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నందుకు ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఆన్లైన్లో భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగాల విద్వేషపూరిత వేధింపులను ఆమె వెలుగులోకి తెచ్చారు. ఇటలీ, టర్కీ, మొరాకోకు చెందిన జర్నలిస్టులను అధిగమించి ప్రియాంక ఈ అవార్డును గెలుచుకున్నారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానే కాకుండా ఆమె ’ఐ యామ్ ఏ ట్రోల్: ఇన్సైడ్ ది సీక్రెట్ వరల్డ్ ఆఫ్ ది బీజేపీ డిజిటల్ ఆర్మీ’ అనే పుస్తకాన్ని రచించారు. గురువారం లండన్‌లో జరిగిన కార్యక్రమంలో రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్(ఆర్‌డబ్ల్యూబీ) అనే సంస్థ అవార్డును స్వాతికి ప్రదానం చేసింది. స్వాతి మాట్లాడుతూ ‘ సమర్థంగా చేసిన నా పనికి కాకుండా నా ధైర్యానికి ఈ అవార్డు పొందడం కొంత విచారకరం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాను శత్రువుగా చిత్రీకరిస్తున్నారు. భారత్‌లో గతేడాది ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ తన ఇంటి బయటే హత్యకు గురవడం భయభ్రాంతులకు గురిచేసింది. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. విమర్శల పట్ల ప్రభుత్వాలు సహనం పాటించడంలేదు. ఆన్లైన్లో నాకు ఎన్నో వేధింపులు ఎదురయ్యాయి. అవి నాపై ప్రభావం చూపి ఉంటే విధుల్ని సరిగా నిర్వర్తించేదాన్నే కాదు. దాడులు, ప్రాణ హాని ఎదుర్కొంటున్న జర్నలిస్టుల కోసం ఆర్‌డబ్ల్యూబీ పాటుపడటం ధైర్యాన్నిస్తోంది’ అని అన్నారు. స్వాతి చతుర్వేది -
సెన్సార్బోర్డుగా మారిన ‘ఐ అండ్ బీ’
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో పత్రికా స్వేచ్ఛ రోజు రోజుకు హరించుకుపోతోంది. ప్రభుత్వం, రాజకీయ నాయకులు, సంఘ్ పరివారం చేతుల్లో అణచివేతకు గురవుతోంది. 2018లోకి ప్రవేశించిన నాలుగు నెలల్లోనే పత్రికా స్వేచ్ఛపై అణచివేత ఎంతగానో ఉందని, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడంలో సెన్సార్ సంస్థగా ఎంతో క్రియాశీలక పాత్ర పోషించిందని మీడియా వాచ్డాగ్ ‘ది హూట్’ ఓ నివేదికలో వెల్లడించింది. బుధవారం నాడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నివేదికను విడుదల చేసింది. మీడియాను పర్యవేక్షించేందుకు కేంద్ర ఐబీ శాఖ ఎన్నో ప్రక్రియలను ప్రకటించి జర్నలిస్టుల గొడవతో ఒక నిర్ణయాన్ని మాత్రమే వెనక్కి తీసుకుందని నివేదిక తెలిపింది. 2018 జనవరి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు, నాలుగు నెలల్లో పత్రికా స్వేచ్ఛ అణచివేతకు సంబంధించి వంద సంఘటనలు జరిగాయని పేర్కొంది. వాటిల్లో మూడు సంఘటనల్లో జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. 21 సంఘటనల్లో దాడులు, బెదిరింపులు, అరెస్ట్‌లు ఉన్నాయి. 2017లో దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై జరిగిన దాడులకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కలను కూడా ‘ది హూట్’ నివేదిక ప్రస్తావించింది. తాము అన్ని విధాల పునర్ పరిశీలించామని, 2017లో దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై 46 దాడులు జరిగాయని స్పష్టం చేసింది. 2017లో జర్నలిస్టులపై 15 దాడులు మాత్రమే జరిగాయని కేంద్ర మంత్రి హన్సరాజ్ అహిర్ రాజ్యసభకు ఫిబ్రవరిలో తెలిపారు. ఈ దాడులకు సంబంధించి 26 మందిని అరెస్ట్ చేశామని కూడా ఆయన చెప్పారు. జర్నలిస్టులపై ఎవరు దాడులు చేశారన్న దానికి కేంద్ర హోం శాఖ వద్ద సమాచారం లేదని, కానీ తమ వద్ద సమాచారం ఉందని ‘ది హూట్’ పేర్కొంది. మూడు సంఘటనల్లో పోలీసులే దాడులు జరిపించగా, మరో మూడు సంఘటనల్లో సంఘ్ పరివార్ సంస్థలు దాడులు జరిపించాయని, మరో మూడు సంఘటనల్లో బెదిరింపులకు కూడా సంఘ్ పరివార్ సంస్థలే కారణమని ఆరోపించింది. దేశంలో ఇప్పటికే 25 చోట్ల ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వం అడ్డుకుందని కూడా తెలిపింది. 180 దేశాల పత్రికా స్వేచ్ఛ సూచికలో గతేడాది భారత్ 136వ స్థానంలో ఉండగా, అది ఈ ఏడాదికి 138వ స్థానానికి పడిపోయిన విషయం ఇటీవలనే వెల్లడైంది. -
కలాలకు రక్షణేదీ?
