న్యూఢిల్లీ: పత్రికా స్వేచ్ఛ సూచిలో మన దేశం ఏమాత్రం మెరుగ్గా లేదు. నానాటికీ తీసికట్టుగా పరిస్థితి తయారైందని తాజా అధ్యయనం వెల్లడించింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్‌ఎస్‌ఎఫ్) తాజాగా ప్రకటించిన దేశాల జాబితాలో మన దేశం 150వ స్థానంలో నిలిచింది. గతేడాది భారత్ ర్యాంక్ 142.
ప్రతి దేశంలో పాత్రికేయులు, వార్తా సంస్థలు, నెటిజన్‌లకు ఉన్న స్వేచ్ఛను.. అలాంటి స్వేచ్ఛను గౌరవించే ప్రభుత్వ ప్రయత్నాలను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ హైలైట్ చేస్తుంది. జర్నలిజానికి ‘చెడు’గా పరిగణించబడే దేశాల జాబితాలో భారత్ గతేడాది చేర్చబడింది.
జర్నలిస్టులపై జరుగుతున్న హింస, రాజకీయంగా పక్షపాత మీడియా, కేంద్రీకృత మీడియా యాజమాన్యం ఇవన్నీ భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ముప్పుగా పరిణమించాయని ఆర్‌ఎస్‌ఎఫ్ నివేదిక పేర్కొంది.
‘ఇండియా స్పెండ్’ నివేదిక ప్రకారం.. ఇంటర్నెట్ షట్‌డౌన్, తప్పుడు సమాచారం విస్త్రృత వ్యాప్తి కూడా గత ఐదేళ్లలో పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం ర్యాంక్ పడిపోవడానికి కారణమని వెల్లడించింది. కాగా, పత్రికా స్వేచ్ఛ సూచిలో నార్వే మొదటి స్థానంలో నిలవగా.. పాకిస్థాన్ 157వ స్థానంలో ఉంది. (క్లిక్: ఇంటర్నెట్ షట్‌డౌన్‌లో టాప్ ఎవరంటే?)
Comments
Please login to add a commentAdd a comment