పత్రికా స్వాతంత్ర్యం కోసం పోరాడి.. ఇటీవలే ఉద్యోగం కోల్పోయిన ఓ పత్రికా సంపాదకుడు కత్తిపోట్లకు గురయ్యారు. హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ మీద వచ్చిన ఓ వ్యక్తి బుధవారం ఉదయం కెవిన్ లౌ మీద దాడి చేసి కత్తితో పొడిచి పారిపోయాడని, ఆ మోటార్ సైకిల్ను మరో వ్యక్తి నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. హుటాహుటిన లౌను ఆస్పత్రికి తరలించారు. అప్పటికి ఆయన స్పృహలోనే ఉన్నారని చెప్పారు.
ఆయనపై దాడి ఎందుకు జరిగిందన్న కోణంలో దర్యాప్తు మొదలైంది. హాంకాంగ్లో మింగ్ పావో అనే ప్రముఖ వార్తా పత్రికకు 2012లో ఆయన సంపాదకుడిగా నియమితులయ్యారు. కానీ, గత నెలలో ఆయన పత్రికా స్వాతంత్ర్యం గురించిపోరాడిన తర్వాత ఉద్యోగం కోల్పోయారు. దీంతో చైనాలో అవినీతి, మానవహక్కుల ఉల్లంఘన గురించి ఎవరు రాసినా వాళ్ల ఉద్యోగం పోతుందన్న భయం అక్కడి పాత్రికేయులలో మొదలైంది.
మాజీ సంపాదకుడికి కత్తిపోట్లు!!
Published Wed, Feb 26 2014 3:57 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement