World Press Freedom Day
-
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
ప్రతి సంవత్సరం మే-3 న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటారు. మానవ హక్కుల ప్రాముఖ్యత, వాటిని పరిరక్షించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రభుత్వాలు మంచి పాలనను అందించడంలో పత్రికారంగం కీలక పాత్ర పోషిస్తోంది.1993లో ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ మే-3 వ తేదీని ప్రపంచ స్వాతంత్య్ర పత్రికా దినోత్సవంగా ప్రకటించింది. 1991లో యునెస్కో 26వ సర్వసభ్య సమావేశంలో చేసిన సిఫారసుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 1991 విండ్ హోక్ డిక్లరేషన్ ఫలితంగా కూడా ఈ ప్రకటన వచ్చింది. ఇది పత్రికా స్వేచ్ఛ గురించి ఆఫ్రికన్ పాత్రికేయులు తయారు చేసిన ప్రకటన. యునెస్కో నిర్వహించిన ఒక సెమినార్లో సమర్పించబడి మే-3న ముగిసింది. దీంతో ఆ రోజును పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా జరుపుకుంటారు.2023వ సంవత్సరానికి సంబంధించి పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత్ 161 స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 400కి పైగా టీవీ న్యూస్ చానళ్లు ఉన్నాయి. పత్రికలైతే వేలల్లో ఉన్నాయి. ప్రాంతీయ ప్రతికా స్వేచ్ఛ సూచీలో నార్వే, ఐర్లాండ్, డెన్మార్క్‌మొదటి మూడు స్థానాల్లో ఉండగా చివరి స్థానంలో నార్త్ కొరియా ఉంది. -
World Press Freedom Index 2023: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత్ నేలచూపులు
న్యూఢిల్లీ: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీ–2023లో భారత్ 11 స్థానాలు దిగజారింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా బుధవారం విడుదల చేసిన నివేదికలో 161వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. 180 దేశాల్లో పత్రికారంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల ఆధారంగా ఇచ్చే ఈ ర్యాంకుల్లో గతేడాది భారత్ 150వ స్థానంలో నిలిచింది. దీనిపై పత్రికా సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ‘భారత్ సహా పలు దేశాల్లో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కల్గుతోందని స్పష్టమవుతోంది. మీడియా క్రియాశీలక పాత్ర పోషించలేకపోవడం దారుణం’’ అని ది ఇండియన్ విమెన్స్ ప్రెస్ కోర్స్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. -
Sakshi Cartoon: భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ప్రమాదం-వరల్డ్ ప్రెస్ ఫ్రీడం
భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ప్రమాదం-వరల్డ్ ప్రెస్ ఫ్రీడం -
పత్రికా స్వేచ్ఛ.. దిగజారిన భారత్ స్థానం
World Press Freedom Day: న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడిందని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వ్యాఖ్యానించింది. పత్రికా స్వేచ్ఛకు అత్యంత ప్రమాదం ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ సూచికలో గత ఏడాది 142వ స్థానంలో ఉన్న భారత్ మరింత దిగజారి 150వ స్థానానికి పడిపోయిందని తెలిపింది. విధి నిర్వహణలో ఏడాదికి ముగ్గురు లేదా నలుగురు పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. ఈ సూచీలో 2016 నుంచి భారత్ స్థానం దిగజారుతూనే వస్తోందని పేర్కొంది. భారత్‌లో లక్షకు పైగా వార్తా పత్రికలతోపాటు 36 వేల వార పత్రికలు, 380 టీవీ న్యూస్ చానళ్లు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలు, ప్రాంతాల్లో పత్రికా స్వేచ్ఛ తీరుతెన్నులను తెలిపే వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్–2022 ఎడిషన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అయిన 3న విడుదలైంది. -
పాత్రికేయులు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 సంక్షోభంలో పాత్రికేయులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ కచ్చితమైన సమాచారాన్ని అందించడంతో పాటు ప్రజల్లో ఆత్మ విశ్వాసం పెంచేందుకు ఎంతో కృషి చేస్తున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే’సందర్భంగా పాత్రికేయ లోకానికి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. నిష్పాక్షికంగా తమ విధులు నిర్వర్తిస్తూ దేశ నిర్మాణంలో పాత్రికేయులు కీలక భూమిక పోషించాలని, ప్రభుత్వానికి ప్రజలకు నడుమ అనుసంధాన కర్తలుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. భయం, పక్షపాతం లేకుండా పాత్రికేయులు తమ విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా గవర్నర్ ఆకాంక్షించారు. స్వచ్ఛందంగా సేవలు అందించండి: స్వచ్ఛంద సంఘాలు, సంస్థలు, వ్యక్తులు పేదలకు అవసరమైన శానిటరీ కిట్లతో పాటు నిత్యావసరాలు అందజేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. శనివారం రాజ్‌భవన్‌లోని నాలుగో తరగతి మహిళా ఉద్యోగులకు శానిటరీ కిట్లు, ఆహార పొట్లాలను ఆమె పంపిణీ చేశారు. కోవిడ్ సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జి.అనూహ్యరెడ్డి వీటిని సమకూర్చినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. -
ఆన్‌లైన్‌పై ఆంక్షలతో స్వేచ్ఛకు సంకెళ్లు
న్యూఢిల్లీ: భారత్‌లో పత్రికా స్వేచ్ఛ నానాటికి తగ్గిపోతోంది. మీడియాపై దాడులు పెరిగి పోతున్నాయి. 2016, జనవరి నుంచి 2017, ఏప్రిల్ నెల వరకు జర్నలిస్టులపై 54 దాడులు జరిగాయని ‘ది హూట్’ మీడియా వాచ్ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. కనీసం మూడు చానెళ్ల ప్రసారాలను నిషేధించారు. 