రాష్ట్రంలో నియంతృత్వ పాలన | The TS state in dictatorial regime | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో నియంతృత్వ పాలన

Published Sun, Mar 26 2017 1:05 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

The TS state in dictatorial regime

ఎదులాపురం (ఆదిలాబాద్‌) : రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి నాంపల్లి వేణుగోపాల్‌ ఆరోపించారు. శనివారం పట్టణంలోని ప్రింట్‌ మీడియా ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మత పరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో శుక్రవారం బీజేపీ తలపెట్డిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ నాయకులను ఎక్కడికక్కడే అరెస్టు చేయడం సరికాదన్నారు. అసెం బ్లీలో ప్రతిపక్షాల వాణిని వినాల్సింది పోయి, వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

రాజ్యాంగ బద్ధంగా నిరసన తెలుపుకునే హక్కు ప్రతీఒక్కరికి ఉందని, ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్‌ను ఎత్తివేస్తూ నగర శివారుకు మా ర్చడం ఎంతవరకు స మంజసమన్నారు. అసెంబ్లీలో మాట్లాడని వ్వకుండా ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడం సరి కాదని మండిపడ్డారు. స స్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశా రు. మతపరమైన రిజర్వేషన్‌ల పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. పార్టీ జిల్లా కార్యదర్శి జోగు రవి, పట్టణ అధ్యక్షుడు ఆకుల ప్రవీణ్, గిరిజనమోర్చా రాష్ట్ర కార్యదర్శి గటిక క్రాంతికుమార్, నాయకులు గండ్రత్‌ మహేందర్, తోట పరమేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement