
రిజర్వేషన్‌ల కోసం ఉద్యమం
ఆదిలాబాద్ రిమ్స్ : రిజనులకు పది శాతం నిరజ్వేషన్‌లు కల్పించాలని ఉద్యమాలకు సిద్ధం కావాలని గిరిజన రిజర్వేషన్ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పెందూర్ ప్రబాకర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రింట్‌మీడియ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. కనీసం గిరజన జనాభా నిష్పత్తి ప్రకారం 10 శాతం రిజ్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
రిజర్వేషన్‌ల కోసం ఈనెల 25న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ధర్నాకు 12 తెగలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో సమితి జిల్లా చెర్మైన్ మడావిరాజు, ప్రధాన కార్యదర్శి బానోవత్ రామరావు, ఉపాధ్యక్షుడు కడిమెతతిరుపతి, సభ్యులు కుర్సెంగ సూర్యబాను, జోడిదివాకర్, తుకారం, తానాజీలు ఉన్నారు.