45 ఇంటర్నెట్లను మూసేశారు. వ్యక్తులు, గ్రూపులు కలుపుకొని 45 దేశద్రోహం కేసులు నమోదు చేశారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా బుధవారం నాడు ‘ది హూట్’ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛ కలిగిన 180 దేశాలతో పోలిస్తే భారత్‌ది 136వ స్థానం. ప్రజల సమాచార హక్కులపై ఆంక్షలు విధించడం, వారికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకుండా చేయడం, ఆన్లైన్ స్వేచ్ఛపై ఆంక్షలు అమలు చేయడం, వ్యక్తిగత స్వేచ్ఛను అరికట్టడం తదితర కారణాల వల్ల ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్‌లో భారత్ స్థానం పడిపోతోంది. 2016, జనవరి నుంచి 2017, ఏప్రిల్ నెల వరకు దేశంలో ఏడుగురు జర్నలిస్టులు దాడుల్లో మరణించారని హూట్ తెలిపింది. జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై ఫిర్యాలుకాని దాడులు ఎన్నో ఉన్నాయని వెల్లడించింది. జర్నలిస్టులపై జరిగిన దాడుల్లో తొమ్మిది దాడులు పోలీసులు చేసినవి కాగా, ఎనిమిది దాడులు రాజకీయ నాయకులు, వారి మద్దతుదారులు చేసినవి. ఐదు దాడులు ఇసుక, బొగ్గు మాఫియా చేసినవికాగా, నాలుగు మీడియా కవరేజీ అడ్డుకుంటూ ప్రజా గుంపు చేసిన దాడులు. ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు సాక్షి టీవీ కేబుల్ ప్రసారాలను నెంబర్ వన్ న్యూస్ చానెల్ ప్రసారాలను నిలిపివేశారు. ఎన్డీటీవీ ప్రసారాలను 24 గంటలు నిషేధించారు. ఒక్క 2016 సంవత్సరంలోనే జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై 40 దేశద్రోహం కేసులు పెట్టారు. మరోపక్క ప్రజల సమాచార హక్కును కూడా నీరుకారుస్తూ వస్తున్నారు. -
అధ్యక్షా..! ఇదీ మా బడి... ఇదీ మా ఊరు
లిటిల్ రిపోర్టర్ బడి బాగుంటే చదువు బాగుంటుంది. ఊరు బాగుంటే బతుకు బాగుంటుంది. బాగుండడం అంటే ఏంటి? స్కూల్లో ఉండాల్సిన వసతులన్నీ ఉండడం. ఊళ్లో నీళ్లకు, నిలువ నీడకు కరువు లేకుండా ఉండడం. అయితే అన్ని స్కూళ్లు, అన్ని ఊళ్లు ఇలాగే ఉన్నాయా? లేవు! లేవన్న విషయం ఎలా తెలుస్తుంది? పేపర్లు రాస్తాయి. పేపర్వాళ్లకు ఎలా తెలుస్తుంది? రిపోర్టర్లు రాసి పంపుతారు. రిపోర్టర్లు అంటే పేపర్లలో పనిచేసేవాళ్లు మాత్రమే కాదు, సమస్యను గుర్తించి దానిని నలుగురి దృష్టికీ తెచ్చేవాళ్లు కూడా. ఇదిగో.. వీళ్లంతా చిన్నారి రిపోర్టర్లు. ఇవన్నీ ఈ చిన్నారులు రిపోర్ట్ చేసిన సమస్యలు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా ‘సాక్షి ఫ్యామిలీ’ వీటిని ప్రచురిస్తోంది. వీటిపై.. ‘అధ్యక్షా...’ అంటూ ప్రతిపక్షాలు లోకల్ లీడర్లను ఎలాగూ ప్రశ్నించకుండా వదలవు. చూడాలి మరి. ప్రభుత్వాలు ఏమాత్రం స్పందిస్తాయో, పరిస్థితిని ఎప్పటికి చక్కదిద్దుతాయో! పాస్ ఉంది... బస్సు లేదు! మా ఊరు పాడేరు. నేను చేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 8వ తరగతి చదువుతున్నాను. మా ఊరికి రోడ్డు సౌకర్యం లేనందు వల్ల బస్సు రావడం లేదు. గతంలో బస్సు వచ్చేది. ప్రస్తుతం బస్సులు లేకపోవడంతో ఆటోలలో