పత్రికలు ప్రజలకు గొంతునిస్తాయి. అవి నిజాలను చాటుతాయి. అక్రమాలను వెలికితీస్తాయి. అన్యాయాలను ఎండగడతాయి. ప్రజల పక్షాన నిలబడతాయి. పత్రికలు ప్రజలకు గొంతునివ్వడం, అవి నిజాలను చాటడం, అక్రమాలను వెలికితీసి, అన్యాయాలను ఎండగట్టడం కొందరికి సహజంగానే మింగుడుపడదు. ముఖ్యంగా అధికారం తలకెక్కిన వారికి పత్రికల తీరు అసలే కొరుకుడుపడదు. ప్రపంచంలో చాలా ప్రజాస్వామిక దేశాల్లోని రాజ్యాంగాలు పత్రికల స్వేచ్ఛకు భరోసా ఇస్తున్నా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు, అన్యాయాలకు తెగబడే పాలక వర్గాలు మాత్రం పత్రికల స్వేచ్ఛను కట్టడి చేయడానికి శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటాయి. రాజ్యాంగ పరిధిలో పత్రికల స్వేచ్ఛకు కళ్లెం వేసే పరిస్థితి కుదరనప్పుడు పాత్రికేయులపై బలప్రయోగం ద్వారా, వారిలో భయాందోళనలను సృష్టించడం ద్వారా పత్రికలను లొంగదీసుకునే ప్రయత్నాలు సాగిస్తుంటాయి. అధికారం అండతో పెట్రేగిపోయే నేర ముఠాలు పాత్రికేయులపై భౌతిక దాడులకు పాల్పడటం, కొన్ని సందర్భాల్లో పాత్రికేయులను ఏకంగా అంతమొందించడం వంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇంకొన్నిసార్లు నిజాలు వెల్లడిస్తూ వార్తాకథనాలు రాసినందుకు కేసుల్లో ఇరికిస్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్యమే... అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలో గుర్తింపు పొందినా, పత్రికా స్వేచ్ఛలో మాత్రం మన దేశం దాదాపు అట్టడుగు స్థానంలోనే ఉంది. రాచరిక పాలనలో ఉన్న దేశాలు, నేపాల్, భూటాన్ వంటి చిన్న చిన్న పొరుగు దేశాలు, చివరకు వెనుకబడిన ఆఫ్రికన్ దేశాల్లో కొన్ని సైతం పత్రికా స్వేచ్ఛలో మనకంటే మెరుగైన పరిస్థితిలోనే ఉన్నాయి. ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ 2017 సంవత్సరానికి విడుదల చేసిన ‘ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్’ ప్రకారం పత్రికా స్వేచ్ఛలో మనది 136వ స్థానం. ఇది 180 దేశాల జాబితా. మన దేశంలో పత్రికా స్వేచ్ఛ ఏ స్థాయిలో వర్ధిల్లుతున్నదో అర్థం చేసుకోవడానికి ఈ జాబితా చూస్తే చాలు. అంతకు ముందు ఏడాది, అంటే 2016లో ‘ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్’ జాబితాలో మన దేశం 133వ స్థానంలో ఉంటే, గడచిన ఏడాది వ్యవధిలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఇది మరో మూడు స్థానాలకు దిగజారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇదీ పరిస్థితి... మన దేశంలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి జమ్ము కశ్మీర్, కర్ణాటక రాష్ట్రాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. వాటి తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితులనే చెప్పుకోవాలి. ప్రస్తుత ‘పచ్చ’పాలనలో రాష్ట్రంలోని పాత్రికేయులకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. పాలకపక్ష నాయకుల అండతో పాత్రికేయులపై జరిగిన దాడులు, హత్యలు పత్రికా స్వేచ్ఛలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ‘ఆంధ్రప్రభ’ రిపోర్టర్ శంకర్ 2015లో మంత్రి పత్తిపాటి పుల్లరావు అనుచరుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం విచారణ కూడా జరిపింది. ‘సాక్షి’ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ సురేంద్ర కూడా మంత్రి అనుచరుల దాష్టీకానికి బలైపోయారు. మంత్రి అనుచరులు తొలుత ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డారు. తర్వాత ఆయన భూముల్లో అక్రమంగా క్వారీయింగ్ చేయించి, ఇష్టానుసారం తవ్విపారేశారు. అప్పులు తీర్చలేక, భూమిని అమ్ముకోవడానికి వీలులేని పరిస్థితుల్లో మనస్తాపం చెందిన సురేంద్ర పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ నేత, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గుడిసె దేవానంద్ గత ఏడాది అక్టోబర్‌లో ‘సాక్షి’ ఆర్సీ ఇన్చార్జ్ సి.