డా. నాగసూరి వేణుగోపాల్
ప్రపంచ పత్రికాస్వేచ్ఛా దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 3వ తేదీని జరుపుకుం టున్నాం. వార్తా సేకరణ, వార్తా మాధ్యమాల రూ పు, వార్తాంశాల పంపిణీ విషయంగా సాంకేతిక వి జ్ఞానం మోసుకొచ్చిన మా ర్పులు ప్రస్తుతం విశేషం గా ఉన్నాయి. ఇలా వార్తా మాధ్యమాలలో వస్తున్న పరిణామాలను, విపరిణామాలను గమనించుకుని, గమనాన్ని సరిదిద్దుకోవడానికి వరల్డ్ ప్రెస్ డే వంటి సందర్భాలు దోహదపడతాయి.
ఇది సుమారు ఒక శతాబ్దం క్రితం సంగతి, మన దేశం విషయం కాదు - అభివృద్ధి చెందిన దేశా లని నేడు అనుకుంటున్న సమాజాల విశేషం. ఏమా త్రం వ్యవధి లేకుండా అప్పటికప్పుడు వార్తలను ఇవ్వగల రేడియో ప్రవేశించిన సమయం అది. వార్తా పత్రికలు ఆనాడు ఎంత బలంగా ఉండేవంటే- పత్రి కలు ప్రచురింపబడేదాకా రేడియో తాజావార్తలు ఇవ్వకూడదనే అప్రకటిత నిషేధం అమలులో ఉండే దట.
రెండు, మూడు దశాబ్దాల క్రితం దాకా మీడి యా అంటే పత్రికలనే భావన ఉండేది. కానీ పత్రిక లకన్నా బలమైన, శీఘ్రమైన టెలివిజన్ రావడంతో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అనే విభజన రావడం మన కళ్లెదుటి సంగతి. టెలివిజన్ ప్రభావ వంతమైన మాధ్యమం కాదని, మనదేశంలో వార్తా చానళ్లు ప్రవేశించిన రోజుల్లో విభేదించిన ఢిల్లీ స్థాయి పత్రికా సంపాదకులు తర్వాత వార్తా కార్యక్రమా లకు యాంకర్లుగా, నిపుణులుగా మారిపోవడం మరింత నిజం.
ఒక రాజకీయ నాయకుడి మరణం విషయంలో ఫేస్ బుక్ వ్యాఖ్యకు సంబంధించి ఒక యువతి న్యాయ పోరాటం చేసినప్పుడు గూగుల్, ఫేస్‌బుక్ వంటి పెద్ద సంస్థలు ఆమెకు అండగా రావ డానికి సంకోచించాయి. వ్యవస్థతో పోరాడి వ్యాపా రం దెబ్బ తీసుకోవడానికి ఆ సంస్థలకు మనస్కరిం చలేదు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధిం చిన చట్టం రూపకల్పనలో సంప్రదాయక భావన ఉండటంతో, అందులోని లొసుగును సుప్రీంకోర్టు సవరించింది. ఇలా అసంపూర్ణమైన భావన పత్రికా స్వేచ్ఛకు బాహ్య అవరోధం కాగా; దీన్ని సవరించే దిశగా పోరాటం విషయంలో, లబ్ధి పొందే న్యూమీ డియా యజమానులు తప్పించుకుని తిరగడం అనేది అంతర్గతమైన అవరోధం.
రేడియో అంతరించిందనే పరిస్థితి మధ్య 1996 లో భారత సుప్రీంకోర్టు - ప్రసార తరంగాలు ప్రజ ల సొత్తు అని తీర్పు ఇవ్వడం ప్రైవేటు ఎఫ్.ఎం. రేడి యో ప్రారంభం కావడానికి భూమిక అయ్యింది. ఈ తీర్పుకు కొత్త టెక్నాలజీ తోడు కావడంతో 2003 నుంచి మన దేశంలో ఎఫ్.ఎం. రేడియో కీలకంగా మారిపోయింది. ప్రధాని నరేంద్రమోదీ ట్వీటర్ వం టి ఆధునిక సౌలభ్యాలతో తాజా సంగతులు ఎప్పటి కప్పుడు పంచుకుంటున్నారు. అదే సమయంలో మనసులోని మాట అంటూ ఆకాశవాణి ద్వారా మారుమూల శ్రోతలకు చేరాలని ఆయనే భావిం చడం పాత సాధనాలను సరికొత్తగా వినియోగిం చడం మాత్రమే! వార్తా మాధ్యమాల స్వరూపం మారడంతో ఆదర్శాల, అవరోధాల అసలు రూపు మరింత లోతుగా
గమనించగలగడం ప్రస్తుత అవస రం. ఆధునిక సాంకేతిక విజ్ఞానం విస్తరించే కొద్దీ మీడియా ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. ఫలి తంగా మీడియాకు అవసరమైన పెట్టుబడి లెక్కలే నంత పెరగడంతో చిన్న సంస్థలూ, సమాంతర వేది కలు క్రమంగా అంతర్ధానమవుతున్నాయి. మరో వైపు డీటీహెచ్ పూర్తిగా విస్తరించకపోవడంతో కేబు ల్ పంపిణీ అనేది రకరకాల అవరోధాలకు దోహ దపడే విషయంగా మారిపోయింది. ఇలాంటి విష యాలు చర్చించడానికి మీడియా సహకరించకపోవ డం ఇంకా పెద్ద అవరోధం. ఈ అవరోధం వైయుక్తం కాదని, సంస్థాపరమైనదని మనం గమనించాలి. ప్రాధాన్యత పెరిగేకొద్దీ మీడియా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఏర్పడే అవరోధాల స్వరూపం, స్వభావం అర్థం చేసుకుంటూ; కొత్త పోరాటాలను సరికొత్తగా తెస్తూ సాగిపోవడం ఒకటే మార్గం.
(మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం)
(వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక్త)