వెళ్లాల్సి వస్తోంది. వానా కాలంలో అదీకష్టమే. చాలా మంది ఆటోలకు డబ్బులు పెట్టలేక బడికి రావడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలను ఆటోల్లో పంపించడానికి భయపడి స్కూలు మానిపించేస్తున్నారు. మేము ఎన్నోసార్లు ఆర్టీసీ వారికి అర్జీ పెట్టుకున్నాం. మా సమస్యకు పరిష్కారం దొరకలేదు. బస్సు పాసులు ఇచ్చారే కానీ బస్సులు వేయలేదు. ప్రస్తుతం మా యందు దయ తలచి బస్సు సౌకర్యం కల్పించవలసినదిగా కోరుచున్నాం. – వి. వెంగమ్మ, 8వ తరగతి, పాడేరు, చేజర్ల జడ్పీ ఉన్నత పాఠశాల, చేజర్ల మండలం, నెల్లూరు జిల్లా టీచర్లు ఇద్దరే మా పాఠశాలలో నీటి సౌకర్యం లేదు. దాహం వేస్తే బయట అంగడికెళ్లి మంచినీళ్లు తెచ్చుకుని తాగుతున్నాం. మా పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఒకటే గది. అన్ని తరగతుల వాళ్లమూ ఆ గదిలోనే చదువుకోవాలి. మాకు ఇద్దరే టీచర్లు ఉన్నారు. అన్ని క్లాసులకూ వాళ్లే పాఠాలు చెప్పాలి. మాకు తరగతి గదులు కట్టించి, టీచర్లను నియమించాలి. అలాగే మున్సిపాలిటీ నుంచి నీటి కుళాయి కనెక్షన్ ఇప్పించాలి. కనీసం ఒక కుండ అయినా ఇప్పిస్తే మేమే నీళ్లు పట్టుకుంటాం. – లక్ష్మీదుర్గ, 5వ తరగతి ఎస్.ఆర్.పురం మున్సిపల్ స్కూల్, కావలి పట్టణం, నెల్లూరు జిల్లా మరుగుదొడ్లకు తలుపుల్లేవు మాది రాజవొమ్మంగి. మా పాఠశాలను మోడల్ స్కూల్‌గా గుర్తించారు. అన్ని రకాల సౌకర్యాలు వస్తాయని సంబరపడ్డాం. అయితే మా మండల పరిషత్ ఇంగ్లీష్‌మీడియం పాఠశాలలో ఆంగ్లం బోధించే ఉపాధ్యాయుడు లేడు. ఇక ఈ పాఠశాలను మోడల్ స్కూల్‌గా మార్చామని ఎలా చెపుతున్నారో అర్ధం కావడం లేదు. అదే విధంగా మంచినీటి సౌకర్యం లేదు. పిల్లలమే చందాలు వేసుకొని కుండ కొనుక్కున్నాం. మరుగుదొడ్లు కట్టారు, కానీ వాటికి తలుపులు లేవు. నీళ్ల ట్యాప్‌లు లేవు. – షేక్ ముజాహిద్దీన్ ఆలీషా, 4వ తరగతి, రాజవొమ్మంగి, విశాఖపట్టణం చెత్త తియ్యరు... కుక్కలను తోలరు! మా ఇల్లు కాకినాడలోని అశోక్‌నగర్, అచ్యుతాపురం. మా ఇంటి వద్ద కరెంటు స్థంభం ఉంది. ఆరు నెలల నుంచి వీధిలైట్లు వెలగడంలేదు. చీకటి పడితే బయట అడుగుపెట్టాలంటే భయం. కుక్కలు తరుముతాయి. వీథిలో చెత్త కుప్పలను అలాగే వదిలేయడంతో కుక్కలు యధేచ్ఛగా తిరుగుతుంటాయి. వీ«ధిలైట్లు వెలగక పోవడంతో రాత్రిళ్లు దొంగల భయం ఉంటోంది. ఈ ఉత్తరం చదివిన తర్వాత అయినా పెద్దలు, అధికారులు çసమస్యలు పరిష్కరించాలి. – జి. సాయి తేజేష్, 4వ తరగతి, కాకినాడ నీటి కోసం ఎదురు చూపు... బాపట్ల పట్టణంలో మంచినీళ్లు ఎప్పుడొస్తాయో తెలియదు. రోజంతా మంచినీటి కోసం ఎదురు చూడడంలోనే సరిపోతుంటుంది అమ్మావాళ్లకు. వచ్చినా అరగంట సేపటికే ఆగిపోతాయి. మంచినీటి కుళాయిలు తగినన్ని పెంచినా ఈ ఇబ్బంది కొంత తగ్గుతుంది. ఒకే కుళాయి దగ్గర అందరూ గుమిగూడి తగవులాడుకోవడం రోజూ మామూలే ఇక్కడ. ట్యాంకర్ల కోసం ఎదురు చూడడం, వచ్చాక నీళ్లు మోసుకోవడంతోనే సరిపోతోంది. ఇక ఏ పనులకు వెళ్లాలన్నా కుదరడం లేదు. – ఎం. సుష్వాంత్, 8వ తరగతి, బాపట్ల కంప్యూటర్ ఎవరు నేర్పిస్తారు! నేను ఆలేరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. మా స్కూలుకి కంప్యూటర్లు ఇచ్చారు. కంప్యూటర్ టీచర్ని నియమించలేదు. దాంతో అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. మాకు పీఈటీ టీచర్ లేరు. ఆట సామగ్రి లేదు. ఏటా మాకు దుస్తులు ఇచ్చేవారు. గడచిన ఏడాది ఇవ్వలేదు. పాత వాటినే వేసుకున్నాం. రాబోయే ఏడాదికైనా కంప్యూటర్ టీచర్ని నియమిస్తే మంచిగ నేర్చుకుంటాం. – బి. సాయికుమార్, 8వ తరగతి, ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా మద్యం సీసాలమయం! మా స్కూలు భవనం పూర్తిగా కుంగిపోయి గోడలు పగుళ్లు బారాయి. వర్షం వస్తే స్లాబు కారుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. మరమ్మత్తులు జరగలేదు. హైస్కూల్లో బాలికలం ఉన్నాం. వాష్‌రూములు సరిగ్గా లేవు. ఇంకా పెద్ద ఇబ్బంది ఏమిటంటే... మా స్కూలు సెలవు రోజు స్కూలు ఆవరణ తాగుబోతుల రాజ్యం అవుతోంది. ఫుడ్ పార్సిల్ కవర్లు, ఖాళీ మద్యం సీసాలను పడేస్తున్నారు. పగిలిన గాజు పెంకులతో ఆవరణంతా అసహ్యంగా ఉంటుంది. సోమవారం స్కూలు తెరవగానే మేము ఆవరణ అంతా శుభ్రం చేసుకోవాలి. ఒక్కోసారి గాజు పెంకులు గుచ్చుకుంటాయి కూడ. ఈ కష్టం తప్పించండి ప్లీజ్. – బి. ఇందుమతి, పునాదిపాడు, కంకిపాడు, కృష్ణాజిల్లా ఆటో బోల్తా... చదువుకు డుమ్మా! నేను రోజూ స్కూలుకి ఏడు కిలోమీటర్లు ఆటోలో వెళ్లేవాడిని. ఒక రోజు మా ఆటో బోల్తా పడింది. ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. దాంతో ఆ ఇద్దరూ బడి మానేశారు. మాకు హైస్కూలుకు పోవడం అంటే పరాయి దేశం పోయినట్లే. అంతగా భయపడతారు. ప్రాథమిక స్కూలుతోనే చదువాపేస్తున్నారు చాలామంది. మా తాండకు దారి సరిగ్గా ఉండదు. మట్టిబాటలో వెళ్లాలి. దాంతో మా ఊరికి బస్సులు లేవు. రోడ్డు వేసి బస్సులు వేస్తే మాలాంటి చాలా మంది చదువుకుంటారు. మా తండాలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. వీథిదీపాలు లేవు. ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. అందుకే పేపర్‌కు రాస్తున్నా. – ఎం. అరవింద్ నాయక్, 10వ తరగతి, లత్తవరంతాండ, అనంతపురం జిల్లా కాలువ పొంగితే... విజయనగరం పట్టణంలో ఉడాకాలనీ మాది. కాలనీలో రోడ్డు మొత్తం బురదమయం. నీరు నిలిచి ఉంటుంది. పందులు తిరుగుతూ బురదను తిరగతోడుతుంటాయి. దోమలతో అంటువ్యాధులు వస్తున్నాయి. మురుగునీరు కాలువలో నుంచి పొంగి రోడ్డు మీదకు పారుతుంటుంది. ప్లాస్టిక్ సంచులు కాలువలను బ్లాక్ చేస్తుంటాయి. ప్రభుత్వం మా కాలనీ సమస్యలను పట్టించుకుని పరిష్కరించాలి. – హర్షిత, 6వ తరగతి, కంటోన్మెంట్, విజయనగరం నది దాటడం గగనమే.. మాది పందలపాక గ్రామం. నేను ఆరవ తరగతి