శ్రీనివాసరెడ్డిపై పట్టపగలు అందరూ చూస్తుండగానే హత్యాయత్నానికి తెగబడ్డారు. మటన్ కొట్టే కత్తితో శ్రీనివాసరెడ్డిపై దేవానంద్ దాడి చేశారు. స్థానికుల సాయంతో శ్రీనివాసరెడ్డి ఆ దాడి నుంచి తప్పించుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, కులం పేరిట తనను దూషించాడంటూ దేవానంద్ తప్పుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ‘సాక్షి’ పాత్రికేయుడిపై కేసు నమోదు చేశారు. దేవానంద్ స్థానిక ఒక మైనారిటీ వ్యక్తి వద్ద అప్పు తీసుకోవడమే కాకుండా అతడిని ముప్పు తిప్పలు పెడుతున్న విషయమై వార్తాకథనం రాయడం వల్లనే ఆయన ‘సాక్షి’ పాత్రికేయుడిపై ఈ దారుణానికి ఒడిగట్టారు. అనంతపురం జిల్లాలోనే తాడిపత్రిలో జేసీ సోదరుల అరాచకాలు శ్రుతిమించుతుండటంతో 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన మంత్రివర్గంలో జేసీ దివాకర్‌రెడ్డికి చోటు కల్పించలేదు. వైఎస్ నిర్ణయంపై రెచ్చిపోయిన జేసీ సోదరులకు చెందిన రౌడీ మూకలు తాడిపత్రిలోని ‘సాక్షి’ ప్రాంతీయ కార్యాలయంలో విలేకరి రాజశేఖర్‌ను బంధించి, కార్యాలయానికి నిప్పంటించారు. ఆ సంఘటనలో రాజశేఖర్ ప్రాణాలు కోల్పోయారు. తాడిపత్రిలోనే గత ఏడాది డిసెంబర్ 26న ‘సాక్షి’ విలేకరి రవిపై జేసీ రౌడీ మూకలు దాడికి తెగబడ్డాయి. కర్నూలు జిల్లాలోనైతే గడచిన ఆరు నెలల వ్యవధిలోనే నలుగురు పాత్రికేయులపై దాడులు జరిగాయి. మంత్రి అఖిలప్రియను విమర్శిస్తూ కథనాలు రాసినందుకు ఆళ్లగడ్డ ‘సాక్షి’ ఆర్సీ ఇన్చార్జ్ కృష్ణయ్యపై దీపావళి పండుగ రోజున దుండగులు దాడిచేసి తీవ్రంగా గాయపరచారు. మంత్రి అఖిలప్రియ ఇలాకాలోనే చాగలమర్రి మండలం గొడగనూరులో బెల్టుషాపులు నడుపుతున్నారనే కథనం ప్రసారం చేసినందుకు ‘మన తెలుగు’ టీవీ చానెల్ విలేకరిపై దాడి జరిగింది. ప్యాపిలి మండలంలో ‘మనం’ దినపత్రిక విలేకరి ఇబ్రహీంపైన, వెలుగోడు మండలంలో ‘విశాలాంధ్ర’ రిపోర్టర్ రామాంజనేయులుపైన కూడా దాడులు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ‘సాక్షి’ విలేకరి జోగేష్‌పై 2015లో ఆర్థిక మంత్రి యనమల అనుచరులు దాడి చేశారు. నీటి సంఘాల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలను ఫొటో తీస్తుండగా, ఆయనపై దాడిచేసి, కెమెరాను ధ్వంసం చేశారు. రెండేళ్ల కిందట ఇసుక మాఫియా కార్యకలాపాలను ఫొటో తీసేందుకు ప్రయత్నించిన పి.గన్నవరం మండలం ‘ప్రజాశక్తి’ విలేకరి అల్లాడి వెంకటరమణమూర్తిపై అధికార పార్టీ అండదండలు గల కాంట్రాక్టర్ల అనుచరులు దాడిచేశారు. అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై వార్తాకథనం రాసిన ఓ పత్రిక విలేకరి చెరుకూరి స్వామినాయుడును మట్టి మాఫియా దుండగులు చెట్టుకు కట్టేసి కొట్టారు. – ఇన్పుట్స్: సాక్షి నెట్వర్క్ – ఆంధ్రప్రదేశ్ -
ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకు పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యత తగ్గిపోతోంది. జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయి. పత్రికా స్వేచ్ఛలో 180 దేశాలకుగాను గతేడాది భారత్‌కు 136వ స్థానం రాగా, ఈ ఏడాది 138వ స్థానం వచ్చింది. పత్రికా స్వేచ్ఛా సూచికను ‘రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్’ రూపొందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లడం పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది. 