
కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ, సీపీ, ప్రెస్‌క్లబ్ కార్యవర్గం
పంజగుట్ట: రాష్ట్రంలో ప్రెస్ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందో చెప్పేందుకు ప్రెస్‌క్లబ్‌లో కమ్యునిటీ సీసీ కెమరాలు ఏర్పాటు చేయడమే నిదర్శనమని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. పత్రికారంగం వారు కెమరాలు ఏర్పాటు చేస్తే మరికొందరు ముందుకు వస్తారన్నారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కమ్యునిటీ సీసీ కెమరాల మనిటరింగ్‌ను ఆయన నగర పోలీస్ కమీషనర్ ఎం.మహేందర్ రెడ్డి, పశ్చిమమండల డీసీపీ వెంకటేశ్వర్ రావులతో కలిసి ప్రారంభించారు.
క్లబ్‌లో 16 కెమరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ... గతంలో దిల్‌శుఖ్‌నగర్ బాబు పేలుళ్ల కేసులో పోలీసుల ఆధ్వర్యంలో ఓ షాపులో ఏర్పాటు చేసిన కెమరావల్లే ఎన్నో ఆధారాలు సేకరించగలిగామన్నారు. నగర పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ .. ప్రెస్‌క్లబ్‌లో సీసీ కెమరాలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చూడటంతో మీడియాదే కీలకపాత్ర అన్నారు. డీసీపీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ .. మీడియా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషమన్నారు.
సీనియర్ పాత్రికేయులు శైలేష్ రెడ్డి మాట్లాడుతూ .. పోలీసులు మీడియా కలిసి పనిచేస్తుందని చెప్పడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు రాజమౌళి చారి, ప్రధానకార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌ను ఫ్యామిలీ క్లబ్‌గా, సేఫ్టీ క్లబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. మీడియా, పోలీసులు మరింత ఫ్రెండ్లీగా ఉండి సేఫ్, సెక్యుర్డ్ తెలంగాణ రూపొందించే దిశగా అడుగులేయాలన్నారు.
పోలీస్ రంగంలో విశేష మార్పులు వచ్చాయని, అందుకు డైనమిక్ అధికారులే కారమన్నారు. హైదరాబాద్‌లో నేరం చేస్తే తప్పించుకోలేమని నేరస్ధుల్లో భయం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు రవికాం త్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు దుగ్గు రఘ, రమేష్ వైట్ల, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు నరేందర్ జి పద్మశాలి, ఎ.రాజేష్, పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్స్‌స్పెక్టర్ మోహన్ కుమార్, ఎస్సై లింగారెడ్డి పాల్గొన్నారు.