చదువుకుంటున్నాను. మా పాఠశాలకు గ్రామానికి మధ్యలో తుల్యభాగా నది ప్రవహిస్తుంటుంది. దానిపై నిర్మించిన కాలిబాట వంతెన ఇరుకుగా ఉంది. అంతే కాదు... అది శిథిలావస్థకు చేరుకుంది. పాఠశాల దూరంగా ఉండడంతో సైకిల్ పై వంతెన దాటి వెళ్ళాలి. ఎప్పుడు విరిగిపడుతుందో తెలియనంతగా పాడైపోయింది వంతెన. చాలామంది పడిపోయారు, గాయాలయ్యాయి. వంతెన ఇరుకుగా ఉండడంతో గోడలు గీరుకుపోయి రక్తం వస్తుంటుంది. ఇదంతా మాకు రోజూ ఎదురయ్యే అనుభవం. దీంతో పాఠశాలకు వెళ్లే సుమారు 800 మంది విద్యార్థులం చాలా ఇబ్బంది పడుతున్నాం. స్కూలు పిల్లలమే కాదు పెద్దవాళ్లకు కూడా ఆ వంతెన మీద నుంచి ప్రయాణించాలంటే భయమే. మంచి వంతెన నిర్మిస్తే తప్ప మా కష్టాలు తీరవు. – షేక్. ముమీనా, పడాల పెదపుల్లారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాల, పందలపాక, బిక్కవోలు, తూర్పు గోదావరి జిల్లా – సాక్షి నెట్వర్క్ సహకారంతో... -
'పత్రికా స్వేచ్ఛకు పునరంకితమవుదాం'
రాజ్యాంగంలోని స్వాతంత్ర్య భావాలను సమున్నతంగా భావించి ప్రతిఒక్కరు పత్రికా స్వేచ్ఛకు పునరంకితం కావాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. ఆదివారం (మే 3) ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలు, మీడియా ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 'ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానం మేరకు మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. పత్రికా స్వేచ్ఛను నిర్ధారించడం తద్వారా సామాజిక అభివృద్ధి ప్రోత్సాహక కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించుకుటున్నాం. మనందరం పత్రికా స్వేచ్ఛకు పునరంకితమవుదాం' అని జైట్లీ ఫేస్బుక్ ద్వారా సందేశం తెలిపారు. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. -
స్వరూపం మార్చుకుంటున్న మీడియా అవరోధాలు
డా. నాగసూరి వేణుగోపాల్ ప్రపంచ పత్రికాస్వేచ్ఛా దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 3వ తేదీని జరుపుకుం టున్నాం. వార్తా సేకరణ, వార్తా మాధ్యమాల రూ పు, వార్తాంశాల పంపిణీ విషయంగా సాంకేతిక వి జ్ఞానం మోసుకొచ్చిన మా ర్పులు ప్రస్తుతం విశేషం గా ఉన్నాయి. ఇలా వార్తా మాధ్యమాలలో వస్తున్న పరిణామాలను, విపరిణామాలను గమనించుకుని, గమనాన్ని సరిదిద్దుకోవడానికి వరల్డ్ ప్రెస్ డే వంటి సందర్భాలు దోహదపడతాయి. ఇది సుమారు ఒక శతాబ్దం క్రితం సంగతి, మన దేశం విషయం కాదు - అభివృద్ధి చెందిన దేశా లని నేడు అనుకుంటున్న సమాజాల విశేషం. ఏమా త్రం వ్యవధి లేకుండా అప్పటికప్పుడు వార్తలను ఇవ్వగల రేడియో ప్రవేశించిన సమయం అది. వార్తా పత్రికలు ఆనాడు ఎంత బలంగా ఉండేవంటే- పత్రి కలు ప్రచురింపబడేదాకా రేడియో తాజావార్తలు ఇవ్వకూడదనే అప్రకటిత నిషేధం అమలులో ఉండే దట. రెండు, మూడు దశాబ్దాల క్రితం దాకా మీడి యా అంటే