ఎన్నికల్లో లబ్ధికోసమే వారసత్వ ఉద్యోగాలు
మణుగూరు రూరల్: త్వరలో జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య అన్నారు. సోమవారం మణుగూరు ఏరియాలో పర్యటించిన ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాల సర్క్యులర్ అందరికీ ఆమోదయోగ్యంగా లేదన్నారు. ఎటువంటి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ అందుకు విరుద్ధంగా సర్క్యులర్ విడుదల చేశారన్నారు.
దీంతో సుమారు 3వేల మంది కార్మికులకు తీరని నష్టం కలుగుతుందన్నారు. డైరెక్టర్ పా వారసత్వ ఉద్యోగాలను ఎప్పుడైనా రద్దుచేసే అవకాశం ఉందంటూ విధించిన నిబంధనతోనే దాని ప్రాధాన్యాన్ని అర్ధంచేసుకోవాలన్నారు. సమావేశంలో సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ డి.శేషయ్య, మణుగూరు బ్రాంచి కార్యదర్శి వై.రాంగోపాల్, నాయకులు అంజయ్య, బైరి శ్రీనివాస్, నజీరుద్దీన్ బాబ పాల్గొన్నారు.