1992 రెండు నుంచి ఇప్పటి వరకు 64 మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో హత్యలకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది స్థానిక రిపోర్టర్లే ఉన్నారు. స్థానికంగా అధికారంలో ఉన్న వ్యక్తి ఆగడాలకే వీరులో ఎక్కువ మంది బలయ్యారు. 2017 నుంచి హిందూత్వ శక్తుల దాడులకు జర్నలిస్టులు బలవుతున్నారు. కర్ణాటకలో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య అలాంటిదే. ర్యాడికల్ హిందూత్వ శక్తులే ఆమెను హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. ఆరెస్సెస్‌ను అంత ఘాటుగా విమర్శించి ఉండకపోతే ఆమె ఈ రోజున బతికి ఉండేదంటూ ఓ బీజేపీ శాసనసభ్యుడు చేసిన వ్యాఖ్య ఇక్కడ గమనార్హం. 2017లో ఐదుగురు జర్నలిస్టులు హత్యలకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో 35 ఏళ్ల జర్నలిస్ట్ సందీప్ శర్మను డంపర్ యాక్సిడెంట్లో చంపేశారు. ఇసుక మాఫియాతో కుమ్ముక్కయిన పోలీసు అధికారి గురించి వార్త రాసినందుకు ఆయన బలయ్యారు. హత్య జరిగిన మరుసటి రోజే కేసును సిబీఐకి అప్పగిస్తున్నామని మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించినప్పటికీ ఇంతవరకు సీబీఐ అధికారులు కేసును టేకప్ చేయలేదు. ఇదే విషయమై వారిని అడిగితే తమకు ఎవరూ కేసును అప్పగించలేదని వారు తెలిపారు. కేసును సీబీఐకి అప్పగించేవరకు ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును దర్యాప్తు చేస్తుందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 15 మంది జర్నలిస్టులు హత్యలు గురికాగా, ఏ ఒక్క కేసులో ఎవరికి శిక్ష పడలేదు. గడచిన దశాబ్దం కాలంలోనే ఏ ఒక్క జర్నలిస్ట్ హత్య కేసులో న్యాయం జరగలేదని అధికారిక వివరాలే తెలియజేస్తున్నాయి. -
పత్రికా స్వేచ్ఛలో భారత్ ర్యాంక్ 138
లండన్: పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ ర్యాంకు మరింతగా పడిపోయింది. గత ఏడాది ర్యాంక్ 136 కాగా, ఈ ఏడాది 138కు దిగజారిందని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్ఎస్ఎఫ్) అనే అంతర్జాతీయ సంస్థ తెలిపింది. ప్రధాని మోదీ వైఖరే ఇందుకు కారణమని విమర్శించింది. సంపూర్ణ పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశంగా నార్వే రెండో ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలవగా, ఉత్తరకొరియా అట్టడుగున ఉన్నట్లు తెలిపింది. వివిధ అంశాల ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో ఉన్న పత్రికా స్వేచ్ఛకు ఆర్ఎస్ఎఫ్ సంస్థ ఏటా ర్యాంకులు ఇస్తుంది. ఈ ఏడాది నివేదికలో.. మోదీ అధికారంలోకి వచ్చాక భారత్‌లో హిందూ ఛాందసవాదుల విద్వేష పూరిత ప్రసంగాలు, నేరాలు పెరిగిపోయాయంది. హిందూ మత ఆధిక్యత, కుల వ్యవస్థ, మహిళా హక్కులపై ప్రభుత్వాన్ని విమర్శించే మీడియాతోపాటు జర్నలిస్టులపై బెదిరింపులు, భౌతిక దాడులు ఎక్కువయ్యాయని పేర్కొంది. -
పత్రికా స్వేచ్ఛలో మరింత దిగజారిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ : 2018 సంవత్సరానికి గాను రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) బుధవారం వెల్లడించిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ స్థానం 136 నుంచి 138వ స్ధానానికి పడిపోయింది. జర్నలిజంపై కత్తికట్టినట్టు వ్యవహరిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వ్యవస్థకు విఘాతం కలుగుతోందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో పరిస్థితి మరింత దిగజారిందని.. రాడికల్ జాతీయవాదులు ఆన్లైన్ క్యాంపెయిన్‌లో జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని చెలరేగుతున్నారని. మోదీ జాతీయవాదంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని ఆర్ఎస్ఎఫ్ పేర్కొంది. హిందూ జాతీయవాదులుగా చెప్పుకునే కొందరు ప్రధాన స్రవంతి మీడియాపై నియంత్రణ విధిస్తూ, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని భౌతిక దాడులకూ తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాదిలో ముగ్గురు పాత్రికేయులను హత్య చేశారని పేర్కొంది. భారత్‌లో పత్రికా స్వేచ్ఛ పతనానికి ప్రధాని నరేంద్ర మోదీ ట్రోల్ ఆర్మీలే కారణమని ఆర్ఎస్ఎఫ్ నివేదిక పేర్కొంది. ప్రభుత్వానికి కొరుకుడు పడని జర్నలిస్టులను ప్రాసిక్యూట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీర్ లాంటి ప్రాంతంలో మీడియా కవరేజ్ సంక్లిష్టంగా మారిందని పేర్కొంది. విదేశీ పాత్రికేయులను ఆ ప్రాంతంలో పనిచేయనీయడం లేదని, తరచూ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవుతోందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ లాలూచీతో స్ధానిక పత్రికల్లో పనిచేసే కశ్మీరీ జర్నలిస్టులను పోలీసులు టార్గెట్ చేస్తున్నారని పేర్కొంది. పత్రికా స్వేచ్ఛలో ముందున్న యూరప్ ఇక పత్రికా స్వేచ్ఛ సూచీలో అమెరికా రెండు స్ధానాలు కోల్పోయి 45వ స్ధానంతో సరిపెట్టుకుంది. గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా యూరప్ దేశాలే పత్రికా స్వేచ్ఛలో ముందున్నాయి. ఈ సూచీలో నార్వే తొలి స్ధానంలో నిలవగా, స్వీడన్ రెండవ స్ధానాన్ని దక్కించుకుంది. నెదర్లాండ్స్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్‌లు తొలి ఐదు స్ధానాల్లో నిలిచాయి. కెనడా నాలుగు స్ధానాలు ఎగబాకి 18వ స్ధానంలోకి దూసుకువచ్చింది. కెనడాలో మెరుగైన పత్రికా స్వేచ్ఛకు సానుకూల వాతావరణం నెలకొందని నివేదిక కితాబిచ్చింది. ఇక ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో ఉత్తర కొరియా అట్టడుగున నిలవగా, తుర్కమెనిస్థాన్, సిరియా, చైనాలు తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి. -
పిలిచి మరీ జర్నలిస్టులను తిట్టిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఎలక్రానిక్ మీడియా ప్రముఖులు, జర్నలిస్టులను పిలిచిమరీ తిట్టిపోశారు. జర్నలిస్టులు నిజాయితీలేని వ్యక్తులనీ, వంచకులు, అబద్ధాలకోరులనీ ట్రంప్ ధ్వజమెత్తారు. న్యూయార్క్‌లో సోమవారం మీటింగ్ ఆఫ్ మైండ్స్ పేరిట సమావేశానికి పిలిచి మరీ ట్రంప్ ఇలా తిట్టిపోయడంతో విస్తుపోవడం విలేకరుల వంతయింది. ‘ఎన్నికల గెలుపు నేపథ్యంలో మీడియాతో సామరస్య ధోరణి ట్రంప్ అవలంబిస్తారని భావించినప్పటికీ, అందుకు విరుద్ధంగా ఎదురుదాడి ధోరణిని ఆయన ప్రదర్శించారు’ అని ఈ భేటీలో పాల్గొన్న పలువురు పాత్రికేయులు తెలిపినట్టు వాషింగ్టన్ పోస్టు తెలిపింది. ‘ప్రేక్షకులకు పారదర్శకమైన, కచ్చితమైన సమాచారం అందజేయడంలో మీరు విఫలమయ్యారు. నన్ను, నేను లక్షలాది అమెరికన్లకు చేసిన విజ్ఞప్తులను అర్థం చేసుకోవడంలో మీరు విఫలమయ్యారు’ అంటూ తన ముందు కాన్ఫరెన్స్ టేబుల్ చుట్టూ కూర్చున్న పాత్రికేయులను ఉద్దేశించి ట్రంప్ తీవ్ర స్వరంతో అన్నారు’ అని వాషింగ్టన్‌పోస్టు తెలిపింది. ఎన్నికల ప్రచారాన్ని కవరేజ్ చేయడంలో పక్షపాతపూరితంగా, బూటకంగా వ్యవహరించారని పదేపదే తీవ్రస్వరంతో ట్రంప్ గద్దించినట్టు పేర్కొంది. -
‘సాక్షి’పై కక్ష సాధింపు
-
‘సాక్షి’పై కక్ష సాధింపు