పత్రికలనే భావన ఉండేది. కానీ పత్రిక లకన్నా బలమైన, శీఘ్రమైన టెలివిజన్ రావడంతో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అనే విభజన రావడం మన కళ్లెదుటి సంగతి. టెలివిజన్ ప్రభావ వంతమైన మాధ్యమం కాదని, మనదేశంలో వార్తా చానళ్లు ప్రవేశించిన రోజుల్లో విభేదించిన ఢిల్లీ స్థాయి పత్రికా సంపాదకులు తర్వాత వార్తా కార్యక్రమా లకు యాంకర్లుగా, నిపుణులుగా మారిపోవడం మరింత నిజం. ఒక రాజకీయ నాయకుడి మరణం విషయంలో ఫేస్ బుక్ వ్యాఖ్యకు సంబంధించి ఒక యువతి న్యాయ పోరాటం చేసినప్పుడు గూగుల్, ఫేస్బుక్ వంటి పెద్ద సంస్థలు ఆమెకు అండగా రావ డానికి సంకోచించాయి. వ్యవస్థతో పోరాడి వ్యాపా రం దెబ్బ తీసుకోవడానికి ఆ సంస్థలకు మనస్కరిం చలేదు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధిం చిన చట్టం రూపకల్పనలో సంప్రదాయక భావన ఉండటంతో, అందులోని లొసుగును సుప్రీంకోర్టు సవరించింది. ఇలా అసంపూర్ణమైన భావన పత్రికా స్వేచ్ఛకు బాహ్య అవరోధం కాగా; దీన్ని సవరించే దిశగా పోరాటం విషయంలో, లబ్ధి పొందే న్యూమీ డియా యజమానులు తప్పించుకుని తిరగడం అనేది అంతర్గతమైన అవరోధం. రేడియో అంతరించిందనే పరిస్థితి మధ్య 1996 లో భారత సుప్రీంకోర్టు - ప్రసార తరంగాలు ప్రజ ల సొత్తు అని తీర్పు ఇవ్వడం ప్రైవేటు ఎఫ్.ఎం. రేడి యో ప్రారంభం కావడానికి భూమిక అయ్యింది. ఈ తీర్పుకు కొత్త టెక్నాలజీ తోడు కావడంతో 2003 నుంచి మన దేశంలో ఎఫ్.ఎం. రేడియో కీలకంగా మారిపోయింది. ప్రధాని నరేంద్రమోదీ ట్వీటర్ వం టి ఆధునిక సౌలభ్యాలతో తాజా సంగతులు ఎప్పటి కప్పుడు పంచుకుంటున్నారు. అదే సమయంలో మనసులోని మాట అంటూ ఆకాశవాణి ద్వారా మారుమూల శ్రోతలకు చేరాలని ఆయనే భావిం చడం పాత సాధనాలను సరికొత్తగా వినియోగిం చడం మాత్రమే! వార్తా మాధ్యమాల స్వరూపం మారడంతో ఆదర్శాల, అవరోధాల అసలు రూపు మరింత లోతుగా గమనించగలగడం ప్రస్తుత అవస రం. ఆధునిక సాంకేతిక విజ్ఞానం విస్తరించే కొద్దీ మీడియా ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. ఫలి తంగా మీడియాకు అవసరమైన పెట్టుబడి లెక్కలే నంత పెరగడంతో చిన్న సంస్థలూ, సమాంతర వేది కలు క్రమంగా అంతర్ధానమవుతున్నాయి. మరో వైపు డీటీహెచ్ పూర్తిగా విస్తరించకపోవడంతో కేబు ల్ పంపిణీ అనేది రకరకాల అవరోధాలకు దోహ దపడే విషయంగా మారిపోయింది. ఇలాంటి విష యాలు చర్చించడానికి మీడియా సహకరించకపోవ డం ఇంకా పెద్ద అవరోధం. ఈ అవరోధం వైయుక్తం కాదని, సంస్థాపరమైనదని మనం గమనించాలి. ప్రాధాన్యత పెరిగేకొద్దీ మీడియా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఏర్పడే అవరోధాల స్వరూపం, స్వభావం అర్థం చేసుకుంటూ; కొత్త పోరాటాలను సరికొత్తగా తెస్తూ సాగిపోవడం ఒకటే మార్గం. (మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం) (వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక్త)