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు బేఖాతర్ - గుంటూరు ‘సాక్షి’ కార్యాలయం గోడకు నోటీసు అతికించిన పోలీసులు - మార్చి 2న ప్రచురించిన కథనాలకు ఆధారాలివ్వాలని స్పష్టీకరణ సాక్షి, గుంటూరు/శ్రీకాకుళం: రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసిన ప్రతిసారీ పత్రికా విలేకరులపై పోలీసుల ద్వారా కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా ‘సాక్షి’ పత్రికలో ప్రభుత్వ, టీడీపీ నేతల అవినీతిపై కథనాలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక కేసు నమోదు చేసి, నోటీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాజధానిలో టీడీపీ నేతల భూ దందాలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. రాజధాని ప్రకటనకు ముందు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా అమరావతి చుట్టుపక్కల అతి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి, రైతులను మోసం చేసిన వైనాన్ని ఆధారాలతో సహా ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. జాతీయ నేతల దృష్టికి కూడా వెళ్లాయి. అధికార పార్టీ నేతల అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో ‘సాక్షి’పై అక్కసుతో రాజధాని గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలతో ఫిర్యాదులు చేయించి, పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసులు నమోదు చేశారు. ‘సాక్షి’ విలేకరులు విచారణకు రాావాలంటూ పిలిపించడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం, డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. దీంతో పోలీసులు కొంతకాలంపాటు మిన్నకుండిపోయారు. అయితే, ప్రభుత్వం, అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలపై ‘సాక్షి’లో కథనాలు వచ్చిన ప్రతిసారీ నోటీసుల పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా శనివారం మంగళగిరి పోలీసులు గుంటూరులోని ‘సాక్షి’ కార్యాలయం గోడకు నోటీసు అతికించి వెళ్లారు. ‘‘2016 సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం 10 గంటలలోపు మీ వద్ద ఉన్న సమాచారం కానీ, డాక్యుమెంట్లు కానీ మంగళగిరి రూరల్ సీఐకి అందించాలి. సాక్షి దినపత్రికలో 2016 మార్చి 2న ప్రచురించిన అంశాలు, టీవీ చానల్లో చూపించిన అంశాలకు సంబంధించి మీ వద్ద ఉన్న ఆధారాలు, పత్రాలు సీఐకి అందించాల్సిందిగా కోరుతున్నాం’’ అని ఆ నోటీసులో పేర్కొన్నారు. అలాగే మంగళగిరిలోని ‘సాక్షి’ యూనిట్ కార్యాలయంలో బ్రాంచ్ మేనేజర్ గదికి కూడా నోటీసు అతికించారు. ‘సాక్షి’ విలేకరులకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వేధింపులు ఆపకపోతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. కక్ష సాధిస్తే సహించం: ఏపీయూడబ్ల్యూజే శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం మీడియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లి ధర్మారావు, ఐవీ సుబ్బారావు పేర్కొన్నారు. పత్రికలపై దాడి అసాంఘిక చర్య ‘‘అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు సాగిస్తున్న అక్రమాలను బయటపెడుతున్న పత్రికలపై దాడికి దిగడం అసాంఘిక చర్య. సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనాలు నిజమా, కాదా.. అనేది విచారణ జరిపి, వాటిని బహిర్గతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కథనాలకు ఆధారాలు చూపమనడం సరైనది కాదు.’’ - పెనుగొండ లక్ష్మీనారాయణ, సీనియర్ న్యాయవాది, అరసం జాతీయ కార్యదర్శి భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి నోటీసులను ఖండించిన ఐజేయూ హైదరాబాద్: సాక్షి విలేకరులకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఇది నిస్సం దేహంగా భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడేనని విమర్శించింది. పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందని ఐజేయూ అధ్యక్షులు ఎస్.ఎన్.సిన్హా, సెక్రెటరీ జనలర్ అమర్, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు అమర్నాథ్, ప్రభాత్‌దాస్ శనివారం పేర్కొన్నారు. -
మీ అవినీతిని ప్రశ్నిస్తే ప్రసారాలు ఆపేస్తారా?
సాక్షి, నెట్వర్క్: ‘మీ ప్రభుత్వం చేసే అవినీతి, అక్రమాలను, వైఫల్యాలను ఎత్తిచూపితే మీడియా గొంతు నొక్కుతారా? ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛను హరించాలని చూస్తే సహించేది లేదు. ఇకనైనా నియంతృత్వ పోకడలు విడనాడి సాక్షి చానల్ ప్రసారాలను పునరుద్ధరించండి’ అంటూ ప్రజాసంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. శనివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నాయకులు, వివిధ పత్రికల జర్నలిస్టులు సాక్షి మీడియాపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై మండిపడ్డారు. సాక్షి ఉద్యోగులతో పాటు జర్నలిస్ట్ సంఘాలు, అన్ని పార్టీల నేతలు శనివారం చేపట్టిన ఆందోళనతో విశాఖ జగదాంబ జంక్షన్ దద్దరిల్లింది.కాగా‘సాక్షి’ టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని అనంతపురంలో శనివారం వర్కింగ్ జర్నలిస్టులు రిలేదీక్షలకు దిగారు. -
శాంతి, ఐకమత్యం నెలకొల్పాలి
ప్రభుత్వానికి ఎడిటర్ల వినతి న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతుండటంపై అఖిల భారత వార్తాపత్రికల ఎడిటర్ల కాన్ఫరెన్స్ (ఏఐఎన్‌ఈసీ) ఆందోళన వ్యక్తం చేసింది. వివిధ వర్గాల మధ్య శాంతి, ఐకమత్యం నెలకొల్పేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చేసిన తీర్మానాన్ని ఆమోదించింది. మరోవైపు జర్నలిస్టులపై దాడులు పెరుగుతుండటంపై విశ్వబంధు గుప్తా అధ్యక్షతన ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏఐఎన్‌ఈసీ ఆందోళన వెలిబుచ్చింది. వృత్తి విధుల్లో నిమగ్నమయ్యే జర్నలిస్టులకు భద్రత కల్పించడం దేశ ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛకు ఎంతో ముఖ్యమని అభిప్రాయపడింది. జర్నలిస్ట్ లపై దాడులకు పాల్పడే వారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలంది. -
మీడియా ఇష్టారాజ్యం సహించం
వరంగల్: మీడియా స్వేచ్ఛ పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరూ అంగీకరించరని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయనతో పాటు స్పీకర్ మధుసూదనాచారి తదితరులు వరంగల్‌లో కాళోజీ విగ్రహానికి నివాళులర్పించే సమయంలో టీవీ9, ఏబీఎన్ సంస్థలకు చెందిన కొందరు నిరసన తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘పత్రికా స్వేచ్ఛ హరి స్తోందని ఇయ్యాల కొందరు ప్లకార్డులు పట్టుకున్నరు. పత్రికలకు స్వేచ్ఛ ఉండవచ్చు. మీడియా సంస్థలు ప్రజాస్వామికంగా ఉంటే మీకా మర్యాద దొరుకుతది. ఆ రెండు చానళోళ్లు మళ్ల ఇయ్యాల తప్పు చేసిన్రు. స్పీకర్‌కు ఎదురుగా నల్ల జెండాలు జూపిన్రు. నేనంటే సీఎంని, కేసీఆర్‌కు వ్యతిరేకమైతే ఓకే. నన్ను చాలామంది తిట్టిన్రు. నేనేం భయపడలే. తెలంగాణ శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేస్తే వాళ్లు ఏం చూపిన్రు? తెలంగాణ రాష్ట్రానికి, శాసనసభకు వ్యతిరేకంగా చూపారు. తెలంగాణ ఎమ్మెల్యేలను పాచికల్లు తాగే మొకాలంటే ఈ గడ్డ మీద క్షమించాల్నా? ఇది పత్రికా స్వేచ్చ అయితదా? ఏ మీడియా చెబుతది ఇది కరెక్టని? అనేకమంది త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ఎమ్మెల్యేలు కొలువుదీరిన రోజు అదేనా పద్ధతి. పాతరేస్తాం జాగ్రత్త. కేసీఆర్‌ను తిడితే బాధలేదు. తెలంగాణ శాసనసభను, తెలంగాణ వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని, ఉనికిని, గౌరవాన్ని వ్యతిరేకించేలా ఎవడు చేసినా మెడలు విరిచి అవతల పారేస్తం. మీడియా ముసుగులో ఇడియట్ ఆటలు చేస్తామంటే సాగనివ్వం. అయినా ఈ చానళ్లను మేం బ్యాన్ చేయలే. ఈ అంశం స్పీకర్ వద్ద విచారణలో ఉంది. అన్ని పార్టీలూ కలిసి శాసనసభలో తీర్మానం చేసి స్పీకర్‌కు అప్పగించాం. స్పీకరు నిర్ణయించాల్సి ఉంది. తెలంగాణ కేబుల్ ఆపరేటర్లు స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వారికి సెల్యూట్ చేస్తున్నా. దాన్ని పట్టుకుని ఢిల్లీల, ఇక్కడ, అక్కడ డ్రామాలు ఆడుతున్నారు. ఆంధ్రావాళ్లు చేసేది ఇదే. దీని గురించి బాధపడవద్దు. దీటుగా ఎదుర్కోవాలి. ఏదైనా ఉంటే మీడియా మిత్రులు నా వద్దకు రండి. ఆంధ్రావాళ్ల తరఫున వకాల్తా పుచ్చుకోవద్దు’ అని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. -
మీడియాపై ఏపీ సర్కార్ వైఖరి సరికాదు
* ఐజేయూ, టీయూడబ్ల్యుజేల హెచ్చరిక * సాక్షి, నమస్తే తెలంగాణ ప్రతినిధులను అనుమతించకపోవడం అన్యాయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సర్కార్ పత్రిక స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తే సహించబోమని ఇండియన్ జర్నలిస్టు యూనియన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి. మీడియా పట్ల ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ శుక్రవారం ఐజేయూ నేతలు దేవులపల్లి అమర్, కె. శ్రీనివాస్‌రెడ్డి, టీయూడబ్ల్యుజే అధ్యక్ష, కార్యదర్శులు శేఖర్, విరాసత్ అలీలు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎం ప్రెస్మీట్లకు ‘సాక్షి’ ప్రతినిధులను అనుమతించకపోవడం, అసెంబ్లీ సమావేశాల వార్త సేకరణకు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధులకు పాసులు ఇచ్చేందుకు నిరాకరించడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని అన్నారు. చట్టసభలకు మీడియా ప్రతినిధులను అనుమతించే అధికారం స్పీకర్‌కు ఉన్నప్పటికీ దానిని విస్మరించి ప్రభుత్వం ఆంక్షలు విధించడం సహించరానిదని వారు దుయ్యబట్టారు. -
మాజీ సంపాదకుడికి కత్తిపోట్లు!!
పత్రికా స్వాతంత్ర్యం కోసం పోరాడి.. ఇటీవలే ఉద్యోగం కోల్పోయిన ఓ పత్రికా సంపాదకుడు కత్తిపోట్లకు గురయ్యారు. హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ మీద వచ్చిన ఓ వ్యక్తి బుధవారం ఉదయం కెవిన్ లౌ మీద దాడి చేసి కత్తితో పొడిచి పారిపోయాడని, ఆ మోటార్ సైకిల్‌ను మరో వ్యక్తి నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. హుటాహుటిన లౌను ఆస్పత్రికి తరలించారు. అప్పటికి ఆయన స్పృహలోనే ఉన్నారని చెప్పారు. ఆయనపై దాడి ఎందుకు జరిగిందన్న కోణంలో దర్యాప్తు మొదలైంది. హాంకాంగ్‌లో మింగ్ పావో అనే ప్రముఖ వార్తా పత్రికకు 2012లో ఆయన సంపాదకుడిగా నియమితులయ్యారు. కానీ, గత నెలలో ఆయన పత్రికా స్వాతంత్ర్యం గురించిపోరాడిన తర్వాత ఉద్యోగం కోల్పోయారు. దీంతో చైనాలో అవినీతి, మానవహక్కుల ఉల్లంఘన గురించి ఎవరు రాసినా వాళ్ల ఉద్యోగం పోతుందన్న భయం అక్కడి పాత్రికేయులలో మొదలైంది.